మీ వ్యూస్

పూర్‌లీడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

300 కోట్ల దోపిడీ. ఆరు హత్యలు. రెంటికీ కారకుడైన విలన్. వాడిపై -ఐదుగురు బాధిత మహిళల పగ. యాక్షన్ రివేంజ్‌కు -ట్రూ కాపీ రాసే నవలా రచయిత. ఈ ముడిసరుకుతో కథల్లుకోమంటే.. -అంటూ నానీస్ గ్యాంగ్‌లీడర్‌పై వెనె్నలలో రాసిన రివ్యూ భలే అనిపించింది. వెనె్నల రివ్యూలకు ఓ ప్రత్యేకత ఉంటుందన్నది నిజం. ఆ క్వాలిటీని మెయన్‌టెయన్ చేస్తూ పత్రికలో ఇస్తున్న రివ్యూలు బావుంటున్నాయ. నిజానికి గ్యాంగ్‌లీడర్ చిత్రం అంత తీసిపారేయతగ్గదిగా లేదు. కాకపోతే, హీరో ఎలిమెంట్‌ను దర్శకుడు సమర్థంగా చూపించలేకపోవడంతో -ఆడియన్స్‌లో నీరసం వచ్చేసింది. కామెడీపరంగాను, కంటెంట్‌పరంగాను, క్వాలిటీపరంగానూ.. ఇలా సినిమా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసినా -స్క్రిప్ట్‌పట్ల దర్శకుడు మరికొంత జాగ్రత్త తీసుకునివుంటే సినిమా మరోలా ఉండేది.
-మల్లికార్జున శర్మ, ర్యాలి
మనోళ్లేరీ..
తెలుగు సినిమాలు, టీవీ సీరియల్స్‌ని పరభాషా నటీనటులే రాజ్యమేలుతున్నారు. తెలుగువాళ్లకు ప్రాధాన్యం తక్కువవుతుంది. ముఖ్యంగా తెలుగు సీరియల్స్‌లో సీనియర్లకు అవకాశాలు వస్తున్నా, కొత్తగా హీరోయిన్ పాత్రలకు చాన్స్‌లే రావడం లేదు. ఎక్కువగా కన్నడ, తమిళ పరిశ్రమల నుంచే వలస వస్తున్నారు. డబ్బింగ్ సీరియళ్ల వెల్లువ తగ్గి, తెలుగు సీరియల్స్ పెరిగినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక సినిమాల్లోనూ తొంభై శాతం హీరోయిన్లు ఇతర భాషల నుంచి వస్తున్న వాళ్లే. ఇదే పరిస్థితి చాలాకాలంగా కనిపిస్తోంది. టాలెంట్‌వున్నా.. అవకాశం ఇచ్చేవాళ్లు లేక ప్యాడప్ ఆర్టిస్టులకే పరిమితమైపోతున్నారు. స్థానిక నటులకు అవకాశమిప్పించే విషయంలో ‘మా’ చొరవ చూపాలి. వృద్ధకళాకారులకూ తగు పాత్రల్లో అవకాశాలిప్పించి జీవనోపాధి కల్పించాలి. పరాయివాళ్లు వద్దని కాదు, మనవాళ్లూ బతకాలిగా.
-ఎఆర్ రామారావు, ఖమ్మం
కుదేలైన కురుక్షేత్రం
కన్నడ భాష అనువాద చిత్రం ‘కురుక్షేత్రం’ సాంకేతికంగా భారీ చిత్రమే తప్ప -కథాపరంగా మెప్పించలేకపోయింది. ఎన్టీఆర్ శ్రీకృష్ణపాండవీయం, దాన వీర శూర కర్ణ చిత్రాల స్ఫూర్తితో కథా కథనాలు తయారు చేసుకొని సినిమా తీశారు. వెనె్నలకంటి పద్యాల జోలికి వెళ్లకుండా ఆ తరహా డైలాగులనే చిత్రానికి అందించారు. మయసభ నిర్మాణం భారీ తనంతో అలరించింది. పాట కూడ బాగానే ఉంది. సాయికుమార్ తమ్ముడు రవిశంకర్ శకునిగా.. మన ధూళిపాళను అన్నిరకాలుగా అనుకరించి రాణించారు. దుర్యోధనుడిగా దర్శన్, కర్ణుడిగా అర్జున్ ఆకోవ రూపాల్లో రాణించేందుకు చేసిన ప్రయత్నం సఫలమైంది. భీముడు పాత్రధారి కుడా బాగానే చేశాడు. వయస్సుడిగిన అంబరీష్ భీష్ముడిగా బాగాలేడు. కొన్నిచోట్ల డైలాగ్స్ బాగున్నాయి. బానబొజ్జతో శ్రీకృష్ణుడిని చూడలేం. జరిగే కథనం ఆపి రాయబారం సీను నుండి కురుక్షేత్రం యుద్ధ ఘట్టంతో చిత్రాన్ని ముగించారు. కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలను భారీ టెక్నాలజీతో తీశారు. ఫైట్స్ భారీస్థాయితో బాగా తీశారు. అసలు దీనికోసమే సినిమా నిర్మాణం చేసినట్టు అనిపిస్తోంది. స్నేహ ద్రౌపదిగా చేసిందేమీలేదు. ఈనాడు పౌరాణికాలు ఎంత భారీతనంతో తీసినా ఆనాటి పౌరాణికాలముందు దిగదుడుపే!
