మీ వ్యూస్

వచ్చార్రా బుజ్జీలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలస పక్షుల్లా ఎక్కడెక్కడి నుంచో హీరోయిన్లు తెలుగు తెరకు ఎగిరెగిరి రావడమేగానీ, ప్రతిభను పెకెగరేస్తున్న హీరోయిన్ ఒక్కరూ కనిపించడం లేదు. లక్షలకు లక్షలు పారితోషికం తీసుకుంటూ -షోకేస్‌లో బొమ్మల్లా అందాలు గుమ్మరిస్తున్నారు గానీ, నటించే సత్తావున్న వాళ్లేరీ? అంటూ నిన్నమొన్నటి వరకూ మీడియాలో వచ్చిన కథనాలకు ఇప్పుడొస్తున్న హీరోయిన్లు సరైన సమాధానమే చెబుతున్నారు. మరీ పైకెత్తేయడం కాదుగానీ, క్యారెక్టర్‌కు సరైన ఔచిత్యాన్ని ఆపాదిస్తే కచ్చితంగా గ్రాఫ్‌కు తగినట్టు నటించగలిగే సత్తావున్న హీరోయిన్లు తెలుగు తెరపై కనిపిస్తున్నారు. ఇప్పటికే అనుభవం సంపాదించుకున్న తారలను పక్కనపెడితే -కొత్తగా వచ్చేవాళ్లలో కీర్తిసురేష్, నివేదా థామస్‌లాంటి హీరోయిన్లు సరైన అవకాశాలు అందితే టాప్‌రేంజ్‌కు సత్తా చూపించడం ఖాయం.
ఆర్‌వి మధు, ముదినేపల్లి
ఓవరాక్షన్ చేస్తే..
అన్నీ వడ్డించిన విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీలేనిది ఎగిరెగిరి పడుతుందని -సామెత. కబాలి సినిమా విషయంలో ఈ సామెత మరొక్కసారి రుజువైంది. కబాలి సినిమాకి ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. ప్రసార మాధ్యమాలలో సినిమా గురించి నెలల తరబడి హోరెత్తించారు. టీజర్లు చూసినవారు భారతీయలు చిరస్థాయిగా గుర్తుంచుకునే సినిమాగా అభివర్ణించారు. కాని సినిమా కాస్త తుస్సుమనడంతో ప్రేక్షకులు ఉస్సూరుమన్నారు. విలక్షణమైన గెటప్‌తో డాన్ పాత్రలో రజనీకాంత్ క్యారెక్టరైజేషన్ ఒక్కటే సినిమాకు ప్లస్ పాయింట్. మొదటి పది నిమిషాలు, రజనీ ఎంట్రన్స్ ఫైట్ హాలీవుడ్ సినిమా స్థాయిలో వుంది. ఇక అక్కడనుండి ముగింపుదాకా ప్రేక్షకులకు దర్శకుడు ప్రత్యక్ష నరకం చూపించాడు. పవర్‌ఫుల్ కథకు నీరసమైన కథనాన్ని జోడించి టార్చర్ చేశాడు. ఫైట్స్, పాటలు, ఎమోషన్స్, కామెడీ అన్నీ నీరుగారిపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ తప్పితే ఈ సినిమాకు ప్లస్‌పాయింట్లు ఏమీలేవు. దినేష్ ఓవర్ యాక్షన్ తట్టుకోలేం. హీరో మెగా ఇమేజ్‌ను ప్రెజెంట్ చేయడంలో దర్శకుడికి ఎంతో స్టామినా కావాలి! అది లోపించినందునే కబాలి ఢమాల్ మంది.
-సి సాయిమనస్విత, విజయవాడ
కృష్ణ స్టిల్ బావుంది
వెనె్నల శరత్కాలంలో సూపర్ స్టార్ కృష్ణ తొలి మేకప్ స్టిల్ కనువిందు చేసింది. బుర్రిపాలెంలో పుట్టిన కృష్ణ చిన్నతనంలోనే ‘పాతాళభైరవి’ చిత్రంకోసం బుర్రిపాలెం నుండి తెనాలికి సైకిల్‌పై వచ్చి అనేకసార్లు ఆ చిత్రం చూసి ఎన్టీఆర్ అభిమానిగా మారినట్టు ఎక్కడో ఎప్పుడో చదివాం. అలాంటి కృష్ణ -ఎన్టీఆర్‌కు సరిసాటిగా సినిమాల చేసిన స్థాయికి ఎదగడం గొప్ప విషయం. స్వయంకృషితో సూపర్‌స్టార్‌గా మారి స్టూడియో అధినేతగా, నిర్మాతగా, నటుడిగా అగ్ర నటుల సరసన కృష్ణ నిలబడటం అపూర్వమైన విషయంగానే భావించాలి.
- ఉప్పు సత్యనారాయణ, తెనాలి
కనెక్టయితేనే..
