మీ వ్యూస్

తోలుబొమ్మలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రగా వచ్చిన తోలుబొమ్మలాటలో తలతిక్క కథనం విసిగించింది. గతంలో ఆయన చేసిన ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రాల్లో ప్రధానమైన భూమిక కనిపిస్తుంది. ఓ సమస్యను చర్చించే కథలుగా ఆ సినిమాలు రాజేంద్రుడి భావోద్వేగ నటనకు అద్దంపట్టాయి. ఇప్పుడు ఆయన ఎంచుకుంటున్న కథల్లో ఆహార్యం బాగున్నా -కథనం బాగోక పాత్రలన్నీ పేలవంగా మిగులుతున్నాయి. గతంలో ఆయన చేసిన హాలీవుడ్ చిత్రం ‘కిక్ గన్ మురుగన్’ గుర్తు చేసుకుంటే -రాజేంద్రప్రసాద్ స్టామినా ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతగొప్ప నటుడిని పెట్టుకుని ఔచిత్యంలేని పాత్రలో చూపించటం సినిమాకు మైనస్ అయ్యింది. సినిమా మొత్తం తోలుబొమ్మల్ని చూస్తున్న భావనే తప్ప, పాత్రల మధ్య భావోద్వేగాలతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు.
-చిన్నికృష్ణ, ముత్తాయిపాలెం
ఏది పాన్ ఇండియా?
విడుదలైన నెలకే సైరా బండారం బయటపడింది. తెలుగులో తప్ప మిగిలిన అన్ని భాషల్లో డిజాస్టర్ అయిన సైరా -తెలుగులోనూ నైజాం, విశాఖ ఏరియాల్లో మాత్రమే కాస్త లాభం సంపాదించింది. మిగిలిన ఏ ప్రాంతంలోనూ బ్రేక్ ఈవెన్ కాలేదన్న విషయం బయటపడింది. చూసినోళ్లంతా బాగుందన్న టాక్ ఇచ్చినా -బ్రేక్ ఈవెన్ కాకపోవడం ఆశ్చర్యమే. అల్లూరి సీతారామరాజు కథ కూడా సైరా కథలాంటిదే. అది ఘన విజయం సాధిస్తే, ఉయ్యాలవాడ సినిమా ఢాం అనడానికి కారణాలేంటి? అల్లూరి రాష్ట్రంలో అందరికీ తెలుసు. పాటలు బాగున్నాయి. ఉయ్యాలవాడ చాలామందికి తెలీదు. పాటలూ, సంగీతం మైనస్ అయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుని కథగా ప్రచారం సాగినా, దేశభక్తి డైలాగులున్న జానపద చిత్రంగానే ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. భారీ బడ్జెట్‌తో నాలుగైదు భాషల్లో ఇతర రాష్ట్రాల నటులను చేర్చుకున్న చిత్రాలను ‘పాన్ ఇండియా’ సినిమాలు అనేస్తున్నారు. బాహుబలి ఒక్కటే ఓవర్సీస్‌ను కూడా రంజిప చేసిన నిజమైన పాన్ ఇండియా సినిమా. సాహో, సైరాలు పాన్ ఇండియా చిత్రాలుగా ప్రచారం చేసుకున్నా -ఓవర్సీస్‌లో పరువు పొగొట్టుకున్నాయి. సాహో, సైరాల పరిస్థతి చూసి కూడా మణిరత్నం, శంకర్ పాన్ ఇండియా చిత్రాలపై ఎగబడుతున్నారు. వాటి పరిస్థితి చూద్దాం.
-బి ప్రభాస్, గాంధీనగరం
సుత్తి అవసరమా?
