మీ వ్యూస్

అదీ సీన్ అంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృదేవత అని ఓ సినిమా నాలుగు దశాబ్దాల ముందు వచ్చింది. అందులో హీరో బయటికి వెళ్తూ, నా మామూలు అని హీరోయిన్‌ని అడుగుతాడు. సీన్ ఛేంజవుతుంది. మరేదో చూపిస్తారు. వెంటనే పాత సీన్ వచ్చేస్తుంది. ముఖం నిండా సిగ్గుకప్పేయగా బుగ్గ తుడుచుకుని వెళ్తుంది కథానాయిక. ముద్దు ఆమె బుగ్గపై పెట్టడం చూపలేదు. కాని పెట్టినట్లు అర్ధమైంది. ఎక్స్‌ప్రెషన్ ద్వారా దాన్ని సజెస్టివ్ కిస్ అంటారు. ఆమె మహానటి. ఎన్ని కాలాలైనా గుర్తుండే సన్నివేశమది. జిప్‌లాక్‌లా లిప్‌లాక్ సన్నివేశాలు వస్తున్నాయి పోతున్నాయి. వాస్తవానికి ఈ లాక్ సిస్టమ్ పతాక సన్నివేశం. కాని ఇన్‌స్టెంటు సన్నివేశాలై వస్తున్నాయి, పోతున్నాయి. అంతటి సన్నివేశాన్ని కెమెరాకిచ్చిన వారికి తర్వాత ఆకార, వికారాలుండవు. వారికి అదో వరంకావచ్చు. అక్టోబర్ 1న చిత్రభూమిలో పూరీ యువ సమాజం మీదికి విసిరిన వల తాలూకూ కథానాయిక వీపంతా నగ్నంగా వుండగా, ఆయన వారసుడు బంధించిన దృశ్యం వచ్చింది. యూత్‌ని పిచ్చెక్కించడం ఖాయమని వార్తలోనే చెప్పారు. పిచ్చెక్కినవారు రోడ్ ఎక్కక ముందే ప్రభుత్వం ఇలాంటి దృశ్యాలు, సన్నివేశాలపై ఏమైనా చేస్తుందేమో చూడాలి.
-విఆర్‌ఆర్‌ఎ రాజు, హైదరాబాద్
రెండూ ఒకచోట..?
అందం, తెలివి కలిసి ఉండవని ఒక ఆంగ్ల సూక్తి. ఆ సూక్తి నిజమని చెప్పడానికి ఎన్ని ఉదాహరణలున్నాయో, నిజంకాదని చెప్పడానికీ అన్ని ఉదాహరణలుంటాయి. అమితాభ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో ఆయనకు ఎదురుగా హాట్‌సీట్‌లో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి కూర్చుంది. రామాయణం ప్రకారం హనుమాన్ ఎవరికోసం సంజీవని తీసుకొచ్చాడని అమితాబ్ అడిగితే ఆమె సమాధానం చెప్పలేకపోయింది. నువ్వు శత్రుఘ్నసిన్హా కూతురివి. మీ గృహం పేరు రామాయణ్. అయినా రామాయణానికి సంబంధించిన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయావని బచ్చన్ జోక్ చేశాడు. ఆంగ్ల సూక్తి నిజమేనని నిరూపించింది సోనాక్షి! అందం, తెలివి కలిసి ఉండవు. నిజమా?!
-ప్రభాస్, గాంధీనగర్
ఔను.. నిజమే
‘పరిశీలించండి’ అంటూ కేవలం రెండుమూడు చిత్రాల రివ్యూల్లోకాక వారంలో విడుదలైన మిగిలిన చిత్రాల రివ్యూలు కనీసం క్లుప్తంగా ప్రచురించి రేటింగ్ ఇమ్మని కోరిన లేఖ సమంజసంగా ఉంది. వెనె్నలలో కుదరకపోతే ప్రతిరోజూ వచ్చే చిత్రభూమి పేజీలోనైనా మిగిలిన చిత్రాల రివ్యూలు సోమ, మంగళవారాల్లో ఇచ్చినాసరే బావుంటుంది. ఆలోచించండి.
-ప్రసన్న, పేర్రాజుపేట
ఎవరి హాస్యం వారిదే
ఒక్కొక్కసారి హాస్యం, నవ్వు వెరైటీగా వుందనడంలో సందేహమే అఖ్ఖర్లేదు. ఆనాటి నేటి రేపటి తరాల హాస్యనటులు అభిమానులను అలరిస్తూనే వున్నారు. అలాంటి వారిలో వేణుమాధవ్ ఒకరు. చిత్రసీమకు లోటయినా ఆయన పండించిన పాత్రలు పూయించిన నవ్వులు మరువలేనివి. ఎందరో హీరోల హీరోయిన్ల చిత్రాల్లో తనతోటి హాస్య నటులతో మనల్ని నవ్వించి ఒక వెరైటీ చూపారు. మనమధ్య లేకపోయినా వేణుమాధవ్ చిత్రాలు ఎప్పటికీ మరువరానివి. అందుకో నివాళులు.
