మీ వ్యూస్

శుభ పరిణామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్
=======

శుభ పరిణామం
ఈ సంవత్సరంలో ఈ అయిదు నెలల కాలంలో విడుదలైన తెలుగు చిత్రాల్లో అధిక శాతం పరాజయాలున్నా చెప్పుకోదగ్గ చిత్రాలు చిన్నవి పెద్దవి కొన్ని విజయాలు సాధించి ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. ముఖ్యంగా చిలుకూరి బాలాజీ, జైసింహా, భాగమతి, చంటి, అ, తొలిప్రేమ. ఐతే 2.0, ఎమ్.ఎల్.ఎ., రంగస్థలం. ఇందులో ఎనె్నన్ని వింతలో, నీది నాది ఒకే కథ, కృష్ణార్జున యుద్ధం, భరత్ అనే నేను, నా పేరు సూర్య, మహానటి లాంటివి ఉన్నాయి. వీటిలో జైసింహా, రంగస్థలం, భాగమతి, భరత్ అనే నేను, నాపేరు సూర్య, మసానటి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటం గమనార్హం. భరత్ అనే నేను 200కోట్లు, రంగస్థలం కూడా దాదాపు 200 కోట్లు వసూల్ క్లబ్‌లో ఉండటం మంచి శుభ పరిణామం. తెలుగులో దాదాపు తొలి బయోపిక్ ‘మహానటి’ అందర్నీ అలరిస్తూ సూపర్‌హిట్ టాక్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ ఉండటం బయోపిక్ చిత్రాలు ఇంకా రావటానక ప్రాణం పోసినట్లే! ఈమధ్యకాలంలో వెనె్నలలో చాల చిత్రాలకు మూడుస్టార్లు రావటం శుభపరిణామమైతే మహానటికి నాలుగుస్టార్లు రావటం గొప్ప విశేషం! మూడు స్టార్ల చిత్రాలకు ఎండి అబ్దుల్‌గారి చిత్రసమీక్షలు గొప్పగా వ్రాయడం చిత్ర వీక్షకులకు ఓ వరం. ఈ విజయాలు తెలగు చిత్ర పరిశ్రమ ఊరట కలిగించి కొత్త ఆశలు చిగురింపచేస్తాయనడంలో సందేహంలేదు.
- పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి

మహా జోరు..
మహానటి మహా జోరుమీదుంది. విడుదలై నెల గడిచినా థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఇప్పటికే 40 కోట్లు అధిగమించి 50 వైపు దూసుకుపోతున్నది. కీర్తిసురేష్ మహానటిగా కీర్తి మూటకట్టుకుపోతుందని తెలిసినా అంతగా ప్రాధాన్యం గాని గ్లామర్‌గా లేని జర్నలిస్టు పాత్ర పోషించడానికి ఒప్పుకున్న సమంత ఔదార్యాన్ని మెచ్చుకోవాలి. బాగా చేసిందని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమ తండ్రి జెమినీ గణేశన్ సావిత్రిని బాగా చూసుకున్నా ఆయన్ని విలన్ లాగ చూపించడం బాగులేది మొదటి భార్య కూతురు ఆరోపించినా సినిమాలో వాస్తవాలే చూపించారు. చిత్రాన్ని ఉన్నత స్థాయిలో చిత్రించిన దర్శకత్వ ప్రతిభను, మనోరంజకమైన నేపథ్య సంగీతాన్ని మెచ్చుకోవలసిందే!
-సోనాలి, సూర్యారావుపేట

అది సాహసం అవుతుందా?
లవకుశ (1963) చిత్రంలోని ‘ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు’ పాటలోని ఒక చరణం ‘విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ’ అని ఉంది. ఒక పనిని చేసే ప్రయత్నంలో ధన నష్టం, అంగవైకల్యం, ప్రాణాన్ని కోల్పోయే అవకాశం ఉన్నప్పటికీ కృతనిశ్చయముతో దానిని చేయటానికి పూనుకోవటమే సాహసం అని భావించవచ్చును. విధి విధానము అంటే దైవ నిర్ణయాన్ని మార్చగలగటం అనేది మానవులకు సాధ్యం కాదు. (అనుకోకుండా సంభవించే మంచిని లేదా చెడును మాత్రమే దైవ నిర్ణయముగా భావించాలి.) కాబట్టి ‘సాహసం అనే పదం విధి విధానానికి అనుగుణ్యంగా ఉందా’ అన్నది ప్రశ్నార్థకం! కాబట్టి సదరు చరణం ‘విధివిధానమును తప్పించుటకు ఎవరికి సాధ్యపడునూ’ అనో లేక మరొక విధంగానో (బాణీకి సరిగ్గా అమరేలాగా) ఉంటే బాగుండేదనిపిస్తుంది! ఈ అభిప్రాయం తప్పయితే క్షమించాలి.
-ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్

