మీ వ్యూస్

మహా తెలివి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి తరువాత కెరీర్‌కు సంబంధించి సమంత తీసుకుంటున్న నిర్ణయాలు ఆమెను మరింత ఎత్తులకు తీసుకెళ్తున్నాయ. కథలు, పాత్రల ఎంపిక విషయంలో ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలను అభినందించకుండా ఉండలేం. -విభిన్నమైన కథాంశాలు, విలక్షణ పాత్రల కోసం నిర్మాతలు, దర్శకులు ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్నారంటే అతిశయోక్తి కాదు. తమిళంలో సూపర్ హిట్టయన ‘96’ చిత్రం రీమేక్‌లో శర్వానంద్‌తో కలిసి చేయడానికి ఆమె అంగీకరించటం చూస్తుంటే -నిర్ణయాల్లో ఆమె తెలివితేటలు కనిపిస్తున్నాయ. దర్శకురాలు నందినీరెడ్డి చేయబోతున్న కొరియన్ చిత్రం రీమేక్‌లోనూ సమంత చిత్రమైన పాత్ర చేయనుందన్న వార్తలు వినిపిస్తున్నాయ. అటు తమిళంలో తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ సేతుపతితోనూ సమంత మరో చిత్రం చేస్తున్నట్టు కథనాలు వింటూనే ఉన్నాం. ఆర్‌ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మాఫియా నేపథ్యంలో సాగే ‘మహా సముద్రం’ ప్రాజెక్టులోనూ బెల్లంకొండ శ్రీనివాస్‌తో సమంత మళ్లీ జోడీ కట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇవ్వన్నీ చూస్తుంటే సీనియారిటీ పెరుగుతున్నకొద్దీ కుర్ర హీరోలతో ప్రాజెక్టులు చేస్తూ సమంత తన కెరీర్‌గ్రాఫ్‌ను మరింత పెంచుకుంటున్నట్టే అనిపిస్తోంది. ఏమంటారు.
-జి అనిత, కాట్రేనికోన
ఏమో చెప్పలేం..
బయోపిక్‌లకు కామానో, ఫుల్‌స్టాపో పడే అవకాశం ఉందంటూ గతవారం వెనె్నలలో ప్రచురించిన కథనం బావుంది. కానీ, బాలయ్య చేసిన కథానాయకుడు చిత్రం సరైన ఫలితం ఇవ్వలేదు కనుక -బయోపిక్‌లను ప్లాన్ చేసుకున్న వాళ్లంతా వెనక్కి వెళ్లిపోతారని అనుకోలేం. దీని ఫలితం ఏ కొందరిపైనో ప్రభావం చూపుతుందేమో తప్ప, అందర్నీ అదే గాటన కట్టలేం. పైగా బాలీవుడ్ ఇప్పటికే బయోపిక్‌ల రుచి మరిగి ఉంది. అక్కడ సిద్ధమవుతున్న ‘జీవిత చరిత్ర’లు ఏమాత్రం ఆగే అవకాశం ఉండకపోవచ్చు. దక్షిణ చిత్ర సీమలో రూపుదిద్దుకుంటున్న కొన్ని ముఖ్యమైన బయోపిక్‌లూ ఆగకపోవచ్చు. ఎందుకంటే -చిత్ర పరిశ్రమ ఎక్కువ శాతం ఆశల లోగిళ్లలోనే నడుస్తుంది. కథానాయకుడు చిత్రం రాణించలేకపోయినా -మనం తీస్తున్న చిత్రం మంచి ఫలితానే్న ఇస్తుందన్న నమ్మకంతోనే నిర్మాతలు ముందుకెళ్తారు. కాకిపిల్ల కాకికి ముద్దు కనుక. సో, బయోపిక్‌ల పరిస్థితిపై కొంతకాలం వేచిచూడటం తప్ప ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేము, రాకూడదు కూడా.
