మీ వ్యూస్

సరైన నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల పవన్‌కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం ఫ్లాప్‌కావడంతో తను స్థాపించిన జనసేన పార్టీకి పూర్తిగా పరిమితమై, ప్రజల సమస్యలు తెలుసుకొని, వారికి నిస్వార్ధంగా సేవచేయాలనుకోవడం నిజంగా శుభపరిణామం. ఎందుకంటే సినిమాలపరంగా పవన్‌కు సక్సెస్ శాతం తక్కువగా వుంది. పవన్ రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు, పవన్‌పై ఒక అవగాహన వచ్చింది. కాని ఎంతమంది పవన్‌కు మద్దతుగా నిలుస్తారో వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది. ఎన్నికల తర్వాత పవన్ తిరిగి సినిమాల్లో నటిస్తేనే అభిమానులనుండి వ్యతిరేకత రాకుండా ఉంటుంది. చిరు రాజకీయల్లోకి వచ్చి చాలా సినిమాలకు దూరంగా ఉండటం, చిరు అభిమానులకు చాలావరకు నచ్చలేదు. కావున పవన్ ఆ తప్పును రిపీట్ చేయకుండా ఉంటే బెటర్. ఆల్ ది బెస్ట్ పవన్‌కళ్యాణ్.

-బాణాల కృష్ణమాచారి, హైదరాబాద్

బావుంటుంది

వారం వారం ఆదివారం వెనె్నల చక్కటి విశేషాలతో తెలుగు చలనచిత్ర రంగానికే సరికొత్త వెలుగులు వికసింపజేస్తోంది. శీర్షికలు అన్నీ బాగున్నాయి. అలనాటి అపురూప చిత్రాలు గురించి తెలియజేస్తున్నందుకు సంపాదక వర్గానికి అభినందనలు. కొత్త చిత్రాలపై మీరు అందిస్తున్న విశే్లషణల్లో నిజాయతీ కనిపిస్తోంది. పాత చిత్రాలకు సంబంధించి మరిన్ని శీర్షికలు ఏమైనా అందించే ఆలోచన చేయండి. అలాగే నచ్చిన పాట, నచ్చిన సినిమా శీర్షికలను మరింత వివరణాత్మకంగా ఇస్తారని ఆశిస్తూ...

-పీవీకె రాజు, ధర్మవరం

కాస్త ఆదరించండి

రొటీన్‌కు భిన్నంగా అక్టోబర్ 13న విడుదలైన ‘నీ ప్రేమకోసం’ సినిమాను ప్రేక్షకులు ఆదరించకున్నా, మీడియా కూడా గుర్తించలేదనే బాధతో ఈ వుత్తరం. లోబడ్జెట్ సినిమాకి ఏమాత్రం పబ్లిసిటీ లేకపోవడంతో ప్రజలకు ఉపయోగపడే ప్రపంచ శాంతి సందేశం వృధాఅయ్యంది. ఇంతవరకు ఏ భాషకు చెందిన సినీ చరిత్రలో రానటువంటి అద్భుత ప్రయోగం ఈ సినిమా. ప్రేమ, పెళ్లి, సినిమా, రాజకీయ, మావోయిజం, ఉగ్రవాదం వంటి సమస్యలను టచ్‌చేస్తూ, ప్రపంచశాంతికి సూత్రం చెప్పటంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ప్రేమించి పెళ్లిచేసుకున్న కూతురిపై కన్న తండ్రి దాడిచేయడం, మతంకోసం ప్రముఖ సినీ విమర్శకుడు కామెంట్స్, అందుకు ఓ స్వామీజీ కౌంటర్, అక్రమ సంబంధం చట్టసమ్మతమే అన్న కోర్టు తీర్పువంటి అనేక విషయాలు గుర్తుకొచ్చాయి. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి మంచి సినిమాలకు తగిన పబ్లిసిటీ ఇచ్చి మీడియావాళ్లు ప్రోత్సహించాలని కోరుతున్నా.

-కెఎస్, వెంకటాపురం

సర్కారు పట్టించుకోవాలి

నాటి నేటి ఆతరం, ఈతరం చిత్రాలను పోలిస్తే చాలా వ్యత్యాసం కనబడుతోంది. చిత్ర పరిశ్రమ వెలుగొందాలంటే సూర్యచంద్రుల్లా, రాష్ట్రాలు విడిపోయినా మనుషులంతా ఒక్కటేనన్న సూక్తియధార్ధం. అందుకని ఎందరో తమ కళను ప్రదర్శించి వినుతికెక్కారు. ఇంకా కొందరు కళాకారుల అనారోగ్యాలతో బాధపడుతూ తమలోని తృష్ణను ఇంకా చూపిస్తూ ప్రేక్షకుల శ్రోతల, అభిమానుల ఆదరణ పొందుతున్నారంటే వారి కళాప్రతిభయే నిదర్శనం. ప్రభుత్వాలు సహకరించాలి. చిత్ర పరిశ్రమ చిరస్థాయిగా ఉండిపోవాలి.

