మీ వ్యూస్

అదీ ప్రియాంకచోప్రా అంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక చోప్రా అనగానే హాలీవుడ్‌ని సైతం మెప్పించి -విదేశ గాయకుడిని పెళ్లి చేసుకున్న బాలీవుడ్ శృంగార తార కళ్లముందు కనిపిస్తుంది. చాలామందికి తెలీని విషయమేమంటే -ఆమెకు స్ఫూర్తిదాయక కళాత్మక హృదయం ఉందని. ప్రజల్ని వినోదపరుస్తూనే, స్థానిక సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకొస్తూ, ఆలోచింపచేసే ప్రయోజనాత్మక మరాఠీ చిత్రాలు నిర్మించింని ప్రియాంక. రెండేళ్ల క్రితం ఆమె నిర్మించిన ‘వెంటిలేటర్’ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు దక్కాయి. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఒక దానిని పర్యావరణ సంరక్షణ విభాగంలో మహారాష్టల్రో నీటి సమస్యని ఎత్తిచూపే ‘పానీ’ చిత్రానికి వచ్చింది. ఎంత గొప్ప విషయం కదూ.
-ప్రేమజ్యోతి, శ్రీనగర్
భలే బాజాలు
నాగార్జున అండ్ టీం మన్మథుడు-2 గురించి వాయించిన బాజాలు విన్నాక -ఆసక్తితో సినిమా రివ్యూలు పరికించాం. ఈ చిత్రానికి ‘వెనె్నల’ సింగిల్ స్టార్ రేటింగ్ ఇవ్వడం చూసి షాకయ్యాను. ఒక ఆంగ్ల పత్రిక అయితే ఇలాంటి చిత్రాన్ని నాగార్జున ఎంపిక చేసుకోవటం హిమాలియన్ బ్లండర్ (అతిపెద్ద పొరపాటు) అని చెప్తూ ఒకటిన్నర స్టార్ రేటింగ్ కొసరి మరీ ఇచ్చింది. తమాషా ఏమంటే కబీర్‌సింగ్ చిత్రాన్ని ఏకిపారేసిన చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. పైగా చిన్మయి స్వయంగా రకుల్ ప్రీత్‌కి డబ్బింగ్ కూడా చెప్పింది. కాని చిత్రాన్ని విమర్శించలేదు. స్ర్తిలకు ఇబ్బందికరమైన డబుల్ మీనింగ్ డైలాగులున్న చిత్రాన్ని చిన్మయి విమర్శించ లేదుకదా, ఆ డైలాగుల్లో కొన్ని ఆమే చెప్పింది. అందుకే నెటిజన్లు చిన్మయిని తూర్పారబట్టారు.
-చంద్ర, కాకినాడ
సక్సెస్ కాలేదు
వెనె్నల అనుబంధంలో ‘సరయు శేఖర్’ వ్రాసిన వ్యాసం ‘పల్లంనుంచి పర్వతనేనికి!’లో దర్శకుడు పర్వతనేని సాంబశివరావు గురించి వ్రాశారు. మనస్సాక్షి, వంశోద్ధారకుడు, కొత్తల్లుడు, కొత్తపేట రౌడీ, ఉద్దండుడు, కలియుగ స్ర్తి, రామరాజ్యంలో రక్తపాశంలాంటి చిత్రాలు విజయవంతమైనట్టు రాశారు. దర్శకుడిగా ఆయనమీద గౌరవం చూపించొచ్చుగానీ, విఫల చిత్రాలను విజయవంతమైనట్టుగా రాయడం తగదు.
-ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
మంచి జ్ఞాపకాలు
పాతతరం సినిమా వాళ్ల జ్ఞాపకాలను పొదివి పట్టుకుని -కథనాలుగా ఇస్తున్న వైనం చాలా బావుంటుంది. నిజంగానే బతుకొక గారడీ అంటూ అద్భుత గాయని వసంతపై రాసిన వ్యాసం చాలాచాలా బావుంది. విధికే ధిక్కార స్వరాన్ని వినిపించి, గాత్రాన్ని సరిచేసుకుని జీవితాన్ని సరిదిద్దుకుంది అన్న మాట ప్రేరణ కల్పించేదిగా ఉంది. ఇక ఒకతరంతో నటించి, నాలుగు తరాలకు మార్గదర్శిగా నిలిచారంటూ బేబీ సీత గురించి రాసిన వ్యాసం కూడా మాకు బాగా నచ్చింది. చిన్నా పెద్దా, గొప్పా పేద అన్న భేదం చూపించకుండా -ఒకప్పటి తరం ఆర్టిస్టుల్ని, వాళ్ల అనుభవాలను ప్రత్యేక శీర్షికలతో అందిస్తోన్న రచయితను అభినందించాలి. మరిన్ని అలనాటి కళాకారులను మాకు పరిచయం చేస్తారని ఆశిస్తూ..
-జి వరలక్ష్మి, డి గన్నవరం
పేరు బావుంటే చాలా?
