మీ వ్యూస్

జాగ్రత్తపడొచ్చు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా ఆరు ఫ్లాపులు చూసిన హీరో సాయితేజ్. అందుకే కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త కథలపై ఫోకస్ పెడుతున్నాడు. గతవారం వచ్చిన చిత్రలహరి కథతో నిజానికి మెగా అన్న ఇమేజ్ వదిలి ప్రయోగమే చేశాడని చెప్పాలి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రచారం చేసుకునేంత గొప్ప హిట్టని అనలేంకానీ, సాయతేజ్ నీరసాన్ని తగ్గించే వూపునిస్తుందని మాత్రం చెప్పొచ్చు. సక్సెస్‌కోసం పేరును రిపేర్ చేసుకున్న ఈ హీరోకు ‘చిత్రలహరి’ ఒకవిధంగా అవసరమైన ఫలితమే ఇచ్చింది. ఇకనుంచి కథలను ఎంపిక చేసుకోవడం, కొత్తదనాన్ని ప్రదర్శించే విషయంలో ఆలోచనలు బలంగా లేకపోతే -వచ్చిన ఫలితానికి ఫలితం లేకుండా పోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. రొటీన్ ప్యాట్రన్ చిత్రాల నుంచి, కథల నుంచి కాస్తంత బయటపడి తనేంటో నిరూపించుకోగలిగే సత్తా సాయతేజ్‌కు ఉంది. పైగా హీరో మెటీరియల్ అనడంలో అనుమానాలే అక్కర్లేదు. కాకపోతే, తనను అద్భుతంగా ప్రజెంట్ చేసే దర్శకుడు దొరకాలి. డౌట్ లేదు, సాయతేజ్ మళ్లీ లేచి నిలబడినట్టే.
-కాసుల పద్మావతి, పొన్నూరు
ఓ హిట్ కావాలి
బాక్సాఫీసు బొనాంజా బాలకృష్ణకు అర్జంటుగా బంపర్ హిట్ కావాలి. లెజండ్ తర్వాత నిజమైన విజయాలేవీ అతని ఖాతాలో లేవు. శాతకర్ణి, జైసింహా యావరేజి. కథనాయకుడు, మహానాయకుడు ఫ్లాప్‌లే. అందుకే మళ్లీ పైకిలేచే సూపర్‌హిట్ బాలయ్యకు అవసరం. బోయపాటిని బాలయ్యబాబు నమ్ముకున్నాడు. కాని బోయపాటి హవా ఇప్పుడు లేదు. సో, అనిల్ రావిపూడి లాంటి కుర్ర దర్శకులను నమ్ముకుని ఓ కామెడీ ఎంటర్‌టైనర్ చేయడం బెటర్. అనిల్ సినిమాలను గమనిస్తే కథకన్నా పక్క ప్లాన్‌తో స్క్రీన్‌ప్లే, సన్నివేశాల కూర్పు, పటిష్టమైన డైలాగులు, చక్కని టైమింగ్‌తో వినోదం మేళవింపు కనిపిస్తుంది. కనుక బాలయ్య బోయపాటి కన్నా అనిల్‌ను లైన్‌లో పెడితే బెటర్.
-పీవీఎస్ ప్రసాదరావు, అద్దంకి
పూర్ణకు కలిసొచ్చింది
మంచి క్రికెటర్ కావాలనుకున్న మధ్య తరగతి రైల్వే ఉద్యోగి (రావు రమేష్) కొడుకుగా పూర్ణ అదృష్టవంతుడు. సినిమాటిక్ లైఫ్‌లో క్యారెక్టర్ పరంగా పడరాని కష్టాలు పడ్డాడేమోకానీ, సమంత అతని లైఫ్‌లోకి వచ్చిన తరువాత చైతూని అదృష్టం వెన్నుతట్టి ముందుకు నడిపిస్తోందని అనిపిస్తోంది. పర్సనల్ లైఫ్ కాసేపు పక్కనపెడితే, ప్రొఫెషనల్‌కు సమంత చైతూకి ఓ మంచి విమర్శకురాలు. అలాగే, సమంత కెరీర్‌కూ చైతూ మంచి గైడ్. వాళ్ల వాళ్ల జీవితాల్లో మరింత పైకి ఎదిగేందుకు ఒకరుకొకరు అన్నట్టు భగవంతుడు వాళ్లను కలిపాడేమో. అందరికీ అలాంటి అదృష్టం రాదు. మంచి కపుల్‌ను మనసారా దీవించొచ్చు. ఇక వెనె్నల వెండి వెలుగులే విరజిమ్ముతోంది. ఆసక్తిదాయకమైన కథనాలే కాదు, మరపురాని జ్ఞాపకాలుగా మంచి శీర్షికలను అందిస్తుండటం అభినందనీయం. ఫ్లాష్‌బ్యాక్ పేరిట మాణికేశ్వరి, అలనాటి హృదయాల శీర్షికన ఇమంది రామారావు, కనుమరుగైన, మరుగున పడిన ఆర్టిస్టుల అనుభవాల జ్ఞాపకాలను రచయత సరయు శేఖర్ అందిస్తున్న విధానం -వెనె్నలకే శోభాయమానం.
