మీ వ్యూస్

సీత నచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ నటించిన -సీత.. ప్రస్తుత మానవత్వ సంబంధాల పరిస్థితిని తేటతెల్లం చేసింది. డబ్బు పిచ్చిపట్టి విలన్‌గా ప్రవర్తించే పాత్రలో కాజల్ నటన బావుంది. ఆ పిచ్చిలో పడి.. అవసరమైతే సహజీవనానికి తెగబడటం, అందుకు అగ్రిమెంట్ రాసుకోవడం లాంటి సన్నివేశాలు వాస్తవ పరిస్థితిని తేటతెల్లం చేశాయి. సీతను టార్చర్‌పెట్టే పాత్రలో బసవరాజుగా సోనుసూద్ అద్భుతంగా చేశాడు. మరోపక్క మూగగా ప్రేమించే బావ (శ్రీనివాస్)ను అవసరానికి వాడుకునేలాంటి సీతలు ఎందురు లేరు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో -నా రామ్ బ్రతకాలి, నాకు కావాలి, డబ్బు వద్దు.. నా బంగారం నాక్కావాలి’ అంటూ కాజల్ చూపించిన ఎమోషన్ నచ్చింది. టోటల్‌గా డబ్బు ముఖ్యమని భావించేవారికి, డబ్బు కాదు మనిషులు ముఖ్యమని చెప్పే చిత్రం అనిపించింది.
-కె శ్రీనివాస్, హైదరాబాద్
బలం లేదు..
ఇటీవల విడుదలైన ‘మహర్షి’ చిత్రం అట్టహాసంగా పబ్లిసిటీ, గొప్పగా అన్వయించడం వినా.. అంతస్థాయికి చేరలేదన్నది అసలు ప్రేక్షకుల అభిప్రాయం. సినిమా విజయం సాధించిందని చెప్పుకుంటే చెప్పుకోవచ్చుగాక, రైతు పాత్రలో మాత్రం మహేష్‌ను మనసుకు హత్తుకోలేకపోయారు. రైతు అభివృద్ధికి పాటుపడే సన్నివేశాల అంచనా తలకిందులైంది తప్ప, సహజత్వం లేదు. ప్రబోధం పిల్లచేష్టగా అనిపించిందే తప్ప, జీవం లేదన్న మాట వినిపిస్తోంది. పబ్లిసిటీ హంగామాతో సినిమాను కోట్లకు కోట్లు పడగలెత్తించారు కానీ, పదికాలాల పాటు మనసులో దాచుకునే గొప్ప చిత్రంగా మాత్రం ‘మహర్షి’ని చూడలేం.
-కేవీపీ రావు, కందుకూరు
ఆత్మలేని సందేశం
సందేశం.. సంపూర్ణబలం అన్నది ఇప్పటి సినిమాలకు వర్తించొచ్చేమోగానీ, ఆ సందేశంలో ఆత్మలేదన్నది అర్థమవుతోంది. సందేశాత్మక చిత్రమంటే -సమస్య లోతుపాతులు సంపూర్ణంగా అవగాహన చేసుకొని కథలో వాటిని బలంగా చూపించాలి. ఆ సమస్యనుంచి బయటపడుతోన్న థ్రిల్ ఆడియన్స్‌కి అందాలి. కాని -్ఠగూర్, శ్రీమంతుడు, భరత్ అనే నేనులాంటి చిత్రాలు పూర్తి కమర్షియల్. నల్లని ముఖానికి పౌడర్ అద్ది తెల్లగా చూపించే కాస్మొటిక్ ట్రీట్‌మెంట్ మాత్రమే. ఇవి కాసేపు ప్రేక్షకుల్లో ఉద్వేగం కలిగిస్తాయి. ఠాగూర్ చూసి అవినీతి నిరోధక సంఘాలు, శ్రీమంతుడు చూశాక గ్రామదత్తత అంటూ హడావుడి మనం చూడంది కాదు. నెలరోజుల తరువాత చర్చే లేదు. ఆదర్శ చిత్రాలుగా వాటిని ఎలా పరిగణిస్తాం.
-ఎస్ చంద్రిక, సామర్లకోట
సెంటిమెంట్ ఉంటేనే..
సందేశం.. సంపూర్ణబలం అన్న వెనె్నల కవర్ కథనం బావుందిగానీ, సినిమాల్లో ఆదర్శాలు -తాజా ట్రెండ్ అయితే కాదు. ఎప్పటినుంచో ఉన్నదే. అయితే ఆ ఆదర్శాలు ప్రజల సెంటిమెంట్‌ని బలపర్చేలా ఉండాలి. అప్పుడే సినిమా హిట్. ఉమ్మడి కుటుంబాల్లోని సమస్యలు చూపి విడిపోటమే మంచిదన్న ఆదర్శాన్ని ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో చూపించారు, కాని ఆ సినిమా హిట్ కాలేదు. కాని ఎన్టీఆర్ ‘ఉమ్మడి కుటుంబం’ హిట్టయ్యింది. దానికి కారణం సెంటిమెంటే. ఆర్ నారాయణమూర్తి తను నమ్మిన ఆదర్శాలు చొప్పించి ఎన్ని సినిమాలు తీసినా అవన్నీ ఒకేలాగ అనిపించి హిట్ కాలేదు. సెంటిమెంట్‌ను సమర్ధవంతంగా ఉపయోగించుకుంటేనే హిట్లు వస్తాయి.
