మీ వ్యూస్

అంత ద్వేషమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైరా.. ప్లాప్! సాహో ఢాం!! పాన్ ఇండియా సినిమా అంటూ తీసి అప్రతిష్టపాలైనారంటూ.. జరా శంకర్ కూడా జాగ్రత్త అని ఓ పాఠకుడు అభిప్రాయంగా రాశారు. ఆయన తీస్తున్న భారతీయుడు-2ను దృష్టిలో పెట్టుకొనే ఈ చురక వేసి ఉండొచ్చు. శంకర్‌ని ఇలా డి గ్రేడు చేయడం భావ్యమేనా? ఇది ప్రాంతీయ ద్వేషంలా తోస్తుంది. అసలు దక్షిణాది వారంటేనే ఉత్తరాదికి వారికి ద్వేషం. నేడు తెలుగువారికి సోదర తమిళ తంబిలపై ద్వేషమెందుకో? గోవింద నిహలానీ, రే, బాలచందర్, ఆదూరి, మన రాజవౌళి ప్రతిభ ఎచ్చటున్నా గుర్తించాలి, కీర్తించాలి. ద్వేషమెందుకు?
-డి సౌదామిని, అత్తిలి
గుర్తింపు
తెలుగు చలనచిత్ర సీమలో ఆయనది సుదీర్ఘ ప్రయాణం. బహుప్రతి పాత్రకూ వైవిధ్యం, సంభాషణల్లో ప్రత్యేకత.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనొక సినిమా నిఘంటువు. ఆయనే రావికొండలరావు. ఆయనను గౌరవించటం చిత్రసీమ బాధ్యత. ఇంతవరకు పరిశ్రమ ఆయనను తగినరీతిన గుర్తించలేదని చాలామంది అభిప్రాయం. ఈసారైనా ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి సత్కరించాలని పాత, కొత్తతరాలకు వారధిలాంటి ఆయన సేవలు పరిశ్రమకు ఉపయోగపడాలని కోరుకుంటూ..
-టి సదా, తిరుపతి
వ్రాస్తే బావుండేది
24 నవంబర్, 2019 వెనె్నల అనుబంధం ఫ్లాష్‌బ్యాక్‌లో ‘ఏకవీర’ చిత్రం గురించి రాస్తూ.. సినిమా 1969 నవంబర్ 7న విడుదలైనట్టు పేర్కొన్నారు. కానీ ఆ చిత్రం 1969 డిసెంబర్ 4న విడుదలైనట్టు గుర్తు. పొరపాటును గ్రహించండి. అలాగే -‘పడమటి సినీ రాగం’ శీర్షికన హాలీవుడ్ తారలు భారతీయ చిత్రమైన అమీర్‌ఖాన్ ‘లగాన్’లో మెరిసారన్నారు. నిజానికి అంతకుముందూ చిత్రాలున్నాయి. 1978 నుంచే కృష్ణషా షాలిమార్ చిత్రంలో రెక్స్‌హారిసన్, సిల్వియామైల్స్, జాన్‌శాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించారు. అక్కడినుంచి ప్రస్తావించి వుంటే బావుండేది. ది టవరింగ్ ఇన్‌ఫెర్నో చిత్రానికి పనిచేసిన వర్టెజిల్, జెర్రీ ఆండ్లర్ -‘ది బర్నింగ్ ట్రయిన్’ హిందీ చిత్రానికి పనిచేశారు.
-ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
ఏది నమ్మాలి?
తారలది -ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కో మాట వినిపిస్తుంటుంది. రకుల్ తను చదువుకునే రోజుల్లో ఫ్లర్టింగ్‌లో ఎక్స్‌పర్ట్‌నని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంది. ఆ పదానికి తెలుగులో సరైన పదం లేదుగానీ, చిలక్కొట్టుడు, సరదా ప్రేమ అని చెప్పుకోవచ్చు. బాగా లోతుగా కాకుండా రొమాంటిక్ కబుర్లు, కిస్సింగ్, హగ్గింగ్ లాంటి కవ్వింపులే ఫ్లర్టింగ్ అంటే. మరో ఇంటర్వ్యూలో అదే రకుల్ ప్రేమించడానికే టైమ్ లేదు, సరదా ప్రేమ నాకు అస్సలు కిట్టదు. ప్రేమలో నిజాయితీ ఉండాలి అని సుద్దులు చెప్పింది. మరి ఈ రెండు ఇంటర్వ్యూల్లో దేన్ని నమ్మాలి?