-పీవీఎస్ ప్రసాదరావు, అద్దంకి
తప్పులేదు..
సామాజిక మాధ్యమాల్లో మరోసారి చిన్మయ విరుచుకుపడింది. ఈసారి కమల్‌హాసన్ మీద. ఎందుకంటే ఆయన తమిళంలో బిగ్‌బాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. బిగ్‌బాస్ కానె్సప్ట్ తెలుసుకదా. బాహ్య ప్రపంచంతో ఫోన్, టీవీలతో సంబంధం లేకుండా ఒక ఇంట్లో కొందరు పోటీదారులు ఆడ, మగ కొంతకాలం కలిసుండాలి. కబుర్లు, జోకులు, ఆటపాటలు, వంటలు చేసుకుంటూ ఓవారం బానే ఉంటుంది. తరువాతే -వాదోపవాదాలు, కొట్లాటలూ ప్రారంభమవుతాయి. కాలక్రమంలో ప్రతి వ్యక్తి గురించి మిగిలిన వారి అభిప్రాయాలు అడుగుతారు. మైనస్‌లు వచ్చినోళ్లు బయటకు పోవాలి. తమిళ షోలో ఒకడు కాలేజీ రోజుల్లో రష్‌గా ఉండే బస్సులు, కాంటీన్లలో అమ్మాయిల వెనక చేరి వారిని ఎక్కడెక్కడో గుచ్చి, మరెక్కడో టచ్ చేసి ఎంజాయ్ చేసేవాడినని చెప్తే అదో ఘనకార్యంలా కమల్‌హాసన్‌తోబాటు ఆ యింటిలోని సభ్యులంతా నవ్వేశారట. ఇది నవ్వులాట వ్యవహారమా? సిగ్గులేదూ? పైగా రాజకీయ పార్టీ పెట్టి ఇలాంటి పోకిరి పనులకు నవ్వుతావా? అంటూ చిన్మయి ఆగ్రహించింది. ఆమె ఆగ్రహం సహేతుకమేకదా!
-శుభ, కాకినాడ
తెలివైన బిజినెస్
సినిమా విడుదల ముందు ఆడియో రిలీజ్, ఫస్ట్‌లుక్, టీజర్ లాంటి జిమ్మిక్స్, విడుదల అయ్యాక ఫస్ట్‌డే కలక్షన్, విజయోత్సవమంటూ భజంత్రీలు మోత సహజమే. సినిమా ప్రమోషన్‌కోసం నానావిధ రభస మామూలే. ఇప్పుడు కొత్తగా థియేట్రికల్ రైట్స్ డబ్బింగ్ లేదా రీమేక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఎంత కలక్ట్ చేసిందో దండోరా వేయటం కొత్త ట్రిక్. డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలకు ముందే హిందీ రీమేక్ హక్కులు కరణ్‌జోహార్ (క.జో.) 5 కోట్లకు కొన్నాడని కొందరు, కాదు 6 కోట్లు అని మరికొందరు గొంతు చించుకొని ప్రచారం చేసినా ఆ చిత్ర హీరో విజయ్‌దేవరకొండగాని కజోగాని పెదవి విప్పలేదు. అసలు రహస్యం హిందీ చిత్ర విమర్శకుడు బయట పెట్టాడు. అంత డబ్బుపోసి రీమేక్ హక్కులు కొనడానికి కజో చేతగానివాడు కాదు. నిజానికి ఆయన రైట్స్ కొన్నా కథను మార్చేశాడు. హీరో ప్రాధాన్యం తగ్గించి మీటూ అంటూ హీరోయిన్ పోరాడిన వైనం కథలో చొప్పించాడట. ఇది హీరోయిన్ ప్రాధాన్య చిత్రం. తెలుగులోనూ డియర్ కామ్రేడ్‌కి మిశ్రమ స్పందనే లభించింది. నిడివి ఎక్కువైందంటూ కొంతభాగం తొలగించి క్యాంటీన్ పాట కలిపినా కలక్షన్లు పెరగలేదు. ఇదీ కామ్రేడ్ బండారం!
-స్నేహమాధురి, పెద్దాపురం