మీ వ్యూస్

ఎదురుచూస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం వచ్చిందంటే చాలు ఆంధ్రభూమి ముందుగా చూడాల్సిందే. ‘సరయుశేఖర్’గారి ఫీచర్, ఫ్లాష్‌బ్యాక్ ఎట్ 50, మీవ్యూస్, కొత్త సినిమాల రివ్యూస్, ఇంకా ‘నాకునచ్చిన చిత్రం’, ‘పాట’, ‘ఇమంది’గారి జ్ఞాపకాలు ఇలా ఏవైనాసరే అన్నీ మాకు నచ్చేవే! ఇలాంటి శీర్షికలు మరిన్ని పెంచి వెనె్నలకు మరింత చల్లదనాన్ని ఆపాదిస్తారని ఆశిస్తున్నాం. ఏది ఏమైనా మా ఇంటిల్లిపాదికి నచ్చే పత్రిక ధరతో సహా ‘ఆంధ్రభూమి’ ఒక్కటే నేను నిజమే చెపుతున్నా.
- టి.సదా, తిరుపతి
ఖంగుతిన్న బాబు
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఈమధ్యనే విజయవాడలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అలీకి జరిగిన సన్మానంలో ముఖ్యఅతిథిగా పాల్గొని సినిమాల్లో హాస్యం పండించి ఆంధ్రులను ఆహ్లాదపరిచిన అలీ రాజకీయాల్లోకూడా సేవలు అందిస్తే బాగుంటుంది. గతంలో ఆయన చాలాసార్లు తెలుగుదేశంపార్టీ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు అని చెప్పారు.
అలీ తెదేపాలో చేరుతారనుకుంటే ఆయన వెళ్లి జగన్ పార్టీలో చేరి ‘నాకు రాజశేఖరరెడ్డి అంటే చాలా యిష్టం’అని చెప్పటంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఎంత ఘోరం! ఇది మోదీ కెసిఆర్‌ల కుట్ర! ఎంతటి వెన్నుపోటు!! అని చంద్రబాబు వాపోతున్నారట!
- గునే్నశ్, కొవ్వాడ
అదేంబిరుదో
కళాబంధు అనిపించుకునే సుబ్బరామిరెడ్డికి సినీతారలకు సన్మానం చేయడం, బిరుదులివ్వడం, అవార్డ్ఫుంక్షన్లు నిర్వహించడం ఒక హాబీ. ఈసారి బి.సరోజాదేవికి విశ్వనట సామ్రాజ్ఞి అని బిరుదు ఇచ్చాడు. ఆ బిరుదులోని పదాల అన్వయం అయోమయంగా ఉంది. నట అన్నది పురుష వాచకం. మహిళను విశ్వనటీ సామ్రాజ్ఞి లేదా విశ్వనటనా సామ్రాజ్ఞి అనాలి. విశ్వనట సామ్రాజ్ఞి అన్నప్పుడు విశ్వనటునికి సామ్రాజ్ఞి అంటే రాణి లేక భార్య అని అపార్థం వస్తుంది. తెలుగు పండితులను సంప్రదించి సరియైన పదాలతో బిరుదు యిస్తే ఈ అయోమయం ఉండదుకదా!
- మైథిలి, సర్పవరం
భలే పోటు
ఎన్టీఆర్ బయోపిక్ చేసే అవకాశం మొదట వర్మకు దక్కింది. అయితే కథా చర్చలో బాలకృష్ణ దానిలో లక్ష్మీపార్వతి పాత్ర ఉండరాదని షరతుపెట్టాడు. వర్మ తప్పుకున్నాడు.
ఒకవైపే చూడు. రెండోవైపు చూడకు అనడంతో తేజాకూడా తప్పుకున్నాడు. చరిత్రను వక్రీకరించకూడదు ఉన్నది ఉన్నట్టే తీయాలి అని సుద్దులు చెప్పిన క్రిష్, బాలకృష్ణ షరతులకు అంగీకరించి తీసిన కథానాయకుడు, మహానాయకుడు డిజాస్టర్లుగా మిగిలాయి! వర్మ ఊరుకునే రకం కాదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసి ‘‘దానికి బాలకృష్ణే ప్రేరణ, నా చిత్రాన్ని ఆయనకే అంకితం ఇస్తున్నా’’అంటూ ఒక పోటు పొడిచాడు!