-సిహెచ్ నాగేశ్వరరావు, హైదరాబాద్

ఆలోచించాలి

మీటూని సమర్ధించే వారున్నట్టే పెద్దగా పట్టించుకోని మహిళలూ ఉన్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మీటూని సమర్ధిస్తూనే లింగవివక్ష ప్రతిచోటా ఉంది. మన ఇంట్లోనే ఉండొచ్చు. వివక్షను లైంగిక దాడి కోణంలో చూడరాదు అంది. ‘కెరియర్ కావాలా? నీతినియమాలు ముఖ్యమా? అనేది తేల్చుకోవాలి. రెండింటి నడుమ చాకచక్యంగా తప్పించుకోగలగాలి’ అంది అనసూయ. వేధింపుల గురించి సామాజిక మాధ్యమాల్లో మాట్లాడినంత మాత్రాన ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నది కిరణ్‌ఖేర్. ఇద్దరికీ సమ్మతమైతే ఏ సమస్యాలేదు- అంటున్నది రేణుక సహాని! వేధింపుల గురించి ఎవరి అభిప్రాయాలు వారివి. తప్పా? ఒప్పా? అనేది వ్యక్తిగతం అంటున్నారు.

-సౌందర్య, కాకినాడ

గురితప్పాడు

చందూ మొండేటి, నాగచైతన్య కాంబినేన్‌లో వచ్చిన సవ్యసాచి సినిమా గురి తప్పాడనే చెప్పాలి. కథ చిన్నది. కథనం కోసం ఫస్ట్‌హాప్ అంతా టైంపాస్‌కోసం సరదా సన్నివేశాలతో సాగతీతే! ట్విస్ట్‌కోసం టూరిస్టు బస్సు బాంబ్ బ్లాస్టింగ్ సీను అర్ధంకాని సోది. సైంటిఫిక్ నేపథ్యంలోని కథ అర్ధంకాని కామెడిగా అనిపించి నసగా ఉంది. కాకపోతే ఇంటర్వెల్‌నుండి కథ మైండ్‌గేమ్ తరహాసాగి కొంత ఆసక్తిని కలిగిస్తుంది. విలన్ పెళ్లి తప్పినంత మాత్రాన ఇంత క్రూరంగా ప్రవర్తించాలా! పాయింటు అంత బలంగా అతికినట్లుగా అనిపించదు. ఇవన్నీ హాలీవుడ్ సంస్కృతికి సరిపోయే సైంటిఫిక్ ఇతివృత్తాలు. మనకి ఒప్పవు. చందూ ఈ పాయింటును రక్తికట్టేలా హేండిల్ చేయలేకపోయాడు. హీరోయిన్ నిధి అగర్వాల్ గ్లామర్ డాల్, నటనకు అవకాశమేమీ లేదు. గొప్ప చిత్రంగా చానెల్ మీడియా ఎందుకు చెప్పుకొచ్చిందో అర్థంకాదు.

-పీవీఎస్పీ, అద్దంకి

పక్షపాతముందేమో

మీటూ అంటూ ఎలుగెత్తుతున్న మహిళలకు మగవారినుంచి, మీడియానుంచి కూడా చక్కని మద్దతు లభిస్తున్నది. ఆరోపణల ధోరణి గమనిస్తూ ఉంటే కొన్ని నగ్నసత్యాలు కనిపిస్తాయి. శృంగార తారగా ముద్రపడిన సన్నీలియోన్ ఆ ముద్రను తొలగించుకోడానికి ప్రయత్నిస్తున్నది. మంచి పాత్రలు పోషించడానికి పూనుకుంటున్నది. అయినా ఒక శృంగార తార వీరమహాదేవి చిత్రంలో ఆమె నటించడానికి వీల్లేదని కర్నాటక యువత రభస చేయగా నిర్మాత వెనుకంజవేశాడు. మీటూ మహిళలెవరూ ఆమెకు బాసటగా నిలబడలేదు. అలాగే కేరళలో ఒక నన్ తననొక బిషప్ 12సార్లు లైంగికంగా వేధించాడని మొత్తుకున్నా మీడియా గాని, మీటూగాని స్పందించలేదు. ఈ ఉద్యమంలోనూ పక్షపాతాలున్నాయి!

-మైథిలి, సర్పవరం