మీ వ్యూస్

కింకర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ చిత్రాలకు పెట్టింది పేరు రవితేజ. బలహీనమైన కథనైనా తనదైన పెర్ఫార్మెన్స్‌తో ఓకే అనిపించగల నటుడే. కానీ, కొంతకాలంగా వైఫల్యాలు అతన్ని వెంటాడుతున్నాయి. మంచి కథలనే ఎంచుకుంటున్నా ఆడియన్స్‌కి కనెక్ట్ చేయటంలో పూర్తిగా విఫలమవుతున్నాడు. అందుక్కారణం -మారుతోన్న ట్రెండ్‌ను రవితేజ అందుకోలేకపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మాస్ కథలు, రొటీన్ పెర్ఫార్మెన్స్‌ని పక్కనపెట్టి కాస్త వైవిధ్యంగా ఏదైనా చూపిస్తేగానీ రవితేజను ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే పరిస్థితి కనిపించటం లేదు. ముఖ్యంగా గతవారం వచ్చిన డిస్కోరాజా కథాపరంగా ఓకే అయినా రవితేజ మూస పెర్ఫార్మెన్స్, దర్శకుడి తడబాటు వెరసి సినిమా వారం తిరక్కుండానే కనుమరుగైంది. కొత్త జనరేషన్‌కు దారిచ్చేస్తూ సీనియర్ హీరోలు కొత్త కథలు వెతుక్కుంటున్నట్టే -రవితేజ సైతం తన పంథాను మార్చుకోక తప్పదు. లేదంటే కెరీర్‌కే ఎసరు పడొచ్చు.
-పల్నాటి రుద్ర, తుని
అవసరమంటారా?
మూడోసారీ లవ్ ఫెయిల్యూర్‌తో నయన్‌కి పెళ్లవుతుందా? అన్న సందేహాలతో ఫ్యాన్స్ బెంగపడుతున్నారంటూ ఈమధ్య కొన్ని పత్రికల్లో కథనాలొచ్చాయి. ఆమె మాత్రమే కాదు కాజల్, తమన్నాలాంటి సీనియర్లూ, రష్మికలాంటి నవతారలూ పెళ్లివరకు వచ్చి వెనక్కి తగ్గినోళ్లే. ఇలాంటి నిర్ణయాలకు సంబంధించి వ్యక్తిగతంగా ఆధునిక మహిళకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉంటాయి. చిత్రరంగంలోనే కాదు ఇతర రంగాల్లోనూ నవతరం వనితలు పెళ్లిపట్ల బలమైన నిర్ణయాలే ప్రకటిస్తున్నారు. సుప్రీం తీర్పు ప్రకారం సహజీవనం తప్పుకాదు. అందువల్ల పెళ్లి, పిల్లల జంఝాటం ఎందుకని ఆలోచిస్తున్న వాళ్లూ లేకపోలేదు. సో, మహిళల వ్యక్తిగత నిర్ణయాలను గౌరవిస్తూ ఫ్యాన్స్ సైతం హద్దుల్లో ఆలోచనలు చేయడం మంచిదన్నది నా అభిప్రాయం. సెలబ్రిటీలు ఎలాంటివాళ్లైనా వాళ్లపై అభిమానాన్ని మరోకోణంలో చూపిస్తే మంచిదేమో.
-శ్రీనివాసులు కె, దుర్గాపురం
ఏది కరెక్ట్?
‘కుటుంబ కథలకు అక్షయపాత్ర’ ఆర్టికల్‌లో ఒకచోట ‘కనె్నమనసులు’ సూపర్‌హిట్ అని, మరోచోట పరాజయం పాలైందని ఉటంకించారు. ఆసక్తికరమైన కొన్ని కథనాలు రాసేటప్పుడు -రచయితలు ఒకటికి రెండుసార్లు చూసుకుంటే మంచిది. సమాచారాన్ని కాస్త శ్రద్ధతో పరిశోధించాలి కూడా. నిజానికి -అక్షయపాత్ర అంటే తీసుకునే కొద్దీ అనంతంగా ఇచ్చేది. కాని ఆదుర్తి సినీ ప్రస్థానం యాభై చిత్రాల్లోపే ఆగిపోయింది. కథనంలో ఘన విజయాలు, సూపర్‌హిట్ అని పేర్కొన్న వాటిలో కొన్ని మోస్తరు సినిమాలు, ఫ్లాపులూ లేకపోలేదు. ఆదుర్తి అద్భుత ప్రతిభావంతుడే. సందేహం లేదు. కాని ఆయన ప్రతిభా చాలామందిలాగానే కొద్ది చిత్రాలకే పరిమితమైంది. మంచి చిత్రాలు తీసే తపనతో అక్కినేనితో కలిసి చక్రవర్తి చిత్ర అనే సంస్థ ప్రారంభించి రెండు చిత్రాలు తీసి నష్టాలు భరించలేక ఎత్తేశారు. ఆ రెండింటిలో మొదటిది ‘సుడిగుండాలు’ ప్రేక్షకుల్ని ఆలోచింప చేసినా, రెండోది ‘మరో ప్రపంచం’ విమర్శల పాలైంది. దానికి రజత నంది ఇచ్చినందుకు విమర్శలూ వచ్చాయి. ఆ చిత్రంలో పిల్లల్ని కిడ్నాప్ చేసి వారిని ఒక ద్వీపంలో పెంచి పెద్దచేసి ప్రయోజకులుగా తయారుచేయటమనే కానె్సప్ట్ అప్పట్లో యాక్సెప్ట్ చేయలేకపోయారు.