-గిరిధర్, కాకినాడ
పాతిక పాత్రలా?
అక్కినేని అప్పుడెప్పుడో నవరాత్రుల్లో తొమ్మిది పాత్రలు చేస్తే -కమల్‌హాసన్ ‘దశావతారం’ చిత్రంతో ఆ రికార్డు బద్దలుకొట్టాడు. పూర్తి వైవిధ్యంతో కూడిన పది పాత్రలు పోషించి సినీరంగంలో తనకు సాటి లేరనిపించుకున్నాడు. కాలమెప్పుడూ ఒక్కలా ఉండదుగా. అందుకే -తాజాగా హీరో చియాన్ విక్రమ్ పాత్రిక పాత్రలతో వైవిధ్యమైన సినిమా చేయబోతున్నాడట. సామాన్యుడు, ప్రేమికుడు, ఆవేశపరుడు ఇలా వుంటాయేమో ఆ పాత్రలు. తమ నటనా ప్రతాపాన్ని చూపించుకునేందుకు హీరోలు చేస్తున్న ప్రయోగాలను ఆహ్వానించాలి. సినిమా కొత్తపుంతలు తొక్కుతున్నందుకు ఎగిరి గంతులేయాలి. ఏమంటారు?
-కె సుబ్రహ్మణ్యం, కావలి
అతిగా లేదూ?
సింహం బోనులో ఉన్నప్పుడు జింకలు హడావుడి చేస్తాయి. ఒక్కసారి బోనుదాటి వచ్చిందంటే -వేట మామూలుగా ఉండదు. అదెలా ఉంటుందో తెలియాలంటే ‘రూలర్’ సినిమా చూడాల్సిందేనని ఓ మీడియా పర్సన్ బల్లగుద్ది మరీ చెప్పాడు. ఈ డైలాగ్ ఔచిత్యమేమి. జింకలు సాధుజీవులు. వాటివల్ల ప్రజలకు ప్రమాదం లేదు. సింహం శౌర్యానికి ప్రతీకకావచ్చు. కాని క్రూర జంతువు. సింహం ప్రతాపం జింకల మీదనా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా అనిపిస్తోంది కదూ. రూలర్ ఫస్ట్‌లుక్‌లో పోలీసు డ్రెస్‌లో బాలకృష్ణ చేతిలో పొడవాటి సుత్తితో కనిపిస్తాడు. టీజర్‌లో కత్తి ఝుళిపిస్తూ కనిపిస్తాడు. పోలీసులకు కత్తి, సుత్తితో పనేమిటి? పిస్టల్ పట్టుకోవడం చేతకాదా? షూట్ చేయడం రాదా? హీరోల అరుపులు, కత్తులతో నరకడాలను ఆడియన్స్ ఇంకెంతకాలం చూడాలి. దర్శకులు ఇక కొత్తగా ఆలోచించరా?
-సత్య, కరప
తప్పేముంది?
సల్మాన్‌ఖాన్ తెలివిమీరి.. సినిమాల లాభం వేరొకరికి ఎందుకివ్వాలని తనే నిర్మాతయ్యాడు. 105కోట్లతో దబాంగ్ 3 తీశాడు. శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్ హక్కులు 155 కోట్లకు అమ్మేశాడు. అంటే సినిమా రిలీజ్‌కి ముందే 50కోట్ల లాభమంటూ గుండెలు బాదుకుంది మీడియా. హీరోలు నిర్మాతలుగా మారడం సల్మాన్‌కు ముందే మొదలైంది. టాలీవుడ్‌లోనూ ఒకప్పటి సీనియర్లే కాదు, దేవరకొండలాంటి నవతరం హీరోలూ నిర్మాతలయ్యారు. మహేష్ పారితోషికం 30 కోట్లు అయితే, పారితోషికానికి బదులు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కులు తీసుకున్నాడని పత్రికల్లో వచ్చింది. అవన్నీ అమ్మితే 50 కోట్లకు పైనే. పాతతరం నటీనటులు తాము సంపాదించినదంతా దాన ధర్మాలకు సన్నిహితులను ఆదుకోడానికి ఖర్చుపెట్టి చివరిరోజుల్లో అనాధలుగా మరణించారు. ఈతరం నటీనటులు సంపాదనను వివిధ వ్యాపారాల్లో పెట్టి భవిష్యత్తుని భద్రం చేసుకుంటున్నారు. ఇందులో ఎవరికో ఎందుకు బాధ?
-పైడిపంతులు, శ్రీనగర్