మీ వ్యూస్

విషాదభరితం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్ వేణుమాధవ్ ఆకస్మిక మరణం -చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. ఆయనలాగే చాలామంది తెలుగు కమెడియన్లు సంపూర్ణ జీవితాన్ని అనుభవించకుండానే -లైఫ్ స్క్రీన్‌నుంచి మాయం కావడం నిజంగానే విషాదభరితం. వేణుమాధవ్ కథనంలో ఎంతోమంది కమెడియన్స్‌ని గుర్తు చేయడం -నిజంగానే నివాళిగా అనిపించింది. ఇలాంటి మరణాలు సంభవించినపుడు -చానెల్స్‌లో వాళ్లు నటించిన చిత్రాలో, సన్నివేశాలో వరుసగా వేసి గుర్తు చేసుకోవడం తప్ప, గొప్ప కళాకారులను శాశ్వతంగా గుర్తు చేసుకునేలా ఏదైనా కార్యక్రమాలు చేస్తే బావుందన్నది చాలామంది అభిప్రాయం. ఏదైమైనా ఎన్నో కష్టాలకోర్చి పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు సొంతం చేసుకున్న వేణుమాధవ్ వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ -ఇన్ని నవ్వుల్నీ తీసుకుపోయాడు. మంచి కమెడియన్లు మాయమవుతున్న కారణంగానే -తెలుగు తెరపై నవ్వులు కరవవుతున్నాయి.
-జి బాలాజీ, సికింద్రాబాద్
ఓవర్’సీజ్
గతవారం వెనె్నలలో ‘ఓవర్‌సీస్’ బిజినెస్ మీద ఇచ్చిన వ్యాసం ఆసక్తికరంగా ఉంది. అత్యాశకు పోయి టాలీవుడ్ నిర్మాతలు ఓవర్‌సీస్ వ్యాపారాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో -శాటిలైట్ బిజనెస్‌తో కంపేర్ చేయడం బావుంది. ఒకప్పుడు శాటిలైట్ బిజినెస్ కోసమే అన్నట్టు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఏ ఒక్కటీ థియేటర్‌లో పట్టుమని రెండు షోలు కూడా పడకపోయినా.. విడుదలకు ముందే శాటిలైట్ ఒప్పందాలు చేసేసుకుని బిజినెస్ చేసుకున్న దాఖలాలు లేకపోలేదు. ఇప్పుడు అదే పంథాను అనుసరిస్తోంది ఓవర్‌సీస్ బిజినెస్ కూడా. స్టార్ హీరోల చిత్రాలను కోట్లుకు అమ్ముకుంటూ.. తీరా సినిమా విదేశీ థియేటర్లలో విడుదలయ్యాక రిటర్న్స్ లేక లబోదిబోమంటున్నారు. అందుకే -ఆనుపానులు చూసుకుని బిజినెస్ డీల్ కుదుర్చుకునే దూరాలోచన ప్రదర్శిస్తున్నారు బయ్యర్లు. అతికిపోకుండా ఓవర్‌సీస్ బిజినెస్ విషయంలో జాగ్రత్తపడకపోతే -ఓవర్’సీజ్ ఖాయం.
-పైడి రాజేంద్ర, రాజమండ్రి
కాస్త మార్చండి
ప్రతి ఆదివారం సినిమా సంపుటిగా అందిస్తోన్న వెనె్నల ఆసక్తికరంగా ఉంటున్నా -ఎప్పటినుంచో వస్తున్న శీర్షికలనే కంటిన్యూ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో -తెరకు దూరమైన ఆర్టిస్టులు, కళాకారుల ‘జ్ఞాపకాలు’ అందిస్తోన్న విధానం ఒక్కటే కొత్తగా ఉంది. నచ్చిన పాట, నచ్చిన సినిమా అనే శీర్షికలు మొదలెట్టి చాలాకాలమే అయ్యింది. పైగా, వాటిలోనూ పాత చిత్రాల గురించే పాఠకులు పంపుతున్నారు. కొత్త చిత్రాల్లోనూ మంచి సినిమాలు ఉంటున్నాయిగా. వాటిగురించీ రాస్తే బావుంటుందిగా. ముఖ్యంగా వెనె్నల కవర్ కథనాలు ఊహించని రీతిలో ఉండటం విశేషం. చాలా సినిమా పత్రికల్లో కనిపించని అనేక అంశాలను ముఖ చిత్ర వ్యాసాలుగా ఇవ్వడం అభినందనీయం. లోపలి పేజీల్లో ‘్ఫ్లష్‌బ్యాక్’ శీర్షిక బావుంటుంది. రచయిత్రి మాణిక్యేశ్వరి పాత చిత్రాలకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలు అందించటం పట్ల అభినందనలు.
-పాముల ఈశ్వరి, కడప
వీళ్లా ప్రేమికులు..?
