మీ వ్యూస్

మహేశ్ సూపర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిట్టా ఫట్టా అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే మహేష్ మహర్షిలోని కొన్ని సన్నివేశాలు ఫీల్‌ను అందించాయ. క్లాస్‌మేట్స్ అల్లరి నరేష్, పూజాహెగ్డేలతో మహేష్ చేసిన అల్లరి చూస్తే కాలేజిలో ఉన్నామా? అన్న భావన కలిగింది. డబ్బు సంపాదించిన మహర్షి తన చిన్ననాటి స్నేహితులను కలవడానికి అవకాశంకోసం చూస్తుంటే తన తండ్రి ప్రకాష్‌రాజ్ మరణంపై వైజాగ్‌కు రావడం, తన క్లాస్‌మేట్ రవి (అల్లని నరేష్), తన స్నేహితురాలు పూజాహెగ్డేలు కలవడం, మిత్రుడు రవి గ్రామం కోసం రామవరం నిరసన దీక్షకు పూనుకోవడంపై లక్షల కోట్ల సంపాదన ఉన్నా తనకు దగ్గరైనవారు లేరన్న ఫీలింగ్ పోగొట్టుకోడానికి రామవరానికి వచ్చి అల్లరి నరేష్ ఆశయం సాధించే దిశగా ప్రిన్స్ మహేష్ చూపిన నటన చూస్తే సరిలేరు నీకెవ్వరు అనాల్సిందే. మొత్తానికి ఈ చిత్రం మహేష్‌బాబు కోసమే అన్నట్టు దర్శకుడు వంశీ ముందే ప్లాన్ చేసుకుని ఉంటాడు. అలాగే హిట్టిచ్చాడు. ఏమంటారు?
-కెవి శ్రీనివాసు,
బెల్లంపల్లి
ఆ ఫైట్లేంటి?
ఒకప్పుడు ఎన్టీరామారావు, కాంతారావు, రాజనాల స్టంట్ మాస్టర్లతో సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో కత్తియుద్ధం, ముష్టియుద్ధం చేస్తూ వుంటే సమవుజ్జీలు అనిపించేది. కథానాయకుడు గెలిచాడంటే అది నిజంగా నమ్మాలన్నట్టే ఉండేది. కానీ నేడు కుర్ర హీరోలు స్మార్ట్‌గా, స్మూత్‌గా కనిపిస్తూ కొండల్ని పిండిచేయగలిగినట్టు కనిపించే విలన్లను ఎడమచేత్తో ఎత్తి అవతల పారవేయడం చూస్తుంటే విడ్డూరం అనిపిస్తుంది. అబద్ధం ఆడినా అతికినట్టు వుండాంటారు. అదేవిధంగా కృష్ణ, నెల్లూరు కాంతారావుతో ఫైట్ చేస్తుంటే చిట్టెలుక సింహాన్ని ఎదుర్కొన్నట్టు వుండేది కదా? మరిప్పుడు ప్రేక్షకులు ఎలా చూస్తున్నారని వింత కలుగుతుంది.
-కెవి ప్రసాదరావు, కందుకూరు
నాగ్.. తగునా?
ఈమధ్య సీక్వెల్స్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి. నాగార్జున మన్మథుడు-2 అంటూ అసలు మన్మథుడుకి సీక్వెల్ ప్రారంభించారు. అరవై దాటిన ఆయన మన్మథుడేమిటి? కాంబినేషన్‌గా ముప్పైలోపు హీరోయిన్లు. ఎంత మేకప్ చేసినా, ఫిట్ బాడీవున్నా ఫిజికల్‌లో ఫ్రెష్‌నెస్ ఏంవుంటుంది. ఎలా వస్తుంది? ఆ కథపై అంతగా మోజుంటే అఖిల్‌తో ట్రైచెయ్యొచ్చుకదా! అగ్ర హీరోగా ఇవి కాదు చేయాల్సింది. తెరపై గ్రాఫిక్స్, జిమిక్స్ మానుకొని కథపై కమాండ్ సంపాదించి ప్రేక్షకులకు నచ్చేవిధంగా సీక్వెల్స్ చేస్తే అవి ఛాలెంజ్‌గా ఉంటాయి. చేయాలంటే సత్తా చూపించుకునే చిత్రాలు చాలావున్నాయి. మంచి కథతో వయసుకు తగ్గ మంచి హూందా కలిగిన పాత్రల్ని చేస్తే ఓ గౌరవం ఉంటుంది.
