మీ వ్యూస్

హిట్టుపడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాపుల్లోవున్న హీరోల సుడి తిరుగుతోంది. అందుకే ఆమధ్య రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టయితే, మొన్ననే వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘రాక్షసుడు’ సెనె్సషనల్ హిట్టై కూర్చుంది. తమిళ ‘రాచ్చసన్’కు తెలుగు రీమేక్ అయినా -దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన విధానం ఆడియన్స్‌కి బాగా కనెక్టైంది. మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా -బెల్లంకొండ మళ్లీ నాలుగు సినిమాలు చేసుకునే అవకాశం ఇచ్చినట్టే. కొడుకుకు భారీ హిట్టుపడగానే తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే -దేనికైనా టైం రావాలి అంటారు. తరువాతి సినిమా మంచి హిట్టుపడితే హీరోగా బెల్లంకొండ నాలుగు కాలాలు నిలదొక్కుకుంటాడు. లేదంటే -ఈ సినిమానుంచి వచ్చిన మైలేజ్ మళ్లీ వెనక్కి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తరువాతి కథ విషయంలో ఆచి చూడి అడుగేస్తే మంచిది.
-పి శ్రీనివాస్, నరసాపురం
అదీ విషయం
‘అర్జున్‌రెడ్డి’పై తెలుగునాట పెద్ద విమర్శలు రాలేదు కానీ, హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’పై విమర్శలు వెల్లువెత్తాయి. పురుషాహంకారానికి ప్రథమ నిదర్శనగా కబీర్‌సింగ్ నిలుస్తాడని, హీరోయిన్‌ని కొట్టే సన్నివేశం క్షమార్హం కాదని ఘాటు విమర్శలు వచ్చాయి. దానికి జవాబుగా ‘ప్రేమ మితిమీరితే కొట్టుకోవడం సహజమే. విమర్శించే వాళ్లకు ప్రేమంటే తెలియదు’ అన్నాడు దర్శకుడు. దాంతో విమర్శలు మరింత జోరందుకున్నాయి. మహిళను చంపేస్తే -హంతకునికి ప్రేమ ఎక్కువైందని చెప్తారు కాబోలంటూ తాప్సీ కామెంట్ చేసింది. ఆ హీరోయిన్‌లాంటి పాత్రను మీరు చేస్తారా? అని అడిగితే -అలాంటి పాత్రలు నచ్చి చేయడానికి కొందరు రెడీ కావచ్చు, నేనైతే చెయ్యను. నా పాత్ర ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం అందుతుందా? అని ఆలోచిస్తా’ అంది. ‘ఆ చిత్రం 270 కోట్లకు పైగా వసూలుచేసి హిట్ అయింది కదా’ అని అడిగితే ‘సమాజానికి అద్దం చూపిస్తే కొద్దిమందే కనిపిస్తారు. అంతా కనిపించరు. ఆ చిత్రాన్ని రెండు మూడు కోట్లమంది చూసుంటారు మన దేశ జనాభా 230 కోట్లు.. అంది తాప్సి.
-ప్రసాద్, గొడారిగుంట
ఇప్పుడు మాట్లాడదేం..
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సామాజిక మాధ్యమాల్లో ఉత్సాహంగా విమర్శలు గుప్పిస్తుంటుంది. ఆమధ్య ఆమె ‘ముసలి హీరోలు తమ వయస్సులో సగంకంటే తక్కువ హీరోయిన్లతో యుగళ గీతాలు పాడుతూ స్టెప్పులు వేయటాన్నీ ఘాటుగా విమర్శించింది. ఆమె భర్త మాత్రం మన్మథుడు-2లాంటి చిత్రాల్లో సీనియర్ సిటిజన్ హీరో కుర్ర హీరోయిన్‌తో యుగళ గీతాలు పాడేస్తూ ముద్దులెట్టుకోవడం చిత్రీకరిస్తూ ఉంటాడు! మరి ఈ చిత్రాన్ని చిన్మయి ఎందుకు విమర్శించదు? భర్తపట్ల గౌరవం కాబోలు! ముద్దుల గురించి రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అని తేల్చేశాడు నాగార్జున!
-ప్రభాస్, హైదరాబాద్
మనసు వికలమైంది
జూనియర్ ఆర్టిస్టుల దయనీయ పరిస్థితి గురించి ‘జూనియర్ సీనియర్’ వ్యాసంలో చదివిన మాకు మనసు వికలమైంది. జూనియర్ ఆర్టిస్టులే కాదు మంచి పేరున్న సీనియర్ ఆర్టిస్టులు నాగయ్య, గిరిజ, రాజబాబు, సూర్యకాంతం లాంటివారు ఎందరో చివరిరోజుల్లో అష్టకష్టాలు పడ్డారు. అందుకే చిత్రసీమ విచిత్రసీమ అనిపించుకుంది. ఇక్కడ అందాల హరివిల్లులు ఎండమావుల్లాగ మారిపోతూ ఉంటాయి. పని దొరకని జూనియర్ ఆర్టిస్టుల బాగోగులు చూడటానికి వారి యూనియన్ తీసుకుంటున్న శ్రద్ధ, చేయాలనుకుంటున్న సంస్కరణలూ శ్లాఘనీయం.
-సుబ్బక్క, జగన్నాథపురం
ఆయన ఆయన కాదు..
ఫ్లాష్‌బ్యాక్ ఎట్ 50 ‘జగత్ కిలాడీలు’ దర్శకులు ఐఎన్ మూర్తి గురించి సీవీఆర్ మాణికేశ్వరి వ్రాస్తూ ‘జగమేమాయ’ చిత్రం ద్వారా ‘రాజబాబు’ను పరిచయం చేసింది ఐఎన్ మూర్తేనన్నారు. కానీ, రాజబాబు అంటే హాస్యనటుడు రాజబాబు కాదు. వీరు వేరే. ఆ పేరుతో అప్పటికే ఆయన ఉండటంతో ఈయన మురళీమోహన్‌గా పేరు మార్చుకొన్నారు. ఈ చిత్రంలో ఆ రాజబాబు కూడా వున్నారు. గిరిబాబు కూడా ఈ చిత్రం ద్వారానే పరిచయమయ్యారు. ‘పుణ్యమూర్తుల అప్పలరాజు’ రాజబాబుగా మారితే ‘రాజబాబు’ మురళీమోహన్‌గా మారారన్న మాట.
-టి సదా, తిరుపతి
మరీ ఇలానా..
ఆరు వరుస ఫ్లాపుల తర్వాత ఏడోది హిట్టయితే సెలబ్రేట్ చేసుకోవలసిందే. ఆ దర్శకుడు గ్రాండ్‌గానే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆయనకు మార్గదర్శకుడైన మరో దర్శకుడు ఆ సినిమా హీరోయిన్లపై మద్యం పోశాడు. అంతటితో ఆగక దొరికిందే చాన్సన్నట్టు ఆడపులి అంటూ తొడకొట్టి ఆర్భాటించి -సినిమా చాన్సులులేని మాజీ నటీ నిర్మాతను కౌగలించుకొని ముద్దులు కురిపించాడట. సెలబ్రేషన్ పేరిట మందుకొట్టి తెరవెనక ఎలా తందానాలాడినా ఫర్వాలేదు. కానీ అవి బహిరంగమైతేనే ఇబ్బంది. ఈ సెలబ్రేషన్ తైతక్కలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తారలకు కూడా ఇష్టమైంది కాబట్టి సరిపోయింది. తేడాకొడితే మీటూ వీరంగం.
-పవన్‌పుత్ర, రామారావుపేట
ప్రాణదాత!
1963లో యన్టీఆర్, కృష్ణకుమారి జోడీగా వచ్చిన లక్షాధికారి సినిమా విజయవంతమైంది. టి చలపతిరావు సంగీత దర్శకులు. ఆ చిత్రంలో సముద్ర తీరాన ‘దాచాలంటే సాగవులే- దాగుడుమూతలు సాగవులే’ పాట చిత్రీకరణ సమయంలో కథానాయకుడు నాయికి ఇరువురూ సముద్రంలోకి కొంతదూరం వెళ్లాలి. అలా వెళ్లిన టైంలో అల తాకిడికి కృష్ణకుమారి కొంతదూరం సముద్రంలోకి వెళ్లిపోయిందట. అదృష్టవశాత్తూ రామారావు చేయిపట్టుకొని లాగారట. కృష్ణకుమారి పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. లేకపోతే అంతే సంగతులు. కృష్ణకుమారి ఎప్పుడూ రామారావు నన్ను రక్షించిన ప్రాణదాత అని చెప్పుకొంటూ ఉండేది. అందుకే శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు పెద్దలు.
-కెవి ప్రసాదరావు, కందుకూరు