మీ వ్యూస్

అతుకుల బొంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమల్‌హాసన్ రాజకీయాల్లోకి వచ్చేముందు తనకు కాషాయం నచ్చదని ఎరుపు ఇష్టం అని చెప్పాడు. వ్యతిరేకుల్ని చంపేసే కల్చర్ ఉన్న కేరళ నేతల్ని కలుస్తున్నాడు. ఆయన చిత్రం ‘విశ్వరూపం-2’లో కూడా ఈ పైత్యం కనిపిస్తుంది. దేశభక్తుడైన హీరో ముస్లిం (కమల్) దేశద్రోహి అయిన హిందూని చంపడం కథ. విశ్వరూపంకోసం చిత్రించిన కొన్ని భాగాలు ఎడిటర్ తొలగించగా వాటిని కలుపుతూ కథ రాసి అవసరం అయిన కొన్ని దృశ్యాలు కొత్తగా చిత్రించి అవీ ఇవీ కలిపి కుట్టిన అతుకుల వింత బొంత ఈ విశ్వరూపం-2. కమల్ అభిమానుల్ని కూడా తీవ్రంగా నిరాశపరిచిన చిత్రం ఇది.

- ప్రసన్న, పేర్రాజుపేట

కల్పిత కథగా మిగిలిపోతుందా?

జయలలిత బయోపిక్ తీయాలనుకోవడం అటుంచి వాస్తవాలు పరిశీలిస్తే బయోపిక్ అని ప్రచారం చేసి కల్పిత కథ అన్న ముసుగేసుకొని ప్రధాన పాత్రకు సుగుణాలు అద్ది నెగెటివ్ చాయలు కనిపించకుండా చేయడం చూ స్తున్నాం. జయలలిత మరణించగానే ‘అమ్మ‘ అనే పేరుతో దాసరి బయోపిక్ ప్రకటించి తర్వాత విరమించారు. ఒక తమిళుడు ‘అమ్మ’ పేరుతో బయోపిక్ తీయబోతే ఆమె జైలు పాలయినట్లు చూపించకూడదని అభిమానులు బెదిరిస్తే విరమించుకున్నాడు. మరి ఇప్పుడు ప్రకటించిన బయోపిక్ ముసుగేసుకున్న కల్పిత కథగా మిగిలిపోతుందా? అభిమానుల బెదిరింపులు సఫలం అవుతాయా? సినిమా తయారౌతుందా? జవాబులకోసం వేచి చూడాలి.

- ప్రసాద్, గొడారిగుంట

హైటెక్ చీకటికోణం

హైటెక్ చీకటికోణం వ్యాసం చాలా బాగుంది. ఒక్క సినిమా రంగం మాత్రమేకాదు ఈ జాడ్యం ఆడ, మగ కలిసి పనిచేసే ఆస్పత్రులు, ఐటి కంపెనీల్లోనూ ఉంది. కొంచెం తక్కువ స్థాయిలో. ఈమధ్య ప్రొఫెసర్లు, లేడీస్ హాస్టల్ మేనేజర్లు కీచక పర్వం కొనసాగిస్తున్నారు. నిజానికి పెద్ద జీతాలు తెచ్చుకునే ఐటి కంపెనీ అమ్మాయిల్ని పెళ్లిచేసుకోడానికి అబ్బాయిలు సంకోచిస్తున్నారు అందుకే. అయితే బాధితుల పేర్లు రహస్యంగా ఉంచాలన్న చట్టంవల్ల ఇలాంటి దాష్టికాల విషయాలు మీడియాలో సమగ్రంగా రావడం లేదు. అమెరికాలోనూ బాధితుల పేర్లు వెల్లడించరు.

- ప్రభాస్, గాంధీనగర్

సత్తా ఉన్నదే నిలుస్తుంది

డబ్బింగ్‌తో సహా ఏడాదికి 175 పైగా చిత్రా లు విడుదలవుతున్నప్పుడు వారానికి 3,4 చిత్రాలు రావడం సహజమే. అవి చిన్న చిత్రాలయితే కామెంట్ చేయని ఛానల్స్-స్టార్లు నటించిన చిత్రాలు 2,3 ఒకేసారి విడుదలైతే దాన్ని యుద్ధంగా అభివర్ణిస్తున్నాయి. ఆఫీసర్, అభిమన్యుడు ఒకేరోజు వస్తే మన నాగార్జున మీద తమిళ విశాల్ యుద్ధానికొస్తున్నట్టు ఒక ఛానల్ పేర్కొంది. అసలు నిజం ఏమంటే ఒకే రోజు ఎన్ని సినిమాలొచ్చినా సత్తా ఉన్నదే నిలుస్తుంది. సత్తాలేకపోతే తోకముడుస్తుంది. దీన్ని యుద్ధం అనడం సమంజసంకాదు. సత్తాలేని ఆఫీసర్- అభిమన్యుడు రాకపోయినా చతికిలబడేవాడు.

- సంపూర్ణ, సాంబమూర్తినగర్

నిఖార్సైన నిజాలే..!

‘హైటెక్ చీకటి కోణం’ వ్యాసంలో నిఖార్సైన నిజాలే చెప్పారు. నిజానికి శ్రీరెడ్డి కన్నా చాలాముందుగానే మలయాళ సెక్సీ తార షకీలా కాస్టింగ్ కౌచ్‌పై ఎలుగెత్తింది. ఆమె సెక్సీ చిత్రాలముందు సూపర్ స్టార్ల చిత్రాలూ వెలతెలాపోయాయి. దాంతో ఆ స్టార్లు ఆమెను బ్యాన్‌చేశారు. ఆరోజుల్లోనే ఆమె టాలీవుడ్‌లో కాలుపెట్టింది. కొంతకాలం తర్వాత తెరమరుగైంది. ఎప్పుడూ ఒకేలాంటి చిత్రాల్లో నటించడం విసుగేస్తోంది అని చెప్పింది. తన ఆత్మకథ రాస్తున్నానని ప్రకటించి సూపర్ స్టార్లకు దడ పుట్టించింది. మళ్లీ ఇప్పుడు తన ఆత్మకథతో మాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నది.

- సత్య, కరప

సినిమా పరిశ్రమా?

‘సినిమా పరిశ్రమా?’ వ్యాసం బాగుంది. అయితే సినిమాని చిత్రం అంటాం. సినీ రంగాన్ని చిత్ర రంగం అంటాం. కనుక దీన్ని చిత్రమైన పరిశ్రమ అనొచ్చునేమో! మన టాలీవుడ్‌లోనేకాక బాలీవుడ్, హాలీవుడ్‌లలో కూడా సినిమాని ఇండస్ట్రీగానే పరిగణిస్తున్నారు. దశాబ్దాల క్రితం మనవాళ్లే నాటి ముఖ్యమంత్రిని కలిసి చిత్ర రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించి ఇండస్ట్రీకి ఇచ్చినట్టే సినీ రంగానికీ సదుపాయాలు, పన్ను రాయితీలు, చౌకగా స్థలాలు, రుణాలు ఇవ్వాలని కోరారు. కాని తర్వాత ఆ ఊసే లేదు.

- సాహిత్య దీప్తి, రమణయ్యపేట

సీక్వెల్స్ మహారాణి!

సీక్వెల్స్ మహారాణి అని ఎవర్ని అంటారో తెలుసా? శ్రద్ధాదాస్‌ని! ఎందుకంటే ఆమె ఇప్పటికే నాలుగు సినిమాల సీక్వెల్స్‌లో నటించింది. అవి ఆర్య-2, నాగవల్లి(చంద్రముఖి సీక్వెల్), డైరీ (మంత్ర సినిమాకి సీక్వెల్), గ్రేట్ గ్రాండ్ మస్తి(మస్తి చిత్రానికి మూడో సీక్వెల్). ఇప్పుడామె కన్నడ సీక్వెల్ కోటిగొబ్బ-3లో నటిస్తోంది. ఇన్ని సీక్వెల్స్‌లో నటించిన నటీనటులెవ్వరూ ఇంతవరకు లేరు. అందుకే శ్రద్ధాదాస్ సీక్వెల్స్ మహారాణి!

- ప్రవీణ్, కాకినాడ

స్టార్‌డమ్ ఉంటే సరిపోదు!

‘సూర్మా’ చిత్ర సమీక్షలో బయోపిక్ తీయడానికి ఆ వ్యక్తికి స్టార్‌డమ్ లేదా సమాజానికి ఏదోచేసి ఉండాలి అన్నారు. స్టార్‌డమ్ ఉంటే సరిపోదు. ఆదర్శప్రాయుడై ఉండి తన జీవితం సమాజానికేదో సందేశం ఇచ్చేదిగా ఉం డాలి. సంజు నటుడుగా రాణించినా అతని జీవితం ఆదర్శప్రాయం కాదు. మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. వైవాహిక జీవితంలో ఫెయిల్ అయ్యాడు. ఉగ్రవాదులతో చెలిమిచేసి జైలుపాలయ్యా డు. అయినా సంజు బయోపిక్ 15 రోజుల్లో 500 కోట్లు సాధించి, సూపర్‌హిట్ అయింది. రావణ భజనచేసే జనం ఉన్న దేశంలో సంజులాంటి నెగెటివ్ వ్యిక్తిత్వం ఉన్న వాడిని ఆరాధించే వారుండటం ఆశ్చర్యం కాదు!

- సుధీర్, శ్రీనగర్