మీ వ్యూస్

మా ఓటు సమీక్షకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తేజ్.. ఐ లవ్‌యూ’ చిత్రానికి వెనె్నల బాగోలేదన్న సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఆ చిత్రం విడుదలైన మర్నాటినుంచి దాన్ని పొగడుతూ నిర్మాత, దర్శకుడు బాకాలూదారు. తేజ్ స్టయల్‌గా ఉన్నాడు, ఎనర్జీ కనిపించలేదని సమీక్ష చెబితే.. దర్శకుడు ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో రన్ అవుతోంది. తేజ్ ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అప్పుడే పెయింటింగ్ చేసిన బొమ్మలాగ హీరోయిన్ ఆకర్షించింది అంటూ డప్పుకొట్టాడు. కానీ ఆమె ఓవర్ యాక్టింగ్, రిథమ్ లేని బాడీతో డాన్సులు బోర్‌కొట్టించాడని వెనె్నల సమీక్ష. మా ఓటు దర్శకునికి కాదు, సమీక్షకే..
- శాంతి చంద్రిక, సామర్లకోట

కొత్త కథలు రావా?
నయనతార, సమంత లాంటి సీనియర్ తారలు తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. మహానటిగా మంచి పేరుతెచ్చుకున్న కీర్తిసురేశ్ చూపుకూడా తమిళం వైపే. పూర్వ పరిచయ మొగమాటం వల్లనో ఎక్కువ పారితోషికం ఆఫర్ చేశారనో వీరు తెలుగువైపు అప్పుడప్పుడు చూస్తున్నారు. అనీశా ఆంబ్రోజ్ లాంటి కొత్త తారలు కూడా తెలుగులో కన్నా తమిళంలోనే డిఫరెంట్ కథలొస్తున్నాయి అంటున్నారు. అది నిజమే. వెనె్నల సమీక్షల్లో చాలా సినిమాలకు కథ, కథనాలు మరీ పాత చింతపచ్చడి అంటున్నారు. సింగిల్ స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. మన రచయితలకు కొత్త కథలు ఆలోచించడానికి భయమా? బద్ధకమా? చేతకాదా?
- అయోధ్యరామ్, పెద్దాపురం

సినీ భీష్ముడు..
ప్రతాప్ ఆర్ట్స్ పతాకంపై జనరంజకమైన చిత్రాలను నిర్మించడమే కాకుండా, మోహన్‌బాబు, రాజబాబుగారిని సినీ పరిశ్రమలో హీరోగా మరియు దాసరి నారాయణరావుగారికి దర్శకత్వం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో భీష్ముడుగా పేరుగాంచిన 105 ఏళ్ల సినీ నిర్మాత కుదుటపూడి రాఘవగారు మరణించడం పట్ల వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తూ తల్లిదండ్రుల ప్రేమ అనురాగ బంధాలపై చెమ్మగిల్లె కన్నులతో సినిమానుండి బయటకు వచ్చి చిత్రం తాతమనవడు లాంటి కుటుంబ కథాచిత్రాల ద్వారా రాజబాబు లాంటి కమెడియన్‌ను హీరోగా చూపించిన కె.రాఘవకు మా శ్రద్ధాంజలి. ‘ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణ య్య’ చిత్రం ద్వారా చిరంజీవికి స్టార్ ఇమేజ్‌ను పెంచడమేకాక, మాటల రచయిత గొల్లపూడికి నటన ద్వారా నటుడిగా గ్లామర్ పెంచింది రాఘవగారే. స్వర్గీయ ఎస్.వి.రంగారావుతో ‘సుఖ దుఃఖాలు’, ‘తాత మనవడు’ చిత్రాల ద్వారా ఎస్.వి.రంగారావు నటనను మన తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసిన కె.రాఘవగారు తెలుగు సినీ పరిశ్రమకి రఘపతి వెంకటరత్నంగా భావిస్తూ 105 ఏళ్లు జీవించిన రాఘవగారి కాంస్య విగ్రహాలను ఫిల్మ్‌నగర్‌లోని రోడ్ నెం.76లో ఏర్పాటుచేయాలని కోరుతున్నాం.
- కోలిపాక రాణి,
బోడుప్పల్, మేడ్చల్ జిల్లా

