మీ వ్యూస్

మీ వ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ రామకృష్ణా..?
తెనాలి రామకృష్ణ సమీక్ష భలేవుంది. ఆసక్తికరమైన టైటిల్ పెట్టి ఆడియన్స్‌ని థియేటర్ వరకూ రప్పించగలరుకానీ, తొలి ఆటతోనే టాక్ విస్తృతమై సినిమా చీదేస్తుందన్న విషయాన్ని చిత్రబృందం గ్రహించలేకపోయంది. అసలు టైటిల్‌కీ, సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? అన్న అనుమానాలు మొదటి సీన్‌నుంచే ఆడియన్స్‌ని వెంటాడాయ. ఏదో అనుకుని ఏదేదో తీసేస్తే ఆడియన్స్ చూసేసే రోజులు పోయాయని దర్శకులు గ్రహించాలి.
-కెవీ అనిత, సికింద్రాబాద్
అలా అనకూడదుగా..
ఒక నటి లేదా నటుడు నటించిన 2,3 చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయితే వారు ఫాం కోల్పోయారనీ, ఒక చిత్రం హిట్ అయితే ఫాంలోకి వచ్చారనీ అంటున్నారు. కానీ ఆ మాటలు క్రీడాకారుల విషయంలో వాడతారు. ఒక క్రీడాకారుడు ఫిట్‌నెస్ కోల్పోయి సరిగా ఆడలేకపోతే ఫాం కోల్పోయాడని అంటారు. కాని నటీనటులు బాగా నటించినా సినిమా ఫ్లాప్ అవొచ్చు. నటులు ఒకసారి బాగా నటించి తర్వాత బాగా నటించకపోవటం ఉండదు. దర్శకుడు, రచయిత, స్క్రీన్‌ప్లే మీద ఆధారపడి నటన రాణించడం, రాణించకపోవడం ఉంటుంది. సినిమా ఫ్లాప్ అయితే నటులు ఫాం కోల్పోయారనడం సరికాదేమో కదా.
-సోనాలి, సూర్యారావుపేట
ఏది సమీక్ష..
చిత్ర సమీక్ష రాసేవాళ్లు వాళ్ళ సొంత అభిప్రాయాలు పాఠకుల వ్యూస్‌లో రాస్తే బాగుంటుంది. పోయిన వారం రాజుగారి గది గురించి రాస్తూ హీరోయిన్‌కు అంత సీన్‌లేదని రాశారు. ఆ అభిప్రాయం వ్యూస్‌లో వుంటే బాగుంటుంది కానీ, సమీక్షలో కాదు. ఎందుకంటే అక్కడ ఆమె పెర్ఫార్మెన్స్‌నే సమీక్షించాలి తప్ప, ఆమెకిచ్చిన నిడివిని కాదు. సమీక్ష చేసేటప్పుడు కలాన్ని కాస్త కంట్రోల్‌లో పెట్టుకోవడం అనేది -అనుభవాన్ని తెలియచేస్తుంది.
-జి పార్వతి, నర్సీపట్నం
సినిమాదే బాధ్యత
1984 లేక 85లో జాగృతి జాతీయ(తా) వారపత్రికలో సినిమా పేరు జ్ఞాపకం రావడం లేదు, ఓ సినిమా సమీక్ష వ్రాశారు. ప్రేమను కాదన్న వారిని మర్డర్ చేసైనాసరే పెళ్ళి జరిపిస్తానన్న సంభాషణను సమీక్షలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సున్నితమైన సమాజంపై దుష్ప్రభావం చూపుతుంది అని వ్యధ చెందేరు. నేడు చూస్తున్నాం. తాను మెచ్చిన వాడితో కలసి కన్నతల్లిని హతంచేసిన వైనం భాగ్యనగరంలో జరిగింది. తెల్లవారి లేచిన దగ్గరినించీ ఇవే వార్తలు. సినిమాలవల్ల జరుగుతాయా? అని రాగం తీసేవారు, ప్రబోధాత్మకాలవల్ల జనం మారుతున్నారా? అనీ ప్రశ్నిస్తున్నారు. నాగయ్య నటించిన భక్తపోతన రుూ సమాజానికి ఓ ముమ్మిడివరం బాలయోగి నిచ్చింది. నేటి యువతీ యువకులను పాడుచేయడంలో సినిమాలే సింహభాగ బాధ్యత తీసుకోవాల్సి వుంటుంది. ‘కామా తురాణాం నలజ్జా న భయం’ అని సూక్తి. కామానికీ ప్రేమకు తేడా పెద్దలకే ఎప్పటికో తెలుస్తుంది. కామాతురాణాం నవాత్సల్యం అనీ కల్పుకోవాలి!!