- శుభ, కాకినాడ
పట్టించుకోరా
అడపాదడపా కొన్ని చిత్రాల్లో బాగా నటించినా పెద్దగా గుర్తింపులేని తార పూర్ణ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషాద విషయాలివి. తను మలయాళ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. వారి కుటుంబాల్లో ముఖ్యంగా స్ర్తిలకు ఆటపాటలు, నృత్యాలు నిషిద్ధం. అయినా ఆమె తెగించి నటి అయింది. ఆమెకు డాన్స్ అంటే ప్రాణం. ఒక దర్శకుడి సూచనమేరకు లిప్‌లాక్‌కు ఓకె చెప్పడంతో కుటుంబీకుల నుంచి ఆమెపై వత్తిడి పెరిగిందట. దాంతో సినిమాలు తగ్గాయ. పెళ్లిచేసుకుందామనుకుంటే నటన డాన్సులు మానెయ్యమంటున్నారట. సో, పెళ్లిచేసుకోలేదు. దేశంలో అసహనం పెరిగిపోయిందని అంగలార్చే అమీర్, షారూఖ్ లాంటివార ముస్లిం కుటుంబాల్లో మహిళల స్వేచ్ఛ గురించి ఏం చేస్తున్నట్టో?
- సోనాలి, సూర్యారావుపేట
గురువిందగింజ..
ఎవరూ చరిత్రను వక్రీకరించకూడదు. నేను ఉన్నదిఉన్నట్టు తీశాను అన్నాడు క్రిష్. తీరాచూస్తే మహానాయకుడులో ఏముంది? ఎన్టీఆర్ కాదు చంద్రబాబే మహానాయకుడు అన్నట్టుంది! చంద్రబాబు టెలీకాన్ఫరెన్సుల్లో తన అనుచరుల్ని ‘మహానాయకుడు’ సినిమా చూడండి. ప్రజలకు చూపించండి. ఆ సినిమా ప్రజల్లో స్ఫూర్తినింపాలి’ అని ప్రోత్సహిస్తున్నాడు. తమ పార్టీ లబ్ధిపొందాలనే ఆ చిత్రం తీసినట్టు అర్ధం అవుతోంది. ఒకవైపే చూడు. రెండోవైపు చూడకు అని బాలకృష్ణ హెచ్చరించటంవల్లనే దర్శకుడు తేజ ఆ ప్రాజెక్ట్‌నుంచి తప్పుకోగా క్రిష్ చిక్కుకున్నాడు. ఒకవైపే చూశాడు. తెలుగుదేశం పార్టీకి లబ్దిచేకూర్చడానికి పూనుకున్నాడు. విశ్వసనీయత కోల్పోయాడు. యాత్ర చిత్రం విమర్శకుల మెప్పుపొందినా వసూళ్లురాలేదు. మహానాయకుడ్ని విమర్శకులు మెచ్చుకోలేకపోయారు, వసూళ్లూ రాలేదు. మాయమాటలతో ప్రేక్షకుల్ని మోసం చేయలేరెవరూ.
-అభిలాష, సాంబమూర్తినగర్
గొప్పనటులైనా..
మహానటులు కూడా ఒక్కోసారి నఖరాలు చేస్తుంటారు. ఏయన్నార్ కూడా. ఆయన హైద్రాబాద్‌కు మకాంమార్చాక మద్రాసు స్టూడియోల్లో అడుగుపెట్టనని శపధం చేశారు. మద్రాస్ ఔట్‌డోర్‌లో ఒక పాట చిత్రీకరణలో పాల్గొనమని దర్శకుడు ఆయన్ని బతిమాలి ఒప్పించాడు. అయిష్టంగానే వచ్చిన అక్కినేని పాటలో ఒక బూతు పదం ఉందంటూ ఆర్భాటం చేసి షూటింగ్‌లోంచి బయటకుపోగా అందరూ నిర్ఘాంతపోయారు. ఆయన రొమాంటిక్ హీరో. బూతులు తొంగిచూసే ఎన్నో పాటలకు స్టెప్స్ వేశారు. ఇప్పుడీ హంగామా దర్శకునిమీద కోపంతోనే. పెద్దలు రాజీ కుదిర్చారు. సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలో ఒరిజినల్ బట్టతలతో నటించను, విగ్గుపెట్టండి అని నఖరా. సినిమా మానేస్తానుగాని విగ్గుపెట్టనని నిర్మాత. మళ్లీ పెద్దలు రాజీకుదిర్చారు. ‘ఆయన తేలు లాంటివాడు. కుడతాడుగాని విషం ఉండదు. చురుక్కుమంటుంది’ అని భానుమతి ఎక్కడో ఓసారి అన్నదట.
-స్నేహ మాధురి, పెద్దాపురం