మీ వ్యూస్

పండుగ ఫన్ వీళ్లిద్దరే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనె్నల సినిమా సంచిక పాఠకులను అలరిస్తుంది. జనవరి 13నాటి వెనె్నలలో ‘రెండోవైపు చూడకు..’ అంటూ బాలయ్య ‘యన్‌టిఆర్- కథానాయకుడు’పై ప్రచురించిన కవర్ పేజీ కథనం బావుంది. ఆ తరంలోని యన్‌టిఆర్ అభిమానులకు తెలిసిన విషయాలను సైతం యథాతథంగా చూపించకుండా -సన్నివేశాలకు సినిమాటిక్ సుగర్‌కోట్ వేయడం బాధాకరం. ఇదొక్కటే కాదు, ఇప్పుడొస్తున్న బయోపిక్‌లపై ఎన్ని విమర్శలు వస్తున్నా -తెరకెక్కుతున్న సినిమాలు మాత్రం వాటి పంథాను అవి కొనసాగిస్తూనే ఉన్నాయి. వాస్తవికతకు దూరంగా అనుకూలమైన అంశాలను మాత్రమే కథగా మలచుకుని అదే బయోపిక్ అంటూ ప్రేక్షకులపై రుద్దుతున్న వైనం ఎంతమాత్రం సమర్థనీయం కాదు, గర్హనీయం కూడా. నిజానికి యన్‌టిఆర్ జీవితంలోని ఎత్తుపల్లాలు తక్కువేం కాదు. అలాగని వాటిని చర్చించుకున్నంత మాత్రాన ఆ మహనీయుడి ప్రతిష్ట ఏమాత్రం దిగజారిపోదు. ఓ వ్యక్తి జీవితంలోని ఇబ్బందికర అంశాలను మరుగునపర్చి, ఆయన గొప్ప విషయాలను మాత్రమే చూపిస్తామంటూ ‘బయోపిక్‌‘ పేరిట ప్రేక్షకుల ముందుకు వదలడం చరిత్రను కించపర్చడమే అవుతుంది. అలాంటప్పుడు ‘బయోపిక్’ అన్న పదాన్ని వాడకుండా -యన్‌టిఆర్ గొప్పతనాన్ని చాటుకునే చిత్రంగా ప్రచారం చేసుకునివుంటే బావుండేది. మహానటుడి జీవితాన్ని కథ చేసుకుని -కమర్షియల్‌గా క్యాష్ చేసుకోవడమే కాకుండా, తీసిన చిత్రం భవిష్యత్ రాజకీయానికి ఉపయోగపడాలన్న అత్యాశతో జనం మీదకురుద్ది -నటరత్న ఉత్థానపతం భవిష్యత్ తరాలకు తెలియాలన్న సంకల్పంతోనే చిత్రం చేశామని చెప్పుకోవడం సబబేనా అన్నది చిత్రబృందమే ఆత్మసాక్షిగా ప్రశ్నించుకోవాలి. ఇంతకుమించి చెప్పేదేముంటుంది?
-జి పార్వతీశం, శ్రీకాకుళం
అదీ సినిమా..
ఇదిగో సంక్రాంతి.. అవిగో పండుగ సినిమాలు అంటూ అటు పత్రికలు, ఇటు చానెల్స్ ఊదరగొట్టేసినంత సేపు లేదు -వచ్చిన సినిమాలు వెళ్లిపోడానికి. తుస్సుమన్న చిత్రాలకు సైతం కోట్ల కలెక్షన్ల లెక్కలు చెపుతుంటే వినడానికి ఆడియన్స్ చెవిలో రీళ్లు పెట్టుకుని లేరన్న విషయం నిర్మాతలు గుర్తెరగాలి. కలెక్షన్లపరంగా చిత్ర నిర్మాతలు చెప్పే కోట్లు కాకిలెక్కలేనన్నది జగమెరిగిన సత్యమే. ఈ సినిమాకు ఇంత.. ఆ సినిమాకు అంత.. అంటూ -విడుదల తరువాత జరుగుతోన్న ప్రచార పటాటోపాన్ని భరించడం జనంవల్ల కావడం లేదు. అటు యన్‌టిఆర్ బయోపిక్ తొలిభాగంగా వచ్చిన కథానాయకుడు -సినిమా చూసిన తరువాత అంతరంగం అర్థమైంది. మహానటుడి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలన్న బలమైన సంకల్పం ఎంత బలహీనంగా ఉందో సినిమా చూశాక అర్థమైంది. ఇక బోయపాటి-రామ్‌చరణ్ కాంబో ఇంతలేదు.. అంత -అంటూ జరిగిన ప్రచారం కూడా థియేటర్ల దగ్గర తుస్సుమంది. తీసిన చిత్రాన్ని ప్రేక్షకుల దగ్గరకు చేర్చేందుకు ప్రచారం చేసుకోవడం తప్పుకాకపోవచ్చు. కానీ, సినిమాలో సరుకు లేకున్నా చూసి తీరాలన్న ఊరింపులు ప్రచారంలోకి తేవడం మాత్రం దారుణాతిదారుణం. ఇక -పండుగ సినిమా.. మామా అల్లుళ్ల సందడి అంటూ వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో వచ్చిన ఎఫ్-2 మాత్రం ఒకింత వినోదానే్న పంచింది. పండుగ సెలవుల్లో కాలక్షేప వినోదాన్ని అందించిన అచ్చమైన తెలుగు సినిమాగా ఈ సినిమాను ప్రస్తావించుకోవచ్చు. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకుల నాడిని సరిగ్గా పట్టాడన్న విషయం ఈ సినిమాతో మరోసారి అర్థమైంది.
ఆర్ సంపత్, జిగిత్యాల
వరకట్నం..
జనవరి రెండోవారంలో వచ్చిన వెనె్నల ఫ్లాష్‌బ్యాక్ అట్ 50లో ‘వరకట్నం’ సినిమా వివరాలు అందించిన రచయిత్రి సీవీఆర్ మాణిక్యేశ్వరికి ధన్యవాదాలు. గొప్ప నటుడే కాదు, దార్శనికతను ప్రదర్శించిన గొప్ప దర్శకుడు ఎన్టీఆర్ అనిపించే చిత్రం -వరకట్నం. అప్పటి సమాజ దృక్కోణాన్ని చాలా సున్నితంగా తెరకెక్కించడంలో ఎన్టీఆర్ ప్రతిభ కనిపిస్తుంది. ఈ చిత్రానికి మద్దిపట్ల సూరి, జూనియర్ సముద్రాల అందించిన సంభాషణలు సినిమాపరంగా మామూలుగానే అనిపించినా -కాస్త దృష్టిపెట్టివింటే మాత్రం వాటిలోని గాఢత మనసుకు అర్థమవుతుంది. సన్నివేశాలు.. అందుకు తగిన సంభాషంల్లో వేనవేల భావాలు పలికించిన చిత్రం వరకట్నం అనొచ్చు. ఇక గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి అందిస్తున్న రాశిఫలాలు కనీసం వెనె్నలలోనైనా మరింత విపులంగా అందిస్తే బావుంటుందని మనవి. దినపత్రికలో అందించినట్టే వెనె్నలలోనూ కాకుండా, వారానికి ఒకసారైన కాస్త ఎక్కువ స్పేస్‌లో డీటెయిల్డ్‌గా అందిస్తారని సంపాదకవర్గాన్ని కోరుకుంటున్నాం. వెనె్నలలో ప్రచురిస్తున్నా కథనాలు ఇంటిల్లిపాదినీ అలరిస్తున్నాయి. ధన్యవాదాలు.
-హెచ్ దుర్గ, తుని
మనసుకు హాయగా..
మొన్నామధ్య విడుదలైన తెలుగు చిత్రాల్లో ‘పడి పడి లేచె మనసు’ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ అనిపించింది. శర్వానంద్, సాయిపల్లవి నటన భేష్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా వచ్చిన ‘కవచం’ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ పలకని సాయశ్రీనివాస్, నటుడిగా శిక్షణ తీసుకోవడం అవసరం అనిపిస్తుంది. రాశిపరంగా తెలుగు సినిమాలు ఎక్కువే అయనా, వాసిపరంగా చూస్తే -సినిమాకు వచ్చేటపుడు ప్రేక్షకుడు వెంట జండూబామ్ తెచ్చుకోవాలన్నంత దారుణంగా ఉంటున్నాయ. లెక్కకు మిక్కిలిగా వస్తున్న అట్టర్ ఫ్లాప్ సినిమాలను ప్రేక్షకులు భరించడం కష్టంగా ఉంది.
-బి కృష్ణమాచారి, బైరామల్‌గూడ
చల్లని వెనె్నల
వెనె్నల సంచికలో వస్తున్న కథనాలు బావుంటున్నాయ. ముఖ్యంగా చిత్ర సమీక్షల విషయంలో ఎలాంటి కనికరం లేకుండా ఉన్నది ఉన్నట్టు రాస్తున్న విధానం బావుంది. సమీక్షకులు మరింత పదునుగా రాస్తే బావుంటుందని మనవి. కవర్ పేజీ కథనాలు, ఫ్లాష్‌బ్యాక్ అట్ 50, ఆసక్తిని రేకెత్తించే వినోదాత్మక గాసిప్స్.. మొత్తంగా సినిమా చూపించేస్తున్నట్టే ఉంటుంది.
-బి ఆయేషా, కాకినాడ