మీ వ్యూస్

తుస్సుమన్నాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌రాజు ఎంతో అనుభవం ఉన్న సక్సెస్‌ఫుల్ నిర్మాత. ఆయన సినిమాకు ప్రత్యేక అంచనాతో థియేటర్‌కి వెళ్తారు ప్రేక్షకులు. ‘లవర్’ చిత్రం విడుదల ముందు ‘చిన్న చిత్రం నిర్మించాలంటే భయం కలుగుతోంది. చిన్న చిత్రం అయినా 8కోట్లు ఖర్చవుతుంది’ లవర్‌కి నలభై శాతం ఎక్కువే అయింది. ప్రజలు కనెక్ట్‌అవుతారు. వారికి నచ్చుతుంది అని చెప్పారు. కాని లవర్ తుస్సుమన్నాడు. సాదాసీదా కథ. ఇలాంటి కథకోసం దర్శకుడు నాలుగేళ్లు ఎందుకు వెయిట్ చేశాడో! ఆయన రాసుకున్నంత అందంగా తెరమీదకు అనువదించలేక పోయాడు- అని వెనె్నల సమీక్ష. సింగిల్ స్టార్ రేటింగ్. మరి దిల్‌రాజు అనుభవం ఏమయింది?

- ప్రభాస్, గాంధీనగర్

ఆదర్శనీయం!

‘సినీ భీష్ముడు రాఘవ’ తెలుగు చలనచిత్ర చరిత్రలో మూకీలనుండి టాకీ యుగంవరకు ఒక సామాన్య వ్యక్తి లైట్‌బాయ్ నుండి జీవితం ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగి సినీ స్వర్ణయుగాన్ని చవిచూచిన మహోన్నతమైన వ్యక్తిత్వం ఆయనది. ఉత్తమాభిరుచి గల నిర్మాతగా భిన్నభాషలలో చిత్రాలు నిర్మించి చరిత్ర సృష్టించిన రాఘవ జీవితం నేటి దర్శక నిర్మాతలకు ఆదర్శనీయం. కె.రాఘవ ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ స్థాపించి తాతమనమడు, తూర్పు పడమర, చదువు సంస్కారం లాంటి ఉత్తమ సందేశాత్మక చిత్రాలు నిర్మించారు. నేటి నిర్మాతలు చిత్రరంగాన్ని కోట్లు సంపాదించటానికి ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. రాఘవ ఉత్తమాభిరుచి, కళాదృష్టితో సమాజానికి సందేశాత్మక చిత్రాలు నిర్మించి అగ్రస్థానంలో నిలవటం తెలుగువారికి గర్వకారణం. ఆయన నిర్మించిన చిత్రాలలోని సామాజిక చిత్రం ‘చదువు సంస్కారం’ చిత్రంలో గిరిబాబు, శుభ ఫొటో అలనాటి తీపి గుర్తుగా వెనె్నలలో ప్రచురించగలరని ఆశిస్తున్నాను.
- ఉప్పు సత్యనారాయణ, తెనాలి, గుంటూరు జిల్లా

మరచిపోయారు..

ఆదివారం, 5 ఆగస్టు 2018 వెనె్నల అనుబంధంలో ‘రాజనందిని’ సినిమా గురించి సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి వ్రాసిన వ్యాసంలో అన్ని పాటలు వ్రాశారు. కాని జిక్కి పాడిన ‘నినె్న నినె్న నినె్ననోయ్ నినే్న కోణంగి రాజా’ అను పాటను కృష్ణకుమారి అభినయించింది వ్రాయడం మరచిపోయారు. గమనించేది. ఎ.ఎం.రాజా, జిక్కి పాడిన ‘అందాలు చిందు సీమలో ఉందాములే హాయిగా’ పాట వి.శాంతారాం చిత్రం ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ చిత్రంలో హేమంత్‌కుమార్, లతామంగేష్కర్ పాడిన ‘నైన్‌సే నైన్ నాహీమిలా వో’కు కాపీ.

- ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు

పరిస్థితికి భిన్నంగా..

