మీ వ్యూస్

చాకచక్యం కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్ ‘చాణక్య’ ఫరవాలేదు కానీ చాకచక్యం కరువైంది. థ్రిల్లర్ కథాంశం ఉండడంవల్లనే సినిమా కొంత విశ్రాంతి తర్వాతనుంచి బాగుందనిపించింది. సంగీతం ఆకట్టుకోలేదు. ఈమధ్య అన్ని సినిమాల్లో సాంగ్స్ ఉత్తేజపరిచేవిగా ఉండటంలేదు. మెలోడీ ట్యూన్స్‌ను ఉత్సాహపరిచేలా చేయటం లేదు. మెహరిన్ గ్లామర్‌గా బాగుంది. గోపీచంద్‌కు అప్పుడే ముసలి ముఖం ఛాయలు వచ్చేశాయ. అతను ఫిట్‌నెస్ మీద ముఖ వర్చస్సుమీద శ్రద్ధతీసుకోవాలి. సునీల్ గ్రాఫ్ పడిపోయిందనటానికి ఈ చిత్రమే ఉదాహరణ. ఆలీ కూడా అంతే! చిత్రంలో వినోదం ఇంకా మెరుగుపరిస్తే బాగుండేది. సైరా టైంకాకుండా కొంత గ్యాప్ తర్వాత వచ్చుంటే కలక్షన్స్ వేరుగా ఉండేవేమో. డైరెక్టర్ తిరు సీక్వెల్స్‌కు సిద్ధమవుతుంటే, స్క్రిప్ట్‌లో శ్రద్ధ చూపాలి.
-పివి శివప్రసాదరావు, అద్దంకి
ఏంచెప్పినట్టు..
సైరా నరసింహారెడ్డి చిత్ర కథ చారిత్రకమైందిగా ప్రచారం చేసుకోవడంపైన పూర్వతరం వారి అభ్యంతరం అంటూ లేఖకులు పాలకొల్లునుండి వ్రాసిన లేఖ అక్టోబర్ 6న వెనె్నలలో వేశారు. ఈ లేఖద్వారా తెలియవచ్చింది ఏమంటే, దత్తత విధానం రద్దుచేసిన బ్రిటీష్ ప్రభుత్వం, ఓ పాలెగాడి దత్తత కుమారుడైన నరసింహారెడ్డికి భరణం నిలుపుదల చేసింది. అందుకు ప్రతిగా నర్సింహారెడ్డి ట్రెజరీపై దాడిచేశాడనీ ఆంగ్లేయులు అందుకే ఉరితీశారని తెల్పబడింది. చారిత్రకంగా యిదే నిజమైతే మనం ఇంతకాలం తొలి స్వతంత్ర పోరాటాన్ని ఝాన్సీలక్ష్మీబాయి 1857లో ప్రారంభించారని చదువుకున్న దానిని చెరిపివేస్తూ ఝాన్సీలక్ష్మీబాయి పాత్ర (అనుష్క)ద్వారా సైరా కథను చెప్పించడం చరిత్రపై చేసిన దాడిగా భావించాలి.
అంతేనా! ఎలాటి ఆధారంలేకుండా ఆనాడే ముస్లిం యువకుడు హిందూ యువతిని వివాహమాడినట్లు చూపడం, యుద్ధఘట్టాలలో ప్రతిఫ్రేంలో ఓ ముస్లిం యువకుని సంబంధిత టోపీతో చూపడం పెల్లుబికిన లౌకిక పైత్య రసప్రకోపమే మరి. కాషాయ జెండాతోపాటు చిత్ర విచిత్ర జెండాల ప్రదర్శన అందించి నవ్వుతెప్పించారు. బ్రిటీషువారి ఉద్యోగులుగా శైవధర్మ చిహ్నం విబూదితో పృథ్వి చివరిలో దేశభక్తునిగా మారితే తిరునామాలతో రఘుబాబు ఆసాంతం రాఘవాచారి పేరుతో అలాగే వుండిపోయాడు. సినిమాను మరీ మోసేశారు.
-విఆర్‌ఆర్‌ఎ రాజు, హైదరాబాద్
వాళ్లేం చెప్తే అదే..
