మీ వ్యూస్

మీ వ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే పెద్ద తప్పు
కథపై, కథాక్రమంపై ఉంచాల్సిన ‘విశ్వాసం’ చిత్రంలోని తారాగణంపై అతిగా ఉంచడంవల్ల ప్రేక్షకుల అభిమాన విశ్వాసాన్ని అంతగా చూరగొనలేకపోయిందంటూ అనే్వషి రాసిన సమీక్ష చాలా బావుంది. ఈ వ్యాఖ్య అక్షర సత్యం కూడా. గ్రేట్ ఆర్టిస్టులను సినిమాలో పెట్టుకున్నంత మాత్రాన వాళ్లకోసమే ప్రేక్షకులు సినిమా చూసేస్తారనుకుంటే -అంతకంటే తప్పులో కాలేయడం ఎక్కడా ఉండదు. నిజానికి అజిత్, నయనతార ఇద్దరూ గొప్ప ఆర్టిస్టులే. వీళ్ల కాంబినేషన్ అనగానే ఆసక్తి పెరిగిన మాటా వాస్తవమే. కాకపోతే, సినిమా తెలుగు నేటివిటీకి దూరమైపోయంది. పైగా -తమిళంలో హిట్టనిపించుకునే చిత్రాలను తెలుగు ఆడియన్స్‌మీద రుద్దేసినంత మాత్రాన ఆ చిత్రాలకు పట్టంగడతారనుకోవం పొరబాటు. సినిమా విషయంలో తమిళుల టేస్ట్‌వేరు. తెలుగు ఆడియన్స్ టేస్ట్ వేరు. నేటివిటీని మిస్సయన చిత్రాలు ఎక్కడా రాణించిన దాఖలాలు కూడా లేవు. సో, ఇప్పటికైనా అనువాద చిత్రాలను ఆచితూచి తెచ్చుకోవడం మంచిది. లేదంటే -చేతులు కాలక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు.
జి బాలు, సికింద్రాబాద్
తీరని లోటే
సుప్రసిద్ధ నిర్మాత, దర్శకుడు విజయ బాపినీడు, సుప్రసిద్ధ దర్శకుడు కోడి రామకృష్ణ మరణించటం చిత్ర పరిశ్రమకు తీరనిలోటే. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీసి తెలుగు పరిశ్రమ పేరుని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ఉద్దండులుగా వీరిద్దరినీ పేర్కొనడంలో ఏమాత్రం సంకోచాలు అవసరం లేదు. అనుకోకుండా పరిశ్రమకు వచ్చి అకుంఠిత దీక్షతో ఎంతో ఎత్తుకు ఎదిగిన విజయబాపినీడు, ఎంతోమందిని పరిశ్రమకు తీసుకురావడమే కాదు చిరంజీవిలాంటి నటులను శాశ్వత హీరోలుగా నిలబెట్టారు. ఇక దాసరి శిష్యుడిగా పరిశ్రమకు వచ్చిన కోడి రామకృష్ణ స్వయంప్రతిభతో మధ్యతరగతి జీవితాలను కథావస్తువులు చేసుకుని గొప్ప చిత్రాలను తీశారు. గ్రాఫిక్స్‌తో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేయొచ్చన్న విషయాన్ని అప్పటి వర్థమాన దర్శకులకు ‘అమ్మోరు’లాంటి చిత్రంతో పాఠం నేర్పిన కోడిని ఎప్పటికీ మరువలేం. ఇద్దరు అగ్ర దర్శకులు ఒక నెలలో రోజుల వ్యవధిలో చిత్ర పరిశ్రమ నుంచి మాయం కావడం -పరిశ్రమకు తీరని లోటు.
-సిహెచ్‌ఎన్ రావు, హైదరాబాద్
అంత అవసరమా?
