మీ వ్యూస్

ఇప్పటికీ మారరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారం వారం కొత్త సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులను పూర్తిగా నిరాశకు గురిచేసి వెళ్తున్నాయి. అప్పుడప్పుడూ వచ్చే మెరుపులా ఏ ఒక్కటో ఆకట్టుకుంటుందే తప్ప, తెలుగు సినిమాలన్నీ రొటీన్ అన్న భావనే కలుగుతుంది. వాస్తవికాంశాల ఆధారంగా ఇతర భాషల్లో అనేక చిత్రాలు రూపుదిద్దుకుంటుంటే -తెలుగు దర్శకులు, నిర్మాతలు మాత్రం ‘మూస కథ’లు పట్టుకునే వేలాడటం బాధాకరం. ఇక, ఇటీవలి కాలంలో తెలుగు పరిశ్రమలో చిన్న చిత్రాల జోరు పెరిగింది. నిజంగా శుభపరిణామం. కానీ, తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమాత్రం పాటించకుండా అవీ ‘్ఫర్మాట్’ చట్రంలోనే ఇరుక్కుపోతుండటం శోచనీయం. గతవారం వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’, ‘నన్ను దోచుకుందువటే’ చిత్రాలు ఆడియన్స్‌ని సంతృప్తిపర్చలేకపోయాయి.
‘్ఫర్మాట్’ దాటని చిత్రాలన్నీ ఢమాల్‌మంటున్న విషయాన్ని తెలుగు పరిశ్రమ ఎందుకు గ్రహించదు. ఫార్మాట్ పరిధుల్ని దాటి చిన్న చిత్రంగా వచ్చిన ‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి ప్రయోగాలపై ఎందుకు దృష్టిపెట్టదు. కొత్త దర్శకులు, నిర్మాతలు ఈ విషయాన్ని కాస్త సీరియస్‌గానే ఆలోచించాలి.

-కె భావన, కంచరపాలెం

ఆ నిజం గ్రహించండి

బయోపిక్‌ల మీద వెనె్నల వ్యాసం బావుంది. నిజానికి ఈ చర్చ ఇప్పటిది కాదు. బయోపిక్‌ల ఊపందుకున్నప్పటి నుంచీ ఈ చర్చ నడుస్తూనే ఉంది. ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని కథగా తీసుకున్నపుడు, ఆ వ్యక్తిగురించి ప్రజలకు చాలా తెలిసే ఉంటుందన్న స్పృహ మర్చిపోవడం దారుణం. సినిమా వ్యాపారం సాగాలంటే అలాంటివి కొన్ని తప్పదని చెప్తున్నారు చాలామంది. వ్యాపారాన్ని వ్యాపారంలా ప్రచారం చేసుకోకుండా, గొప్ప వ్యక్తి జీవితాన్ని ప్రజలకు అందించే ఉదాత్త ఆశయంతో చేస్తున్న సినిమాలుగా ఎందుకు చెప్పుకుంటారు. వాస్తవాలను వక్రీకరించడం, అవాస్తవాలకు బలం చేకూర్చడం చేస్తున్నపుడు -వాటిని బయోపిక్ అని ఎందుకు చెప్పాలి? ఇవి ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి తప్ప, పట్టించుకునే వారు లేరు. ఈనాటి సినిమా రేపటి తరానికి ఓ చరిత్ర. గొప్ప వ్యక్తుల జీవితాల్లోని చారిత్రాకాంశాలను సినిమా కోసం మరుగునపెట్టి చరిత్రను వక్రీకరిస్తే -రేపటి తరం అదే నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది. తెలుగు పరిశ్రమలో అలాంటి తప్పులు జరగడం -్భవిష్యత్‌ను చెరిపేసుకోవడమే. పాత చిత్రాలను ఇప్పటికీ ఎందుకు ఆణిముత్యాలుగా చెప్పుకుంటున్నామంటే -ఆ కాలంలో చూపిన నిజాయితీ. ఆ అనుసరణను వదిలేసుకోవడం -సరిదిద్దుకోలేని తప్పే అవుతుంది.

-కాజ ప్రదీప్‌చంద్ర, తుని

అభినందనలు

కొద్దిరోజులపాటు నిలిచిపోయిన ‘్ఫ్లష్ బ్యాక్ అట్ 50’ని మళ్లీ కొనసాగించడం చాలా ఆనందంగా ఉంది. 50ఏళ్ల క్రితంనాటి ఆణిముత్యాలను ఏరి పాఠకుల కోసం తెలీని విశేషాలు, వివరాలతో అందిస్తున్న రచయిత్రి మాణిక్యేశ్వరి ప్రయత్నాన్ని అభినందించాలి. సినిమాపై ఎంతో అవగాహన ఉంటే తప్ప అలాంటి ప్రక్రియను కొనసాగించలేం. అప్పటి కాలమాన పరిస్థితుల్లో రూపుదిద్దుకున్న చిత్రాల కథను చెబుతూనే, తెరవెనుక అంశాలనూ ప్రస్తావిస్తోన్న తీరు చాలాచాలా బావుంటుంది. వెనె్నల పాఠకుడిగా చిన్న విన్నపం. వచ్చే వారం ప్రచురించదలచిన చిత్రాన్ని ముందువారమే ప్రకటిస్తే -ఆసక్తివున్న వారు ఆ సినిమాను చూసే అవకాశం ఉంటుంది. దీనివల్ల వ్యాసంలో పేర్కొంటున్న తెరవెనుక అంశాలు మరింత రక్తికట్టిస్తాయని నా అభిప్రాయం. పరిశీలించగలరు.

