మీ వ్యూస్

అదీ విషయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మణికర్ణిక’ నుంచి క్రిష్ తప్పుకునేలా అవమానించిన కంగన, ఇప్పుడు ‘మెంటల్ హై క్యా?’ తెలుగు దర్శకుడు కోవెలమూడి ప్రకాశ్‌నీ అవమానిస్తోందని, అందుకే సినిమా విడుదల ఆలస్యమవుతోందని గగ్గోలు పెట్టిందొక పత్రిక. అయతే, మానసిక వికలాంగులను మెంటల్ అనడం తగదంటూ సైకియాట్రిస్టుల సంఘం కోర్టుకు వెళ్తామని నిర్మాతలను హెచ్చరించింది. ఈమధ్యనే సెన్సార్ బోర్డు కూడా చిత్రాల్లో మెంటల్ అనే పదం వాడరాదని చెప్పింది. బెదిరింపులు, కేసులూ అనడంతో చిత్రం విడుదల ఆలస్యమైంది. జడ్జిమెంటల్ హై క్యా? అని పేరుమార్చి టీజర్ విడుదల చేశారు- అని కంగనా వివరించగా, ఆమెనుంచి తనకేమీ సమస్యలు ఎదురుకాలేదని దర్శకుడు ప్రకాశ్ చెప్పాడు. అసలు విషయం తెలుసుకోకుండా తెలుగు పత్రిక కంగనామీద విరుచుకుపడింది!
-శుభ, కాకినాడ
దిగ్బ్రాంతికరమే..
విజయనిర్మల హఠాన్మరణం దిగ్భ్రాంతికరమే. రెండో భార్య, సవతి తల్లిపట్ల మనవాళ్లు ఎన్నో అపోహలు, అనుమానాలతో వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు. విజయనిర్మల, కృష్ణ- ఇద్దరికీ రెండో వివాహమే. ఆమె భర్తకు, అతడు భార్యకు విడాకులిచ్చి వివాహం చేసుకున్నారు. అయినా మొదటి వివాహ సంతానానికి ఏవిధమైన ఇబ్బంది, బాధ కలగకుండా ఇద్దరూ సామరస్యంగా మెలిగారు. అది నిజంగా హర్షణీయం. సవతి తల్లి మరణానికి మహేశ్ కన్నీరు పెట్టుకొని ఆమె జ్ఞాపకార్థం ఏదో చేయాలని మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాడట. రెండో వివాహంవల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న తారలు ఎందరో ఉన్న ఈ విషయంలో విజయనిర్మల ఆదర్శప్రాయురాలే.
-మైథిలి, సర్పవరం
చిన్న విలన్లూ ..తక్కువేం కాదు
వీర విలన్లుగా నటించిన మహానటుల మధ్య చిన్న విలన్లుగా అత్యంతం సినిమాను రక్తికట్టించిన వాళ్లున్నారు. ఒకప్పటి చిత్రాల్లో జగ్గారావు, ఆనందమోహన్, భీమరాజు, సిహెచ్ కృష్ణమూర్తి, కోళ్ల సత్యం, అశోక్‌కుమార్, హరిబాబు లాంటివాళ్లను ఉదహరించొచ్చు. నేటి తరంతో పెద్ద విలన్ సరసన హాస్యంతో రక్తికట్టించే చిన్న విలన్లలో రవిబాబు, ప్రభాస్ శ్రీను, పోసాని, బాహుబలి ప్రభాకర్, కృష్ణచైతన్య, పృథ్విరాజ్, షఫిలనూ ఉదహరించొచ్చు. పాతతరం నటుడు కెవి చలం సైతం విలన్ పాత్రలు ధరించారు. ప్రతి కౌబాయ్ సినిమాల్లో విలన్స్ త్రయం ఉండేది. అందులో సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డి, త్యాగరాజు, రాందాస్, రావు గోపాలరావుతోపాటుగా ఆనందమోహన్, జగ్గారావులూ కనిపించేవారు. ఇదే త్రయంలోని కొందరు విఠలాచార్య సినిమాల్లోనూ కనిపించారు. కాకపోతే, వీళ్లను మనం ఎక్కడా గుర్తించం, గుర్తుపెట్టుకోం. నిజంగా శోచనీయం.
