మీ వ్యూస్

హీరో’యినే్ల! (మీ వ్యూస్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో ఓరియంటెడ్ సినిమాల కాలంలోనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో ఎందరో మెప్పించారు. ముఖ్యంగా క్రైమ్ తరహా సినిమాల్లో విజయలలిత, జ్యోతిలక్ష్మి, మంజుల, కవితవంటి వారినే చెప్పుకోవచ్చు. విజయలలిత రౌడీరాణి, ఒకనారి వందతుపాకులు, బస్తీమే సవాల్, కొరడారాణి, పిల్లాపిడుగా లాంటి చిత్రాల్లో నటించారు. మంజుల- తుఫాన్ మెయిల్ అనే సినిమాలో నటించింది. పోలీస్ లాకప్, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ, సమ్మక్క సారక్క, పోలీస్ సిస్టర్స్, రోజాలాంటి చిత్రాలు హీరోయిన్ డామినేటెడ్ కథలతో సాగాయి. శారద, సుజాత, ప్రెసిడెంట్ పేరమ్మ, బాటసారి, చిల్లరకొట్టు చిట్టెమ్మ, రిక్షారాజి, పొట్టేలు పున్నమ్మ, అమ్మోరు, జయసుధ, జస్టిస్ రుద్రమదేవి, చారులత, చండీ చాముండి ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఇలాంటి చిత్రాలు ఇప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు.
-ఎ రఘురామారావు, ఖమ్మం

మార్చండి బాస్
వెనె్నల్లో వచ్చిన ‘కథలు మార్చండి బాస్’ చదివాక కొన్ని విచిత్రాలు కనిపిస్తాయి. తెలుగులో రాముడు భీముడు హిట్టవ్వగానే హిందీలో రామ్ ఔర్ శ్యామ్‌గా నిర్మించారు, అదీ హిట్. ఆ హిట్‌తో మగ పాత్రలను ఆడ పాత్రలుగా మార్చి అదే కథనే చిన్న చిన్న మార్పులతో సీతా ఔర్ గీతా తీసి విజయం సాధించారు. అవి తెలుగులో గంగ-మంగగా మారి హిట్టయ్యింది. ఏవిఎం వారికి కళత్తూరు కన్నమ్మ ఎంత నచ్చిందంటే తెలుగులోకి డబ్ చేశారు. హిందీలో పునర్నిర్మించారు. మళ్లీ తెలుగులో పునర్నిర్మించారు. తమాషా ఏంటంటే మన వాళ్లు హిందీ, తమిళ చిత్రాల హక్కులుకొని తెలుగులో నిర్మించిన చిత్రాలు ఇంతకుముందే తెలుగులో వచ్చాయని గుర్తించకపోవడం!
-జె జ్ఞానగుప్త, సిద్ధార్ధనగరం

ఎవరు వింటారు?
కథలు మార్చండి బాసు అని కోటి గొంతుకలతో అరచినా వినిపించుకోనేది ఎవరు? మనోళ్లకి సృజనాత్మకత తక్కువ. విజయం సాధించిన చిత్రాల కాళ్లు చేతులు తీసేసి మరొకరి కాళ్లు చేతులు తగిలించేసి చిత్ర విచిత్రాలు చేయడంలో సిద్ధహస్తులు. ఎంతో సృజనాత్మకతతో గొప్ప చిత్రాలు తీసిన వారిలోనూ రెండు మూడు చిత్రాలతోనే ఆ సృజనాత్మకత ఎండిపోయి, తాము తీసిన చిత్రాలనే మళ్లీ మళ్ళీ తీస్తూ వెలిసిపోయారు. కొంచెం ఆలోచిస్తే వాళ్వెవరో మీకూ తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే సృజనాత్మకత ప్రదర్శిస్తున్న నవతరం దర్శకుల కాలం ఎంతదూరం వెళ్తుందో చూడాలి!
-పి శాండిల్య, కాకినాడ

అణిగిమణిగి..
అవకాశం దొరికింది అని విర్రవీగడం మంచిది కాదు. కొంతమంది హాస్య నటులు తమ హద్దుదాటి ప్రవర్తిస్తున్నారు. రెండు పడవల మీద కాళ్లు పెట్టడం ప్రమాదకరం. హాస్యనటులు కథానాయకుడిగా నటించడం అత్యాశ! గాడిదచేసే క్రియ కుక్క చేస్తే చివరికేమైంది? రేలంగి కలసిఉంటే కలదుసుఖంలో విలన్ పాత్రకు మొదట భయపడ్డాడట. దర్శకుడి సలహా మేరకు నడుచుకుంటే కొంతవరకు విజయం సాధించింది. పార్వతీకళ్యాణంలో రమణారెడ్డి నారద పాత్రలో ఇమిడిపోయారు. అది కొంతవరకు హాస్య పాత్రగాబట్టి బాగుంది. కాబట్టి హాస్యనటులు అణిగిమణిగి ఉంటే మంచిది కదా!
-పి జనార్ధన్ రావు, నిడదవోలు

