మీ వ్యూస్

నాగ్ కెరీర్‌లోనే మాయని మచ్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్ కెరీర్‌లోనే మాయని మచ్చ!
అనునిత్యం వివాదాలలో చిక్కుకుంటూ, వివాదాస్పదమైన వ్యాఖ్యలుచేస్తూ వార్తల్లో వుండేందుకు ఇష్టపడే వ్యక్తి ఆర్‌జివి అనబడే రామ్‌గోపాల్‌వర్మ. కొత్త డైరెక్టర్ స్థాయిలో కూడా సినిమాలు తీయలేక పాత చింతకాయ పచ్చడి విధానాలను నమ్ముకున్న వర్మపై ఎంతో పరిణితిగల నటుడిగా ఇండస్ట్రీ చేత గుర్తింపుపొందిన నాగార్జున సినిమా తీసే బాధ్యత ఎలా వుంచాడో ఎవ్వరికీ అర్ధంకాలేదు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆఫీసర్ సినిమా ఫ్లాప్ అవుతుందనే విషయం అందరికీ విడుదలకు ముందే తెలుసు. కాని అసలు సంగతి ఏమిటంటే అట్టర్‌ఫ్లాప్ స్థాయినుండి కూడా దిగజారిపోయి ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీకి అతిపెద్ద డిజాస్టర్ సినిమాగా రికార్డులకెక్కడం నాగార్జున కెరీర్‌లోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. ఫైనల్ రేస్‌లో ఈ సినిమా తెలుగురాష్ట్రాల్లో కోటి రూపాయలు కూడా అందుకోలేకపోవడం అత్యంత దారుణమైన విషయం. కేవలం నాగార్జునను నమ్మి కోట్లువెచ్చించి ఈ సినిమాను కొన్న బయ్యర్లు పూర్తిగా మునిగిపోయారు. కథలు, సాంకేతిక నిపుణుల ఎంపికలో అగ్ర హీరోలు ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వారి నిర్ణయంపై కోట్ల రూపాయలు, వేలాది కుటుంబాల భవిత ఆధారపడి వుంటాయి.
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ

ఇంత చెత్తగానా!?
‘ఆఫీసర్’ మరో డిజాస్టర్. వయసైపోతున్న ఓ పెద్ద హీరో కేవలం తన ఫిజిక్, అందం, ఫిట్‌నెస్ ఇంకా తగ్గలేదని నిరూపించుకోడానికి చేసిన సినిమా తప్ప ఇంకేం లేదు. వర్మ ఇన్నాళ్ల తర్వాత నాగ్‌తో సినిమాచేస్తూ కూడా ఇంత చెత్తగా కథ, కథనం ఎన్నుకొన్నాడంటే ఆశ్చర్యమేస్తుంది. సిస్టమ్, అని పేరు పెట్టుంటే బాగుండేది. ఎన్నిసార్లు వస్తుందో సినిమాలో ఆ పదం అందరి నోటి వెంట. ‘ఏ సారి’ అనే పేరుమీద విరక్తి కల్గింది. మనవాడు అన్పించని ఒక ముసలాణ్ణి విలన్‌గాపెట్టి బోరుకొట్టించాడు. బరితెగించిన హీరోయిన్, పిచ్చెక్కించే పాటలు, అర్ధం పర్ధం లేకుండా ప్రవర్తించే పాత్రలు టోటల్‌గా రిలీజై రెండ్రోజులాడిన సినిమాగా మిగిలింది. చూసి వెంటనే మర్చిపోవడం తప్ప చేసేదేం లేదు.
- పీసీ, కావలి

ఆ సూచన సబబే!
పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ సమస్య తీవ్రంగా ఉన్నందున హీరోయిన్లను పరిశ్రమకు చెందిన కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను రక్షించేందుకు బాధ్యతను మీడియా తీసుకోవాలన్న హీరోయిన్ అదితిరావు సూచన సబబుగానే వుంది. పరిశ్రమలో మహిళలకు గౌరవం పెరిగేందుకు, లైంగిక వేధింపులు తగ్గేందుకు మీడియా కీలకపాత్ర పోషించాలన్న అదితిరావు వాదన నూటికి నూరుపాళ్లు కరెక్ట్. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విశృంఖలంగా వుంది. దీనిని ఎదిరించేందుకు వర్ధమాన నటీనటులు మానసికంగా దృఢంగా వుంటూ, తమ టాలెంట్‌ను మాత్రమే నమ్ముకుంటూ, అవకాశాలకోసం దొడ్డిదారులు ఆశ్రయించే విధానాలకు స్వస్తిపలకాలి. అయితే తమకు జరిగే అన్యాయాలను ధైర్యంతో బయటపెట్టినప్పుడు మాత్రమే మీడియా తనవంతు పాత్ర నిర్వర్తించగలుగుతుంది. ఇదంతా మామూలు వ్యవహారమని కొందరూ, మీడియా ముందుకువస్తే అవకాశాలు తగ్గిపోతాయని కొందరు 99 శాతం సంఘటనలను దాచేస్తుంటే మీడియా ఏం చేయగలుగుతుంది? దాసరి వంటి పెద్దలు చిత్ర పరిశ్రమలో పెద్దరికం చేసే పరిస్థితులు ఇప్పుడు లేకపోవడం వర్ధమాన నటీనటుల పాలిట శాపంగా మారింది.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

చెప్పడానికే సుభాషితాలు!
‘సినిమాల్లో నటిస్తున్నాం. మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లి నటించడం ఎందుకు?’అని అక్కినేని సుభాషితం చెప్పి ఉండొచ్చు. రంగం మీదకు రాలేదుకాని తెర వెనక రాజకీయాల్లో ఆయనా సిద్ధహస్తుడే. మొదట ఎన్టీఆర్ తరఫున తెదేపాకి ప్రచారం చేశాడు తెరవెనక. అన్నపూర్ణ స్టూడియోలోని 7 ఎకరాలపై స్పర్ధరాగానే అక్కినేని కాంగ్రెస్‌వైపు తిరిగాడు. కుట్రలతో నాదెళ్ల భాస్కరరావు సిఎం అవగానే నిలువెత్తు దండ వేసి అభినందించాడు. ఆయన్ని దించేసి మళ్లీ ఎన్టీఆర్ సిఎం అయ్యాక ఆయనకు దండ వేసిన ఫొటో రాలేదు. వారిద్దరిమధ్య పొరపొచ్చాలు, రాజకీయాలూ కొనసాగాయి. చెప్పడానికే సుభాషితాలు!
- సాహిత్యదీపి, రమణయ్యపేట