ప్రతీ దిన వారపత్రికలో తారల ఇంటర్వ్యూలు ఒక తప్పనిసరి ఫీచర్. తారలు చెప్పిన విషయాల్ని విలేఖరులు బుద్ధిగా రాసుకొని పాఠకులకు వడ్డిస్తారు. విషయంలో తేడావున్నా పట్టించుకున్నట్టు కనిపించటం లేదు. ఇటీవల తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ తను తెలుగు అమ్మాయి అయినందువల్లనే తెలుగు చిత్రాల్లో అవకాశం ఇవ్వడంలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కొన్ని ప్రశ్నల తర్వాత తను ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి చెప్తూ తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లోచేస్తున్నా. తెలుగులో చాలామంది అడుగుతున్నారుగాని అన్నీ ఒకే రకం కథలు అవడంతో ఓకే చెప్పలేదు అంది. ఒకవైపు తెలుగులో అవకాశాలు ఇవ్వడంలేదంటూ.. మరోవైపు చాలామంది అడుగుతున్నారనడంలో అర్థం ఏమిటి? ఇలా ఉంటాయి ఇంటర్వ్యూ సొబగులు!
-అయోధ్యరామ్, పెద్దాపురం
లవ్ స్టోరీలు తీయాలి
ఇటీవల మన పెద్ద హీరోలు ఎక్కువగా మెసేజ్ ఓరియెంటెడ్ మరియు స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను తీస్తున్నారు. ఆ చిత్రాలుకూడా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాయి. కాని చిన్న చిత్రాల్లో మాత్రం లవ్‌స్టోరీలు వసున్నా, అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. సినీ ప్రేమికుల్లో చాలావరకు అగ్ర హీరోల అభిమానులే. వీరుమాత్రం తమ అభిమాన హీరోనుండి మంచి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలు రావాలని కోరుకుంటున్నారు. రవితేజ, అల్లుఅర్జున్, కళ్యాణ్‌రామ్ వంటి హీరోలనుండి మంచి ప్రేమకథాచిత్రాలు రావాలి. ఆ దిశగా అగ్రహీరోలు అడుగులు వేయాలని కోరుకుందాం.
-బి కృష్ణమాచారి, హైదరాబాద్
మళ్లీ స్టార్ ఎందుకు?
వెనె్నలలోని చిత్ర సమీక్షలను నాలాంటి పాఠకులు ప్రమాణంగా తీసుకుంటూ వుంటాం. ‘ఆర్‌డిఎక్స్ లవ్’, ‘వదలడు’ సమీక్షలనుబట్టి అవి చూడదగ్గ సినిమాలు కావని అర్ధం అవుతున్నది. మరి వాటికీ ‘ఒక చుక్క’ రేటింగు దేనికి? ఒక చుక్కకన్నా కిందది ఏమీయివ్వరా. అంటే, ఏ చుక్కా లేకుండా వదలవచ్చుకదా! ఆనాటి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల ముచ్చట్లు వెనుక పేజీలో బావుంటున్నాయ. వాటినే ముందు పేజీలో మరింత ఆసక్తిగా ఇస్తే బావుంటుందేమో.
-డి యుగంధర్, వక్కలంక
-పి మల్లిఖార్జున రావు, కాకినాడ
దేవర్ ఫిలింస్..
ప్రధాన హీరోలతోపాటు జంతువులు ప్రధానాంశగా చిత్రాలను నిర్మించినవారిలో దేవర్ ఫిలింస్‌ను ఆదర్శంగా చెప్పాలి. దీని వ్యవస్థాపకుడు ‘చిన్నప్ప దేవర్’. రజనీకాంత్‌తో రాము గెలుపునీదే, అమ్మఎవరికైనా అమ్మ, రామలక్ష్మణులు (కృష్ణంరాజు, మోహన్‌బాబు), పొట్టెలు పున్నమ్మ (శ్రీవిద్య.. మురళీమోహన్) వంటి హిట్ చిత్రాలను అందించారు. తమిళ, తెలుగు భాషల్లో అనేక చిత్రాలను నిర్మించారు. హిందీలోనూ ప్రముఖ హీరోలతో చిత్రాలను నిర్మించారు. ఆయన బాటలోనే జంతువులు ప్రధానాంశంగా అనేక చిత్రాలు వచ్చాయ. మావూరి మారుతి (ప్రభ, మురళీమోహన్), పంచకళ్యాణి (చంద్రమోహన్- అనురాధ), నోము ఎవిఎం (రామకృష్ణ-చంద్రకళ), మారుతి (సుమన్), హిందీలో హాతి మేరా సాతీ (రాజేష్‌ఖన్నా), అడవిరాముడు (ఎన్‌టిఆర్). విఠలాచార్య సినిమాలో ప్రతి జంతువుకూ ప్రత్యేక పాత్రని చేశారు. అందుకే ప్రేక్షకులు హిట్ చేశారు.
-ఎ రఘురామారావు, ఖమ్మం