మీ వ్యూస్

పూర్ బెల్లంకొండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి సినిమాకీ ముందు మీడియా వద్ద తన స్టామినా చెప్పుకునే కుర్ర హీరో బెల్లంకొండ సాయ శ్రీనివాస్ ఈసారీ -మాస్, యాక్షన్ చాలా ఇష్టమని చెప్పడం వరకూ బాగానే ఉంది. కానీ, చేసిన సినిమాలన్నీ అదే యాక్షన్ కోణంలో ఉన్నా, అతన్ని రక్షించగలిగే సినిమా ఒక్కటీ దొరకలేదు. యాక్షన్, మసాలాకు ఎక్కువ అవకాశమున్న కథనే ఎంచుకుని చేసిన ‘కవచం’ సినిమా సైతం హీరోని ఏమాత్రం ఒడ్డెక్కించలేకపోయంది. మాస్ హీరోగా నిలదొక్కుకోడానికి భారీ బడ్జెట్‌తో, స్టార్ తారాగణంతో పట్టువదలని విక్రమార్కుడిలా శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నా -కాలం మాత్రం అనుకూలించడం లేదు. కొత్త హీరోలంతా స్క్రీన్‌పై సత్తా చాటుతున్నా -నటనలో ఎంతో ఈజ్ చూపిస్తున్న బెల్లంకొండకు మాత్రం నిరాశే మిగులుతోంది. ప్రయోగాత్మక సినిమాల సీజన్ నడుస్తున్న తరుణంలో తరువాతి ప్రాజెక్టు అయనా ట్రెండ్ మార్చి ఆడియన్స్ ముందుకొస్తే సరే. లేదంటే -ఆ హీరో అంతే అన్న పరిస్థితి ఎదుర్కోక తప్పదేమో.
-పవిత్ర, అల్లవరం
నిజంగా అంతే..
వీళ్లు కూడ ఇంతే-నంటూ రచయత శ్రీనివాస్ రాసిన కథనం చాలా బాగుంది. చేస్తున్న చిత్రాలు వరుసపెట్టి బోల్తా కొడుతున్నా.. ఎందుకు? అని తమనుతాము ప్రశ్నించుకోకుండా ఆడియన్స్ మీదకు ఏడబాదుడు చిత్రాలు వదులుతున్న హీరోలు ఇక మారరేమో. కొంత గ్యాప్ తీసుకుని అయనా కొత్త మేకోవర్, కొత్త తరహా కథలు, వైవిధ్యమైన నటన చూపాలన్న ఆలోచన వాళ్లలో రాకపోవడం దారుణం. మా సినిమా మా ఇష్టం అనుకుంటే ఎవ్వరూ ఏం చేయలేరుగానీ, కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే అవుతుందిగా. షార్ప్‌నెస్‌తో వస్తున్న కొత్త దర్శకులు, కొత్త రచయతలతో వాళ్లెందుకు పని చేయరో ఎప్పటికీ అర్థంకాని విషయం. స్టార్ హీరోలే ప్రయోగాలు చేస్తుంటే.. వాల్యూ సంపాదించుకోలేక పోతున్న వీళ్లు మాత్రం మొనాటీనే ప్రేమించడం క్షమించలేనిదే.
-కర్రి నాగేంద్ర, శ్రీకాకుళం
ఫ్లాష్‌బ్యాక్ బావుంది
ఫ్లాష్‌బ్యాక్ అట్ 50 శీర్షికన ప్రచురిస్తున్న పాత చిత్ర కథారాజాలు అద్భుతంగా ఉంటున్నాయ. ఇలాంటి శీర్షికలనే ఇటీవల కొన్ని ఆంగ్ల పత్రికలూ పాఠకుల కోసం నిర్వహిస్తుండటం కనిపిస్తోంది. కానీ, వెనె్నలలో రచయత సీవీఆర్ మాణిక్యేశ్వరి చాలాకాలంగా నిర్వహిస్తున్న ఈ శీర్షిక నిజంగా అద్భుతం. ఒకపక్క పాత చిత్రాల్లోని కథా కథనాలు, పాటల విశేషాలను తెలుపుతూనే -తెరవెనుక విశేషాలనూ సవివరంగా అందిస్తుండటం గ్రేట్. గతవారం ప్రచురించిన ఎన్టీఆర్ సారంగధర చిత్ర విశేషాలు ఆకట్టుకున్నాయ. వ్యాసాన్ని చదువుతున్నపుడు -స్క్రీన్‌మీది సన్నివేశాలు మస్కిష్కంగా మెదిలేంత పట్టుతో రాసిన రచయతకు అభినందనలు. ఇలాంటి గొప్ప చిత్రాల వివరాలు మరిన్ని అందిస్తారని ఆశిస్తూ..