అయ్యప్ప దీక్షలోవున్న పోలీసులు దీక్షాకాలమంతా నల్లదుస్తులు, గడ్డాలతో డ్యూటీకి రాకూడదని ఓ పోలీస్ ఉన్నతాధికారి ప్రకటన చేశాడు. కోర్టులో వాద ప్రతివాదాలు సినిమాల్లో చూపించే విధంగా ఉండవు. లెక్చరర్లు, స్టూడెంట్లు సినిమాల్లో చూపించే విధంగా కాలేజీల్లో వెకిలిగా ప్రవర్తించరు. కొన్ని వ్యవస్థల్ని సినిమాల్లో చూపించేటప్పుడు అవి పాటించే విధి విధానాలు సినిమాల్లో కూడా పాటించాలి. అప్పుడే సినిమా రియలిస్టిక్‌గా ఉంటుంది. అలాకాకుండా ఇష్టారీతిన చూపిస్తే ప్రజలకు ఆ వ్యవస్థలపై గౌరవం పోతుంది. ఈమధ్యనే రూలర్ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. అందులో బాలకృష్ణ నలిగిపోయిన పోలీస్ యూనిఫాంలో కనిపించాడు. బెల్ట్‌కివున్న హోల్‌స్టర్‌లో ఫిస్టల్ ఉంటుంది. కుడిచేతిలో పెద్ద కర్రకు బిగించిన సుత్తివుంటుంది. పోలీస్ అధికారి ఇస్ర్తి చేసిన యూనిఫాంలో క్లీన్‌గా కనిపించాలి. కాని, బాలకృష్ణ మరెవరిదో నలిగిన డ్రెస్ వేసుకున్నట్టు కనిపించాడు. పోలీస్‌కి పిస్టల్ చాలదా? సుత్తెందుకు? పోలీసులు డ్యూటీలో సుత్తి వాడతారా? పిస్టల్‌కంటే సుత్తి పవరెక్కువా? దర్శకుడు ఇవన్నీ ఆలోచించినట్టు లేదు. అందుకే ఆ ఫస్ట్ లుక్‌కి మిశ్రమ స్పందనే లభించింది.
-ఎస్ సంపూర్ణ, సాంబమూర్తినగర్
రెండు చోట్లా..
కొందరు దర్శకులు, రచయితలు వారి వృత్తితోపాటు నటులుగానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కె విశ్వనాథ్ దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ శుభసంకల్పం, కలిసుందాంరాలాంటి చిత్రాల్లో నటించి తన సత్తాచాటారు. అలాగే రచయితలుగా పరిచయమైన పరుచూరి బ్రదర్స్ సైతం స్క్రీన్‌పై సత్తా చాటుకుని దర్శకత్వంలోనూ ఎన్నికైన ప్రతిభ చూపారు. అలాగే రచయిత పోశాని కృష్ణమురళి సైతం రైటర్‌గా పరిశ్రమకు కథలు అందించి, చివరకు విలన్‌గానూ, క్యారెక్టర్ ఆర్టిస్టుగాను మెప్పిస్తున్నారు. దాసరి నారాయణ రావు, శివప్రసాద్, గొల్లపూడి మారుతీరావులాంటి వాళ్లే కాదు, ఈతరంలోని దర్శకులు, రచయితలు సైతం స్క్రీన్‌పై తమ నటనాభిరుచిని ప్రదర్శిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం.
-అయినం రఘురామారావు, ఖమ్మం
అదీ వెనె్నల
రావి కొండలరావుపై నాలుగు వారాలుగా వచ్చిన వ్యాసాలు పాఠకులకు వరంలాంటివి. చంద్రుడిని మించిన చంద్రుడిని స్క్రీన్‌పై చూపించిన మార్కస్ బాట్లే ముచ్చట్లు రావి చెప్పడం ఆసక్తికరం అనిపించింది. ఆయన సినిమానుభవం, ఆ కాలపు ముచ్చట్లను రావినుంచి ఓపికగా సేకరించి అందించిన రచయిత శేఖర్ అభినందనీయుడు. ఆ వ్యాసాల్లో భాగంగా అందించిన అప్పటి చిత్రాలు, మాయాబజార్ వర్కింగ్ స్టిల్ పెట్టడం కథనానికి తగిన చిత్రమినిపించింది. ఆనాటి కస్తూరి శివరావు నుంచి ఈనాటి కమెడియన్ల వరకూ రావి విశే్లషించిన తీరు బావుంది. ప్రతి ఆదివారం వెనె్నల కోసం ఎదురు చూసేలా మంచి కథనాలు అందిస్తున్న సంపాదక వర్గానికి అభినందనలు.
-ఏవీ సోమయాజులు, కాకినాడ
అదీ వరస
అర్జున్‌రెడ్డి చిత్రం కంటెంట్‌ని టీవీ యాంకర్ అనసూయ తీవ్రంగా విమర్శించటంతో -హీరో విజయ్ ఘాటుగా ప్రతిస్పందించాడు. ఇద్దరి వాగ్వాదాల తరువాత ఆయన నిర్మించిన ‘మీకుమాత్రమే చెప్తా’ చిత్రంలో ఆమె నటించింది. ముసలి హీరోలు పడుచమ్మాయిలతో గంతులేయడంపై డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఘాటుగా విమర్శించింది. కానీ, మన్మథుడు 2లో నాగార్జున రకుల్‌తో గంతులేయడాన్ని తప్పుబట్టలేదు. పైగా రకుల్‌కు బూతు డైలాగుల డబ్మింగ్ చెప్పింది చిన్మయి. చెప్పడానికే నీతులు. పాటించడానికి కాదనుకుంటా.
-బి సుబ్బక్క, జగన్నాథపురం