థియేటర్లకు వెళ్లం!
కథలు మార్చడం సరే కనీసం సీన్లైనా మార్చండి బాసూ! తలకు దెబ్బతగిలితే అంతా మరిచిపోయి మళ్లీ అదే చోట దెబ్బతగిలితే అంతా జ్ఞాపకం వచ్చే ఫార్ములాతో మా తలలు తినేశారు చాలాకాలం. డబుల్ రోల్స్‌లో ఒకడు హీరో, ఇంకొకడు విలన్. వాడి ఫీలింగ్స్ వీడికి వాడి ఫీలింగ్స్ వీడికి బదిలీ అయిపోతూ మధ్యలో మనల్ని హింసించారు. వల్గర్ కామెడీ, తాగుబోతు సీన్లు అవే అవే మళ్లీ వెల్లువెత్తుతున్నాయి. ఇది చాలక రొటీన్ ఫైటింగ్‌లు. ఇక్కడ కొట్టు, అక్కడ కొట్టు అంటూ అడిగిమరీ చావుదెబ్బలు కొట్టించుకొని చచ్చినట్టు పడిపోయి, చివరకు ఠంగున స్ప్రింగులా లేచి, పాతికమందిని చావగొడుతూనే ఉంటారు. ఆ దెబ్బకు మనమూ చస్తాం. అందుకే మేము థియేటర్లకు వెళ్లడం మానేశాం.
-సివి రామచంద్ర, పెద్దాపురం

అంచనా వద్దు
అగ్ర హీరో వెంకటేష్ సినిమాను ఆటాడించేస్తాడు అని అంచనా వేస్తే పొరపాటు. గోపాల గోపాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఈసారి తనదైన పాత్రలో రీఎంట్రీ ఇచ్చాడు బాబు బంగారంలో. భలే భలే మగాడివోయ్ విజయం తర్వాత మారుతి ప్రేక్షకులను ఏమాత్రం నిరాశ పరచకుండా తీస్తాడని కుటుంబంతో వెళ్తే అంతే! కథ రొటీన్‌గా ఉన్నా నవరసాలు దట్టించి, రుచికరంగా వండే ప్రయత్నం చేశాడు. వయస్సు పైబడుతున్నా వెంకటేష్‌లో పంచ్ తగ్గలేదు. పోసాని, బ్రహ్మానందంల కామెడీ ఒక ఎత్తుగా సాగింది. అయితే ద్వితీయార్థంలో సరిగా సినిమాను నడపలేకపోయారు. అంచనాలు లేకుండా వెళ్లిన వాళ్లకు అంత ఇబ్బంది లేదు.
-సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ

ఆమె గురించి ఈమెకెందుకు?
పెళ్లి చేసుకుని రెండేళ్లు కాకుండానే విడాకులు తీసుకున్న అమలాపాల్‌పై ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేయడం నిజంగా దారుణం. ఎవరి జీవితం వారిది. ఎవరి సమస్యలు వారివి. మధ్యలోదూరి ఉచిత సలహాలు చెప్పడం తోటి నటిగా ఎంతమాత్రం సరికాదు. నటించాలనుకున్నపుడు పెళ్లి చేసుకోకూడదన్నది ప్రియమణి సలహా. మరి -పెళ్లి చేసుకుని కూడా ప్రియమణి నటించటం లేదా? అంజలి, సావిత్రి, జమున, భానుమతి లాంటి సీనియర్ల నుంచి తరువాతి తరాలైన శ్రీదేవి, హేమమాలిని, ఐశ్వర్య, కరీనాలాంటి ఎందరో వివాహితలు హీరోయిన్లుగా నటించలేదా? ఇంకా నటించడం లేదా? వారికి ఓమిరి, నిబద్ధత ఎక్కువ. నవతరం తారలకు ఓరిమి తక్కువ. అందుకే విడాకులు ఎక్కువవుతున్నాయి. వివాహం నటనకు ఆటంకం కాదు.
గిరిధర్, కాకినాడ