మీ వ్యూస్

చరిత్రను వక్రీకరిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి తీసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాటిక్‌గా హిట్ కావొచ్చు. కానీ చారిత్రక కథగా ప్రచారం చేసుకుని ఇష్టారీతిన తీసిన సినిమాను గొప్ప చిత్రంగా పరిగణించలేం అంటోంది పూర్వతరం. తెల్లదొరల పాలనలో రైతుల నుంచి పన్నులు వసూలు చేయడానికి పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. వసూలు చేసిన శిస్తుల్లో కొంత ఉంచుకుని, కొంత బ్రిటీష్ పాలకులకు అందించేవారు. ఆ వ్యవస్థ నిజానికి బ్రిటీష్‌కు అనుకూలంగానే ఉండేది. ఓ పాలెగాడి దత్తపుత్రుడు నరసింహారెడ్డి. బ్రిటిష్ దొరలు దత్తతను నిషేధిస్తూ చట్టం తెచ్చాక, పాలెగాళ్ల వ్యవస్థనూ రద్దు చేసి భరణం ఇవ్వడం ఆపేశారు. నరసింహారెడ్డి దత్తత తండ్రి మరణించటంతో, రద్దయిన దత్తత చట్టంకింద నరసింహారెడ్డికి భరణం ఇవ్వడం ఆపేసింది బ్రిటీష్ ప్రభుత్వం. దాంతో నరసింహారెడ్డి బ్రిటీష్‌పై కోపగించాడు. ప్రభుత్వ ట్రెజరీపై దాడిచేశాడు. ట్రెజరీ ఆఫీసర్, తాహశీల్దార్‌ని చంపేసి 8 రూపాయలు దోచుకున్నాడు. ఈ సంఘటనతో ఆగ్రహించిన బ్రిటీష్ ప్రభుత్వం అతనిపై నిఘాపెట్టింది. ఈలోగా నరసింహారెడ్డి మరో తాహశీల్‌ను చంపేసి పరారయ్యాడు. ప్రభుత్వం చివరకు అతనిని పట్టుకొని రాజద్రోహం నేరంమోపి ఉరితీసింది. ఇదీ నరసింహారెడ్డి చరిత్ర. అతనికి దాస్యవిముక్తి, స్వాతంత్య్ర పోరాటంలాంటి భావాలేమీ లేవు. కాని గొప్ప దేశభక్తుడు, స్వాతంత్య్ర పోరాటయోధునిగా అతనిని కీర్తించడం మొదలెట్టారు కొందరు అంటూ -పూర్వ గ్రంథాలను పరిశీలించిన వాళ్లు అంటున్నారు. ఒక కట్టుకథని చరిత్రగా చలామణి చేయడం తగదని పూర్వతరం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అలనాటి.. పొరబాటు
సెప్టెంబర్ 29 వెనె్నల సంచికలో ఆనాటి హృదయాల శీర్షికన లవకుశ సినిమా గురించి రాస్తూ -ఆదిలో హంసపాదులా పుల్లయ్య మరణం అని రాశారు రచయిత ఇమంది. అది పెద్ద తప్పు. షూటింగ్ దశలో పుల్లయ్య కుమారుడు సిఎస్ రావు సహకరించారు. 1963లో లవకుశ విడుదలైంది. దర్శకుడు పుల్లయ్య ఆ చిత్ర ఘన విజయాన్ని కళ్లారూ చూశారు కూడా. తరువాత 1966లో పరమానందయ్య శిష్యుల కథ, 1967లో గుణసుందరి కథ చిత్రాలకు దర్శకత్వం వహించారు పుల్లయ్య. 1967లో కీర్తిశేషులయ్యారు. లవకుశ షూటింగ్‌కు ముందే మరణించారనటం -పెద్ద పొరబాటు. అతి ముఖ్యమైన విషయాలను ఏమాత్రం అధ్యయనం చేయకుండా రచయిత ఇలాంటి పొరబాటు చేయడం దారుణం.
-ఎస్వీ రామారావు, హైదరాబాద్
బిరుదార్థమేమి?
సినీ ప్రముఖులకు బిరుదులిచ్చి సత్కరించటం సుబ్బిరామిరెడ్డికి హాబీ. అయితే ఆ బిరుదుల్లో అర్ధసమన్వయం కుదరని చిన్న లోపాలుంటున్నాయి. ఆమధ్య బి సరోజాదేవికి ‘విశ్వనట సామ్రాజ్జి’ అని బిరుదునిచ్చారు. కానీ ‘నట’ పదం పురుషులకు సంబంధించినది. కనుక విశ్వనటీ సామ్రాజ్ఞి అనిగాని విశ్వనటనా సామ్రాజ్జి అనిగాని అనాలి. ఈమధ్య జయసుధకు ‘అభినయ మయూరి’ బిరుదుయిచ్చారు. మయూరి అంటే నెమలి. అయితే నెమలికి నాట్యం తప్ప నటన తెలీదు. అదీకాక పురివిప్పి నాట్యం చేసేది మగ నెమలి. ఆడ నెమలికి పురి ఉండదు. నాట్యం చెయ్యదు, నటన రాదు. మరి అర్థసమన్వయం ఎలా? ఒక పత్రికలో అభినవ మయూరి అని రాశారు. అంటే కొత్త నెమలి!?
