మీ వ్యూస్

ప్రేక్షకుడు ఏమవ్వాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హక్కులు, రాయతీలు కోరుకుంటున్నంత నిక్కచ్చిగా చిన్న సినిమా దర్శక, నిర్మాతలూ బాధ్యతలు తీసుకుంటే బావుంటుంది. చిన్న సినిమాలను రక్షించండి అంటూ అప్పుడప్పుడూ గగ్గోలు వినిపిస్తూనే ఉంది. కానీ, ఎన్ని చిన్ని సినిమాలు ప్రేక్షకులను మైమరిపింప చేస్తున్నాయన్న లెక్కలు తీస్తే -లెక్కించడానికేమీ ఉండవు. వచ్చే సినిమాల్లో ఒకటీ అరా ఔరా! అనిపించడం తప్ప చాలా సినిమాలు ఏమాత్రం సినిమా ప్రామాణికత లేకుండానే వస్తున్నాయ. వినోదం కోసం వందలు ఖర్చుపెట్టి థియేటర్లకు వెళ్తే, ఉసూరుమని వెనుతిరగాల్సిందే. గతవారం విడదలైన చిత్రాలనే తీసుకుందాం. వీరభోగ వసంతరాయులు అన్న టైటిల్ చూసి, పోస్టర్లపై ఫెమిలియర్ ఆర్టిస్టులను చూసి, ఆశకల్పించే ప్రచారాన్ని చూసి థియేటర్లకు వెళ్లినోళ్లకు మాడు పగిలింది. ఇక బంగారి బాలరాజు చిత్రమైతే మరీ దారుణం. మరి, చిన్న సినిమాల విషయంలో ప్రేక్షకులు ఏండిమాండ్ చేయాలి?

-రాజేంద్ర, సఖినేటిపల్లి

కుదిరితే పాగా..

సినిమా తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు, కాకపోతే వచ్చినోళ్లు ప్రజలకోసం చివరి వరకూ ఎంతమంది నిలబడ్డారన్నదే ముఖ్యం. సూపర్‌స్టార్ కృష్ణ, అమితాబ్‌బచ్చన్ వంటి వారు రాజకీయాలకు దూరమయ్యారు. పొరుగు రాష్టమ్రైన తమిళనాడులో సినిమానే రాజకీయం, రాజకీయమే సినిమా. ఎంజిఆర్, కరుణానిధి, జయలలిత వంటి సినీ ప్రముఖులు ఏకంగా సీఎంలయ్యారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అంతటి అదృష్టం ఎన్టీఆర్‌కే దక్కింది. ఇక మెగా అన్నయ్య ప్రజారాజ్యం ప్రయోగం విఫలమైనా తమ్ముడు పవన్‌కళ్యాణ్ జనసేన పెట్టి ముందుకెళ్తున్నాడు. ఆయన ఏమేరకు విజయం సాధించి ఎప్పటి వరకూ ఉంటాడన్నది కాలం సమాధానం చెప్పాలి.

- ఎంఎ కుమార్, రామచంద్రాపురం

అరవింద సమేత

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరరాఘవుడిగా రూపొందిన అరుదైన చిత్రం ‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ నటనలో వెరైటీ చూపించగలిగాడు. డైలాగ్ డెలివరీ సూపర్! త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శక ప్రతిభ పదునెక్కింది. అభిమానులకు కనువిందు చేసిన చిత్రంలో పాటల చిత్రీకరణ చాలా బాగుంది. బాక్సాఫీసులో అరవింద కలెక్షన్ల జోరు చిత్రానికి ప్లస్ అవుతుంది.

- ఎల్.ప్రపుల్లచంద్ర, ధర్మవరం

మన బుద్ధిఏమైంది?

ఎంత గ్లామరైనా చూపిస్తాం. ఎన్ని ముద్దు సీన్లున్నా ఓకే అంటూ ముందుకొస్తున్నారు నటీమణులు. ఐటం సాంగ్స్‌లో విజృంభిస్తున్నారు. ఎదభాగం, బాహుమూలలు, నాభి, తొడలు కనిపించేలా వస్తధ్రారణ ఎప్పుడో రొటీన్ అయపోయంది. చిత్రమైన డ్యాన్స్‌ల పేరిట సౌష్టవ అవయవాలను గమ్మత్తుగా కదుపుతూ నటిస్తున్నారు. ఇవన్నీ మగ ప్రేక్షకుల్ని ఆకర్షించడానికే కదా. ఇవన్నీ తెరమీద చూపడానికి ఓకే అన్నప్పుడు తెర వెనక నిజ జీవితంలోనూ ఓకే అంటుందిలేనని పరిశ్రమలోని మగాళ్లు కొందరు ముందడుగు వేస్తున్నారనిపిస్తోంది. తెరమీద అలాంటి దృశ్యాలకు నటీమణులు నో చెబితే తెరవెనక వేధింపులు చాలామట్టుకి మాయమవుతాయ. మనవైపు తప్పులు పెట్టకుని మీ టూ అంటూ రోడ్డెక్కడం ఎంతవరకూ సబబు అనిపిస్తోంది ఒక్కోసారి.

