మీ వ్యూస్

గొప్ప సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లి, భార్య, పిల్లలు.. వీరిమధ్య బాంధవ్యాలు, మానవత్వ విలువలను చక్కగా చాటిచెప్పిన మహోన్నత చిత్రం -తల్లా పెళ్ళామా? విద్యాలయాలు రాజకీయ నిలయాలుగా మారకూడదని, రాజకీయ నాయకులు తమ స్వార్థంకోసం విద్యార్థులను పావులుగా వాడుకోవడం తగదని కచ్చితంగా విశదీకరించి విద్యార్థుల మనసులను వికసింపచేసే మహత్తర చిత్రం కూడా. 1970 దశకంలో ఆంధ్ర, తెలంగాణ వివాదాల మధ్య విడుదలైన సినిమాలో కలసివుంటే కలదు సుఖం అన్న సూత్రంమీద నారాయణరెడ్డి రాసిన అద్భుతమైన పాట గొప్ప ప్రాచుర్యం పొందింది. ఐకమత్యానికి ఊపిరిపోస్తూ.. ‘తెలుగుజాతి మనది/ నిండుగ వెలుగు జాతి మనది’ అన్న పాట జాతిని ఉత్తేజపర్చింది. దురదృష్టవశాత్తూ తెలుగువారం విభజించబడ్డాం. రామారావు, చంద్రకళ, శాంతకుమారి ప్రశస్తమైన నటనతో మెప్పించి చిత్ర విజయానికి కారణమయ్యారు. ఎప్పటికీ గుర్తు చేసుకోతగ్గ చిత్రం ‘తల్లా-పెళ్ళామా’.
-ఎన్ రామలక్ష్మి,
సికిందరాబాద్
నయన్.. ఓ వెరైటీ
పారితోషికం, ప్రేమ, పెళ్లిలాంటి వ్యక్తిగత విషయాలు తల్లిదండ్రులతో తప్ప పబ్లిక్‌లో చర్చించి పదిమంది నోళ్లలో నాన్చటం నాకిష్టముండదు. అందుకే సినీ ఫంక్షన్లకు వెళ్లను. ట్విట్టర్ ఖాతా కూడా లేదు. చిట్టిపొట్టి దుస్తులు, హెవీ మేకప్‌తో గ్లామర్ రాదు. మనసు ప్రశాంతంగావుంటే చీరలోనూ, లైట్ మేకప్‌లోనూ అందం ఉట్టిపడుతుంది. మీటూ ఉద్యమాన్ని విమర్శించను, సమర్ధించను. బాధితులకు తగిన సాయం ఆర్థికంగా, నైతికంగానూ చేస్తూనే ఉన్నా. నేను చేసిన సాయం గురించి ఎవరితోనూ చెప్పుకోను కూడా -అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది లేడీ సూపర్‌స్టార్ నయన్. గ్రేట్ కదూ. అందుకే -హీరోయిన్లలో ఆమెకు ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది.
-్భస్కర్, అశోక్‌నగర్
మారని ధోరణి
సరయు శేఖర్ రాసిన ‘పల్స్‌పట్టిన కళాకారుడు’ కథనం చదువుతుంటే -గతమెంతో ఘనకీర్తి గలవాడా పాట జ్ఞాపకమొచ్చింది. ఇప్పుడూ చిత్ర పరిశ్రమలో అభ్యుదయ భావాలు కలిగిన సంస్థలున్నాయి. ఏం సినిమాలు తీస్తున్నాయన్న ప్రశ్నకు మాత్రం -సమాధానం ఉండదు. ఒకప్పటి మాదాల రంగారావుతోబాటు ఇప్పటి నారాయణమూర్తీ అభ్యుదయ భావాల చిత్రాలు తీశారు. ఈ సినిమాలతో సమస్య ఏంటంటే, ఒకటి రెండు చిత్రాలు చూస్తే చాలు, మిగిలినవి చూడక్కర్లేదు. అన్నింటిలోనూ ఒకేటైపు నటన. ఒకే తరహా సన్నివేశాలు. ఏమాత్రం మారని ఆవేశపూరిత డైలాగులు. అందుకే -ఎర్ర సినిమాలను చూడటం చాలామంది మానుకున్నారు. మాదాల రవి బాల నటుడిగా అవార్డులు సాధించినా హీరోగా ఫ్లాప్. మరి పల్స్‌పట్టిన కళాకారుడు ఎలాగైనట్టు?
-పైడి పంతులు, కాకినాడ
గ్రేట్ కృష్ణవేణి
29 డిసెంబర్ ఆంధ్రభూమి వెనె్నల పేజీలో సాక్షాత్తూ స్వర్గీయ ఘంటసాలను సినీ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిదంటూ ఆమెపై రాసిన వ్యాసం ఆసక్తిదాయకం. రచయిత సరయూ శేఖర్‌కి అభినందనలు. నిర్మాతగా ఆమెపడిన కష్టాలు, వచ్చిన వారిని ఆదరించే సహృదయం, మాటల తుఫాను సూర్యకాంతమ్మను మూగగా నటింపచేసిన వైనం, కష్టాలు తెలిసిన కళాకారిణిగా బాధల్లో ఉన్నవారిని ఆదుకోవడం వంటి మంచి గుణాలే ఆమె సుదీర్ఘ జీవితానికి కారణాలు అనేలా వ్యాసం రూపొందడం చదువరులకు ఆనందదాయకం. ఈమెకు మామూలుగా లభించే ప్రభుత్వ పురస్కారాలు, గుర్తింపులు, గౌరవాలు, ఆమెముందు చిన్నవే అన్నట్లుగా ఆమెకు దక్కిఉండవు. ప్రజాభిమానమే తరతరాల ఆమె ప్రతిభకు ప్రమాణాలై ఉంటాయనేలా ఆంధ్రభూమి వెనె్నల వ్యాసం వనె్నలు చిందించింది.
-యంవిఆర్ కుమారి, హైదరాబాద్
ఆమె జాన్వి, అంతే!
అందాల శ్రీదేవి కుమార్తె జాన్విమీద తెలుగువారికి మోజెక్కువ. అర్జున్‌రెడ్డి సినిమా చూశాక దేవరకొండ అంటే క్రష్ ఏర్పడింది. అతనితో నటించాలనుందని ఆమె అనగానే మనవాళ్లు పొంగిపోయారు. తీరా పూరి ఆ అవకాశం కల్పిస్తే అదిగో, ఇదిగో అంటూ కాలయాపన చేసి పారితోషికం 4 కోట్లు డిమాండ్ చేసిందట. అందుకూ సిద్ధపడిన పూరి ఆమెను ఒప్పించడానికి ఏకంగా ముంబైలో మకాంపెట్టాడట. ఆమె ఒప్పుకుందని ఒకసారి, లేదని మరోసారి కథనాలొచ్చాయి. ఇప్పుడు జాన్వి -రణబీర్‌కపూర్, విక్కీకౌశల్‌తో నటించడానికి ఎదురుచూస్తున్నానంటూ సెలవిచ్చింది. అందుకే -ఆడవారి మాటలకు అర్ధాలు వేరనేది.
-సుధీర్, శ్రీనగర్
మర్యాద కాదేమో
చిత్రరంగంలో యాక్టివ్‌గా ఉన్నవారు తాతలకు, తండ్రులకు అవార్డులివ్వమంటూ ప్రతిపాదించటం ఎంతమాత్రం మంచిది కాదు. అవార్డుకు సమయం, సందర్భముంటుంది. అందుకు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఎవరికి అవార్డు అర్హతలున్నాయో అలాంటివారి యోగ్యతలు, చేసిన ఘనకార్యాలు వివరిస్తూ సినీపెద్దలు ఆ కమిటీలకు ప్రతిపాదనలు పంపితే వాటిని పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసులు చేస్తారు. ప్రభుత్వం ప్రకటిస్తుంది. అంతేగాని వేదికలెక్కిన ఉత్సాహంతో అవార్డులు ఇవ్వమని సొంతవాళ్లే కోరడం సముచితమైన ధర్మం కాదు. టాలీవుడ్‌కు గౌరవప్రదం కాదు.
-మైథిలి, సర్పవరం
పొరబాటు
ఆదివారం 12, జనవరి 2020 వెనె్నల అనుబంధంలో సీవీఆర్ మాణిక్యేశ్వరి రాసిన ఎన్టీఆర్ చిత్రం ‘తల్లా? పెళ్లామా?’ ముచ్చట బావుంది. కాని ఈ చిత్రం హిందీలో ప్రసాద్ ప్రొడక్షన్స్‌పై ‘జుదాయి’గా నిర్మించినట్టు అచ్చయ్యింది. దీని హిందీ చిత్రం బిదాయి. ‘జుదాయి’ అన్న హిందీ చిత్రం తెలుగు ‘ఆలుమగలు’ (ఏఎన్నార్)కు రీమేక్. పొరబాటుని గ్రహించాలి. ఇక నాకు నచ్చిన పాటలో ‘పెళ్లినాటి ప్రమాణాలు’ చిత్రంలోని వెనె్నలలోనే వేడియేలనో నిజంగా గొప్ప పాట. దీనిగురించి రాసిన రామలక్ష్మి -సినిమా విజయం సాధించిందని రాశారు. నిజానికి అది ఫట్.
-ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు