మీ వ్యూస్

వాళ్లంతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో దక్షిణాది హీరోయిన్లు కొందరు పెళ్లయిన ‘పెద్దమనుషుల్ని’ ప్రేమించి రెండో భార్యగా సెటిలయ్యేవారు. అలా పెళ్లి చేసుకున్న తరువాతే -సావిత్రి జీవితం ఎంత ఘోరమైపోయిందో మహానటిలో చూశాం. శ్రీదేవి కూడా మిధున్ చక్రవర్తిని ప్రేమించి ‘ భార్యకు విడాకులిస్తే పెళ్లి చేసుకుందాం’ అన్న ప్రపోజల్ పెట్టిందట. అతడు వెనక్కి తగ్గగానే బోనీకఫూర్‌ని చేసుకుందన్న కథనాలు చదువుకున్నాం. చివరకు ఆమె మరణం మిస్టరీగా మారింది. హేమమాలిని ధర్మేంద్రలు వివాహబంధంలోని సమస్యలు బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. నయనతార -ప్రభుదేవల ప్రణయం మొదట్లోనే బెడిసికొట్టింది. అందుక్కారణం అతను తన ఆస్తినంతా మొదటి భార్యకు రాసేయడమేనని చదివాం. అతడి ప్లానింగ్ అర్థమవ్వడంతో నయన్ వెనుకంజ వేసింది. చిత్రమేంటంటే -చిత్రపరిశ్రమలోనే ఇలాంటి విచిత్రాలు బయటికొస్తుంటాయి. ఎంతైనా ‘నక్షత్రాలు’ కదా!
ప్రసన్న, పేర్రాజుపేట
భలే తమ్మూ..
మనసు విప్పకుండా మాట చెప్పడంలో తమ్మూ బేబీ ఎక్స్‌పర్ట్. అందుకు -నెక్స్ట్ ఏంటి? సినిమా టైంలో ఆమె ఇంటర్వ్యూ సమాధానాలు చదివితే విషయం అర్థమవుతుంది. చిత్రంలో బోల్డ్ డైలాగులు చెప్పడానికి ఇబ్బంది పడలేదా? అంటే స్క్రిప్ట్ చదివినప్పుడు ఇలాంటి డైలాగులు ఉన్నాయేంటి? అనుకున్నా. అయినా అమ్మాయిలు సెక్స్ గురించి మాట్లాడితే తప్పేంటి. మనం ఏ కాలంలో ఉన్నాం. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అమ్మాయిలకు ఉంది అంటూ నొక్కులు నొక్కింది. ఐటెం సాంగ్స్‌కి ఎక్కువ వసూలు చేస్తారట? అన్న ప్రశ్నకూ -ఎక్కువ ఇమ్మని నేను డిమాండ్ చేయను. అయినా ఆర్థిక విషయాలు నాన్న చూసుకుంటారు. అయినా ఐటెమ్ సాంగ్స్‌కి ఎంత కష్టపడాలో తెలుసా? ఎక్కువ డిమాండ్ చేస్తే తప్పేంటి? అని మరో నొక్కు నొక్కింది. రీల్ పంచ్‌లు కాదు, ఇవన్నీ రియల్ పంచ్‌లు. కాదంటారా?
హైమావతి, సూళ్లూరుపేట
సినిమా ప్రేమ
ఎన్టీఆర్ బయోపిక్ ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో సూపర్‌స్టార్ కృష్ణ డైలాగులు మీద డైలాగులు పేల్చడం చూస్తే భలే నవ్వొచ్చింది. ‘నేను రామారావు అభిమానిని. మేమిద్దరం కలిసి నటించిన చిత్రాల్లో తమ్ముడిగా చేసిన సినిమాలన్నీ హిట్టు’ అన్నారు. కథానాయకుడి సినిమాలోనే కాదు, బయటా చరిత్రను తిప్పేశారనడానికి ఇదే ఉదాహరణేమో. యన్టీఆర్ తీయాలనుకున్న సీతారామరాజు చిత్రాన్ని కృష్ణ తీసేశాడని, తరువాత ఇద్దరూ పోటీలుపడి ‘కురుక్షేత్రం’ ఒకరు, ‘దాన వీర శూర కర్ణ’ మరొకరు తీసి ఒకే రోజున విడుదల చేశారు. యన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టిన తరువాత -కాంగ్రెస్‌లో చేరిన కృష్ణ -యన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన చిత్రాలను ప్రోత్సహించాడు. నిజమైన సినిమా అభిమానమంటే ఇదేనేమో. బహుశ అదే చెప్పుకుని ఉంటారు.
