మీ వ్యూస్

నయన్ నయనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమన్నా మీద నయనతార గుస్సా అట. ఎందుకంటే సైరాలో తన పాత్రకన్నా ఆమె పాత్రే ఎక్కువని. పైగా నయన్ కంటే తమన్నాకే ప్రశంసలు ఎక్కువగా అందాయంటూ ఓ పత్రిక కథనం. ఆ అభిప్రాయాన్ని బలపరుస్తూ తమన్నా కూడా ‘సీనియర్ నటి నయన్ ఉన్నా తనకే ప్రేక్షకామోదం లభించింది’ అంటూ డబ్బాకొట్టుకుంది. పైగా రామ్‌చరణ్ భార్య ఉపాసన తమన్నా నటనకు ఫిదా అయి గిఫ్ట్ ఇచ్చిందన్న వార్త ప్రచారం పొందింది. అందువల్ల నయన్‌కు గుస్సా అన్నది మీడియాకి ఎక్కింది. అయితే ఇలాంటి చిన్న విషయాల్ని పట్టించుకోనట్టే కామ్‌గా ఉంది నయన్. తన పారితోషికం తనకు లభిస్తే చాలు. అది తమన్నా పారితోషికంకన్నా చాలా ఎక్కువని అందరికీ తెలుసు. పైగా ఇద్దరిమధ్యా పోటీ లేనేలేదు. నయన్ కోలీవుడ్‌ని ఏలుతుంటే తమన్నా టాలీవుడ్ రాణి. కోపం వచ్చినా నయన్ బయటపడదు, ఆ నిర్మాత, దర్శకుడు, హీరోల చిత్రాల్లో ఆమె నటించదంతే అన్నది ఆమె సమర్ధకుల మాట.
- పైడి పంతులు, శ్రీనగర్

అంతేకదా..!
రెండువారాల్లో 80 కోట్లు సాధించిన చిత్రం హిట్ అయినట్టే. కానీ భారీ బడ్జెట్ సైరా మరో 40కోట్లు సాధిస్తేకాని బయర్లు గట్టెక్కరు. ఆమేరకు సైరా కలక్షన్లు నిరాశాజనకమే అని చెప్పాలి. అంతేకాదు, ఆ కలక్షన్లు తెలుగు చిత్రానికే. ఓవర్‌సీస్, హిందీ, తమిళ, మలయాళ సీమల్లో సైరా డిజాస్టర్‌గా మిగిలింది. ఎందుకంటే హిందీలో దేశభక్తి, స్వాతంత్య్ర పోరాటం థీమ్‌పై మణికర్ణిక హిట్ అయిన కొద్దికాలానికే ఆ థీమ్‌తో సైరా వచ్చింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలలోనే ఉయ్యాలవాడ గురించి తెలిసినవారు బహుతక్కువ. మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా ఎవరికీ తెలియదు. అందువల్ల ఆ రాష్ట్రాల్లో ప్రేక్షకులు కనక్ట్‌కాలేదు. పైగా తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇతర రాష్ట్రాల్లో చిరంజీవికి పెద్దగా అభిమానులు లేరు. అక్కడ సైరా డిజాస్టర్‌కి ఇదో కారణం.
-్భవదీశ్వరి, జగన్నాధపురం
అంతలేదమ్మా..
భారతీయుడు-2 గురించి పరస్పర విరుద్ధ వార్తలొస్తున్నాయి. శంకర్‌తో సినిమా అంటే బడ్జెట్ భారీగా పెరిగిపోతూ కాలం కరిగిపోతూ ఉంటుంది. నిర్మాత ఆ రెండింటినీ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించగా చిత్రం ఆగిపోయింది అన్నారు. తర్వాత మళ్లీ ప్రారంభమైంది అన్నారు. ఇప్పుడేమో శంకర్ 2 నిమిషాల సీన్‌కోసం రెండు కోట్లు ఖర్చుపెట్టించాడనీ 90 ఏళ్ల వృద్ధ హీరో చేసే యాక్షన్ సీన్లకోసం నలభై కోట్లు ఖర్చుపెడుతున్నారనీ బడ్జెట్ 300కోట్లు దాటుతుందని తాజా వార్త. ఇదంతా ప్రచార ఆర్భాటమే. ఎందుకంటే కమల్‌హాసన్ చిత్రాలేవీ వంద కోట్లు సాధించలేదు. సాహో యాక్షన్ సీన్లకోసం 80కోట్లు ఖర్చయిందని ప్రభాస్ చెప్పాడు, ఆ చిత్రం ఢమాల్! భారీ బడ్జెట్ సైరా కూడా తెలుగు తప్ప అన్ని భాషల్లో ఢాం! బుర్ర ఉన్న ఏ నిర్మాత అయినా కమల్‌హాసన్ చిత్రానికి 300 కోట్ల బడ్జెట్ పెడతాడా..? యాక్షన్ సీన్లకు నలభై కోట్లు పెడతాడా? ఇదంతా ప్రచార ఆర్భాటమే అనిపిస్తోంది. శంకర్ 2.0 చిత్రం కూడా పెద్దగా ఆడలేదు కదా.