-కె లింగేశ్వరరావు, ప్రొద్దుటూరు
ఎవరి మెప్పుకోసం..
ఈమధ్య వెనె్నలలో ప్రచురించిన బయోపిక్‌ల డైలమా వ్యాసం బాగుంది. ఏ ఉద్దేశ్యంతో ఆ సినిమాలు తీస్తున్నారో ప్రేక్షకులకు అర్ధంకాని విషయం. ఏ వ్యక్తి జీవితం తీసుకున్నా ఎన్నో అంశాలు, వైఫల్యాలు, విజయాలు ముడిపడి ఉంటాయి. అలాంటి వాటిలో తమకు అనుకూలమైన విషయాలనే చిత్రీకరించడం న్యాయం కాదు. ఎన్టీఆర్ బయోపిక్ తీసుకుంటే ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అవడంతో ముగుస్తుంది అంటున్నారు, ఎందుకో? ఎన్టీఆర్ చివరిసారిగా (1994) ముఖ్యమంత్రి అవడం చూపిస్తే, ఆయన ద్వితీయ వివాహం, వైస్రాయ్ ఉదంతం, కుటుంబ కలహాలన్నీ చూపాలి. మరిన్ని ఈ విషయాలన్నీ చూపెట్టలేనప్పుడు అది బయోపిక్ ఎలా అవుతుంది? ఎవర్ని మెప్పించడానికి ఈ చిత్రాలు?
-ఎంఎ కుమార్,
రామచంద్రాపురం
వాళ్లూ దర్శకులంటే
1955లో విడుదలైన ‘దొంగరాముడు’ చిత్రానికి కెవి రెడ్డి దర్శకుడు. చిత్రం ప్రారంభానికిముందు అనేక విమర్శలు వచ్చాయి. పౌరాణిక, జానపద చిత్రాల దర్శకుడైన కెవి రెడ్డి ‘దొంగరాముడు’ చిత్రానికి దర్శకత్వం వహించటం సాధ్యమయ్యే పనేనా? అంటూ ఆక్షేపణలు చేశారు ఆనాటి చలనచిత్ర ప్రముఖులు.
గుండమ్మకథ (1962) చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించినప్పుడూ, ఆయన సాంఘిక చిత్రాల దర్శకునిగా పనికిరాడని బల్లగుద్ది వాదించారు. కాని ఆక్షేపణలు వమ్మయ్యాయ. ఆ రెండు చిత్రాలు ఎంత విజయవంతమయ్యాయో ఆనాటి తరం ఈనాటితరం ప్రేక్షకులకు తెలీంది కాదు? అందుకే ఆక్షేపణలు, విమర్శలు సినిమాల విజయంతో లేచిన దుమ్ములో కలిసిపోయాయి!
-కెవిపి రావు, కందుకూరు
పుర్రెకో బుద్ధి
మీటూ ఉద్యమం ఇప్పుడు బాలీవుడ్‌ని తాకింది గాని హాలీవుడ్‌లో ఎప్పుడో రాజుకుంది. ఒక పరిష్కార మార్గం లాగ అక్కడ ఇంటిమసీ డైరెక్టర్లు అనే కొత్త కానె్సప్ట్ వచ్చింది. శృంగార సన్నివేశాల చిత్రీకరణలో హీరోహీరోయిన్‌ని ఎక్కడ, ఎలా టచ్ చేయాలి? ఎంతసేపు ఎలా కౌగలించుకోవాలి? ఎంతసేపు ఎలా ముద్దుపెట్టుకోవాలి అనే అంశాల్ని ఈ ఇంటిమసీ డైరెక్టర్లు వివరించి పర్యవేక్షిస్తారు. ఇంటిమసీ అంటే సాన్నిహిత్యం. ఈ కొత్త కానె్సప్ట్ డైరెక్టర్లవల్ల మీటూ సమస్య చల్లారుతుందని హాలీవుడ్ ఆలోచన. అక్కడ ఏ కానె్సప్ట్ వచ్చినా అది క్రమంగా బాలీవుడ్‌కి అక్కడనుంచి ఇతర వుడ్‌లకు రావచ్చు. చిత్రసీమలో ఇప్పుడున్న 24క్రాఫ్టులు ఇకపై 25 అవుతాయేమో!
- ధర్మజేత, గొడారిగుంట