మీ వ్యూస్

మారవయ్యా బాబూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడపలోపల గుడ్‌బోయ్. గడప దాటితో ప్లేబోయ్ కానె్సప్ట్‌తో -అల్లుకున్న మన్మథుడు కథ బావుందిగానీ, ఆ పాత్ర పోషించిన నాగార్జునకు ఏమాత్రం సూట్‌కాలేదు. వయసుపై సెటైర్లు వేసుకున్నంత మాత్రాన -తగని పాత్రను పోషిస్తే చప్పట్లు కొట్టేస్తారనుకోవడం అపోహ. నాగార్జున కెరీర్ ఎక్కడ మొదలైంది.. ఎక్కడి వరకూ జర్నీ చేసిందన్నది -కామన్ ఆడియన్‌కు కొత్త విషయమేం కాదు. ఆ ప్రభావం నుంచే అతను చేసే పాత్రను చూస్తారన్న విషయాన్ని గమనించకపోవడం -దారుణం. ప్రమోషన్స్ టైంలో -రొమాన్స్ అంటే ఇష్టం, ఇప్పటికీ రొమాంటిక్ లైఫ్‌నే కోరుకుంటానంటూ నాగ్ చెప్పుకోవడాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదనడానికి -సినిమా ఫలితం ఓ ఉదాహరణ. వ్యక్తిగత జీవితంలో అతను ఎలాగైనా ఉండొచ్చు. కానీ, ఇమేజ్‌వున్న నటుడిగా, పబ్లిక్ ఫిగర్‌గా -స్క్రీన్‌మీద ఉండే తీరు మాత్రం ఇదికాదని ప్రేక్షకులు చెప్పకనే చెప్పేశారు. సో, లిప్‌లాక్‌లు, హాట్‌హగ్గుల్లాంటి ‘కుర్ర’ సన్నివేశాలకి స్క్రీన్‌పై ఫుల్‌స్టాప్ పెట్టి -గౌరవప్రదమైన పాత్రలు పోషించటం ఎంతైనా ఉత్తమం.
-్భలే రాజు, నల్గొండ
ఏంలాభం!
దర్శకుడు అర్జున్ జంధ్యాల తొలి ప్రయత్నంగా ఒంగోలు నేపథ్యంగా అల్లుకున్న కథను గుణ 369గా తెరపైకి తెచ్చారు. స్క్రిప్ట్ ప్రకారం పరిమిత బడ్జెట్‌లో సినిమా అంతా ఒంగోలు పరిసరాల్లో నిర్మాణం చేసుకున్నారు. కథను అనేక కోణాల్లో స్పృజిస్తూ అనవసర వత్తిడితో తికమకపడ్డాడనిపిస్తుంది. సీన్స్‌లో డెప్త్ మిస్సయ్యారన్న భావన కలిగింది. కార్తికేయ మూడో ప్రయత్నంలో సాఫ్ట్‌నెస్ పాత్రలో ఫరవాలేదు అనిపించాడు. కొత్త హీరోయిన్ అనఘ చిరునవ్వులు, కనుదోయల చూపులు (లుక్స్) నటనా అందాలు బాగానే ఉన్నాయి. నరేష్, హేమ, విలన్ హీరో ఫ్రెండ్స్ రాధా పాత్రధారి బాగానే చేశారు. పాటలు, నేపథ్య స్కోర్ బాగానే ఉన్నాయి. ఎంత బాగున్నా కథనంలో కొరత అనిపిస్తుంది. చానాళ్ల తరువాత ఎంట్రీ ఇచ్చిన మంజుభార్గవి పాత్ర రూపకల్పన, నటన రక్తికట్టలేదు. కథను ఎప్పుడు సిద్ధం చేశారో కానీ, ఈమధ్య ఒంగోలులో జరిగిన ప్రేమ జంటపై ఆకతాయిలు అత్యాచారం దాడి సంఘటనలు లింకు కుదిరింది. ఈ పాయింట్‌పై కథనం సాగటంతో -ఈ చిత్రం ఓ హెచ్చరికగా సూటిగా తాకుతుంది కూడా. ప్రేమకథగా మొదలై రక్తపాతంతో ముగిసిన కథలా అనిపించింది.
-రాఘవ, చీరాల
బాధాకరం
సుప్రసిద్ధ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటే. ఎందరో కళాకారులను తీర్చిదిద్దిన ఘనత ఆయనది. దర్శకుడిగా ఆయన తీసిన చిత్రాల్లో బాగా నచ్చే చిత్రం -నాగమల్లి. అందులోని ప్రతీ పాట మాట అత్యద్భుతం. చిన్న బడ్జెట్ చిత్రాలను విజయవంతం చేయొచ్చని పరిశ్రమకు పాఠం చెప్పిన వాళ్లలో దేవదాస్ కనకాల పేరూ ఉంటుంది. ఎంతో సేవలందించిన ఆయన మరణాన్ని పరిశ్రమ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది మాత్రం చాలా బాధాకరం.