తెలుగు కథ ఎక్కడ?
‘తెలుగు కథ ఎక్కడ’? వ్యాసంలో చెప్పినట్టు నేడు రచయిత టైటిల్స్‌లో కనిపించడు. దర్శకుడే కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం అన్న భుజకీర్తులు తగిలించేసుకుంటాడు. దర్శకుడు ఒక లైన్‌చెప్తే సహాయకులు ఆ లైన్‌ని ముక్కలుగాకోసి ఉప్పు, కారం, పులుపు, తీపి లాంటి మసాలాలు కలిపి పంచకూళ్ల కషాయం చేస్తే అదికాస్తా చేదుగా తయారై ప్రేక్షకులు పారిపోతున్నారు. తమ చిత్రం ఢాం అనడానికి కారణం ఏమిటనేది నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోకుండా నెపం పైరసీ మీదకు నెట్టేసి ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఒక చిత్రంతో వాళ్లకి బుద్ధిరాదు- మళ్లీమళ్లీ ఇదే తతంగం. ఇంతోటి సినిమా చూడడానికి వందలు ఖర్చుపెట్టి థియేటర్‌కి వెళ్లాలా?
- స్నేహమాధురి, సూర్యారావుపేట

సినిమా జూదమా?
‘సినిమా జూదమా?’ వ్యాసం బాగుంది. వెనె్నలలో చెప్పినట్టు పాత సినిమాల్లో దుష్టశిక్షణ శిష్టరక్షణ చట్టంపై గౌరవం పెరిగేలాగా చూపించేవారు. తర్వాత దుష్ట పాత్రల దృక్పథాన్ని సానుభూతితో అర్థంచేసుకునే విధంగా డైలాగులు చెప్పడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఎన్టీఆర్ దుర్యోధన, రావణాసురుల పాత్రలు పోషించి ఆ పాత్రలపై కాస్తంత సానుభూతి కలిగేట్టు చూపించి దుష్టశిక్షణ చేసేవారు. దుర్యోధనునికి ఆయన భార్య భానుమతికి మధ్య యుగళగీతం చిత్రించి శభాష్ అనిపించుకున్నారు. మణిరత్నం ‘విలన్’చిత్రంలో రాముని చేతగానివానిగా రావణుని ఉదాత్తంగా చూపించి చేతులు కాల్చుకున్నాడు.
- జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్

ఎన్టీఆర్ బయోపిక్
నందమూరి తారక రామారావు జీవిత కథను చలనచిత్రంగా రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగా వున్నది. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించడం కూడా ఆనందాన్ని కలిగిస్తున్నది. ఈమధ్య విడుదలైన ‘మహానటి’ చిత్రం సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చింది. చిత్రం చాలా బాగుంది. నాగ అశ్విన్ దర్శకత్వం బాగుంది. అయితే ‘మహానటి’ ఒక విషయంలో నిరుత్సాహం కలిగించింది. ఎన్టీఆర్ పాత్రకు సరైన న్యాయం జరుగలేదు. ఆ పాత్ర పోషించడానికి తారక్ వెనుకడుగు వేయడమే కారణం. ఈ విషయంలో నందమూరి అభిమానులు నిరుత్సాహపడ్డారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో యంగ్ సీనియర్ ఎన్టీఆర్‌గా తారక్ నటిస్తే బాగుంటుంది. మనదేశం, మిస్సమ్మ, మాయాబజార్, కన్యాశుల్కం చిత్రాలలో నటించేటప్పుడు ఎన్టీఆర్ ఎంత వయస్సులో ఉన్నాడో ఇప్పుడు తారక్ కూడా అంతే వయస్సులో ఉన్నాడు. అందుకని కుర్రవాడిగా ఉన్నప్పుడు తారక్‌ను మధ్యవయస్సు వచ్చిన తరువాత బాలయ్యను ఎన్టీఆర్‌గా చూపిస్తే బాగుంటుంది. ఎన్టీఆర్‌కు బాలయ్య కొడుకు, తారక్ మనుమడు. ఇద్దరూ ఆ చిత్రంలో కనిపిస్తే బాగుంటుంది.
- అనూరాధ, హైదరాబాదు.