మీ వ్యూస్

కుళ్లు కామెడీ లేకుండా (మీ వ్యూస్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని ద్విపాత్రాభినయం చేసిన జెంటిల్‌మన్ చిత్రం బాగుంది. ఇద్దరు అమ్మాయిలు వారి ప్రేమకథలను చెప్పుకోవడంతో ప్రారంభమైన సినిమా నెమ్మదిగా థ్రిల్లర్ రూపుదాల్చింది. తనకు కాబోయే ఫ్రెండ్ హత్య చేయబడ్డాడన్న అనుమానంతో కేథరిన్ స్వయంగా ఇనె్వస్టిగేషన్ ప్రారంభించడం, ఆ క్రమంలో ఎదురైన నాని రెండో పాత్రను వెంటాడడం, చిట్టచివరకు అసలు విషయం తెలియడంతో సినిమా పట్టు సడలకుండా నడిపించడంలో దర్శకుడి ప్రతిభ కనిపించింది. నరుక్కోవడాలు, బాంబు బ్లాస్టింగులు, సుమోలు ఎగరడాలు, హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనలు లేకుండా సింపుల్‌గా సినిమాను మలిచారు. కుళ్లు కామెడీ లేకపోయినా సినిమా హిట్ అవుతుందని జెంటిల్‌మన్ నిరూపించాడు.
- ఎం.కనకదుర్గ, తెనాలి

బరువైన దొర
ఈవారం విడుదలైన సత్యరాజ్ చిత్రం దొర ఏమాత్రం రుచించని కథనంతో తయారైంది. సినిమాలో అసలు కథేంటో ఎంత బుర్రగోక్కున్నా ఎవరికీ అర్ధం కాకపోవడం సినిమా విశేషం. ఆమధ్య రామ్‌గోపాల్‌వర్మ రెండు దయ్యాల మధ్య ప్రేమకథతో ఓ సినిమా తీస్తానని అన్నట్టు గుర్తు. ఈ చిత్రం మాత్రం రెండు దయ్యాల మధ్య పగ, ప్రతీకారాలను మరోసారి చూపించింది. ప్చ్! మన తెలుగు, తమిళ చిత్రాలు ఇలాగే ఉంటాయేమో!
- టి.రఘురామ్, నరసరావుపేట

సెన్సార్‌వారు వారే!
చారిత్రక, పౌరాణిక చిత్రాల్లోని వక్రీకరణలకు వ్యధ చెందుతూ రచయిత రాసినదంతా సత్యమే. ఉన్నదున్నట్టు తీస్తే ప్రేక్షకులు మెచ్చరన్న భ్రమతో మసాలా దట్టిస్తారు. చరిత్రలు, పురాణాలు తెలియని విజ్ఞానవంతులే ఇప్పుడు సెన్సార్ అధికారులుగా ఉన్నారు. సాహసించి వాళ్లేదైనా కట్ చేస్తే వాళ్లకు ఆ అధికారం లేదని కోర్టు అంటోంది. అందరూ ఘనంగా పొగిడిన, బోలెడు ఆస్కార్ అవార్డులు పొందిన గాంధీ చిత్రంలోనూ బోలెడు వక్రీకరణలున్నాయి. బ్రిటిష్‌వారిపై ఎవరికి అసహ్యం, కోపం కలుగని తీరులోనే ఆ బ్రిటిష్ దర్శకుడు గాంధీ చిత్రాన్ని రూపొందించాడు. అందుకే కాబోలు అన్ని అవార్డులు వచ్చాయి. కస్తూరిబా పాత్ర కూడా వాస్తవానికి దూరంగానే చిత్రీకరణ సాగింది.
- కె.ప్రవీణ్, కాకినాడ

ప్రశ్నకు జవాబు ఏదీ?
చిన్న చిత్రాలు వస్తున్నాయి.. పోతున్నాయి.. కొన్ని చిత్రాలు రాకుండానే చాటుముఖం వేస్తున్నాయి! దాసరి నారాయణరావు లాంటి ప్రముఖులు కూడా ఒకే ధోరణిలో ఆ నలుగురి గుప్పెట్లోనే థియేటర్లున్నాయి. అందువల్ల థియేటర్లు దొరక్క చిన్న చిత్రాలు చచ్చిపోతున్నాయి అని అలవాటుగా ప్రకటనలు ఇచ్చేస్తూ వున్నారు. కానీ చిన్న చిత్రాలు సత్తా నిరూపించుకుని నిలబడాలి. అలా చిన్న చిత్రాలు తీయాలి అని ఎందుకు చెప్పరు. నిలబడని చిత్రానికి థియేటర్ దొరికితే మాత్రం ఏం లాభం. గత ఆరు నెలల్లో వచ్చిన 50 పైగా చిత్రాల్లో నిలబడగలిగినవి నాలుగే నాలుగు. ఇందుకు కారణాలు ఏమిటి? ఎవరు? ఎంతమంది దర్శకులకు నైపుణ్యం వుంది? ఎంతమంది ప్రేక్షకుల నాడి పట్టుకున్నారు? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేలెవరూ!
- కె.సుభాష్, శ్రీనగర్

