మీ వ్యూస్

మరీ.. మోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా గతవారం విడుదలైన మహర్షి చిత్రం మామూలుగానే ఉందితప్ప, బయట ప్రచారం జరుగుతున్నంత గొప్ప చిత్రమేమీ కాదు. ‘వీకెండ్ వ్యవసాయం’ అంటూ ఓ కానె్సప్ట్‌ను సినిమాలో డిస్కస్ చేయడం గొప్ప సమాజోద్దరణగా కనిపించొచ్చేమోగానీ ప్రాక్టికల్‌గా సాధ్యంకాదు. రైతు ప్రాధాన్యతకు గుర్తింపునిచ్చే చిత్రంగా చెప్పుకున్నా -కమర్షియాలిటీ తప్ప కమిట్‌మెంట్ చిత్రమని చెప్పలేం. అంతుకుముందు ‘దత్తత’ కానె్సప్ట్‌మీద మహేష్‌బాబు చేసిన సినిమాతోనూ తాత్కాలిక ప్రేరణకు గురైన జనం తరువాత వదిలేశారు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. వందకోట్లు కలెక్ట్ చేసినవాటన్నింటినీ గొప్ప సినిమాలు అనలేం. కమర్షియల్ సినిమాలు అనాలంతే. ఏమంటారు?
-జి పాప, డి గన్నవరం
ఆయన అలాకూడా..
కాంతారావు కాఫీ బిల్లు చదివిన తర్వాత- విఠలాచార్య ఎంత మంచివాడో అంత కఠినుడు కూడా అని చెప్పే మరో సంఘటన జ్ఞాపకమొచ్చింది. అదీ కాంతారావు విషయంలోనే. కాంతారావు ఇల్లుకట్టుకొని గృహ ప్రవేశం చేద్దామని అన్నీ సిద్ధం చేసుకున్నప్పుడు -కొంచెం ప్యాచ్‌వర్క్ ఉంది రమ్మని విఠలాచార్య నుంచి ఫోన్ వచ్చిందట. దర్శకుడు పిలిచాడు, ఇప్పుడే వచ్చేస్తా, అన్నీ సిద్ధం చేసుకొమ్మని భార్యకు చెప్పి స్టూడియోకి వెళ్లాడట కాంతారావు. నవగ్రహ పూజామహిమ చిత్రం కోసం. శని ప్రభావంతో కాంతారావు దిగుడు బావిలోపడి పైకి వచ్చే సన్నివేశం. విఠలాచార్య టేకులమీద టేకులు తీస్తున్నాడు. కాలం గడిచిపోతోంది. రాత్రి అయింది కాని టేక్ ఓకే అవటం లేదు. చివరకు అర్థరాత్రి చిరిగిన దుస్తులతో బురద అంటిన శరీరంతో రేగిన జుట్టుతో ఇంటికి చేరుకున్నాడు కాంతారావు. గృహప్రవేశం ఎలాగో పూర్తి చేసేశాడు పంతులు. విందు ఆరగించి బంధువులంతా వెళ్లిపోయారు. భర్త వాలకంచూసి భోరున ఏడ్చేసింది ఆ ఇల్లాలు. ఇలాంటి విషయాలు పత్రికలు ప్రచురించవు. కొద్దికాలం క్రితం స్వయంగా కాంతారావే ఈ విషయం చెప్పినట్టు ఒక పత్రికలో వచ్చింది!
-సోనాలి, సూర్యారావుపేట
చెరగని చిరునామాలు
వెనె్నల 28-4-19 ‘బతుక తెలిసిన మొండిఘటం’ వ్యాసంలో నాటికి నేటికి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకస్థానం సంపాదించిన ‘కాకరాల’ చిన్నతనంలో జానపద కళారూపాలైన ‘తోలుబొమ్మ’లాటకు ఆకర్షించబడి చదువుకు స్వస్తిచెప్పి కళాకారుడిగా ఎదగటమే తన ‘జీవిత పరమావధి’గా భావించి నాటకరంగం నుంచి సినీ రంగానికి అంచెలంచెలుగా ఎదిగి తనదైన శైలితో పాత్రలకు వనె్నతెచ్చారు. ‘నిడివి తక్కువ పాత్రలే అయినా ఆ పాత్రలు పోషించిన విధానం అమోఘమైనది’. రంగుల రాట్నం, ముత్యాలముగ్గు, రాముడు భీముడులో కార్మిక నాయకుడిగా అడవిరాముడులో గిరిజన పాత్రలో ఎన్టీఆర్‌తో నటించిన పాత్రలు, డైలాగ్స్ ఎల్పీ రికార్డు రూపంలో ఆనాడు తెలుగునాట మార్మోగాయి. కాకరాల నట జీవితం నేటితరం నటులకు స్ఫూర్తిదాయకం.
తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాళ్లుగా నిలిచిన ఎందరో కళాకారులు, దర్శకులు సాంకేతిక నిపుణుల జీవిత విశేషాలు, అనుభవాలు నేటితరానికి చెరగని జ్ఞాపకాలుగా అందిస్తున్న ‘సరయు శేఖర్’ కృషి అభినందనీయం. వెనె్నల పాఠకులకు చక్కని శీర్షికలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
-ఉప్పు సత్యనారాయణ, తెనాలి
ఆలోచించండి
ఈమధ్య నటుడు, దర్శకుడు దిలీప్‌కుమార్ సల్వాది తనే దర్శకత్వం వహిస్తూ తీసిన చిత్రం ‘దిక్సూచి’ చిత్రం విడుదలకు ఇబ్బందిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అరవై థియేటర్లు దొరికితే, తెలంగాణాలో మూడు థియేటర్లలో మాత్రమే విడుదలైంది. చెప్పేదేమంటే గతంలో దాసరి నారాయణరావు చిన్న చిత్రాలకు మధ్యాహ్న సమయం కేటాయించి, మధ్యాహ్నపు ఆటలుగా విడుదల చేయించేవారు. మంచి టాక్ వచ్చిన చిత్రాలు గోన విజయరత్నం ‘తల్లిదీవెన’ మధ్యాహ్నం ఆటగానే రెండువందల రోజులు పైగా ప్రదర్శింపబడింది. అలా ఇప్పుడుకూడా మధ్యాహ్న సమయాన్ని చిన్న హీరోలు లేదా బడ్జెట్ చిత్రాలకు కేటాయిస్తే వారికి సహాయం చేసినవారవుతారు. నిర్మాత, దర్శకులు తమ చిత్రాలు విడుదల చేసుకొనే అవకాశం వుంటుంది. చిత్రసీమ పెద్దలు ఆలోచించాలి.
-టి.సదా, తిరుపతి
వినోదానికే సినిమా
‘ఏవీ చైతన్య ఊపిరులు?’ వ్యాసం బావుంది. సమాజాన్ని చైతన్యపర్చేవి, ఉపయోగపడేవి అయిన చిత్రాలు రావాలని రచయిత ఆకాంక్ష సరైనదే. కాని ప్రజలు కోరుకునేవి కాస్తంత వినోదం, రెండు గంటల కాలక్షేపం మాత్రమే. కథలు కాస్తంత ఆలోచింపజేస్తే చాలు. నిజానికి సినిమాలు చూడటం, నవలలు చదవటంవల్ల సమాజం మారిపోదు. స్వాతంత్య్రోద్యమ దేశభక్తి సినిమా చూసి కాసేపు బ్రిటిష్‌వారిని తిట్టుకున్నా ఇంటికి వెళ్లాక బ్రిటిష్, అమెరికా సంస్కృతికి మానసిక బానిసలుగానే వ్యవహరిస్తున్నారు. మాలపిల్ల సినిమా చూసిన కాసేపు ప్రభావితమైనా కులవ్యవస్థ చెక్కు చెదరలేదు. ఎన్నికలు కుల పునాదుల మీదనే జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో సినిమా ప్రయోజనం వినోదం మాత్రమే. సంఘ సంస్కరణ కానే కాదు.
-చంపక్, మాధవనగర్
మరికొన్ని..
‘వెనె్నల’కు తలమానికంలాంటి మాణిక్యేశ్వరి ఫ్లాష్‌బ్యాక్‌లో ‘ఇల్లరికం’ చిత్రంలో ఎన్నో ముచ్చట్లు చెప్పారు. బాగుంది. నేను మరో మూడు ముచ్చట్లు జోడిస్తాను. హీరోయిన్‌ని టీజ్ చేసే ‘నిలువవే వాలు కనులదానా’ పాట నాగేశ్వర్రావుకి నచ్చలేదట. తొలగించమన్నారట. కాని ఆయన భార్య అన్నపూర్ణకు బాగా నచ్చటంతో పాటను ఉంచారు. సూపర్‌హిట్ అయిందాపాట. ‘చేతులు కలిసిన చప్పట్లు’ పాటలో ‘కొత్త కుండలో నీరు తియ్యన’ అన్న పదబంధంలో బూతు ఉందని కొందరు రచ్చచేసినా ఆ పాట హిట్. హిందీ ఇల్లరికంలో హీరో రాజేంద్రకుమార్. వ్యాసంలో పొరబాటున రాజేంద్రప్రసాద్ అని వచ్చినట్టుంది.
-శాండీ, కాకినాడ