మీ వ్యూస్

ఓకే వరుణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్మీకి బతికిపోయాడు. చివరి క్షణంలో గద్దలగొండ గణేశ్‌గా పేరు మార్చినా -వరుణ్‌తేజ్ మాస్ అప్పియరెన్స్‌తో ఆడియన్స్‌కి కనెక్టయ్యాడు. ఎస్టాబ్లిష్‌డ్ హీరో కనుక సరిపోయింది. అదే ఏ కొత్త హీరో సినిమా అయినా ఇలాంటి ప్రాబ్లెమ్ ఫేస్ చేసివుంటే, కచ్చితంగా ఢమాల్‌మనేది. పాత్రపరంగా వరుణ్ పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకోవాలి. జోడీగా కొద్దిసేపే కనిపించినా పూజాహెగ్దె యూత్‌ని మెప్పించగలిగింది. తెలంగాణ మాండలికాన్ని ఊరమాస్ స్టయిల్లో డైలాగుల్లో పలికించి వరుణ్ మంచి మార్కులు సంపాదించుకున్నాడు. అయితే పెద్దగా యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోవడం సినిమాలో చిన్న అసంతృప్తి. ఈసారి వరుణ్ మంచి యాక్షన్ చిత్రాన్ని చేయడానికి మార్గం వేసుకున్నట్టే.
-కె భార్గవ, పెద్దాపురం
పూర్ సాహో..
ప్రమోషన్ అదిరిపోతే ఏ సినిమా అయినా బెదిరిపోయి పారిపోతుందని సాహో కూడా నిరూపించింది. సినిమా ఇంతకాదు అంత అంటూ నిర్మాతలు, కృష్ణరాజు, ప్రభాస్, రాజవౌళిలాంటి పెద్దలు బ్రహ్మాండంగా మోసేశారు. రిలీజ్‌కి ముందు చైనానుంచి వచ్చిన ప్రభాస్ అభిమానులు ఇద్దరు చైనా యువతులు హైదరాబాద్‌లో ప్రభాస్‌ని కలిసి ఆగస్టు 1న సినిమా అక్కడే చూద్దాం అనుకున్నారని, ప్రభాస్ లేకపోవడం, సినిమా విడుదల వాయిదా పడటంతో నిరాశచెందిన చైనాకు వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. ఇంత చేసినా సాహో ఫలితం నిరాశాజనకమే. భారీతనం ఒక ప్లస్ పాయింట్ అయితే, కథ, కథనం, ఇంకా ఎన్నో ఎన్నో మైనస్ పాయింట్లు అంటూ పత్రికలు సమీక్షలు రాసేశాయి. నేలవిడిచి సాము చేసిన సాహో అంటూ విమర్శలూ వచ్చాయి. ప్రభాస్ మేకప్ అస్సలు బాగలేదనీ రాసేశాయి. ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు.. రెండు మూడు రోజులు ఆగి సమీక్షలు రాస్తే మంచిదంటూ దర్శకుడు మొరపెట్టుకున్నా -సాహో దుమ్ము దులిపేశాయి పత్రికలు. కలెక్షన్లు సంతృప్తికరంగానే ఉన్నాయని చెప్పుకున్నా -ట్రేడ్ పండితులు మాత్రం పెదవి విరిచేశారు.
-శాండీ, కాకినాడ
పూర్తిగా మునిగారు
భారీ బడ్జెట్ చిత్రాలకు భారీగా లాభాలొస్తాయనుకోవడం భ్రమ అని రజనీకాంత్ చిత్రం 2.0తోబాటు తాజాగా సాహో కూడా నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి బాలీవుడ్‌లో కాస్త లాభాలొచ్చాయని చిత్రబృందం చెప్పుకున్నా -ఏతావాతా సినిమా అయితే తుస్సుమంది అన్నది నిజం. నిర్మాతలకు లాభాలు వచ్చి ఉండొచ్చేమోగానీ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు మాత్రం 30శాతం వరకూ మునిగిపోయారన్నది చివరిగా వచ్చిన కథనాలు. సాహో ఫలితం చూశాక భారీ మొత్తాలకు సైరాని కొనడానికి బయ్యర్లు వెనకాడుతున్నారట.