ప్రపంచ సినిమా ‘లెమన్ ట్రీ’ చదివాక-దర్శకులు, రచయితలు లాంటి మేధావివర్గం ఆలోచనలు వాస్తవ పరిస్థితికి ఒక్కోసారి భిన్నంగా సాగుతుంటాయి. యూదుల రాజ్యం ఇజ్రాయిల్ ఏర్పడటం చుట్టూవున్న అరబ్ దేశాలకు ఇష్టంలేదు. మ్యాప్‌నుంచి ఆ దేశాన్ని తుడిచిపెట్టేస్తాం అంటూ అరబ్బులు యుద్ధాలుచేసినా ఆ దేశం దృఢంగా నిలబడింది. మన కశ్మీర్‌లో పాక్ లాగ ఇజ్రాయిల్ సరిహద్దుల్లో పాలస్తీనా ఉగ్రవాదులు శాంతికి విఘాతం కలిగిస్తున్నాయి ఇప్పటికీ. నిరంతరం యుద్ధవాతావరణం ఎదుర్కొంటున్న ఇజ్రాయిల్ రక్షణకు భంగం కలిగిస్తున్న నిమ్మతోటను ధ్వంసం చేయాలనుకోవడం సహజ న్యాయమే. అందుకే కోర్టులు ఇజ్రాయిల్ చర్యని సమర్ధించాయి. సినిమా హిట్ అవాలంటే పాలస్తీనాపై సానుభూతి రగిల్చాలని తీసిన సినిమా ఇది.

- పూర్ణారావు, కాకినాడ

ప్రపంచ సినిమా

పాక్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు మన దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడం మనకు అనుభవమే. ముస్లింలందరూ ఉగ్రవాదులు కారని చెప్తారు. నిజమే కానివారు ఉగ్రవాదులకు రక్షణ, ఆశ్రయం కల్పించడం కూడా నిజమే. ‘ముల్కి’చిత్రంలో హిందువుల దౌర్జన్యానికి గురిఅయి సర్వం కోల్పోయిన ముస్లిం పెద్ద తరఫున కోర్టులో హిందు లాయర్ (తాప్సీ) వాదించి విడుదల చేయించడం నేపథ్యంగా చూపిస్తారు. ఈ ‘ముల్కి’ కథ ప్రపంచ సినిమా లెమన్‌ట్రీ కథలాంటిదే. మేధావులు సామాన్యులకంటే భిన్నంగా ఆలోచిస్తారని ఈ రెండు కథలూ నిరూపిస్తున్నాయి.

- కృష్ణ, కొండయ్యపాలెం

అంతా గ్యాస్..

ప్రతి పత్రికలోనూ తార లతో ఇంటర్వ్యూ అని ఒక ప్రహసనం నడుస్తూ ఉంది. ఎప్పుడూ అవే ప్రశ్నలు అవే జవాబులు! ఈమధ్య తెలుగులో కనిపించడం లే దేం? కోలీవుడ్‌లో బిజీ అయ్యా ను. నాకు తెలుగువారంటే ఎంతో అభిమానం. వీలైతే తప్పక చేస్తాను అంటుంది. ఆమె బిజీగా ఉందా? లేదా? అన్నది విలేఖరికి తెలుసు. పాఠకులకూ తెలుసు! పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్నకు అప్పుడే పెళ్లా? మీ అందరికీ చెప్పే చేసుకుంటా రహస్యంగా ఉంచాల్సిన అవసరం నాకు లేదు. కాస్టింగ్ కౌచ్ గురించి.. కొంతమంది బాధ పడి ఉంటారు. నాకు ఎదురుకాలేదు. మనోనిబ్బరంతో ఎదుర్కొంటే ఎవరూ ఏమీచేయలేరు. తారలు చెప్పింది బుద్ధిగారాసుకొని ప్రసారం, ప్రచారం చేసేస్తారు విలేఖరులు. అవి ఎంతవరకు నిజం అని ఆరా తియ్యరు. అంతా గ్యాస్ అని పాఠకులకూ తెలుసు!

- సోనాలి, సూర్యారావుపేట

నిజంగా విషాధ గాథ..

స్నేహితుల దినోత్సవం సందర్భంగా మహానటి సావిత్రి చిన్ననాటి నుంచి స్నేహితురాలు మద్దాలి సుశీల చెప్పిన విషయాలు- సినిమాల్లోకి రమ్మని సుశీలను ఆహ్వానిస్తే ఆమె రాలేదని సావిత్రికి చాలా కోపం వచ్చిందట. చాలాకాలం తర్వాత సావిత్రి ఆమెను కలిసినప్పుడు ‘నువ్వు సినిమాల్లోకి రాకపోవడమే మంచిదైంది. నువ్వు కుటుంబంతో చక్కగా ఉన్నావు. నీ మాట కాదని పెళ్లిచేసుకున్నందుకు ఏమాత్రం సంతోషంగా లేను. ఇప్పుడు నా భర్త నాతో ఉండడం లేదు. నాకు నచ్చిన చీర కట్టుకోలేను. ఇష్టమైనవి తినలేను. సంపద, సంతోషం నన్నొదిలి పోయాయి’ అంటూ ఏడ్చిందట సావిత్రి. నిజంగా సావిత్రిదొక విషాధ గాథ.

- సుధీర్, శ్రీనగర్