-్భస్కర్, అశోక్‌నగర్
గోల్డెన్ హ్యాండ్
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా పరిచయమైన దర్శకులు కె ప్రత్యగాత్మకు ఒక విశిష్టత ఉంది. అదేమంటే ఈయన పరిచయం చేసిన నటీనటులంతా తారాస్థాయికి చేరినవారే. కృష్ణ, కృష్ణంరాజులను ‘కులగోత్రాలు’ చిత్రంలో చూపించి మంచి స్టార్‌డమ్ ఇచ్చారు. కృష్ణ సూపర్‌స్టార్ అయితే, కృష్ణంరాజు రెబెల్ స్టార్ అయ్యాడు. రమాప్రభను పరిచయం చేసి గొప్ప భవిష్యత్ ఇచ్చారు. ఇక జయలలిత అయితే స్టార్‌డమ్ మీదే ‘ముఖ్యమంత్రి’ అయ్యారంటే అతిశయోక్తి కాదు. త్యాగరాజు మంచి విలనయ్యాడు. రాజ్‌బాబు తమ్ముడిని పరిచయం చేసిందీ -ప్రత్యగాత్మే. దర్శకుడిగా ఆయన హస్తవాసి అలాంటిది.
-టి.సదా, తిరుపతి
కలగలుపే..
ఇప్పుడు ఏ సినిమా చూసినా -ఎన్నో పాత సినిమా సన్నివేశాలు జ్ఞాపకమొచ్చి ప్రాణం ఉసూరుమంటుంది. చివరకు అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్న మహేశ్ ‘మహర్షి’ సైతం శ్రీమంతుడు, భరత్ అనే నేనులాంటి సినిమాల కలగలుపే. అయితే అలాద్దీన్ అద్భుత దీపం కథ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో (తెలుగులో కూడా వచ్చి ఫ్లాప్ అయింది) ఎందరో ఎన్నోసార్లు చూసేసిన సినిమాని డిస్నీ కంపెనీ తాజాగా రీమేక్ చేసి హిట్‌కొట్టింది. తెలిసిన కథనే సరికొత్తగా ఆసక్తికరంగా టెంపో చెడకుండా గొప్పగా తీశాడు దర్శకుడు గైరిట్చీ. సృజనాత్మకత అంటే అదీ!
-అయోధ్యరామ్, పెద్దాపురం
నచ్చేశాడు హిప్పీ
హిప్పి యువతను ఆకర్షించే చిత్రమే. హీరో కార్తికేయ హుషారుగా అలరించాడు. వెనె్నల కిశోర్ కామెడీ బావుంది. జేడీ పాత్ర కథకు పెద్ద దిక్కు. హుందాగా నటించాడు. ఇక చిత్రంలో ప్రత్యేక ఆకర్షణ హీరోయిన్ ఆముక్తమాల్యద. కొత్త హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ సెక్సీ గెటప్స్‌లో యువతకు కిక్ ఇచ్చింది. అలాగే, సన్నివేశాల్లో చక్కని హావభావాలతో లీనమైంది. దర్శకుడు టి.ఎన్.కృష్ణ చిత్ర కథనాన్ని నూతన పంథాలో చెప్పడానికి ప్రయత్నం చేశాడు.
మొదట్లో పాత్రలను హద్దులు దాటించేలా చేసినా క్లైమాక్స్ కథనంలో సంప్రదాయ విలువల్ని గొప్పవనేలా సృజించారు. ఎంత విచ్చలవిడితనం ఉన్నా హృదయాల్ని కదిలించే తాకే చూపులు, భావనల ప్రేమ అని హీరోయిన్ వాదన. ఎవరితో తిరిగినా తొలి చూపులోనే కలిగేది ప్రేమ అని కొత్త అర్థం చెప్పే ప్రయత్నం. ఆఖరులో కొంత విసుగు లేకపోలేదు. ఉన్న రెండు గీతాలు మామూలే. పోస్టర్స్‌లో రెచ్చిపోయిన హీరోయిన్స్ అందాలను చూచి యువత వెర్రిగా థియేటర్లకు వచ్చేస్తారు. కానీ, కంటెంట్‌పరంగా యూత్‌కు బాగా నచ్చుతుంది.
-పీవీఎస్‌పి రావు, అద్దంకి