‘‘ఇదేనా బాధ్యత?’’ అంటూ పర్యావరణం గురించి సినీ సెలబ్రిటీస్ ఊగిపోవడాన్ని విమర్శించిన లేఖాంశాలతో ఏకీభవిస్తున్నాం. ఎక్కడో ఉన్న నల్లమల సంగతి అటుంచండి. న్యూలుక్ అంటూ హీరో ముఖాన్ని దట్టమైన గడ్డాలు మీసాలతో నింపేసి ఖంగున మోగే కంఠ స్వరంతో వల్గర్ బూతులు మాట్లాడుతూ పరమ చండాల ఇమేజ్‌ని హీరోకి ఆపాదించి వాత్సాయనుడు కూడా సిగ్గుపడేట్టు ఆడ శరీరాన్ని వల్గర్ భంగిమల్లో చూపించి న్యూ సినిమా అంటే ఇదే అని చూపిస్తున్నారు. డబ్బుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు. సమాజాన్ని భ్రష్టుపట్టిస్టున్నారు. పర్యావరణం గురించి బెంగ నటిస్తున్న ఈ సెలబ్రిటీస్ ఈ దిగజారుడుని నిరసించక ఆమోదిస్తున్నారు.
-జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్
భారతంలో బాహుబలి?
అతిరధులు మహారధులు మహాభారతంలో ఎనలేని యశస్సుపొంది వీరస్వర్గము అలంకరించినారని భారత ఇతిహాసం చెపుతుంది! అదే విధముగా మూడు బాణాలు ఒకేసారి ప్రయోగించిన మహావీరుని కథ బాహుబలి దర్శకుడు సేకరించి అనేక మార్పులతో చిత్రాన్ని నిర్మించాడని వేద పండితులు మేధావులు చెప్పుకొచ్చారు. అర్జునుడు రెండు చేతులతో బాణములు వేయగలిగిన దిట్ట. శునకము మూతి మీద ఏడు బాణములు నిలబెట్టిన ప్రతిభాశాలి అని భారతంలో కథ. అందుకే అర్జునుడు సవ్యసాచిగా ప్రఖ్యాతిచెందినాడు. ఒకరిని మించిన ఒకరు వీరుల చరిత్ర కొంతవరకే కొంతమందికే తెలుస్తుంది. మరుగునపడిన మహాబలులు ఎంతమంది ఉన్నారో ఈ ధరణి మీద. భారతంలో భీముడి మనమడు బర్బరీకుడి కథే బాహుబలి అన్న చర్చా లేకపోలేదు? కాకపోవచ్చు కూడా. కానీ, బర్బరీకుడి కథను సినిమాగా తీయొచ్చు?
-కేవీపీఆర్, కందుకూరు
బాజాలు భలే భలే
రిలీజ్ ముందు ప్రమోషన్‌లో భాగంగా నిర్మాత, దర్శకుడు, నటీనటులు మా సినిమా బ్రహ్మాండమంటూ బాజాలు మోగించవచ్చు. కాని ఆ ప్రచార హోరులో పడి మీడియా సైతం వత్తాసు పలకడం తగదు. ఎందుకంటే రిలీజ్‌ముందు ఆకాశానికి ఎత్తేసిన సినిమా గురించి రిలీజ్ తర్వాత విరుద్ధంగా రివ్యూరాస్తే పరువుపోతుంది. సాహో విషయంలో అలాగే జరిగింది. సేమ్‌స్కేల్, సేమ్ స్ట్రాటజీ, సేమ్ భారీ బడ్జెట్, భారీ తారాగణం విదేశీ నిపుణులు కనుక బాహుబలి స్థానంలో సాహో కలక్షన్లు ఉంటాయని, సందేహం అక్కరలేదని బాజామోగించిన ఓ పత్రిక.. దాని రివ్యూ రాస్తూ ఓకే అనేసింది. మనవాళ్లు భారీగా ఖర్చుపెట్టడంలో హాలీవుడ్‌ని అనుకరిస్తారు గాని కథ, కథనం, పాత్రల వ్యక్తిత్వాలు నిలబెట్టడం, సన్నివేశాల్ని బిగువుగా తీర్చిదిద్దడంలో హాలీవుడ్‌ని టచ్ చేయలేరు. ఒకేలాంటి థీమ్‌తో జేమ్స్‌బాండ్ చిత్రాలు ఎన్నివచ్చినా హిట్టయ్యాయి. టెర్మినేటర్లూ అలరించారు. మిషన్ ఇంపాసిబుల్ సీక్వేల్స్ అన్నీ హిట్ అయ్యాయి. కాని బాహుబలిని చూసి అలాగే తీసిన సాహో బకెట్ తనే్నశాడు. హాలీవుడ్, టాలీవుడ్‌లకు తేడా అదే.
-వింధ్యారాణి, శ్రీనగర్