మీ వ్యూస్

పూరి స్మైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు పూరి జోష్ మీదున్నాడు. హీరో రామ్ అంతకంటే ఊపులో ఉన్నాడు. కారణం -‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టు. సినిమా ఫలితం కంటే -వసూళ్ల జోరే ఇద్దరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. విడుదలకు ముందు అనేక కోణాల్లో పూర్తి నెగెటివిటీ మూటగట్టుకున్న ఇస్మార్ట్.. విడుదల తరువాత థియేటర్లలో చెలరేగిపోయాడు. పూరి పనైపోయిందని అనుకున్న ప్రతిసారీ ఓ హిట్టుతో ట్రాక్‌పైకి వస్తోన్న ప్రక్రియే మళ్లీ కొనసాగింది. బూతులెక్కువున్నాయా? గ్లామర్ డోసు పెంచాడా? నేలబారు సినిమానా? లాజిక్‌కు అందడం లేదా? ఇవన్నీ కాదు, తీసిన సినిమాతో హిట్టందుకున్నాడా? లేదా? అన్నదే ముఖ్యం. ఆ విషయంలో పూరి సక్సెస్.
-పార్ధసారథి, విజయవాడ
ఐదో బాలనాగమ్మ!
వెనె్నల మీ వ్యూస్‌లో నలుగురు బాలనాగమ్మల గురించి చెప్పారు. కాని ఐదో బాలనాగమ్మ కూడా ఉంది. అయితే పూర్తిగా బాలనాగమ్మ ఐదో చిత్రం అని అనలేం. ఎందుకంటే -హీరోయిన్ పాత్ర పేరు బాలనాగమ్మ కాదు. సినిమా పేరు -సన్నాఫ్ ఇండియా. ఇది హిందీ సాంఘిక చిత్రం. బాలనాగమ్మ కథలోని పాత్రలు, సన్నివేశాలు సాంఘికం చేసి తీశారు. నిర్మించింది మెహబూబ్‌ఖాన్. ఆయన ‘మదరిండియా’ చిత్రం తీసి ప్రపంచ ప్రఖ్యాతి చెందినవాడు. సన్నాఫ్ ఇండియా మాత్రం పెద్దగా ఆడలేదు, ప్రశంసలూ దక్కలేదు. సాంఘికం చేసిన బాలనాగమ్మ కథని మెహబూబ్‌ఖాన్‌కి ఎవరు చెప్పారో మరి.
-సాహిత్యదీప్తి, రమణయ్యపేట
బ్యాడ్‌లక్
‘ఓ బేబీ!’ సినిమా హిట్టు. సంగీతం ఫట్టు. ఇది మన మాట కాదు, ద గ్రేట్ నిర్మాత సురేష్‌బాబు మాట. చిత్ర నిర్మాతల్లో ఆయనా ఒకరు. సినిమా విడుదల తరువాత మ్యూజిక్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అది బావుండివుంటే సినిమా మరింత హిట్టయ్యేదన్నారు. తెలిసిన సమాచారం ఏంటంటే -్ఫస్ట్‌నుంచీ మిక్కీ జె మేయర్ పట్ల సురేష్ అసంతృప్తిగానే ఉన్నాడట. దర్శకురాలు నందినిరెడ్డి, మరికొందరు మిక్కీని ఎంపిక చేసుకోవడంతో ఆయన వౌనం వహించాడు. ఇప్పుడీ సినిమాకు సంగీతం మైనస్ అవడంతో నోరువిప్పాడు. జరిగిందేంటంటే -మిక్కీ అమెరికాలో ఉంటున్నాడు. పాటలు చిత్రీకరణకు రెండురోజుల ముందు మ్యూజిక్ నోట్స్, కంపోజిషన్‌లు పంపాడట. అవి నచ్చకున్నా వాటినే ఉపయోగించాల్సి వచ్చిందట. మనిషి ఎదురుగావుంటే మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బాగోగులు చర్చించి మార్పులు చేసే వీలుండేది. అలా జరిగివుంటే -సినిమా మరో రేంజ్‌లో ఉండేదేమో.
-రాజు, చీరాల.. -వింద్యారాణి, కాకినాడ
అభిరుచి మారుతోంది
మన పాత సినిమాల్ని తెగ పొగిడేసుకుంటాంగానీ, ఇప్పటి జనరేషన్‌కు అలాంటిదేమీ లేదని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. నిజమే -పాత చిత్రాలు ఆణిముత్యాలే. కాకపోతే అప్పటి తరానికే అనిపిస్తుంది. ఎందుకంటే -విజయావారి ‘మాయాబజార్’ (కలరు) మా ఊళ్లో మళ్ళీ విడుదలైంది. వారంపాటు రోజుకు నాలుగు ఆటలు. చిత్రమేంటంటే -ఆటకు ఐదారుగురు ప్రేక్షకులతో థియేటర్ వెలవెలబోయింది. ఈ తరం తెలుగు ప్రేక్షకుడి అభిరుచి ఆ స్థాయికి తగినట్టు లేకపోవడమా? లేక ఈతరం ప్రేక్షకుడి స్థాయికి ఆనాటి చిత్రాలు లేకపోవడమా? సమాధానం ఎవరు చెప్పాలి.
-జంగమదేవర, వక్కలంక
హిట్టని చెప్పలేం
కొత్త దర్శకుడు మహేంద్ర రూపొందించిన దొరసాని ఓ మంచి చిత్రం అంతే. తనకు నచ్చిన రీతిలో తెలంగాణ గడీల నేపధ్యంలో చిన్న ప్రేమకథని అల్లుకున్న తీరు బావుంది. కాకపోతే -మీడియా పొగిడేస్తున్నంత హిట్టు చిత్రమైతే కాదు. ఆనంద్, శివాత్మికల అభినయం ఓకే అనిపించినా, సినిమాలో వినోదంస్థాయి చాలా తక్కువ. మంచి పాటలు లేవు. కథనం నెమ్మది. తెలంగాణ దొరల కాలం, నక్సలైట్ల ఉద్యమం కాలానికి కథ సరిపోయింది కాని, ఇంకొంత కృషిచేస్తే మరోలా ఉండేదేమో. వసంత ప్రేమ వ్యవహారాన్ని వినోదం పంచే కామెడీ ట్రాక్‌లో చేస్తే బావుండేది. ఏకోణంలో చూసినా -ఇప్పుడొస్తున్న చాలా సినిమాలకంటే మంచి సినిమా తప్ప, హిట్టు చిత్రం అనలేం.
-పి.లక్ష్మీసుజాత, అద్దంకి
మరీ విడ్డూరం
ఒకనాటి సినిమాల్లో హీరో హీరోయిన్లు తల్లులు సాదాసీదాగా, సామాన్య దుస్తులు ధరించి -ఆహార్యంలోనే పాత్ర స్వభావాన్ని చెప్పేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోయిన్లకంటే ఎక్కువ మేకప్‌తో కనిపిస్తుంటే ఒకింత ఎబ్బెట్టుగా ఉంటుంది. భర్త లేనివారు సైతం పాత్ర తీరుకు విరుద్ధంగా అతి మేకప్‌తో కనిపిస్తుంటే -సంప్రదాయమే సిగ్గుపడుతోంది. క్యారెక్టర్ ప్రాధాన్యత కంటే, ప్రేక్షకులకు కనివిందుగా కనిపించాలనే ఆలోచనే కనిపిస్తోంది. అప్పటి చిత్రాల్లో కన్నాంబ, హేమలత, ఋష్యేంద్రమణి, సూర్యాకాంతం.. ఇలా గుర్తు చేసుకుంటే సహజ సిద్ధమైన పాత్రల్లా అనిపిస్తాయి. ఇప్పటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటోంది. ఆతరంవారు, కాస్త వయసు మళ్లిన వాళ్లు మారుతోన్న సంప్రదాయాన్ని జీర్ణించుకోవడం కష్టమే. ఈ మార్పును తప్పుగా చెప్పలేం కానీ, ఇబ్బందలున్న మాట వాస్తవం.
-కెవివి గుణశేఖర్, మిర్యాలగూడ
డై’లాగుడు?
తెలుగు సినిమాల్లోని సంభాషణలు మత గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయా? అనిపిస్తోంది. చాలా సినిమాల్లోని సన్నివేశాల్లో సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి వంటి సాధ్వీల పేర్లపై సెటైర్లు, పంచ్‌లు వేస్తూ మత సంబంధ విశ్వాసాన్ని మంటగలుపుతున్నారు. హీరో పాత్రలను శ్రీరాముడు, శ్రీకృష్ణుడులతో పోల్చటం, ఆయా పాత్రలపై పక్క పాత్రలతో సెటైర్లు వేయించటం మరీ దారుణం. రామాయణ, భారతం, భగవద్గీత.. ఇలా మైథాలజీని అపహాస్యం చేస్తోన్న సన్నివేశాలెన్నో వస్తున్నా సెన్సార్ కళ్లబడటం లేదు. కాలం మారిందనడానికి ఇది సంకేతమని అంటున్నారే తప్ప, మన మూలాలను మనమే గౌరవించుకోవాలన్న జ్ఞానం రావడం లేదు. ఇక -పక్కనోళ్లు ఎందుకు పట్టించుకుంటారన్న స్ప్పహ ఎప్పటికొస్తుందో? -ఎస్ మలేశ్వర రావు, కాశీబుగ్గ