-జి రవితేజ, సామర్లకోట
ప్రయత్నమే..
ప్రయత్నం గొప్పదేకానీ, ఫలితమే సంతృప్తినివ్వలేదు కథానాయకుడు చిత్రం. శ్రీకృష్ణునిగా యన్టీఆర్‌ను చూసినపుడు భక్తికలిగి మనోరంజకం అనిపిస్తుంది. కానీ, బాలకృష్ణను చూస్తే తండ్రిని అనుకరించే ప్రయత్నమే కనిపించిందికానీ పాత్రలో లీనమైన హావభావాలు ఏమీ కనిపించలేదు. వాచకంలోనూ యన్టీఆర్‌ను ఏమాత్రం మరిపించలేదు సరికదా.. ఒకింత అతిశయోక్తి అనిపించింది. భర్తచాటు భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ గ్లామరస్‌గా కనిపించిందేతప్ప, బసవతారకాన్ని మూర్త్భీవించిన రూపంగా తోచలేదు. మిగిలిన పాత్రల్లోనూ పోలికలు ఏమాత్రం కుదరకపోయినా -ప్రచార పటాటోపంతో తాత్కాలికంగా దాటించేశారు. కానీ, చరిత్రలో ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ఫలితానివ్వని ప్రయత్నంగానే చర్చకొస్తుంది తప్ప, గొప్ప చిత్రం అనిపించుకోదగినంతగా చిత్రంలో ఏమీ లేదన్నది కాదనిలేని వాస్తవం.
-జి దక్షిణామూర్తి, సికింద్రాబాద్
నిజంగానే ఫన్ను
పండుగ ముస్తాబుతో వచ్చిన వెనె్నల అలరించింది. ఆహా ఓహో అంటూ ప్రచారార్భాటంతో వచ్చిన చిత్రాలను సమీక్షించిన తీరు చాలా నచ్చింది. భారీ బడ్జెట్ చిత్రాలే అయినా -కనీసం చిన్న బడ్జెట్ సినిమాల సంతృప్తిని కూడా ఇవ్వలేదంటూ రాసిన తీరు నచ్చింది. అటు రామ్‌చరణ్ వినయ విధేయ రామ, ఇటు బాలయ్య కథానాయకుడు చిత్రాలు ఆడియన్స్‌కి ఏమాత్రం రుచించలేదు. అచ్చమైన పండుగ చిత్రంగా వచ్చిన ఎఫ్-2 మాత్రం ఆడియన్స్‌కి అన్ని రుచులూ అందించి సక్సెస్‌ను అందుకుంది. వందకోట్ల క్లబ్‌కు చేరువగా చిత్రం వెళ్తుందంటే -ఆడియన్స్ ఏతీరున దానికి పట్టంగట్టారో అర్థం చేసుకోవచ్చు. అందుకే -బడ్జెట్‌ను బట్టికాదు కథాబలాన్ని బట్టి చిత్రాలను నిర్మించడం మంచిది. ఇది ఎన్నిసార్లు రుజువైనా -టాలీవుడ్ తోక మాత్రం మారడం లేదు. ప్చ్, చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత.
-కె రాజేశ్వరీదేవి, అల్లవరం
భలే ముచ్చట్లు
ఆ జ్ఞాపకాలే.. మధురానుభూతులంటూ విజయావారి పెళ్లి చేసి చూడు చిత్రంలోని మాస్టర్ కుందు ముచ్చట్లు వెనె్నలకే హైలెట్ అనిపించాయ. ఆసక్తికరమైన విషయాలను మనముందు కూర్చుని మాట్లాడుతున్నంత సరళంగా రచయత సరయు శేఖర్ రాసిన విధానం చాలా చాలా బావుంది. ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’లో పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడపాలోయ్ అన్నపాటలో ఎన్టీఆర్ సతీమణి బసవరామ తారకం సెట్‌కువచ్చి హార్మోనియమ్ నేర్పినట్టుగా చూపటాన్ని ప్రస్తావిస్తూ.. ఆమె ఎప్పుడూ షూటింగ్‌కు వచ్చినట్టు గుర్తులేదని సున్నితంగానే కుండబద్దలు కొట్టడం బావుంది. బహుశా వారు ఎన్టీఆర్‌కు ఇంట్లోనే హార్మోనియం నేర్పించారేమో అంటూ ఆయన పెద్దరికంగా చమత్కరించిన తీరు బావుంది. కథానాయకుడిలో ఇలాంటి లోపాలు ఇంకెన్ని బయటపడతాయో.
-భావన, కందుకూరు