-ఏఆర్ రామారావు, ఖమ్మం
నచ్చే చాన్స్ తక్కువ
డెబ్భయి ఏళ్లక్రితం కీలుగుర్రం చిత్రం చూసి ఇప్పుడు వృద్ధులైన వారి హృదయాలు ఆనాటి పాటలు, సంగీతం విని ఉర్రూతలూగవచ్చు. కాని ఈనాటి యువతరం ఆనాటి చిత్రాలు చూసి నవ్వుకుంటారు. బోరింగ్ అనుకుంటారు. ఆనాటి చిత్రాలు ఇప్పుడు థియేటర్లలో విడుదల కావు. టీవీలో వస్తే వెంటనే చానల్ మార్చేస్తారు. కీలుగుర్రం, బాలరాజు, మల్లీశ్వరి, బంగారుపాప, అగ్గిరాముడులాంటి ఆనాటి ఘన చిత్రాలు ఈనాటి వృద్ధుల్ని అలరించే మధురస్మృతులు తప్ప ఈనాటి కుర్రకారుకి కాదు. వీటిని ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లలో విద్యార్థులకు చూపించడానికి తప్ప నవ ప్రేక్షకులు చూడరు.
-మరుదకాశి, కరప
ఇవీ చెప్తే బావుండేది
బహుశా స్థలాభావంవల్ల కాబోలు అందరికీ నచ్చిన ‘ముత్యాలముగ్గు’ చిత్రం గురించి కొన్ని విషయాలు చెప్పలేదు రచయిత. కోతికే నటన నేర్పిన అల్లుగారి కోతి నటన సూపర్. ఈ చిత్రంలో కొన్ని డైలాగులు చిరస్మరణీయాలు. అవి- నిత్యపెళ్లికొడుకు, డిక్కీలో తొంగోబెడతా, మడిసన్నాక కాసింత కలాపోసనుండాలి, ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదూ? లాంటి డైలాగులు సృష్టించిన ముళ్లపూడికి హ్యాట్సాఫ్. ‘ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ’ పాట రాసిన ఆరుద్రని ఆయన భార్య, అభ్యుదయ స్ర్తివాద రచయిత్రి కె రామలక్ష్మి చమత్కరించినట్టు ఎక్కడో చదివాం. నిజానికి పాట ఎంతో బావున్నా -ముఖానికి పసుపు రాసుకుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆడవాళ్లకే తెలుసు, ఆయనకేం తెలుసు? అని.
-స్నేహమాధురి, పెద్దాపురం
నిజాయతీగా..
‘మీవ్యూస్’ నిజాయితీగా బావుంటున్నాయి. ‘వెనె్నల’ సమీక్షలో పొగడిన చిత్రాల్ని కూడా విమర్శించటం కనిపిస్తోంది. ఏ పత్రికా విమర్శల్ని తట్టుకోలేక విమర్శనాత్మక లేఖల్ని ప్రచురించదు. కాని ‘మీ వ్యూస్’ తీరే వేరు. అందుకు మెచ్చుకోవాల్సిందే. వెనె్నలతో సహా చాలా పత్రికల్లో మంచి రివ్యూలు సాధించిన ‘గేమ్ ఓవర్’ని క్రేక్‌గేమ్‌గా ఒక పాఠకురాలు విమర్శించటాన్ని సమర్ధిస్తున్నాం. ఏ చిత్రంలోనైనా దర్శకుడు చెప్తున్నదేమిటో, చూపిస్తున్నదేమిటో ప్రేక్షకులకు అర్ధంకావాలి. అలా అర్ధంకాని ఎన్నో తెలుగు సైన్స్‌ఫిక్షన్‌లు ఢాం అన్నాయి. గేమ్‌ఓవర్ కూడా ఎక్కడా పెద్దగా ఆడలేదు. లోబడ్జెట్ చిత్రం కాబట్టి కొద్దిగా లాభంవచ్చి ఉంటుంది. అంతేగాని హిట్ కాలేదు.
-శాండీ, కాకినాడ
వ్యాసం బావుంది
‘సినిమా ఏదైనా సీన్ కామన్’ వ్యాసం నచ్చింది. ఒక్కో సీజన్‌లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. మొదట జానపదాలు, పౌరాణికాలు, తర్వాత సాంఘికాలు. కొంతకాలం కామెడీలు కొంతకాలం వర్షం పాటలో హీరోయిన్‌ని తడపటం, అటు తర్వాత ఐటెం సాంగ్స్ ఇప్పుడు హగ్గులు ముద్దులూ! హీరో హీరోయిన్లు చేయిచేయి కలిపితే ప్రేక్షకుల్లో ఏ స్పందనా ఉండదు. ఇప్పుడు పెదవీ, పెదవీ కలిపినా ప్రేక్షకుల్లో స్పందనా ఉండటం లేదు. 27 కిస్సులున్న చిత్రాలు ఫెయిలవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ఆ ముఖాల్లో తన్మయత్వం, హాయి, అనుభూతి కనిపించడం లేదు. ముద్దుసీన్ సరిగా పండకపోవటం! రెండు బొమ్మలు ఢీకొన్నట్టు ఉంటోంది ఆ సీన్. కొద్దిరోజుల్లో ఈ ట్రెండూ పనికిరాకుండా పోతుంది.
-సుధీర్, శ్రీనగర్