-పి.లక్ష్మీసుజాత, అద్దంకి
సేదతీర్చిన మజిలీ
వరుస అపజయాలతో సతమతమవుతున్న నాగచైతన్యకు ‘మజిలీ’ కాస్త రిలీఫ్ నిచ్చిందనే అనుకోవచ్చు. సినిమా కథ పాతదే అయినా తీసుకున్న సన్నివేశాలూ, రాసుకున్న సంభాషణలూ, నటీనటుల ప్రతిభతో దర్శకుడు శివ నిర్వాణ చాకచక్యంగా సినిమాని గట్టెక్కించాడు. సమంత అయితే తన నటనతో సినిమాకి జీవంపోసింది. నాగచైతన్య రొటీన్‌కు భిన్నంగా వుండి తాగుడుకు బానిసైన విఫల ప్రేమికుడి పాత్రలో చక్కగా నటించాడు. సినిమా మొత్తంగా చూస్తే ఫ్యామిలీ మజిలీలా వుంది.
-వి నవచరణ్‌రాయుడు, గొల్లలవలస
చేజేతులారా..
‘ఎన్టీఆర్ మెచ్చిన అందగాడు’ లేఖ చదివాక- నిజమే ఆరడుగుల అందగాడు హరనాథ్ ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు రేపాడు. ఆ రోజుల్లో హరనాథ్, జమున హిట్‌పెయిర్. వారిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న వదంతులూ వచ్చాయి అప్పట్లో. అయితే ధనం, కీర్తి అనే ప్రియమైన శత్రువుల బారిన పడిన హరనాథ్ మద్యం, మగువలకు అలవాటుపడి కెరీర్‌తోపాటు జీవితాన్ని నాశనం చేసుకున్నారు. రామకృష్ణ కూడా అంతే. ఉదయ్‌కిరణ్ అగ్రనటుని కూతురు ప్రేమలోపడి నాశనమైనట్టు వార్తలు విన్నాం. చిత్రసీమలాంటి అందాల మెరమెచ్చుల ప్రపంచంలో ఎంతో జాగ్రత్తగా మసలాలి. లేకుంటే నాశనమే.
-గునే్నశ్, కొవ్వాడ
నిజమే కానీ..
‘సినిమా దారెటు?’ అని వెనె్నల ప్రశ్నించిన కురవ శ్రీనివాసులు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. కాని సెన్సార్ చేయగలిగిందేమీలేదు. కొన్ని కట్స్ సూచించిన సెన్సార్ అధికారిణిమీద రంకెలేసి రివిజన్ కమిటీలో కట్స్‌లేకుండా సర్ట్ఫికేట్ సంపాదించిన ఒక ‘బాబు’ కథ తెలిసిందే. బ్రాహ్మణులను కించపర్చే సన్నివేశాలున్నాయి, వాటిని తొలగించాలంటూ కోర్టుకెళ్తే సినిమా రన్ పూర్తి చేసుకొని డబ్బాలు వెళ్లిపోయాక రెండు సీన్లు కట్ చేయమని కోర్టు తీర్పునిచ్చింది. అధికారులవల్ల, కోర్టులవల్ల జరిగేదేమీ ఉండదు. ఆ దర్శకుడు, నిర్మాతల సినిమాలు చూడకుండా ఆడియనే్స గట్టి నిర్ణయం తీసుకోవాలి. అది సాధ్యమేనా?
-జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్
సిల్వర్‌జూబ్లీ మహర్షి
మహేష్‌బాబు 25వ చిత్రంగా వచ్చిన ‘మహర్షి’తో మంచి మెసేజ్ ఇవ్వగలిగాడు. దేశంలో పారిశ్రామికవేత్తలు రాజకీయ పలుకుబడితో గ్రామాల్లో ఎలాంటి అశాంతి కలిగిస్తున్నారన్న అంశాన్ని రామవరం బ్యాక్‌డ్రాప్‌లో చూపించటం బావుంది. తన క్లాస్‌మెట్ అల్లరి నరేష్ కోసం రామవరం వచ్చి ఊరును రక్షించే శ్రీమంతుడిగా మహేష్ 25వ చిత్రం మంచి ఫలితం రాబట్టింది. సినిమాను 100 కోట్లతో నిర్మించిన నిర్మాత త్రయానికి, మహేష్‌బాబు షెడ్యూల్ కోసం రెండేళ్లు ఎదురుచూసిన పైడిపల్లి వంశీకి ఈ సినిమాతో మంచి ఫలితం అందినట్టే. కాకపోతే హీరోయిన్ పూజాహెగ్డే పాటలకే పరిమితమైంది. అల్లరి నరేష్ పోషించిన రవి పాత్ర సినిమాకే హైలెట్. స్టార్ హీరోలు కమర్షియాలిటీతోపాటు ఇలాంటి బాధ్యతాయుతమైన సినిమాలు చేయాలి.
-కె.అమన్‌రాజీవ్, శంషాబాద్