శుభ సూచన
నేను శైలజ చిత్రంతో తెలుగువారి మనసు దోచిన కీర్తి సురేష్ మరే తెలుగు చిత్రంలో నటించకపోయినా ఐదు తమిళ చిత్రాలు ఒప్పుకుంది. తాను స్కిన్‌షోకి వ్యతిరేకం అని, భవిష్యత్‌లో భర్త, పిల్లలతో కలిసి హాయిగా చూడగలిగే చిత్రాలే చేస్తానని, వారి ముందు తలదించుకోవాల్సిన చిత్రాలు చేయనని నిష్కర్షగా చెప్పింది. తెలుగు చిత్రాలలో స్కిన్‌షోకే ప్రాధాన్యం ఇస్తారని చెప్పకనే చెప్పింది. నిత్యామీనన్, శ్రీదివ్యలు కూడా ఇదే విధంగా చెప్పారు. హీరోయిన్ల పాలిట ఇది శుభసూచన అనే చెప్పాలి.
- ఎన్.ప్రసాద్, గొడారిగుంట

కొత్త తరానికి దారి చూపాలి
ఏదీ విలువల సౌశీల్యం అని సీనియర్స్‌ని గౌరవించలేమా? అన్న వ్యాసం (7.6.16) బాగానే ఉన్నా ఒక విషయం ఆలోచించాలి. రచయిత ఉదహరించిన సీనియర్ సింగర్స్ అందరూ అర్ధశతాబ్దం పైగా తమ ప్రభలను వెలిగించారు. అప్పట్లో మగ, ఆడ సింగర్స్‌ను వేళ్ళమీద లెక్కించవచ్చు. ఇప్పుడనేక మంది కొత్త సింగర్స్ వస్తున్నారు. వారికి అవకాశం కల్పిస్తున్నారు కూడా. పాతవారి గళంలో సరళం తగ్గింది. సుశీల, జానకి లాంటి పాత తరంవారు తమ అనుభవాలను, సూచనలను కొత్తవారికి అందజేసి తమంత వారిగా తయారుచేయాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

చివరకు అంతే..!
నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ అంటాడు కన్యాశుల్కం గిరీశం. ఆలోచించే వారికోసమే నేను సినిమాలు తీస్తాను అంటాడు నరసింహనంది. తీరాచూస్తే లజ్జ సినిమా కథ చలం మైదానాన్ని తలపింపజేసింది. స్ర్తి స్వేచ్ఛ అంటూ చలం బరితెగించిన స్ర్తిల శృంగార కథలే రాసి చివరకు సన్యసించి రమణాశ్రమంలో చేరిపోయాడు. విశృంఖల శృంగార కథల వల్ల డబ్బు సంపాదించగలరేమోగాని మనశ్శాంతి కోల్పోతారన్నది చలం జీవిత పాఠం. లజ్జ సినిమా మూడురోజులు కూడా ఆడలేదు! దానికి సింగిల్ స్టార్ ఇచ్చిన వెనె్నల సమీక్షకుడు, సినిమాని తిరస్కరించిన ప్రజలు నంది ప్రమాణాల ప్రకారం ఆలోచన లేనివారేనన్నమాట!
- సత్య, కరప

అదీ గొప్పతనం!
చిత్తూరు నాగయ్య మహాగాయకుడేగాక మహానటుడు కూడా. ‘వెంకటేశ్వర మహాత్మ్యం’ సినిమాలో ‘వేగరారా ప్రభూ వేగరారా’ అనే పాటను ఆయనపై చిత్రీకరించారు. ఆయన తన గాత్రం అంతగా సహకరించే పరిస్థితి లేనందున పాటను ఘంటసాలచే పాడించమన్నారు. ఘంటసాల అందుబాటులో లేనందున మాధవపెద్దితో పాడించారు. మాధవపెద్ది పెండ్యాల కూర్చిన రాగాన్ని నాగయ్య నోట విని అదేవిధంగా పాడారు. ఇవి అప్పటి సినిమా రంగంలోని నటులు, కళాకారుల ఉదాత్త వైఖరి. నాగయ్య వంటి ప్రముఖ గాయకుడు అవకాశాన్ని మరొకరికి ఇవ్వాలని కోరడం ఔదార్యానికి ఉదాహరణ. ఇలాంటి సంగతులు మరిన్ని వెనె్నలలో రావాలి.
- కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి