మీ వ్యూస్

నిరాశపర్చారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతవారం వచ్చిన బాలకృష్ణ రూలర్ సినిమా చూశాక -ఏ ధైర్యంతో సినిమాలు తీస్తున్నారన్న అనుమానం కలగక మానదు. చూస్తే చూడండి లేదంటే లేదన్నట్టు వస్తున్న చిత్రాలను చూసి జాలేస్తుంది. బాలయ్య వయసుకి, ఆయన చేసిన పాత్రలకీ పొంతనే లేదు. పైగా విచిత్రమైన మేకవర్, విగ్గు వ్యవహారం బోర్ కొట్టించింది. అలాగే, రెండు వారాల క్రితం వచ్చిన వెంకీమామ చిత్రం కూడా. వెంకటేష్, నాగచైతన్య కలసి నటించిన ‘వెంకీమామ’ నిరాశ పరిచింది. ఎన్నో చక్కటి చిత్రాలను నిర్మించిన ఘనత సురేష్ ప్రొడక్షన్స్‌ది. అట్లాంటి సంస్థ ఇటువంటి చెత్త చిత్రం నిర్మించటం బాధాకరం. అసలు కథలోనే బలం లేదు. వెంకటేష్ మేకప్ బాగలేదు. ఒక్క పాటా బాగాలేదు. దర్శకుడు బాబి ఈ చిత్రం నడపడంలో ఘోరంగా ఫెయిలయ్యాడు. టోటల్‌గా వెంకీమామ చెత్త సినిమా.
-పివి రామారావు, రేపల్లె
కథనం బావుంది
ఆదివారం 8 డిసెంబర్ 2019 ఆంధ్రభూమి వెనె్నల అనుబంధంలో సరయు శేఖర్ వ్రాసిన ‘సిరి’స్వరము నీవె శీర్షికలో సంగీత దర్శకులు రాజన్-నాగేంద్ర గురించి చాలా విషయాలు వ్రాశారు. అయతే, రచయిత కేవలం 5 పాటలు వ్రాసి సరిపుచ్చారు. తెలుగులో రాజన్-నాగేంద్రలు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు వ్రాయలేదు. అవి: ‘పెళ్ళిమీద పెళ్లి (1959), నవగ్రహ పూజా మహిమ (1960), అన్నాచెల్లెలు (1960), 1962- ఖైదీ కన్నయ్య, మదనకామరాజు కథ (1962), అగ్గిపిడుగు (1964), నవగ్రహ పూజామహిమ (1964), వరలక్ష్మీవ్రతం, పూజ (1975), పంతులమ్మ (1977), సొమ్మొకడిది సోకొకడిది (1978), ఇంటింటి రామాయణం (1979), అల్లరి బావ (1980), నాగమల్లి (1980), తాతయ్య ప్రేమలీలలు (1980), (1981), మా పెళ్లికథ, ప్రణయగీతం (1981), మంచుపల్లకి (1982), వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982), 4 స్తంభాలాట (1982), కోటికొక్కడు (1983), మూడుముళ్లు (1983), పులి బెబ్బులి (1983), లంకె బిందెలు (1983), రాజు-రాణి-జాకి (1984), అనురాగబంధం (1985), రెండు రెళ్లు ఆరు (1985), (1986)- ఆడపడుచు, రాగలీల (1987), చూపులు కలిసిన శుభవేళ (1988), ప్రేమఖైదీ (1981), అప్పుల అప్పారావు (1991). ఈ చిత్రాల్లోని పాటలు కొన్ని కన్నడ చిత్రాల్లోని బాణీలకు కాపి.
-ఎన్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
తీరని లోటే
గొల్లపూడి మారుతీరావు మరణంతో సినీ పరిశ్రమ మంచి నటుడ్ని కోల్పోయింది. సినీ, నాటక రంగాల్లో ఎనలేని కృషిచేసి, మంచి నటుడిగా ప్రేక్షకుల్లో గుర్తింపుపొందారు. రచయితగా నాటికలు, నాటకాలు సినిమా కథలు ఎన్నో వ్రాసి సాహితీరంగంలో కూడా ఎనలేని సేవ చేసిన ఆయన మరణం సాహితీ రంగానికి కూడా తీరని లోటుగా చెప్పవచ్చు. ఆయన కుమారుడు శ్రీనివాస్ చిత్ర నిర్మాణం సమయంలో ప్రమాదవశాత్తు మరణించడం నాటినుండి శ్రీనివాస్ జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస్ స్మారక పురస్కారాన్ని నెలకొల్పి సినీ రంగంలో విశేష సేవలందించిన ప్రముఖులకు ప్రతి ఏడాది అవార్డులను ఇవ్వడం ఆయన మంచితనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావుకి శ్రద్ధాంజలి.