-పూర్ణచంద్ర, శ్రీనగర్
భారీగా పోతున్నారు..
భారీ బడ్జెట్ చిత్రాలకు భారీగా లాభాలొస్తాయనుకోవడం భ్రమ అని రజనీకాంత్ చిత్రం 2.0తోబాటు తాజాగా సాహో కూడా నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన చిత్రానికి బాలీవుడ్‌లో కాస్త లాభాలొచ్చాయ్. ఇతర ఉడ్‌లలో నాలుగైదు రోజులు కలక్షన్లు బాగున్నా తర్వాత క్షీణించాయి. నిర్మాతలకు కాస్తంత లాభాలు రావచ్చుగాని భారీ మొత్తాలకు కొనుగోలు చేసిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ముప్పయి శాతానికి మునిగిపోయారని ఒక పత్రిక కథనం. సాహో ఫలితం చూశాక సైరాని కొనడానికి బయ్యర్లు అటూ ఇటూ ఊగారు. కానీ, ఆ సినిమా హిట్టవ్వడంతో కొన్న బయ్యర్లంతా భారీగా బాగుపడే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. సో, భారీ బడ్జెట్ చిత్రాలైనా లక్కుమీదే ఆధారపడి ఉంటాయన్న మాట.
-పీవీఆర్, సికింద్రాబాద్
చూడండి బాసూ..
చాలాకాలం క్రితం ‘గొల్లభామ’ చిత్రం చూసి ప్రేక్షకులు ఆనందించారు. కొద్దికాలం క్రితం అదే గొల్లభామ టైటిల్‌తో చిత్రాన్ని పునర్నిర్మిస్తే -నిరసన తెలిపారు కొందరు. దాంతో టైటిల్‌ని ‘్భమా విజయం’ అని మార్చారు. రాణి పద్మిని కథను పద్మావతి పేరుతో హిందీలో తీస్తే ఆమె ముస్లిం సుల్తాన్ ఎదుట నృత్యం చేయడాన్ని రాజస్థాన్‌లో నిరసించగా ‘పద్మావత్’ అని పేరు మార్చి కల్పిత కథ అని ప్రచారం చేశారు. ‘మెంటల్‌హై క్యా’ హిందీ చిత్రం పేరు కూడా ‘జడ్జిమెంటల్ హై క్యా’ అని మార్చాల్సి వచ్చింది, మెంటల్ అనే పదాన్ని సైకియాట్రిస్టుల సంస్థ నిరసించటంవల్ల. ఇలాంటి సంఘటనలన్నీ సినీ రంగంలోని వారు గుర్తించి జాగ్రత్తగా టైటిల్ పెట్టుకోవాలి. చెడునుంచి మంచికి మారడానికి వాల్మీకి కన్నా గొప్ప ఉదాహరణ లేదని భావించి హరీశ్‌శంకర్ ‘వాల్మీకి’ టైటిల్ పెట్టానంటాడు. కాని ఫస్ట్‌లుక్ చూస్తే హీరో భాష, లుక్స్ పరమ కిరాతకంగా ఉన్నాయి. వాల్మీకి తన కులాచారం ప్రకారం జంతువుల్ని పక్షుల్ని వేటాడాడు తప్ప క్రూరుడు కాదు. కాని సినిమా వాల్మీకి మాత్రం పరమ క్రూరుడులా కనిపిస్తాడు. అందుకే సినిమా పేరు ‘గద్దలకొండ గణేశ్’గా మారింది!
-శాంతిసమీర, వాకలపూడి
ఎంత బాధాకరం
అటు ఇమంది రామారావు, ఇటు సరయు శేఖర్.. పాతతరం సినిమావాళ్ల జ్ఞాపకాలను పొదివి పట్టుకొని కథనాలుగా ఇస్తున్న వైనం వెనె్నలకే హైలెట్. మొన్నటివరకు ప్రేక్షక హృదయంలో పాతతరం స్టార్‌గా గుర్తిండిపోయిన చంద్రకళ ఆమె చివరి క్షణంలో అన్న మాటలు, రచయిత ప్రస్తావించిన విధానం కంట తడి పెట్టించింది. యన్టీఆర్, శోభన్‌బాబులకు చెల్లెలిగా నటించిన చంద్రకళ స్టార్‌వెలుగే వెలిగినా, చివరి రోజుల్లో క్యాన్సర్ బారినపడి పోవడం బాధాకరం. ఈవారం వెనె్నల కథనాలు మరీ బావున్నాయి.
-పీఎస్ నారాయణ, రాజమండ్రి

-ఎల్వీఎస్, పాలకొల్లు