మీ వ్యూస్

ఏం సినిమా ఇది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూత్ సినిమా అంటే బూతు సినిమా అని, అసలు వలువలకు విలువలేదని తెలియజెప్పే ప్రయత్నం చేసింది ఆమధ్య వచ్చిన ‘హిప్పీ’. సినిమా ఆసాంతం తలాతోకా లేకుండా, అసలు చెప్పాలంటే కథని గాలికి వదిలేసి ముద్దులు, బూతు డైలాగులు, వళ్ళు చూపించడం లాంటివి వుంటే సినిమా పాసయి పోతుందన్న ధీమాతో యూత్‌పైకి ఈ వి(వ)లువల్లేని సినిమాని వదిలారు. అసలు ‘హిప్పీ’ద్వారా ఏం చెప్పాలనుకున్నారో సినిమా తీసినోళ్లకే అర్థమై ఉండదు. ఏదో ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా హిట్టయ్యందన్న హ్యాంగోవర్‌లో హీరో కార్తికేయతో ఇలాంటి కళాఖండాన్ని తీసి వదిలేస్తే యూత్ కనెక్ట్ అవుతారులే అనుకుంటే ఎలా? కుర్రాళ్ళు అంటే ‘హిప్పీ’ లానే ఉండాలి. అలాగే ప్రవర్తించాలి అనే ‘పిచ్చి’ ప్రయత్నం చేశారు ఈ సినిమాలో. నిజం చెప్పాలంటే ఒక ‘విలువ’లేని సినిమా ఇది.
-విసిహెచ్ రాయుడు, గొల్లలవలస
కొంచెం చోటివ్వండి
చూడముచ్చటైన సినిమా వెనె్నల కోసం పాఠకులు ఎదరు చూస్తుండటం ఇప్పటిదే కాదు. నిఖార్సైన సినిమా సమీక్షలు, వైవిధ్యమైన కథనాలు, ఆసక్తికలిగించే సినిమా కబుర్లు, సినిమా క్విజ్‌లను వారం వారం పాఠకులకు అందిస్తోన్న ఆంధ్రభూమి సంపాదక వర్గానికి నిజంగా అభినందనలు. పత్రికలో పాఠక లోకానికి ఒకింత చోటిచ్చి, వాళ్ల అభిప్రాయాలను యథాతథంగా అచ్చేసే పత్రిక కూడా ప్రస్తుతం మార్కెట్లో ఒక్క వెనె్నల మాత్రమే కనిపిస్తోంది. అలాంటిది ఇటీవలి కాలంలో మీరు కూడా పాఠకులకు కేటాయించిన చోటుని వెనక్కి తీసేసుకుంటున్నారా? అనిపిస్తోంది. సినిమా సంగతులు, పాటల ముచ్చట్లు, మరిన్ని కబుర్లు చెప్పుకోడానికి పాఠకుల కోసం ఇంకొంచెం ఎక్కువ స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే, ఆసక్తిని కలిగించే కొన్ని కొత్త శీర్షికలు మొదలుపెడితే బావుంటుందని మనవి.
-కెవి జ్ఞానేశ్వర్, మొగల్తూరు
చెప్తే బావుండేది
‘వెనె్నల’ అనుబంధంలో ఎన్టీఆర్, సావిత్రి నటించిన ‘విచిత్ర కుటుంబం’ మరియు కృష్ణ నటించిన ‘ఆస్తులు అంతస్తులు’ చిత్రాల గురించి రచయిత్రి మాణిక్యేశ్వరి చక్కగా రాశారు. కాని ‘విచిత్ర కుటుంబం’ తమిళ మాతృక ‘ఉయిరా? మానమా?’, ‘ఆస్తులు అంతస్తులు’ చిత్రం తమిళ మాతృక ‘పణమా-పాశమా’? అన్న విషయాలు పేర్కొనక పోవడం ఒకింత అసంతృప్తి కలిగించింది. ఫ్లాష్‌బ్యాక్ శీర్షికన చక్కని వ్యాసాలు, సినిమా సంగతులు అందిస్తోన్న రచయిత్రికి అభినందనలు తెలుపుతూనే, సినిమాకు సంబంధించి ముందు వెనుకలు, పూర్తి సమాచారాన్ని పాఠకులకు అందిస్తే బావుంటుందని ఆశిస్తున్నాం.
-ఎన్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
బ్రోచేవారికి నచ్చింది
బ్రోచేవారెవరురా!? చిత్రం ఆద్యంతం వినోదభరితంగా అనిపించింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ మంచి స్క్రీన్ ప్లే పట్టుతో చిత్ర కథనాన్ని విసుగు లేకుండా వినోదాత్మకంగా నడిపించాడు. కథనంలో లాజిక్‌లు వెతుక్కుంటూ వినోదాన్ని ఎంజాయ్ చేయడమే చిత్ర ప్రధాన లక్ష్యం. చిత్రాన్ని దర్శకుడు ఎంత క్లారిటీతో కథనాన్ని నడిపించాడో తారాగణమంతా అదే క్లారిటీతో పాత్రల్లో లీనమై కనిపించారు. శ్రీవిష్ణు, ప్రియదర్శిని, రాహుల్ రామకృష్ణ, నివేదా థామస్, నివేదా పేతురాజ్, సత్యదేవ్ ప్రధాన పాత్రధారులుగా శక్తిమేర నటించారు. నివేదా థామస్ వౌనమైన అల్లరి, చక్కని హావభావాలతో మంచి నటనను ప్రదర్శించింది. ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సింపుల్ బ్యాగ్రౌండ్ స్కోరు అందించారు. వీటన్నిటికి తోడు తేలికైన మాటలు, చిన్న చిన్న పంచ్‌లతో సంభాషణలు ఆకట్టుకున్నాయి. సమాంతరమైన మూడు కథనాల్ని క్లైమాక్స్ వరకు నడిపించి ఒకటిగా లింక్ చేసిన తీరు బాగుంటది. వెనె్నల తరఫున మూడు స్టార్లు ఇవ్వతగ్గ చిత్రమిది. ఈ చిత్రాన్ని బ్రోచేది ప్రేక్షకులే?
-పీవీఎస్‌పి రావు, అద్దంకి