మీ వ్యూస్

ఆమె మాటలో తప్పేముంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల ఎమీ అవార్డ్స్ వేడుకలో ‘్భరతీయ చిత్రాల్లో ఎక్కువ భాగం మహిళల నడుము, శరీర సౌందర్యం చుట్టే తిరుగుతాయి’అని చెప్పి నెటిజన్ల ఆగ్రహానికి గురి అయింది. వెంటనే క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. నిజానికి ఆమె చెప్పిన మాటలో తప్పేముంది? ఎనభై శాతం పైగా చిత్రాల్లో హీరోయిన్ నాభి, బహుమూలాలు, వక్షోజాల ఊపులు, గంతులేస్తూ ఊరువులు చూపించక వదిలారా? నిజం చెప్తే ఉలుకెందుకు? ఇరవై శాతం సినిమాల్లోనైనా హీరోయిన్‌ని నీటుగా చూపినందుకు సంతోషించాలి. ప్రియాంక అనుభవంతో చెప్పింది!
- సుభాష్, శ్రీనగర్

దిశానిర్దేశం లేదు!

వెనె్నలలో ‘దిశా నిర్దేశకులు దర్శకులు’ వ్యాసం జనరల్‌గా ఉంది. కాని ఎవరు ఏ చిత్రంలో కొత్తగా దిశానిర్దేశం (ట్రెండ్ సెట్టింగ్) చేశారో వివరించలేదు. ఆయన పేరున్న దర్శకులు ఒకటి రెండు చిత్రాల్లో ట్రెండ్ మార్చి దిశానిర్దేశం చేసినా అటు తర్వాత వచ్చిన వారి చిత్రాలు జనాల్ని గొప్పగా ప్రభావితం చేసింది లేదు. నారాయణరావు చిత్రాలన్నీ ఒకే మూసలో ఉండి ఏదీ విజయం సాధించలేదు. వర్మ చిత్రం తీస్తున్నాడంటే అది ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది. ఇంక పూరి తమ్ముణ్ణి హీరో చేయబోయి ఫెయిల్‌అయ్యాడు. కొడుకుని హీరో చేయబోయి బోర్లాపడ్డాడు. వీళ్లు తీస్తున్న చిత్రాల్లో దిశానిర్దేశం లేదు కానీ దిక్కుమొక్కు లేకుండా పోతున్నాయి.

-జ్ఞానబుద్ధ, సిద్ధార్ధనగర్