-విఆర్‌ఆర్‌ఎ రాజు, హైదరాబాద్
రావి కథనం బావుంది
సరయు శేఖర్ నాలుగు వారాలపాటు రావికొండలరావు అనుభవాలలను పాఠకులకు పంచి పెట్టారు. తెలుగు చిత్రసీమలో చిత్రవిచిత్రాలు, ‘పెళ్లిపుస్తకం’ ఎలా బాపురమణ తెరకెక్కించి కాసుల వర్షమేగాక, రావికొండలరావుకి కీర్తితెచ్చిపెట్టారో తెల్సింది. రావికొండలరావు అడ్రసు కూడా వ్యాసంలో ఇచ్చివుంటే మావంటి పాఠకులు+ ఆయన సినిమాల ప్రేక్షక సాక్షులుగా వారిని అభినందించి ఆనందించేవారం. బావుంది వాళ్ల వరస వ్యాస రచయిత పేరు వెయ్యలేదు, ఎందువల్లనో. స్టార్ హీరోలుగా రాణిస్తున్న నటులు, నిర్మాతలుగా మారడం దానివెనుక వారి ఉద్దేశ్యం, కారణాలతో విశే్లషణ బాగా చేశారు.
-ఎవి సోమయాజులు, కాకినాడ

సమాజంలోని వివిధ వ్యాపారాల్లో కల్తీ ఏవిధంగా జరుగుతుంది, దాన్ని పెద్దపెద్ద వ్యాపారులు కొందరు ఎలాచేస్తున్నారో విశదీకరించాడు ఆమధ్య వచ్చిన ‘వదలడు’ సినిమా దర్శకుడు. కల్తీచేసే వ్యాపారస్థులపై పోరాటాన్ని సిద్ధార్థ ఎలా సాగించాడు, ఎలా విజయం సాధించాడనేది ఆ చిత్రంలో చూపించాడు. మొత్తం కల్తీలవల్ల ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఎందరో పిల్లలు యుక్తవయస్సు రాకుండానే మరణిస్తున్నారని తన డైలాగ్స్‌లో వివరించాడు. ఇలాంటి సినిమాలు ఇంతకుముందు ఎన్నడూ రాలేదు. మొత్తం కల్తీవ్యాపారం బేస్ చేసుకుని తీసిన మొదటి సినిమా ‘వదలడు’ అనాలేమో. ఇలాటి సినిమాలను ప్రజలు ఆదరించటం లేదు. వారికి హంగులు ఆర్భాటాలే కావాలి. ఆలోచింపజేసే సినిమాలవైపు ఆడియన్స్ మళ్లాలి. కమర్షియల్ సినిమాలను ఆదరించవద్దని కాదు నా ఉద్దేశం. నిజాన్ని నిర్భయంగా వివరించే సినిమాలనూ ఆదరిస్తేనే, అలాంటి విషయాలు మరిన్ని వెలుగులోకి వస్తాయ.
-ఎ రఘురామారావు, ఖమ్మం
ఎంతకాలమిది..
తెలుగు హిట్ చిత్రాల్ని బాలీవుడ్ ఎంత రేటైనా ఇచ్చి హక్కులు ఎగరేసుకు పోతోందనీ, అదీ తెలుగు హవా అనీ ఈమధ్య పత్రికలు తెగ రాస్తున్నాయ. కాని అది తాత్కాలికమే. సాహో హిందీలో హిట్, మిగిలిన భాషల్లో ఫట్! సైరా కూడా తెలుగులో హిట్ మిగిలిన భాషల్లో ఫట్ అవడంతో ట్రిపుల్ ఆర్ బిజినెస్ సంశయంలో పడింది. దాంతో తెలుగు చిత్రాల హక్కులు కొనడానికి బాలీవుడ్ వెనుకంజ వేస్తోంది. పైగా తెలుగు సీనియర్ నటులే కాక యువనటులు కూడా ఇతర భాషల హిట్స్‌ని రీమేక్ చేయటంలో బిజీ అయ్యారు.
-సాహిత్యదీప్తి, రమణయ్యపేట