ఆకర్షణీయమైన టైటిల్ జనాల్ని థియేటర్లకు లాక్కొస్తుందన్నది చిత్ర నిర్మాతల భ్రమ. అందుకే వింత పేర్లు, నంబర్లు కూడా టైటిల్స్ అయిపోతున్నాయి. కొందరు పాత హిట్ చిత్రాల పేర్లు, పాత సినిమాల్లోని పల్లవులను కొత్త సినిమాలకు పెట్టుకుంటున్నారు. దేవదాసు పేరుతో మూడు చిత్రాలు రాగా పాత పేర్లతో కొత్త చిత్రాలు నర్తనశాల, శంకరాభరణం, దొంగాట, మిస్సమ్మ, మాయాబజార్ ఇలా చాలా చిత్రాలు వచ్చాయి. కాని పాత పేర్ల కొత్త చిత్రాలు చాలా మట్టుకి ఫ్లాపయ్యాయి. ఇప్పుడు గ్యాంగ్‌లీడర్ వస్తోంది. నాని నటిస్తున్న చిత్రానికి గ్యాంగ్‌లీడర్ అని పేరు ప్రకటిస్తే, ఆ టైటిల్ నాది అంటూ కొందరినుంచి గొవడ మొదలైంది. అందుకే నానీస్ గ్యాంగ్‌లీడర్ అని టైటిల్ మార్చారు. ఈ మార్పే నానికి కలిసొస్తుందేమో. ట్రైలర్ చూస్తుంటే నానీస్ గ్యాంగ్‌లీడర్ నవ్వించేలాగే ఉంది.
-మైథిలి, సర్పవరం
కామ్రేడ్..
కన్నడ నటుడు రక్షిత్‌సెట్టి, నటి రష్మిక మండన్నలకు వివాహం నిశ్చయమైంది. ఇరు వర్గాలు ఏర్పాట్లు చేసుకుంటున్న టైంలో -తెలుగులో విజయ్‌దేవరకొండ, రష్మికల సినిమా హిట్టై కూర్చుంది. కెరీర్‌మీద ఆశతో రష్మిక వివాహ నిశ్చయాన్ని రద్దు చేసుకుని, టాలీవుడ్‌లో ముద్దుల హీరోయిన్‌గా బిజీ అయిపోయింది. గీత గోవిందం హిట్టవ్వడంతో -డియర్ కామ్రేడ్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ పెయిర్‌ను చూసి సహించలేక -కన్నడ కామ్రేడ్‌కి వ్యతిరేకంగా తన ఫ్యాన్స్‌తో రక్షిత్‌సెట్టి వ్యతిరేక ప్రచారం చేయించాడని, అందుకే సినిమా ఫ్లాపైనట్టు వార్త రాజుకుంది. తెలుగు చిత్రం తొలి రోజు కలక్షన్లు బ్రహ్మాండమని, సినిమా విడుదల కాకముందే కరణ్‌జోహార్ భారీ రేటుకు హిందీ రైట్స్ తీసేసుకున్నాడని చానల్స్ బాజాలు కొట్టాయి. కాని, టాలీవుడ్‌లోనూ కామ్రేడ్ చతికిలపడ్డాడు. బయ్యర్లు రూపాయికి ముప్పావలా నష్టపోయినట్టు పత్రికలూ రాసేశాయి. ఆ దెబ్బతో చానెల్స్ సైలెంట్ అయిపోయాయి.
-లక్ష్మి, బృందావనం
గోవిందా...
హిందీ సినిమాలు చూసేవారికి గోవిందా పేరు పరిచితమే. దశాబ్దాల క్రితం ఆయన టాప్ కామెడీ హీరో. ఇప్పటికీ అప్పుడప్పుడు సహాయ పాత్రల్లో కనిపిస్తుంటాడు. ఆయనకు ఈమధ్య మతి చలించిందన్న వార్తలొస్తున్నాయి. ఎందుకంటే -ప్రపంచ బ్లాక్‌బస్టర్ ఆంగ్ల చిత్రం ‘అవతార్’కి ఆ పేరు తనే సూచించాననీ, నటించమని దర్శకుడు కోరినా నిరాకరించానని చెప్తున్నాడట. ఆయన సెట్స్‌మీద వింతగా ప్రవర్తిస్తున్నాడనీ వినిపిస్తోంది. షూటింగ్ చూడటానికి వచ్చిన ఒకరిని కొట్టి, ఇప్పుడు కేసు ఎదుర్కొంటున్నాడు. దీంతో గోవిందా పరిస్థితిపై నెటిజన్లు ‘గో..విందా’ అంటూ వ్యంగ్య బాణాలేస్తున్నారు. ఎంత డబ్బు, కీర్తి సంపాదిస్తేనేం చివరకు గోవిందా పరిస్థితి ఇలాగైందని సోషల్ మీడియా సెటైర్లు వేస్తోంది.
-్భవదీశ్వరి, జగన్నాథపురం