-సిహెచ్‌ఎన్ రావు, హైదరాబాద్
తీరు మారాలి
ఒకనాడు మన తెలుగు సినీ వైభవం దిగంతాల అంచులుదాటింది. ఈనాడు రాజవౌళి మాత్రం ‘బాహుబలి-1, 2’లతో ప్రపంచానికి తెలుగు సినీ వైభవం రుచి చూపించాడు. ఒక్క సినిమాతో సరిపెట్టుకోలేము కదా. ఇంకా మంచి సినిమాలు రావాలి. ఏడాదిలో వంద సినిమాలు వస్తున్నాయి. అందులో ప్రజాదరణ పొందేది ఒకటో రెండో మాత్రమే ఉంటున్నాయి. ఈమధ్య యూత్‌ను టార్గెట్ చేసి తీస్తున్న సినిమాలు పరమ రోత పుట్టిస్తున్నాయి. ఇదెంతవరకు సమంజసమో దర్శక నిర్మాతలు ఆలోచించాలి. సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. 2019లో వచ్చిన 6 నెలల్లో మనకు తెల్సి ఓ మూడు చిత్రాలు హిట్టయ్యాయి. గడచిన వేసవిలో ఒక్కటంటే ఒక్కటీ మంచి సినిమా రాలేదు. తెలుగు సినిమా తీరు ఎప్పటికి మారుతుంది. కలకాలం జనామోదం పొందే మంచి చిత్రాలను ఎప్పటికి అందిస్తుంది.
-కురువ శ్రీనివాసులు
ఆమె అంతే..
హిందీ నటి స్వరభాస్కర్‌కి వివాదాలు రేపి ప్రచారం పొందటం హాబీ. మొదట మీటూ అంటూ రెచ్చిపోయారు. తాజాగా మొగలారుూ చక్రవర్తులు మన దేశాన్ని దోచుకోలేదు, సుసంపన్నం చేశారు అంటూ కామెంట్ చేసింది. దాంతో నెటిజన్లు ఆమెపై నిప్పులు కురిపించారు. నా తప్పులేదు. ఫలానా చరిత్ర రచయిత రాసిందే చెప్పాను అంటోంది తరువాత. అయితే చరిత్ర రచయితల్ని నమ్మడానికి వీల్లేదు. ఒకే అంశంపై వామపక్షీయులు ఒకలాగ, బ్రిటిష్‌వారు ఇంకోలాగ, అమెరికన్లు మరోలాగ విభిన్నంగా రాయొచ్చు. నెహ్రూ రొమాన్స్‌ల గురించి రాసిన వారున్నారు. స్ర్తిల మధ్య బాపూజీ పడుకునేవారని రాశారు కొందరు. ఎక్కువమంది నమ్మిందే నిజమైపోతుంది.
-శాంతి సమీర, వాకలపూడి
తప్పులున్నాయ్
28 జూలై 2019 వెనె్నల అనుబంధంలో సరయు శేఖర్ ‘విరిసినది వసంతగానం’ శీర్షికలో గాయని వసంత గురించి వ్రాశారు. ఆమె పర్సనల్ లైఫ్ బాగానే ఉంది. కానీ, సినిమాల్లో పాడిన పాటలను కొన్ని తప్పులు రాశారు. కెవి మహదేవన్ ఓసారి ఆదర్శకుటుంబం చిత్రానికి గాను పి సుశీల, జానకి, వసంతలతో ‘తుళ్లితుళ్లి పడుతోంది తొలకరి వయసు’ పాటను రికార్డ్ చేశారన్నారు. అసలు ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు. కానీ ఈ పాట ‘మంచి కుటుంబం’ చిత్రంలోనిది. సంగీతం ఎస్‌పి కోదండపాణి. ‘మంచి కుటుంబం’ చిత్రం తమిళ మాతృక ‘మోటార్ సుందరం పిళ్లె’.
ఒక పేజీలో సగం వ్యాసం రాసినవారు కనీసం ఇలాంటి తప్పులు సరిచేసుకోకపోవడం సరికాదు. పక్కనే వస్తున్న ఇమంది రామారావు వ్యాసాలూ కేవలం కల్పితాలుగానే ఉంటున్నాయి. సంపాదకవర్గం సరిచూసుకుంటే మంచిది.
-ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు