మీ వ్యూస్

సరికాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాహం అయిన తర్వాత సమంతను సమంత అక్కినేని అని మీడియా పేర్కొనడం సరికాదు. తెలుగు రాష్ట్రాల్లో వివాహిత ఇంటి పేరు మారుతుంది. కాని తమిళులు, మలయాళీలు, ఉత్తరాదివారు, క్రైస్తవులకు ఇంటి పేరు ఉండదు. సొంత పేరు పక్కన తండ్రి పేరు లేదా భర్త పేరు వస్తుంది. సమంత క్రైస్తవ మలయాళీ. ఆమెకు ఇంటి పేరు లేదు. భర్త నాగచైతన్యను చై అని గాని చైతూ అని గాని పిలుస్తూ ఉంటారు. అందువల్ల సమంత చై లేదా సమంత చైతూ అనడం మంచిది. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తెను కళ్యాణి ప్రియదర్శన్ అనాలి కానీ కొందరు కళ్యాణి ప్రియదర్శిని అంటున్నారు. ఇదీ తప్పే.

- గునే్నశ్, కొవ్వాడ

దటీజ్..సుబ్బరాజు!

ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బహుబలి చిత్రాలతో ప్రభాస్ కీర్తి ఎక్కడికో వెళ్లిపోయింది. అతనికి ఆఫర్లమీద ఆఫర్లు వచ్చేస్తున్నాయంటూ మన మీడియా బాకాలుదాయి. కానీ జపాన్‌లో రజనీకాంత్ తర్వాత అంత క్రేజ్ సాధించినవాడు బాహుబలిలో కుమారవర్మగా నటించిన సుబ్బరాజు! మిగిలినవారు సూపర్ హీరోల్లాగ అసహజంగా ఉంటే సుబ్బరాజు పాత్ర సహజంగా ఉండి వారికి బాగా నచ్చింది. ఆ పాత్ర పిరికివాడు. యుద్ధం అంటే వణికిపోయేవాడు. పిరికిపందగా కనిపించినా చివరకు తెగించి ధైర్యం కూడగట్టుకొని తెగించి ఫైటింగ్ చేయడం జపనీయులకు బాగా నచ్చింది. అందుకని నిర్మాతలు ప్రత్యేకంగా సుబ్బరాజుని జపాన్ తీసుకెళ్లి ప్రేక్షకులకు పరిచయం చేసే పనిలోపడ్డారట. దటీజ్.. సుబ్బరాజు!

- శాండీ ప్రచండ్, శ్రీనగర్

బయటపడతాయా?

‘మహానటి’ హిట్ అవగానే ఇంకా ఎవరి బయోపిక్‌లు తీయవచ్చో సూచిస్తూ వెనె్నలలో వ్యాసం వచ్చింది. కానీ డాన్‌ల బయోపిక్‌లు సరేగాని రాజకీయ నేతలు, స్టార్ల బయోపిక్‌లు తీయడం చాలా కష్టం. ఇందిరాగాంధీపై తీయదలచిన చిత్రంలో విద్యాబాలన్‌ని సంప్రదిస్తే ఆ పాత్ర పోషించడం నాకిష్టమే గాని కావలసిన అనుమతులన్నీ తీసుకొని రమ్మని ఆమె చెప్పింది. అంతే. ఆ చిత్రం ఆగిపోయింది. జయలలితపై ‘అమ్మ’ పేరుతో దాసరి చిత్రం తీద్దామనుకొని మానేశాడు. కాని ఒక తమిళుడు గట్టిగా ప్రయత్నించాడు కాని ఆమెను జైల్లోపెట్టినట్టు చూపించకూడదని అభిమానులు బెదిరించారు. ఆ సినిమా ఆగిపోయింది. మన్మోహన్‌సింగ్, బాల్‌థాక్రేలపై చిత్రాలు ప్రకటించినా అవి సమస్యల్ని అధిగమించి బయటపడతాయో లేదో చెప్పలేం.

- చంద్రిక, రాజేంద్రనగర్

ఐటమ్‌సాంగ్స్!

బాలీవుడ్‌లోనే కాక సినీ రంగంలోనే అరుదైన నిజాయితీపరురాలు కంగనా ఎవరేమనుకున్నా లెక్కచేయక నిజాయితీగా తన అభిప్రాయం చెప్తుంది. ఐటంసాంగ్స్‌పై ఆమె అభిప్రాయం వినండి. ‘ఐటంసాంగ్స్‌లో అశ్లీలత తప్ప వేరేమీ ఉండదు. అందులో నటించాల్సిందీ ఏమీ ఉండదు. సినిమాకు ఏ విధంగానూ సంబంధంలేని అలాంటి పాటలకు ఎందుకు లక్షలు కుమ్మరిస్తారో! డబ్బుకోసం అలాంటివి నేను చేయను. నా పిల్లలు వాటిని చూసి మా మమీ ఇలాంటివి చేసిందా అనుకోకూడదు. నా పిల్లల్ని ఎవరూ ఐటెం బాంబ్ పిల్లలు అని గేలి చేయకూడదు’అంది. ఈ నిజాయితీ ఎంతమంది నటీమణుల్లో ఉంది? అమ్మ అయితే ఐటెంసాంగ్స్ చెయ్యకూడదని ఎక్కడుంది అని మన అనసూయ, కస్తూరి ఎదురు ప్రశ్నిస్తారు మరి!

- సుధీర్, శ్రీనగర్

వాహ్..రేణు!

రేణుదేశాయ్ జ్ఞాపకం ఉందా? పవన్‌కళ్యాణ్‌తో సహజీవనం చేసి ఇద్దరు బిడ్డల్ని కని అతనితో విడిపోయి 7 సం. ఒంటరిగా ఉండి తన 37వ ఏట మళ్లీ పెళ్లిచేసుకుంటుందట. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధమే. అతడు పక్కనుంటే నాకు ప్రశాంతంగా, నిబ్బరంగా ఉంటుంది. అందుకే పెళ్లి. నేను సంప్రదాయాల్ని గౌరవిస్తాను. పెళ్లి అంటే ఇష్టమేకాని గత్యంతరం లేని పరిస్థితిలో సహజీవనం చేశాను. ఇప్పుడు సహజీవనం కాదు పెళ్లే చేసుకుంటున్నా. సామాజిక మాధ్యమాల్లో నా గురించి భయంకరమైన కామెంట్లు వస్తున్నాయి. వారి అల్పబుద్ధికి నేనెందుకు బాధపడాలి? అందుకే సామాజిక మాధ్యమాలనుంచి బయటపడ్డాను అంటున్నది రేణుదేశాయ్. వాహ్..రేణు!

- మరుదకాశి, కరప

అది తప్పు.. ఇదీ నిజం!

గత వారం వెనె్నలలో నాకు నచ్చిన సినిమా ‘శ్రీకృష్ణ తులాభారం’లో వసంతకుడుగా రేలంగి నటించారని సోదరుడు తప్పుగా పేర్కొనడం జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ బేనర్‌పై రామానాయుడు రామారావు, అంజలి, జమున, కాంతారావులతో నిర్మించిన ఆ చిత్రంలో వసంతకుడుగా నటించింది పద్మనాభం. రేలంగి కాదు. ఆమధ్య నాకునచ్చిన పాట క్రింద వ్రాయబడ్డ ‘నీవులేక వీణ పలుకలేనన్నది’అన్న గీతం సి.నారాయణరెడ్డి రచన అని మరో మిత్రుడు పేర్కొనడం జరిగింది. కానీ ఆ గీతం వ్రాసింది ఆచార్య ఆత్రేయ! నేను స్వయంగా నాలుగువారాల క్రితం ‘మీ వ్యూస్’లో వ్రాసిన డాక్టర్ చక్రవర్తి చిత్రం మొదటగా 1964లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నంది అవార్డులలో మొదటి బంగారు నందిని గెలుచుకుందని వ్రాస్తే అచ్చుతప్పులో 1959 అని వచ్చింది. ఇది నా తప్పుకాదు! ఈనాటి తరానికి ఆ తరం మధుర జ్ఞాపకాల తీపి గుర్తుల్ని అందించడం, ఆనాటి నిర్మాణాల విలువలను, విశేషాలను వివరించడంకోసం జరుగుతున్న ఈ విపులీకరణాల్లో తప్పులు రాయడం జరిగితే నెగెటివ్ సంకేతాలను పంపినట్లవుతుందనే భావనతో ఈ నాలుగు మాటలు రాయవలసి వచ్చింది. ఈ ‘మా’ వెనె్నలను వినీలాకాశంలో విహరించేలా ఆ ‘వెనె్నల’కు ధీటుగా నిలిపే ప్రయత్నంలో భాగస్వాములైన వారికి మా పాఠకులమే కాకుండా వెనె్నల కూడా ఋణపడి ఉంటుంది. వారివారి విషయాలు, విశే్లషణలు ఎంతో బాగుంటున్నాయి. రెండు తరాలకు వారధుల్లాంటి వీళ్ల రచనలు ఆపాత మధురాల తేనెల్ని అందిస్తున్నాయి. అలాగే మిగతా రచయితల కృషి, రిలీజైన చిత్రాల నిష్పాక్షిక సమీక్షలు బాగుంటున్నాయి.

- తాడ్డి అప్పలస్వామి, పార్వతీపురం