-చింతా కామాక్షి, శృంగవృక్షం
క్విజ్ బావుంటుంది
ఆదివారం ఆనందంగా గడిపేందుకు వెనె్నల అందిస్తున్న సినిమా క్విజ్ ఆసక్తిదాయకం, ఆనందకరంగా ఉంటుంది. వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు తెలిసినవే అయనా, కూసింతపాటు ఆలోచింప చేస్తున్నాయ. ముఖ్యంగా క్విజ్‌లో అధికభాగం పాత చిత్రాలకు సంబంధించినవే ప్రశ్నలు ఉంటున్నాయ. అలాకాకుండా కొత్త చిత్రాలకు సంబంధించిన ప్రశ్నలను మిళితం చేస్తే, కుర్రకారుకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే, కవర్‌పేజీ కథనాలు బావుంటున్నాయ. సినిమా పరిశ్రమలోని ముఖ్యాంశాలు, ఆసక్తికరమైన విషయాలను కథనాలుగా అందించటం బావుంది. మరిన్ని అంశాలతో వెనె్నల సంపుటాన్ని మరింత శోభాయమానం చేస్తారని ఆశిస్తూ..
-జి మహేష్, పాలకొల్లు
వెనె్నల హాయి
వారం వారం ఆంధ్రభూమి అందిస్తోన్న వెనె్నల సోయ ఎంతో హాయినిస్తోంది. ఇమంది రామారావు ‘ఆనాటి హృదయాల’, సరయుశేఖర్ రాస్తున్న పాత నటీనటుల పరిచయం ఆకట్టుకొంటున్న శీర్షికలు. అలాగే నచ్చిన సినిమా నచ్చిన పాట శీర్షిక బాగుంది. కానీ, నెలలో రెండుసార్లయనా కొత్త చిత్రాల గురించి నచ్చిన సినిమాలు, పాటల శీర్షికన వేస్తే బావుంటుంది.
ఇక సినిమాల రివ్యూలు నిక్కచ్చిగా రాస్తున్న విధానానికి అభినందనలు. ఫ్లాష్‌బ్యాక్ ఎట్ 50 పేరిట మాణిక్యేశ్వరి అందిస్తున్న సినిమా కథలు చదువుతుంటే, అప్పటి సినిమాను రీళ్లురీళ్లుగా ఇప్పుడు చూస్తున్నట్టే అనిపిస్తుంది. కవర్ పేజీపై వేస్తున్న ఫొటోలు మరింత కలర్‌ఫుల్. అభిమాన పాఠకాదరణతో అక్షర వెనె్నల మరింత విరబూయాలని ఆశిస్తూ..
-కేవీ సుధాకర్, మంగళగిరి
కొత్త చిత్రాలు భలే
ఏ సినిమా అయనా గొప్ప ఆదరణ పొందాలంటే ఇతివృత్తం ఉదాత్తంగా ఉండటమే కాదు, అందులోని పాత్రల చిత్రీకరణా అంతే గొప్పగా ఉండాలి. ఇటీవలి కాలంలో కుర్ర దర్శకులు తీస్తున్న చిత్రాల్లోని పాత్రల చిత్రీకరణ ప్రశంసార్హంగా ఉంటున్నాయ. గత రెండు మూడు వారాల వ్యవధిలోనే వచ్చిన మూడు సినిమాలను చూస్తే -మజిలీలో చైతూ, చిత్రలహరిలో సాయతేజ్, జెర్సీ చిత్రంలో నాని పోషించిన పాత్రల్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నిజానికి ఆ మూడు చిత్రాలు ఆదరణకు నోచుకున్నాయంటే పాత్రల చిత్రీకరణలోని గొప్పతనమే. భావోద్వేగాలను పండించగల ఆర్టిస్టులు మనదగ్గరున్నా ఎందుకో అలాంటి పాత్రల జోలికి పోవడం లేదు దర్శకులు. అలాంటి ప్రయోగాలు చేస్తున్న దర్శకులను ఆదరించి తీరాలి మనం. ఏమంటారు?
-్భరతీరావ్, చంద్రగిరి