మీ వ్యూస్

చరిత్రను కలుషితం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ ఖ్యాతిగడించిన ‘బాహుబలి’ సృష్టికర్త రాజవౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఎంతవరకు సబబు? తెలుగు జాతికి స్వాతంత్య్ర ఉద్యమస్ఫూర్తిని రగిల్చి, మన్యాన్ని ఉద్యమకేంద్రంగా మార్చి బ్రిటిష్ వారిపై పోరాడిన మన్యంవీరుడు ‘అల్లూరి సీతారామరాజు’. గిరిజనుల స్వాతంత్య్రంకోసం పోరాడి వారిని బానిస దాస్య శృంఖలాలనుండి కాపాడిన తెలంగాణాయోధుడు ‘కొమరంభీమ్’. ఈ వీరుల చరిత్ర భావితరాలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకం. దర్శకుడు ‘రాజవౌళి’ ‘అల్లూరి’, ‘కొమరంభీం’ల జీవిత చరిత్రలో వారి స్వాతంత్య్ర ఉద్యమాలకంటే ముందు అజ్ఞాతవాసంలో గడిపిన సంఘటనలను, పోరాటస్ఫూర్తిగా నిలిచిన అంశాలను కల్పిత కథతో చరిత్రలో లేని విషయాలు, ఊహాజనితంగా నిర్మించటం ఎంతవరకు సమంజసం?
‘బాహుబలి’లాంటి రాజవంశ కథలను కల్పిత పాత్రలతో భారీ బడ్జెట్‌తో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో నిలపటం నిజంగా విజయం సాధించినట్లా? దశాబ్దాల క్రితమే మన తెలుగు చిత్ర పరిశ్రమ బిఎన్ రెడ్డి, కెవి రెడ్డి, కమలాకర కామేశ్వరరావు లాంటి దిగ్గజాలు కళాత్మక విలువలుతో కూడిన చిత్రాలు అందించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందారు. ‘మన్యంవీరుడు అల్లూరి’, ‘కొమరం భీమ్’ల చరిత్రలకు కల్పిత కథను జోడించి నిర్మించటం చరిత్రకు మాయనిమచ్చగా మిగిలిపోతుంది. ఇలాంటి కల్పిత కథ, పాత్రలు సృష్టించటానికి చందమామ కథలాంటి ‘బాహుబలి’ కాదు? మన చరిత్రతకు గ్రహణం పట్టించవద్దు?
-ఉప్పు సత్యనారాయణ, తెనాలి
ఏడ్చేస్తుందట
వాళ్లు నటించిన చిత్రం ఫ్లాప్ అయితే చాలామంది హీరోయిన్లు పెద్దగా పట్టించుకోరు. మామట్టుకు మేము బాగానే నటించాం అనేస్తారు. కాని పూజహెగ్డే మాత్రం వారం పదిరోజులు బాధపడేదట. ఆ బాధ ముఖంలో కనిపించి షూటింగ్‌ల్లో సరిగా నటించలేకపోయేదట. ఈ మూడ్‌ని అధిగమించేందుకు పూజ ఒక చిట్కా కనిపెట్టింది. తన సినిమా ఫ్లాప్‌అయితే తన గదిలో ఒంటరిగా కూర్చుని భోరున ఏడ్చేయటమే ఆ చిట్కా. అలా ఏడ్చేస్తే దిగులు అంతా తీరిపోయి మనసు తేలికపడి షూటింగ్‌లల్లో ఉత్సాహంగా పాల్గొనేదట. మరక మంచిదే అన్నట్లు ఏడుపుకూడా మంచిదేనేమో!
- ప్రభాస్, గాంధీనగర్

రాజకీయ ప్రేరణతో..