-సిహెచ్ నాగేశ్వరరావు, హైదరాబాద్
అంత మోసేయ్యాలా..
శ్రీదేవి గొప్ప నటే. సందేహం లేదు. అంతమాత్రాన ఆమెని ఒక దేవతను చేసి అతిలోక సుందరి, జగదేక సుందరి అంటూ భజన చేయనక్కరలేదు. గొప్ప నటిగా గౌరవిస్తే చాలు. బాలీవుడ్‌లో అవకాశాలకోసం ఆంధ్రను వీడి బోనీకపూర్ రెండో భార్యగా సెటిలై టాలీవుడ్‌పై కనె్నత్తిచూడకపోయినా భజన ఆపరు, ఆమె వృద్ధురాలై తల్లి పాత్రలు పోషిస్తున్నా అదే భజన. ఆమె రీఎంట్రీలో రాజవౌళి బాహుబలిలో పాత్ర ఆఫర్ చేస్తే తిరస్కరించి తమిళ చిత్రంలో నటించినా అదే భజన. ఆమె చనిపోయాక జగదేక సుందరి కూతురంటూ జాన్విని నెత్తినమోస్తూ భజన మొదలుపెట్టారు. ఆమెను టాలీవుడ్‌కి పరిచయంచేయాలని కొందరు ఉత్సాహపడితే దిమ్మతిరిగేట్లు నాలుగు కోట్లు డిమాండ్ చేసిందట. నో చెప్పగానే రాజవౌళి శ్రీదేవిని బతిమాలలేదు. రమ్యకృష్ణతో ఆ పాత్ర చేయించి భేష్ అనిపించుకున్నాడు. జాన్వికంటే అందకత్తెలు చక్కగా నటించగలవారు కోటికంటే తక్కువ పారితోషికానికే లభించే కన్నడ, మలయాళ, తెలుగు భామల్ని వదిలేసి జాన్వి చుట్టూ భజన ఎందుకు?
-్ధర్మతేజ, గొడారిగుంట
సమీక్ష బావుంది
ఔరా! చిరంజీవ అంటూ సమీక్షకుడు మహదేవ మహాద్భుతంగా 3స్టార్స్ రేటింగ్‌తో విశే్లషణ బాగా యిచ్చారు. మేము కూడా వెంటనే సినిమా చూడ్డంవలన వారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం. సినిమా మొత్తానికి బావుందనిపిస్తోంది. మీ వ్యూస్‌లో కూడా ఉత్తరాలు వారి వ్యూస్ సైరావారి విమర్శలు, ప్రశంసలు సహేతుకంగా ఉన్నాయి. ఎలాగూ నరసింహారెడ్డి జీవితకథను ఉన్నదున్నట్లుగా తీయలేదు గనుక, ముగ్గురు టాప్ హీరోయిన్స్ ఉన్నందుకు మూడు పాటలు, డాన్సులు, కామెడీ యాక్టర్లను కూడా దించి కామెడీ పండిస్తే సైరాకూడా మరో ఏదో సినిమా అయ్యేది.
-ఎవి సోమయాజులు, కాకినాడ
అది చెప్పరేమి
వేణుమాధవ్ అకాల మరణంతో 60 ఏళ్లు నిండకుండానే అర్ధాంతరంగా చనిపోయిన హాస్యనటులపై ఫీచర్లు చాలా పత్రికల్లో వచ్చాయి. చాలా మంది కవితాత్మకంగా జాలికురిపించి విధిని నిందించారు గాని అసలు కారణం ఎవరూ స్పృశించలేదు. అసలు కారణం ఆ నటుల జీవనశైలి. అత్యధిక మరణాలు మద్యంవల్లనే. మద్యం ఎక్కువైతే రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. ఆ చిహ్నాలు తెలుస్తూనే ఉంటాయి. డాక్టర్ సలహాపై తగిన విశ్రాంతి తీసుకుంటూ జీవనశైలి మార్చుకోవాలి. కాని మనవాళ్లు విశ్రాంతి లేకుండా ఇంకా ఇంకా సంపాదించాలన్న యావతో నటిస్తూ ఉండడం, మద్యాన్ని కంట్రోల్‌లో పెట్టుకోలేక పోవటంవల్లనే మరణాలు. చేతులారా చేసుకున్నదే గాని విధిని నిందిస్తారు!
-గిరిధర్, కాకినాడ