-పట్నాల సూర్యనారాయణ, రాజమండ్రి
ముల్లుని ముల్లుతోనే..
రియల్ స్టోరీ, బయోపిక్‌ల పేరిట ఆర్జీవీ కొంతమందిని టార్గెట్ చేసి తీసిన చిత్రాలు ఆ కొంతమందిని చుర్రుమనిపించడం సహజమే. అయితే ముల్లుని ముల్లుతోనే తియ్యాలన్న సూత్రం ప్రకారం ఆ కొంత మంది ఆర్జీవీ బయోపిక్ తీసి అతనిని చుర్రుమనిపించాలన్న ప్రయత్నంలో పడ్డారట. అయితే వాళ్లు ఆర్థికంగా, నైతికంగా ఫెయిల్ అవడం ఖాయం. ఎందుకంటే ఆర్జీవీ జీవితంలో అంత సీన్ లేదు. పైగా ఇలాంటి విషయాలను పట్టించుకోడు.
-గునే్నశ్, కొవ్వాడ
అదీ.. సాయపల్లవంటే
కథ డిమాండ్ చేయడంవల్లనే గ్లామరస్‌గా కనిపించామంటూ హీరోయిన్లు ఘోషించినా డబ్బుకోసమేనన్నది తెలిసిందే. ఈ విషయంలో సాయిపల్లవి కుండబద్దలు కొట్టింది. కోట్లు యిస్తామన్నా లిప్‌లాక్, హాట్ సీన్లలో నటించడం నాకిష్టం లేదు. హాట్‌సీన్స్ ఉన్నాయనే ‘సరిలేరు నీకెవ్వరు’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు వదులుకున్నాను. ఎంత సంపాదించినా కడుపు పట్టినంతే తినగలం. తినడానికి సరిపోయేటంత సంపాదిస్తే చాలు అని నిర్మొగమాటంగా ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె గట్స్‌ని మెచ్చుకోవలసిందే.
-సోనాలి, సూర్యారావుపేట
ఏంటా పోస్టర్?
90 ఎంఎల్ వాల్‌పోస్టరుపై ఏన్ అథరైజుడు డ్రింకరు క్యాప్షన్ పెట్టారు. మారాంచేస్తూ హీరోయిన్ వడిలో హీరో పడుకొని వుంటాడు. నోట్లో పాలసీసా... అందు ‘మందు’. పైగా పిల్లాడిని లాలిస్తున్నట్టు హీరోయను. ఈ చెత్త పోస్టరును చూసి దర్శకుడు ఏం చెప్పదలచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ దేశంలో కనుక ఇలాంటి చెత్త సినిమాలు తీయడానికి స్వాతంత్య్రముంది. ఇస్లామిక్ కమ్యూనిస్టు దేశాలలోనైతే ఆ దర్శకుడిని చెఱసాలలో పెట్టి వుండేవారు.
-బడేటి దమయంతి, అత్తిలి
ఆ ఘనత ఆయనదే
నిజానికి తొలిసారి ఒక చిత్రంలో తొమ్మిది పాత్రలు పోషించిన ఘనత శివాజీ గణేశన్‌ది. ఆ చిత్రానికి రీమేక్ ‘నవరాత్రి’లో ఏఎన్నార్ నటించాడు. అందులో మూడు, నాలుగు పాత్రలు మాత్రమే అలరించాయి. అలాగే దశావతారంలో కమల్‌హాసన్ పది పాత్రలు పోషించినా అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మెప్పుపొందాయి. మిగిలినవి అవసరానికి పనికొచ్చి తర్వాత మాయమయ్యే కరివేపాకు పాత్రలే. ఇప్పుడు ఒక చిత్రంలో పాతిక పాత్రలు అంటూ విక్రమ్ బయలుదేరాడు. ఇది రికార్డుకోసం చేసే జిమ్మిక్ మాత్రమే. రెండుమూడు పాత్రలకు తప్ప మిగిలినవాటికి ప్రాధాన్యం ఉండదు. జిమ్మిక్‌లకు కాసులు రాలవు.
-జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్