రాజకీయాల ప్రేరణతో కొన్ని పార్టీలను ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యతిరేకిస్తూ సినిమాలు నిర్మించటం కొత్త కాదు. సూపర్ స్టార్ కృష్ణ ఈనాడు, నాపిలుపే ప్రభంజనం వంటి సినిమాలను రాజకీయ కోణంలోనే చేశారు. మేస్ర్తి, ప్రజాప్రతినిధి వంటివి దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు నిర్మించారు. కమల్‌హాసన్ నాయకుడు, అర్జున్ ఒకేఒక్కడు. రాజశేఖర్ ఎవడైతే నాకేంటి, కోడి రామకృష్ణ అంకుశం లాంటి చిత్రాలను రాజకీయ కోణంలోనే చూడాలి. అలనాటి తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని నిర్మితమైతే, ఇతర పార్టీలను విమర్శిస్తూ మరికొన్ని చిత్రాలు రావడం తెలిసిందే. రాజకీయ చదరంగం, ప్రతిఘటన, వందేమాతరం, మరోకురుక్షేత్రం, యువతరం కదిలింది, విప్లవ శంఖం, స్వరాజ్యం, మహాప్రస్థానం, చీమలదండు, ఒరేయ్ రిక్షా.. ఇలా చాలా సినిమాలనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు రాజకీయాన్ని బయోపిక్‌ల రూపంలో తీసుకొస్తున్నారంతే. ఇలాంటి చిత్రాలు వచ్చాయ, వస్తున్నాయ, వస్తూనే ఉంటాయ కూడా.
-ఎ రఘురామారావు, ఖమ్మం
వర్కౌట్ కాలే..
ఎన్టీఆర్ బయోపిక్‌పై రాంగోపాల్‌వర్మ అభిప్రాయం అడిగితే ‘కథానాయకుడు’మాత్రమే చూశాను. భావోద్వేగాల సంఘర్షణ లేకుండా సన్నివేశాలు పేర్చినట్టుంది అన్నాడాయన. ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభించిన కొత్తలో మీరుకూడా మీ నాన్నగారి బయోపిక్ తీయవచ్చుకదా అని నాగార్జునని ఒక విలేఖరి అడగ్గా ‘నాన్నగారి జీవితంలో భావోద్వేగాల సంఘర్షణలేవీ లేవు. ఆయన జీవితం సాఫీగా సాగిపోయింది. సాఫీగా సాగిపోయే బయోపిక్‌లు ఆడవు’అని నిష్కర్షగా చెప్పేశాడు నాగార్జున. ఆపాటి తెలివిడి బాలకృష్ణకు లేకపోయింది. ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని బయోపిక్ తీసి బొక్కబోర్లాపడ్డాడు.
-సుబ్బక్క, జగన్నాథపురం
అలా ఉండేదెవరు?
నటుడు శోభన్‌బాబుది అరుదైన వ్యక్తిత్వం. ఆదర్శప్రాయ జీవితం. మహానటులు ఎన్టీఆర్, ఎయన్నార్‌ల జీవితాల్లో వివాదాలున్నాయేమోగాని శోభన్ కెరియర్‌లో వివాదాలులేవు. డబ్బు విషయంలో నిష్కర్షగా ఉంటూ పారితోషికం ఖచ్చితంగా వసూలుచేసుకునేవాడు. మద్యం, మగువ, సిగరెట్ల జోలికి పోయేవాడు కాదు. సాయంత్రం 6గంటలు దాటితే చాలు షూటింగ్ ముగించి నేరుగా ఇంటికిపోయి భార్యబిడ్డలతో గడిపేవాడు. ఆదివారాలు షూటింగ్‌లకు వచ్చేవాడుకాదు. డబ్బు వృథాచేయకుండా స్థలాలు కొనేవాడు. ఇలాంటి క్రమబద్ధ జీవితం ఈనాటి నటీనటుల్లో ఎంతమందికుంది?
- ప్రసాద్, గొడారిగుంట
కథనం బావుంది
‘ఏడనున్నారో ఎక్కడున్నారో’ ఫీచర్ చక్కగా వుంది. పరుగుపందెంలో వెనకబడితే ఇంక అంతే. ఎంత ప్రయత్నించినా ముందుకురాలేదు. ఆ విషయం తెలియటంవల్లనే కాబోలు చాలామంది పరుగుమానేసి తప్పుకుంటారు. కొందరి విషయంలో బంధువులు, స్నేహితులు సలహాలు గుప్పిస్తూ ఏ సలహా పాటించాలో తెలియని అయోమయంలోకి నెట్టేస్తారు. తరుణ్ విషయంలో ఆయన తల్లినే దోషిగా చెప్తారు తెలిసినవారు. దాంతో తరుణ్ స్వయం నిర్ణయంతీసుకోలేక నిరాశ నిస్పృహలకులోనై తాగుడు అలవాటు చేసుకొని వెనకబడిపోయాడని విన్నాం. చాలామంది విషయంలో కుటుంబ పెద్దలే విలన్‌లు! మంచి చేయాలనుకునే విలన్లు!!
-సాహిత్యదీప్తి, రమణయ్యపేట