సోనాలి, సూర్యారావుపేట
పరిశీలించండి
వారం వారం వెనె్నల పేజీలో కొత్తగా విడుదలైన సినిమాలపై రివ్యూలు చాలా బావుంటున్నాయి. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే వెనె్నలలో ఆయా సినిమాలకు ఇస్తున్న రేటింగ్స్ (స్టార్స్)ని బట్టి ఏ సినిమాకు వెళ్లాలో నిర్ణయించుకుంటున్నామంటే అతిశయోక్తి కాదు. అయితే కొన్నిసార్లు ఒక్కోవారం ఐదారు సినిమాలు విడుదలవుతున్నా, వెనె్నలలో కేవలం రెండు లేక మూడు సినిమాలకే సమీక్షలు రాస్తున్నారు. పాఠకుల తరఫున అభ్యర్థన ఏమంటే -స్థలాభావం కారణంగా అన్ని సినిమాల రివ్యూలు ఇవ్వలేకపోయినా క్లుప్తుంగా సినిమా గురించి చెబుతూ రేటింగ్స్ ఇస్తే బావుంటుంది. ఆ స్టార్స్‌ని బట్టి సినిమాకు వెళ్లాలో వద్దో ఆడియన్స్ నిర్ణయించుకుంటారు. పరిశీలించండి.
-విఎన్‌సి రాయుడు, గొల్లలవలస
వెనె్నల సూపర్
ఒకప్పటి నటి రూపాదేవి ఇప్పుడెలావున్నారన్న విషయాన్ని వెనె్నలలో ఆర్టికల్ ద్వారా తెలియజెప్పిన రచయిత సరయు శేఖర్‌కు అభినందనలు. ఆమె మా అభిమాన నటి. హనుమాన్ ప్రసాద్ గురించి, ‘్భలేతమ్ముడు’ మరో హీరోయిన్ కాంచన సోదరిగురించి, బిఏ సుబ్బారావు కామెడీ గురించి వెనె్నల కథనాల్లో తెలుసుకుని ఆనందించాం. వెనె్నలలో ప్రచురిస్తున్న సినిమా సమీక్షలు క్వాలిటీగా, వివరణాత్మకంగా బావుంటున్నాయి. పాఠకులకు మరిన్ని మంచి విషయాలు అందించాలని ఆశిస్తూ..
-టి సదా, తిరుపతి
ముచ్చట్లు భలే
వెనె్నల సినిమా అనుబంధంలో ఇమంది రామారావు అలనాటి ‘సీతారామకల్యాణం’ చిత్ర వివరాలు అందించటం బావుంది. శ్రీరాముడిగా హరనాథ్‌ను ఆ సినిమా పూర్తయ్యే వరకు సిగరెట్లు, మద్యమాంసాలు ముట్టవద్దంటూ ఎన్టీఆర్ చెపుతూ ఇద్దరు బాడీగార్డ్‌లను నియమించారన్నారు. కాని ఓసారి హఠాత్తుగా ఎన్టీఆర్ స్టూడియోలోకి ప్రవేశించగానే శ్రీరాముడి గెటప్‌లో హరనాథ్ సిగరెట్ కాలుస్తుండటం చూసి ఆగ్రహంతో.. వెంటనే వెళ్లి స్నానంచేసి రమ్మన్నారనే విషయం కథనంలో పేర్కొనలేదు. రావణాసురుడి పాత్రను ఎంతో నిష్ఠగా, పవిత్రంగా ఎన్టీఆర్ వేస్తే, శ్రీరాముడి పాత్రను హరనాథ్ పవిత్రంగా భావించలేదన్న కథనాలు అప్పట్లో వచ్చాయి
-ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
పెద్ద ఆదరణ
హీరో ఎవరైనా కావొచ్చు, మంచి కథతో తీస్తున్న చిన్న బడ్జెట్ సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. అందుకు నిదర్శనం ఇటీవల విడుదలైన ఎవరు?, రాక్షసుడు చిత్రాలను ఉదహరించాలి. గతం ఏడాది విడుదలైన హుషారునూ గుర్తు చేసుకోవచ్చు. మీడియం రేంజ్ చిత్రాలుగా చిత్రలహరి, బేబీ ఓ బేబీ, బ్రోచేవారెవరురా?, నినువీడని నీడను నేనే.. చిత్రాలనూ ప్రస్తావించొచ్చు. చిన్న బడ్జెట్‌తో వచ్చిన చిత్రాలే అయినా, ఇవన్నీ లాభాల బాట పట్టాయి. అంతకుముందు సంవత్సరాల్లో గూఢచారి, ఆర్‌ఎక్స్ 100 చిత్రాలూ అంచనాలకు మించి కలెక్షన్లు సాధించాయి. మంచి కథ, బలమైన కథనంతో సినిమాను ప్రేక్షకులకు కనెక్ట్ చేసి లాభాలు ఆర్జించవచ్చన్న విషయాన్ని ఈ సినిమాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ చిన్న సినిమాల ముందు కొన్ని పెద్ద సినిమాలు సైతం కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తెరగాలి.
-ఎఆర్ రామారావు, ఖమ్మం