-స్నేహమాధురి, పెద్దాపురం

ఈవ్‌టీజింగూ వేధింపే..

ఒక చిత్రంలో నాగార్జున అమలను పడగొట్టి కాలు పట్టుకొని ఈడ్చుకుపోతూ అక్కినేని అందగాడిని సుందరాంగులెందరికో అందని వాడినని గొప్పలు చెప్తూ పాటతో టీజ్ చేసే సన్నివేశముంది. నిజానికి చాలా సినిమాల్లో హీరోలు హీరోయిన్లను తక్కువచేస్తూ డైలాగులు చెప్పి టీజ్ చేయడం చూపిస్తున్నారు. ఈవ్‌టీజింగ్‌ని ప్రేక్షకులే కాదు హీరోయిన్లూ ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. అయితే ఈవ్‌టీజింగ్ కూడా ఒక విధమైన వేధింపే. ఎంతమంది నటీమణులు ఈవిధమైన సన్నివేశాలకు అభ్యంతరం చెప్తున్నారు, చెప్పగలుగుతున్నారు? ఇదొక కోణం. మరోపక్క ఇప్పుడు ‘మీ టూ’ని సమర్ధిస్తూ మగమహారాజులు చాలామందే పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. వీళ్లలో ఎంతమంది చానల్స్‌లోనూ, సినిమాల్లోనూ స్ర్తిలను అవమానించే దృశ్యాలను ఇంతకుముందు నిరసించారు? ఈ ప్రశ్నలకు వాళ్ల సమాధానమేమిటి?

-ఏ రామ్, కొవ్వూరు

ఇప్పటిదేం కాదు..

మీటూ ఉద్యమ సెగలు టాలీవుడ్‌ని పెద్దగా తాకలేదు. అలాగని ఇక్కడ వేధింపులు లేవని చెప్పలేం. దశాబ్దాల క్రితం దర్శకుడు పి.పుల్లయ్య సీను సరిగా రాకపోతే ఆడ, మగా అందర్నీ బండ బూతులు తిట్టేవారట. అలనాడు కొంతకాలం జమున అగ్ర నాయకులు ఇద్దరితో నటించ నిరాకరించింది. విఠలాచార్యను శాడిస్టుగా అభివర్ణించాడు కాంతారావు. ఆలస్యంగా సెట్స్ మీదకొచ్చే లేడీ ఆర్టిస్టులను ఒకప్పటి విలన్, తరువాత హీరో ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకరు కొట్టేవాడని ఎన్నో కథనాలు ఉన్నాయ. అవికాగౌర్ (చిన్నారి పెళ్లికూతురు) ఇద్దరు యువనటుల వేధింపులవల్ల తెలుగులో నటించనని చెప్పి వెళ్లిపోయింది. రాధికాఆప్టే కూడా ఇక తెలుగులో నటించనని చెప్పేసింది. ఈమధ్యనే ప్రకాశ్‌రాజ్ అనుపమ పరమేశ్వరన్‌పై నోరుపారేసుకున్నట్టు కథనాలు వెలువడ్డాయ. ఇవన్నీ అవేగా...

-సుధీర్, శ్రీనగర్

అందుకే...

‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్‌నాథ్ ప్రతిస్పందన అడిగితే ‘ఇప్పుడు ప్రపంచం ఎలా తయారైందంటే మహిళ ఏంచెప్పినా నమ్మేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో నోరువిప్పితే సమస్య విస్తరిస్తుంది. నిజం నిలకడమీద తెలిసేవరకు నోరు మూసుకోవడం మంచిది’ అన్నాడు. ‘గొంతెత్తిన పాకుడురాళ్లు’ వ్యాసం చదివాక ఆరోపణలన్నీ నిజమని నమ్మి రాసినట్టుంది. కానీ కంగన చెప్పేవన్నీ నమ్మనక్కరలేదు. ఆవిడా అబద్ధాలు చెప్తుంది’ అని ఒక నటి చెప్పింది. ఆరోపణలు చేస్తున్న కొందరు తాము స్వయంగా ఆరోపించకుండా చిన్మయి ద్వారా ఆరోపించడమెందుకు? ఈ ఆరోపణలన్నీ కోర్టులో నిలబడతాయా? అనేదొక పెద్ద ప్రశ్న.

-సోనాలి, సూర్యారావుపేట