-శాండీ, కాకినాడ
రెండూ మటాష్
పోటీ ప్రపంచంలో పేర్లతోకూడా జనాన్ని మాయచేసి కోట్లు సంపాదిద్దామన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. సాహో పనైపోయంది కనుక పక్కన పెట్టేద్దాం. ఇంక సైరా సైడుకొస్తే ఇదివరలో పరిశోధకులు చెప్పినట్లు ఏమాత్రం ప్రాధాన్యతలేని నరసింహారెడ్డిని దేశభక్తుడు, ఆంగ్లేయులతో పోరాడిన వీరుడని అల్లూరి, భగత్‌సింగ్, ఝాన్సీలక్ష్మీబాయి వగైరా యోధుల సరసన కూర్చోపెట్టడం చరిత్రను వక్రీకరించటమే. ప్రజలకు పెద్దగా పరిచయంలేని చరిత్రతో సినిమా తీసి వదిలితే పేరుకుపేరు కోటికి వంద కోట్లు వస్తాయి అనుకొని రంగంలోకి దిగితే రోటీన్ సినిమాల సరసనే కూర్చోబెట్టారు తెలుగు ప్రేక్షకులు.
-ఎస్‌ఎల్‌ఎన్ మూర్తి,
హైదరాబాద్
పోలికెందుకు?
మన పరువు మనం తీసుకోకూడదు.
ఒక సినిమా కలెక్షన్లను వేరే సినిమా కలెక్షన్లతో పోల్చకూడదు. మా హీరోకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. గతంలో ఒక సినిమాకు వచ్చిన భారీ కలెక్షన్లు మించిపోయిందని యూట్యూబ్‌లలో పెట్టి అభిమానుల మధ్య చిచ్చురేపవద్దు. అందరూ అందరి అభిమానులు చూస్తేనే ఏ సినిమాకైనా కలెక్షన్లు వస్తాయి. ఏ అభిమానులో సినిమాలు చూస్తే కలెక్షన్లు రావు. ప్రజలకు నచ్చితే కలెక్షన్లు వస్తాయి. నచ్చకుంటే ఎంత ఖర్చుపెట్టినా వృధా. ఒక సినిమాను వేరే సినిమాతో పోల్చిచూడకూడదు. రెండుమూడు సంవత్సరాలకే టెక్నాలజీ మారుతుంది. కలెక్షన్లు వచ్చాయని రాసుకోవచ్చు కాని ఆ హీరోను మించి మా హీరోకు కలెక్షన్లు వచ్చాయని అభిమానాన్ని దురభిమానంగా మార్చవద్దు. అందరు మంచి దర్శకులే. వారివారి కథలను వారివారి ఆసక్తినిబట్టి సినిమా తీస్తారు. తప్ప నేను గొప్ప దర్శకుణ్ణి అని ఎవరు చెప్పుకోరు. మన హీరోలను మన దర్శకులను మనమే కించపరచుకోరాదు. ప్రపంచఖ్యాతిని పెంచే రీతిలో భారీ వ్యయంతో సినిమాలు తీస్తున్నారు మనవారు. దాన్ని మెచ్చుకోవాలి.
-ఏఆర్ రామారావు, ఖమ్మం
రాజుగారి గది- నెంబరు 3
‘రారా...నా గదికి రా’ అంటూ పాత్రధారిణి ముందు వెనుక అసభ్యంగా ఊపుతూంటే మహిళా ప్రేక్షకులు, సంఘాలు ఎలా చూస్తూ ఊరుకున్నారో అర్థంకావటం లేదు. సినిమా గుర్తుకొచ్చే ఉంటుంది ఈపాటికి. . డబ్బులకోసం ఇంత దుర్మార్గ ప్రదర్శన అవసరమా? అనిపిస్తోంది. అమ్మాయల్ని ఎంత గ్లామర్‌గా చూపించినా కథలో విషయం లేకపోతే ప్రేక్షకుడు థియేటర్‌వైపు చూడడన్న విషయం దర్శక నిర్మాతలకు ఎప్పటికి అర్థమవుతుంది.
-సిహెచ్ ప్రవల్లిక, మిర్యాలగూడ