చక్కటి వివరణ
వెనె్నలలో ఎనుగంటి వేణుగోపాల్ వ్యాసం ‘బయోపిక్‌ల హవా’లో ఎందరో మహానుభావులు అన్నట్లుగా ఎందరు సినీ తారలు, నటులపై బయోపిక్‌లుతీస్తే ఎలా ఉంటుందో బాగా వివరించారు. వారు వ్యాసంలో ఒక 20 మందిదాకా నటీనటుల గురించి వివరించనంత సులభంగాదు ఏ ఒక్కరిపైన సినిమా నిర్మించడమనేది. ఎఎన్‌ఆర్‌గారిపై కూడా సినిమా తీస్తే ఒక విలన్ పాత్ర లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా సినిమా తీయవచ్చు. కానీ బాలకృష్ణ తన తండ్రి ఎన్‌టిఆర్‌మీద తీస్తున్నారు. ఎన్టీఆర్‌గారి సినిమా ప్రవేశం, సినిమాలో రాణింపు, రాజకీయ ప్రవేశం బాగుంటుంది.
-ఎ.వి.సోమయాజులు, కాకినాడ

చెడపకురా కాదా?
చెరపకురా చెడేవు (1955) సినిమా పేరు అర్థవంతంగా లేదనిపిస్తోంది! చెరపటం అంటే రాసింది లేదా? గీసింది. చెరిపి వేయటం అని. చెడపకు అంటే ‘ఒకరికి చెడు చేయవద్దు లేదా చెడ్డవారు అయ్యేలాగా సలహాలు చెప్పటం లేదా ప్రోత్సహిస్తూ తన స్వార్థానికి బలిచేయవద్దు’అని. ఇంకా ఇతరుల మధ్య అపార్థాలను కల్పించి వారు తగాదాలు పడే విధంగా చేయటం వంటి అర్థాలను ఎన్నయినా భావించవచ్చు. కాబట్టి సదరు సినిమాకి ‘చెపడకురా చెడేవు’ అని ఉండటం సమంజసంగా తోస్తోం ది. ‘చెరపటం’ అన్న పదాన్ని ఆధారంగా ‘చెరపరకురా’అని ప్రయోగించటం వింతగా ఉంది. ఈ సినిమాలో తనదైన దుర్మార్గపు రీతిలో అందరికీ చెడు చేసి జైలుకు వెళతాడు విలన్. ఏదిఏమైనా ఈ సినిమా మాత్రం ‘ఐద నక్షత్రాల హోదాని’ పొందదగిన స్థాయిలో ఉంది.
- ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్

చాలా విషయాలు..
ఈ ఆదివారం మహానటి గురించి చాలా విషయాలు తెలిసాయి. అలాగే రోజు విడుదలైన అమాయకుడు గురించి విశే్లషణ బాగుం ది. ఇకపోతే ’60 ప్రాంతాల్లో వచ్చిన పద్మశ్రీ వారి పిక్చరు ‘జగన్నాటకం’ అమర్‌నాథ్, కృష్ణకుమారిల చిత్రం గురించి విశేషాలు మన ఫ్లాష్‌బ్యాక్‌లో వేస్తారని ఆశిస్తూ.. ఇక 15వ పేజీలో కళాంజలిలో ‘హరికథా’్భగవతార్ శ్రీ కోట సచ్చాదానందశాస్ర్తీగారి గురించి కూడా విపలీకరిస్తారని మనవి. మేము చాలా చిన్న వయస్సులో శాస్ర్తీగారి హరికథ విన్నాము. మరల వారి గురించి తెలియజేస్తారని, అలాగే మంత్రి ప్రగడ లలితకుమారి, రామలక్ష్మిగార్ల గురించి వివరణలు చేస్తారని ఆశిస్తూ..
- సత్య, విజయవాడ