మీ వ్యూస్

రజనీ కథ బలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతి సర్వత్రే వర్జయేత్ అని పెద్దలు సరదాకి అన్నారా? తాజాగా విడుదలైన కబాలి సినిమా, మీడియాలో దానిపై పెంచేసిన అంచనాలు, ఆ పేరుతో కార్పొరేట్ సంస్థలు సాగించిన వ్యాపారం, విడుదల రోజు కార్యాలాయాలకు సెలవులు ఇవ్వడం.. ఇత్యాది ప్రయోగాలు, పటాటోపాలు అన్నీ అతే. విడులయ్యాక బండారం బయటపడింది.
ధనరాజు, సూళ్లూరుపేట
కోట్లతో నటన నాణ్యమవునా?
చిరంజీవి నూటయాభైయ్యవ సినిమాకు హీరోయిన్ కరువొచ్చినట్టుంది. నయనతార, అనుష్కలు అంగీకారం తెలపకపోవడంతో హిందీ భామ జాక్విలన్ ఫెర్నాండెజ్‌ను సంప్రదిస్తే, ఆమె ఏకంగా ఐదు కోట్ల పారితోషికం అడిగిందట. కోట్లతో నటన నాణ్యమవుతుందా? కొత్త తెలుగమ్మాయిని వెతకండి. సరైన స్క్రిప్ట్, దర్శకత్వం ఎటువంటి కథనయినా కదనరంగానికి పంపవచ్చు. ఆదుర్తి సుబ్బారావు తేనెమనసులు, రాఘవేంద్రరావు గంగోత్రి, బాపు ముత్యాలముగ్గు సినిమాల్లో కొత్త నటులను ఎంపిక చేసుకుని హిట్లుకొట్టలేదా? కోట్లంటే మాటలా? మరోసారి ఆలోచించండి. అనవసరంగా కోట్లు కుమ్మరించకండి. సినిమా ఓ స్పెక్యులేషన్ అనే వాస్తవాన్ని మరువకండి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
అంతమాత్రానికే....
రెండు చిత్రాలు ఫెయిల్ అయితే ఏ తారకైనా ప్రజాదరణ తగ్గినట్లు అనిపిస్తే వారి గురించి అవాకులు, చెవాకులు చెప్పడం మీడియాకు అలవాటే. ఆమధ్య తమన్నా, సమంతల పని అయిపోయిందని ప్రచారం చేసింది మీడియా. కాని వారు తర్వాత పుంజుకున్నారు. ఈమధ్య కాజల్‌ని టార్గెట్ చేసింది మీడియా. కాని ఆమెకూడా నిలదొక్కుకుంది. ఇప్పుడు టార్గెట్ నయనతార! ఆమె పాత్ర బాగుండాలి. స్కిన్‌షో చెయ్యను అంటోందట. తప్పేం ఉంది. దీపిక పాత్ర బాగులేదని సల్మాన్ చిత్రమే చెయ్యనంది. కంగన సరేసరి. టాలీవుడ్‌లో కూడా నిత్యమీనన్, కీర్తిసురేష్, శ్రీదివ్య లాంటి వారిదీ అదే బాట. పాత్ర బాగులేకపోతే చేయననడం నటీనటుల హక్కు.
-అభిలాష, సాంబమూర్తినగర్
హీరో విలన్లు
ఉద్యోగం చేసేవారు 60 ఏళ్లకైనా రిటైర్ కావాల్సిందే. సినీ రంగంలో ఎంత ప్రముఖులైనా కొంతకాలం వెండితెరమీద వెలిగిపోతారు. ఆ కాలంలో నటులు తక్కువ కాబట్టి దశాబ్దాలు ఏలారు. కొత్తతరం తెరను ఆక్రమించాక మధ్యతరగతి హీరోలు విలన్ల అవతారం ఎత్తారు. నాయకుడు ప్రతి నాయకుడైతే ప్రేక్షకులకు నచ్చదు. అయినా నటుడన్నవాడు ఏ పాత్రలోనైనా ఇమిడిపోవాలి. గతంలో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లతో జమునకు కొన్నాళ్లపాటు సమస్యలు ఎదురైతే కృష్ణకుమారికి అవకాశాలు వచ్చాయని అనుకున్నారు. పాదుకాపట్ట్భాషేకం అన్ని విధాలా బాగున్నా ఆశించిన విజయం పొందకపోవడానికి కారణాలు కనిపించాయి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
వ్యాపార వ్యవహారం
దశాబ్దాల క్రితం బాలీవుడ్ హాస్య నటుడు ఐ.ఎన్.జోహార్ ఆంగ్ల చిత్రంలో నటిస్తున్నాడన్న వార్త సంచలనం కలిగించి ఎంతో ప్రచారం జరిగింది. తీరా సినిమాలో చూస్తే అతని పాత్ర హీరో వెనక లగేజి మోసే పాత్ర! శశికపూర్ నాలుగైదు ఆంగ్ల చిత్రాల్లో హీరోగా నటించి కాస్తంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకొందరూ కాస్త గుర్తింపు పొందారు. హాలీవుడ్ చిత్రాల్లోనూ బి, సి గ్రేడు సినిమాలుంటాయి. బాలీవుడ్ నటులు ఎక్కువగా ఇలాంటి చిత్రాల్లోనే కనిపిస్తారు. వాళ్లెంత తక్కువ పారితోషికం ఇచ్చినా దాన్ని రూపాయిల్లోకి మార్చితే మనవాళ్లు ఇచ్చే దానికన్నా ఎక్కువే. అందుకే మనవాళ్లకి అటు చూపూ.. చవకగా దొరుకుతారని వాళ్లకి ఇటు చూపు!
- సుభాష్, శ్రీనగర్
‘చలో హాలీవుడ్’ బావుంది
‘చలో హాలీవుడ్’ వ్యాసం చదివాక బాలీవుడ్ నటులు ఇంతమంది ఆంగ్ల చిత్రాల్లో నటించారా? అని ఆశ్చర్యపోయాం. ఆలోచిస్తే అందుకు రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. టెన్నిస్ ఆటగాడు విజయ్ అమృత్‌రాజ్ లాంటి భారతీయులు ఆంగ్లచిత్రాలు తీస్తూ బాలీవుడ్ నటులకు స్నేహహస్తం అందించడం, ఆంగ్లచిత్రాలు భారతీయ భాషల్లోకి డబ్బింగ్ అవడం, ఆ ప్రధాన కారణాలు. ఎక్కువ జనాభాగల భారత్‌లో పాగా వేయాలంటే భారతీయుల్ని తమ చిత్రాల్లో భాగస్వాముల్ని చేయాలన్న ఆర్థికసూత్రం పనిచేస్తుంది. కొన్ని చిత్రాల్లో పాత్రలకు అమితాబ్, జగపతిబాబు లాంటి వారితో డబ్బింగ్ చెప్పించడం ఆ సూత్రంలో భాగమే.
- ప్రవీణ్, కాకినాడ
హీరోలకు ఎంత కష్టం
మన అగ్ర హీరోలు ఎక్కువ సినిమాలు చేయడానికి రెడీ అవడం, వారి స్థాయికి తగిన హీరోయిన్లు తక్కువ సంఖ్యలో ఉండటం, అవే కాంబినేషన్లు రిపీట్ అవుతూ ఉండటం గడ్డు సమస్యగామారి మనవాళ్లు పొరుగింటి పుల్లకూరకోసం అర్రులుచాచేట్టు చేస్తున్నది. తగిన హీరోయిన్ దొరక్క చిరంజీవి పరిస్థితి దయనీయంగా మారింది. అనుష్క, నయన్‌లతో కుదరలేదు. పుల్లకూర రుచి సంగతి అటు ఉంచితే డిమాండ్‌ని బట్టి రేటుఎక్కువయింది. పరిణితి 3 1/2 కోట్లు అడిగితే జాక్వెలిన్ 5 అడుగుతోంది! బాలీవుడ్ బక్కపలుచని భామలతో చిరంజీవి కెమిస్ట్రీ కుదరుతుందా? అయ్యో, ఎంత కష్టమెంత కష్టం!!
- లక్ష్మీప్రసన్న, పేర్రాజుపేట
తెలుగు చిత్రరంగం తెర వెనక్కి
ఆనాడు మాతరంలో తోలుబొమ్మలాట, నాటక రంగం, హరికథలు, బుర్ర కథలు, ఇత్యాది కళారంగాలు ప్రజలను ఆనందింపచేసేవి. క్రమేపీ ఆ కళలు, కళాకారులకు ఆదరణ కరవైంది. చిత్రసీమ ఒక వెలుగువెలిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆనాటి కళలు తెరమరుగైనట్టే, చిత్రసీమ తెరమరుగు కాబోతుంది. ఇందుకు ప్రధార కారణం బుల్లితెర, అందులో ప్రసారమవుతున్న సీరియల్స్! సీరియల్స్ అంటే సామాన్యులకుగాని అర్ధం, అవగాహన లేకపోయినా చూస్తున్నారు. సెన్సార్‌వారు పూర్తిగా స్వేచ్ఛనిస్తున్నారు కాబోలు! మరీ దిగజారుడు పదాలు వినాల్సి వస్తోంది. చిత్రసీమకు కూడా ఇది రాబోయే రోజుల్లో ఎదురుదెబ్బ! ఎదురీత కూడా!
-మంగం ఆనందరావు, వేగివారిపాలెం