-పల్నాటి సుబ్రహ్మణ్యం, కర్నూలు

అన్నీ మేకోవర్లేనా?

సంజు బయోపిక్ బాగోతం గురించి రచయిత్రి బాగా ఎండగట్టారు. బయోపిక్ అని ప్రచారం జరిగినా ఇది పూర్తిగా కల్పితం అని తెరమీద చూపించి తప్పించుకుంటూ ఉంటారు. నెగెటివ్‌గా చూపించడానికి ఎవరూ ఒప్పుకోరు. అందుకే చెడు కనిపించకుండా రంగులు పూసిన మేకోవర్ చిత్రాలివి. జయలలిత చిత్రం తీయబోతే ‘అమ్మను జైల్లోపెట్టినట్టు చూపించకూడదని’ అభిమానులు హెచ్చరిస్తే ప్రాజెక్ట్ విరమించుకున్నాడాయన. ‘మీ నాన్న గొప్పోడని చూపించడానికి మా నాన్నని చెడ్డవాడు’ అని చూపిస్తే జాగ్రత్త అని ఎన్టీఆర్ చిత్ర నిర్మాత బాలకృష్ణని హెచ్చరించాడు నాదెండ్ల భాస్కరరావు తనయుడు. చూద్దాం ఎన్టీఆర్ చిత్రంలో మేకోవర్లుంటాయో, యథార్థాలే చూపిస్తారో.

- ప్రవీణ్, కాకినాడ

దేశభక్తి గీతాలేవి?

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వచ్చాయంటే విద్యార్థులకు దేశభక్తిగీతాల ఆవశ్యకత ఎంతో ఉంది. మరి నేటికీ ప్రసిద్ధమైన దేశభక్తి గేయాలు ఏమిటంటే.. ‘నేనూ నా దేశం’, ‘నీ ధర్మం నీ సంఘం’, ‘గాంధీ పుట్టిన దేశం’, ‘్భలే తాత మన బాపూజీ’, ‘పుణ్యభూమి నా దేశం’...వంటి కొన్ని గీతాలే. నేటి సినిమాలు కమర్షియల్ పంథాలో సాగి, పాటలంటే ఎక్కువ శాతం డ్యూయెట్లకే పరిమితం అవుతున్నాయి. దేశభక్తి గేయాలు కరవైనాయి. ఇప్పటికైనా అడపాదడపా దేశభక్తి చిత్రాలను తీసి, వాటిని దేశభక్తి గీతాలతో నింపాలి. ఒకవేళ మామూలు కథతో తీసినదైనా సందర్భాన్ని సృష్టించి దేశభక్తి గేయాలను చిత్రించాలి. ప్రసిద్ధమైన ‘సారే జహాసె అచ్ఛా’, ‘హోంగే కామియాబ్’, ‘హింద్ దేశ్‌కే నివాసి’, ‘జ్యోదీతోర్ డార్‌షె’వంటి గేయాలని అవే రాగాలతో రీమిక్స్‌చేసి సినిమాల్లో చిత్రించాలి. ఇవి ప్రతి మానవునిలోనూ దేశభక్తిని రగిలించాలి.

- సరికొండ శ్రీనివాసరావు, హైదరాబాద్

అదీ తెలుగు కథ

తెలుగు కథ ఎక్కడ? అని వెదికితే దర్శకుని జేబులో చిత్తుకాగితం లాగ కనిపించింది. దానిలో కథ ఒక లైను, మూడునాలుగు సన్నివేశాలున్నాయి హీరోకి చెప్పడానికి! ఆ కాగితం పట్టుకొని కాళ్లకు బలపాలు కట్టుకొని హీరోల ఇళ్లచుట్టూ తిరుగుతాడు దర్శకుడు. చెప్పులు అరిగిపోయాక చివరకు ఒక బకరా హీరో దొరికితే అతని అభిమానులు పది సినిమాలనుంచి పది సన్నివేశాలు చెబితే దర్శకుని చిత్తుకాగితంలోని సన్నివేశాలకు వీటిని చేర్చి స్క్రిప్ట్ తయారుచేసేస్తారు. టైలర్ షాపులోని గుడ్డముక్కలన్నీ కలిపి కుట్టేసి తయారుచేసిన డ్రెస్‌లాగ ఉంటుందాకథ. దాన్ని సినిమాగా తీస్తే రెండురోజులైనా ఆడుతుందన్న గ్యారంటీ లేదు. దటీజ్ టాలీవుడ్!

- లంబకర్ణ, రాజేంద్రనగర్