మణికర్ణిక చిత్రానికి క్రిష్ దాదాపు 70శాతం దర్శకత్వం వహించిన తరువాత లీడ్ రోల్ ప్లేచేసిన కంగనతో విభేదాలు రావడం, ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం తెలిసిందే. కాకపోతే, ఆ చిత్రానికి ఎక్కువ శాతం తానే దర్శకత్వం వహించినట్టు కంగన చెప్పుకోవడం ఎంతమాత్రం మర్యాద అయితే కాదు. దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ చిత్రాన్ని ఎలా తీయాలన్న విషయం స్క్రిప్ట్ దశలోనే పూర్తవుతుంది. బౌండెడ్ స్క్రిప్ట్‌తోనే సినిమా పూరె్తైనట్టు. ఇక సినిమా షూటింగ్ మొదలుపెట్టి కొంత తీసిన తరువాత, అదే ప్యాటర్న్‌లో మిగిలిన చిత్రాన్ని పూర్తి చేయడం ‘సవాల్’ విసిరేంత గొప్ప విషయమేమీ కాదు. చిత్రం హిట్టనిపించుకున్న తరువాత కంగన పడిన కష్టం వీడియో విడుదలైంది. అది చూస్తే -కంగన దర్శకత్వ భారం ఎంతమోసిందో అర్థమై నవ్వొచ్చింది. జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కంగనకు అంత దూకుడు ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఒకింత వౌనం వహించాల్సిన దర్శకుడు క్రిష్ సైతం అనుచిత వ్యాఖ్యలకు దిగడం పరిస్థితిని తేటతెల్లం చేసింది.
-విచిత్ర, మైదుకూరు
పాపం క్రిష్!
మహానాయకుడు సినిమా చూసి అభిమానులు డల్ అయిపోయారు. నెట్‌లో సినిమాని ట్రోలింగ్ (ఘాటు విమర్శలతో) చేస్తున్నారు. అవసాన దశ చూపించకుండా అవసరార్థం ఎన్టీఆర్‌ని వదిలేయడం ఆడియన్స్‌కి రుచించలేదు. ఆ విమర్శల్ని తట్టుకోలేకే మహానాయకుడు తారక రాముల కథ అని ప్రకటనలు గుప్పిస్తున్నారు. చరిత్రను వక్రీకరించారంటూ మణికర్ణికను వదిలేసి వచ్చిన క్రిష్, తను కూడా చరిత్రను వీక్రరించాడు. చిత్ర నిర్మాణ సమయంలోనే ‘మీనాన్న గొప్పోడని చాటడానికి మా నాన్నను విలన్‌గా చూపిస్తావా?’ అని నాదెండ్ల భాస్కర రావు కొడుకు బాలకృష్ణని నిలదీశాడు. సినిమా విడుదల చేశాక నాదెండ్ల భాస్కర రావే జరిగిందేమిటో, చిత్రంలో దాన్ని ఎలా వక్రీకరించారో ఒక చానెల్‌లో వివరిస్తూ దర్శకుడిపై పరువు నష్టం దావా వేస్తానన్నాడు. కొంత మంచి పేరున్న క్రిష్ ఇలా ఎందుకు అభాసుపాలయ్యాడో.
-సత్య, కరప
అదేం పోలిక
మహేష్‌బాబు, రామ్‌చరం, ఎన్టీఆర్‌లాంటి స్టార్ హీరోలు పారితోషికంగా 20 నుంచి 25 కోట్లు తీసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ, నానిలాంటి హీరోలు పారితోషికంగా 8 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నారు. కాకపోతే, స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేస్తుంటే, చిన్న హీరోలు మాత్రం ఏడాది రెండు మూడు సినిమాలు చేసేస్తున్నారు. సో, హీరోల వార్షికాదాయంలో వాళ్లకు వీళ్లేంత తక్కువ కాదు అన్నది ఓ చానెల్ ప్రసారం చేసిన కథనం. చూస్తే నవ్వొచ్చింది. ఒక వ్యక్తి స్థాయి, హోదాలను సంపాదనతో పోలిక చేస్తూ ఆ చానెల్ కథనాన్ని చేసుకోవడం హాస్యాస్పదం. దేశ ప్రథమ పౌరుడి జీతం ఒక సీనియర్ కార్పొరేట్ ఐటీ ఉద్యోగికంటే తక్కువే ఉండొచ్చు. అంతమాత్రం చేత ఆ ఉద్యోగితో రాష్టప్రతిని పోల్చగలుగుతామా? ఆదాయమార్గాలతోనే వ్యక్తుల స్థాయిలను కొలమానిస్తారా? ఇదెక్కడి చోద్యమండీ బాబూ. ప్రపంచగతినే మార్చేసిన గొప్ప శాస్తవ్రేత్తలు పేదరికంలోనే మగ్గి ఊపిరి వదిలేశారు. చానెల్ ప్రసారం చేసిన కోణంలో మరి వీళ్లనేమనాలి?
-బబితాకుమారి, ధర్మవరం