‘కనెక్ట్’ అయితేనే వ్యాసం బాగా కనెక్టయ్యింది. చిత్ర విజయానికి కథ ఎంత ముఖ్యమో, కథనం అంతకంటే ముఖ్యం. బాహుబలి రొటీన్ జానపద కథే అయినా ఫొటోగ్రఫీ ప్రేక్షకుల్ని మైమరపించింది. అనార్కలి కథ తెలిసిందే మొఘల్-ఎ-ఆజామ్ సూపర్‌హిట్ అయితే బీనారాయ్, ప్రదీప్‌కుమార్ నటించిన అనార్కలి హిట్ అయిందిగాని సూపర్ కాదు. అక్కినేని అంజలి నటించిన అనార్కలి హిట్ అయితే, ఎన్టీఆర్ తీసినది ప్రజల్లోకి వెళ్లలేదు. మంచి కథవున్న బాటసారి కొందర్నే మెప్పిస్తే కథంటూ ఏమీలేని అనేక చిత్రాలు హిట్టవ్వడం చూస్తున్నాం. ఏదైనా ప్రజల మనస్సులోకి ఎక్కేలా తీయాలంటే -సినిమాను కనెక్ట్ చేయాలి.
-ప్రసాద్, గొడారిగుంట
తెరమరుగు
తెలుగు చిత్రసీమలో హాస్యనటులు ఎందరో తెరమరుగవుతున్నారు. కొత్తవారు రాణించలేని పరిస్థితి. తనకంటూ ప్రత్యేకతను చూపిస్తూ మంచి హాస్యాన్ని పండిస్తున్న తరుణంలో సునీల్ కథానాయకుడిగా రంగప్రవేశం చేయడం, తాను నటించిన చిత్రాలు పరాజయాల పాలవుతూ అభిమానులకు దూరమవుతున్నాడు. జక్కన్న కూడా విజయం సాధించలేదు. ఇకనైనా సునీల్ మళ్లీ హాస్య పాత్రలో ప్రవేశించి అభిమానులను అలరిస్తాడని ఆశిస్తున్నాం. సహజ హాస్య నటుడు మళ్లీ తన నటనతో అలరించాలని ఆశిస్తున్నాం.
-ఎం ఆనందరావు, వేగివారిపాలెం
అవసరమా?
ఫిల్మ్ జర్నలిస్టులు తారల్ని అడిగే ముఖ్యమైన ప్రశ్న మీ పెళ్లెప్పుడు? అని. సిల్లీ క్వొశ్చన్. వాళ్లు అంతకంటే ముదుర్లు. అందుకే -అప్పుడే పెళ్లికేం తొందర అని ముసిముసి నవ్వులు నవ్వుతుంటారు, అప్పుడే పుట్టిన పాపాయిల్లాగ. ఆ నవ్వులకు అర్ధం చాలామందికి తెలుసు! ఎందుకంటే అలా నవ్విన తారలు చాలామంది బహిరంగంగానో గుప్తంగానో సహజీవనం చేస్తున్నవారే. డబ్బులు వస్తున్నంత కాలం ఏ హీరోయినూ పెళ్లి చేసుకోదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఒకటి రెండేళ్లలో విడాకులు తీసుకొని మళ్లీ పరిశ్రమకు వచ్చేస్తున్న ఉదాహరణలే ఎక్కువ. తాజా ఎగ్జాంపుల్ అమలాపాల్! అందువల్ల ఫిల్మ్ జర్నలిస్టులు తారల పెళ్లి ప్రస్తావన తీసుకురావడం అనవసరం. అది వాళ్ల వ్యక్తిగతానికి వదిలేయడమే బెటర్, ఏమంటారు?
-సాహిత్యదీప్తి, రమణయ్యపేట
మాతృక అది కాదు
‘మై చుప్ రహూంగీ’ (రహోంగే- కాదు) చిత్రం మూగనోము చిత్రానికి మాతృక అనడం సరికాదు. ఈ రెండు చిత్రాలకు ఒక తమిళ చిత్రం (కళత్తూర్ కన్నమ్మ అనుకుంటాను) ఆధారం. దాన్ని తెలుగులోకి ‘మా ఊరు అమ్మాయి’ పేరిట డబ్బింగ్ చేశారు. దానిలో కమల్‌హాసన్ బాల నటుడుగా గొప్పగా నటించాడు. నిజానికి అక్కినేని మూగనోములో నటించడానికి ఒక కథ ఉంది. ఎవియం వారి సదారమ చిత్రంలో కొంత నటించాక, ఆ పాత్ర నచ్చక తప్పుకున్న అక్కినేని వారి మరో చిత్రంలో నటిస్తానని మాటిచ్చి మూగనోములో నటించాడు. ఈ పాత్ర కూడా ఆయనకు నచ్చకపోయినా, మాటిచ్చినందుకు ఆ చిత్రంలో చేయక తప్పలేదు.
-చంద్ర, కాకినాడ