-ఎస్ రాజేశ్వర రావు, కాకాని
వెనె్నలకే సాటి
గత రెండు మూడు వారాలుగా ‘వెనె్నల’ చివరి పేజీలో -ఆ తరం ప్రతిభావంతుల ముచ్చట్లు అందిస్తుండటం బావుంది. ఆనాటి ప్రముఖుల జ్ఞాపకాలను ముచ్చట్లుగా అందిస్తున్న తీరు ప్రశంసనీయం. మరోపక్క ‘ఆనాటి హృదయాల’ అంటూ ఇమంది రామారావు ఫీచర్ మొదలవుతుందని ప్రకటన చేశారు. ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. చాలాకాలంగా ‘్ఫ్లష్‌బ్యాక్’ పేరిట రచయిత్రి మాణిక్యేశ్వరి అందిస్తున్న పాత చిత్రాల రివ్యూ సంగతులు వెనె్నలకే హైలెట్. మరే పత్రిల్లోనూ కనిపించనటువంటి విలువైన శీర్షికలతో నిజంగానే ‘వెనె్నల’ కురిపిస్తున్నారు, అభినందనలు. వారంవారం అందిస్తున్న ఈ ‘సినిమా’ సంపుటంలో వర్థమాన తారల వివరాలు, వారి సంగతులూ కూడా ప్రముఖంగా అందిస్తారని ఆశిస్తున్నాం.
-జింకా రాము, భీమడోలు
నిక్కచ్చిగా..
ఆంధ్రభూమి వెనె్నల సంపుటంలో అందించే సమీక్షలు నిక్కచ్చిగా, నిష్పాక్షికంగా ఉండటం అభినందనీయం. గతవారం అందించిన బాలీవుడ్ చిత్రం ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ సమీక్ష చాలాచాలా నచ్చింది. కానీ, టెక్నాలజీ విసృతమైన తరువాత వెబ్‌సైట్లు అదే రోజు సమీక్షలు అందిస్తుంటే -వెనె్నల మాత్రం మూడు రోజుల తరువాత రివ్యూను ప్రచురించటం బాధగా ఉంది. గత కొద్దివారాల్లో బాలయ్య కథానాయకుడు చిత్రం మీద, ఇటు బయోపిక్‌ల మీద అందించిన కథనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మరే తెలుగు సినీ పత్రికా అందించనటువంటి ‘క్విజ్’ కాలమ్‌ను సైతం వెనె్నలలో కొనసాగించటం ఆనందదాయకం. ఇదే తీరున వెనె్నల మరింత శోభాయమానం కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ...
-కె బాలసుందరం, చెన్నై
సబబు కాదు
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ బయోపిక్ వ్యాసం బావుంది. కానీ, ‘మూడు స్టార్స్’ రేటింగ్ యిచ్చారు. సమంజసం కాదు. ఎందుకంటే, అది అమూల్యమైన చిత్రం.
‘శభాష్’ క్రిష్! మీ దర్శకత్వంలో తీసిన సినిమా, కెవి రెడ్డి పాత్రలో నటించిన తీరు అద్భుతం. ‘జగదేకవీరుని కథ’ను కెవి రెడ్డితీస్తుంటే, నాగిరెడ్డి చక్రపాణి.. యిదేం కథో, చిత్రం ఫ్లాపవుతుందని ప్రొడక్షన్ కంట్రోలర్ ద్వారా నిర్మాణాన్ని నివారించారు. కాని కెవి రెడ్డి ఈ చిత్రంపై అపనమ్మకాన్ని నిలువరించి, వారు వద్దన్నా, స్వయం నిర్మాతగా తీస్తానని, అప్పటికే అయిన ఖర్చును వారికి వాపసుచేశారు. సినిమా పూర్తయిన తర్వాత ప్రీవ్యూ అందరికీ చూపించగా, నాగిరెడ్డి, చక్రపాణిలు ఆయనను బ్రతిమాలి విజయా బానర్‌పై సినిమా ఉండేటట్లు ఒప్పందం చేసుకున్నారు. కాని ‘జగదేకవీరుని కథ’ టైటిల్స్‌లో నిర్మాత, దర్శకుడు కెవి రెడ్డి అని ఉంది. ఇక ఎన్టీఆర్.. కెవి రెడికి శ్రీరాముని కథతో సిన్మాచేయాలని చెబితే, అయతే నీవు శ్రీరాముడు, రావణునిగా ఎస్‌వి రంగారావు అన్నారట. కాని డిబిఎన్ చౌదరి అను కవి ఎన్టీఆర్‌కు రావణుడి స్క్రిప్ట్ ఇచ్చారు.
ఎన్టీఆర్ అది చదివి, కెవి రెడ్డికి వినిపిస్తే, రాక్షసుడి పాత్రలో నిన్ను చూడనని, సినిమాను డైరెక్టు చేయనన్నారట. ఈ సీన్ బయోపిక్‌లో అంద్భుతంగా చూపించారు. అప్పటి సంగతులు ఎన్నో చిత్రంలో చూపించటం సంతోషం కలిగింది.
-ఎస్.శ్రీనివాసరావు, ఎన్మిగనూరు