-చంపక్, మాధవనగర్
సరిలేరనుకోలేం
హీరోయిజంతోపాటు పర్‌ఫెక్ట్ కామెడీ టైమింగ్‌వున్న మహేష్, ఒక తరహా కామెడీని పండించే అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ అనలేం. ప్రచారం అలా చేసుకున్నా -అదొక ఫరవాలేదనిపించే చిత్రంలానే ఉంది. మహేష్ అవకాశమిచ్చినా, మంచి సినిమా తీసే అవకాశాన్ని అనీల్ జారవిడుచుకున్నట్టే. రెండు దశాబ్దాల క్రితం వచ్చే రెగ్యులర్ కమర్షియల్ సినిమా పంథాలో అప్‌డేట్ కాని కథ, కథనాలను, చిత్రీకరణ విధానాలను ఎంచుకోవడంలోని దర్శకుడు తన వెనుకబాటుతనాన్ని చాటుకున్నాడు. కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్, థ్రిల్లింగ్ స్థానంలో హీరోచేత కామెడీ చేయించడం ఏమాత్రం సూట్‌కాలేదు. మినిస్టర్ నరేంద్ర పాత్రలో ప్రకాష్‌రాజ్ వృథాఅయ్యాడు. విజయశాంతి చాలాకాలం తర్వాత తెరపై కనిపించినా, ఆ పాత్రకు ఎలాంటి ప్రత్యేకతా లేకపోవడం ఆశ్చర్యకరం. మాటిమాటికీ అర్థనగ్న దుస్తులతో హీరోపైకి ఎగబడే పాత్రలో రష్మిక నటన ఎబ్బెట్టు అనిపించింది. అసలేమాత్రం లాజిక్ లేని సన్నివేశాల సమాహారంగా తయారైన సినిమాలో ప్లస్ పాయింట్ అంటూవుంటే అది పక్కా మాస్ పాత్రలో మహేష్ నటన, ఫైట్స్, డ్యాన్స్‌లే. మొత్తం సినిమాను తన భుజాలపై మోసిన మహేష్‌కు హ్యాట్సాఫ్. సంక్రాంతి సీజన్‌లో వినోదం కోసం ఆవురావురుమన్న సగటు ప్రేక్షకులకు టైంపాస్ అయ్యిందే తప్ప, సరిలేరు నీకెవ్వరు చిత్రం మళ్లీ మళ్లీ ప్రస్తావించుకునేంత గొప్ప సినిమా అయితే కాదు.
-సి ప్రతాప్, శ్రీకాకుళం
లక్ష్మి కటాక్షించలేదు
జనవరి 26నాటి ఆదివారం వెనె్నల సంపుటిలో రచయిత్రి సీవీఆర్ మాణిక్యేశ్వరి రాసిన ఫ్లాష్‌బ్యాక్ అట్ 50లో ‘లక్ష్మీకటాక్షం’ హిట్టు చిత్రంగా రాశారు. ఆసక్తికర సమాచారం అందించినా, అది హిట్టు చిత్రమని రాయడం తప్పు. ఎన్టీఆర్‌తో దర్శకుడు విఠలాచార్య తీసిన జానపదాల్లో చాలా చిత్రాలు ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. ‘కంచుకోట, ‘రాజమకుటం’, ‘బందిపోటు’ చిత్రాలు ప్రస్తావించుకోదగ్గవే అయినా, మిగతా చాలా జానపద చిత్రాలు ఫ్లాపులే. పాఠకులకు అందించే సమాచారం ఒకటికి మరోసారి సరిచూసుకుని ఇవ్వాలని రచయిత్రికి మనవి. ఫ్లాప్ చిత్రాలు విజయం సాధించాయని చెప్పడం చరిత్రను వక్రీకరించటమే అవుతుందని గ్రహించగలరు. చిత్రమేంటంటే -లక్ష్మీకటాక్షం చిత్రానికి అప్పట్లో 30 రోజుల వాల్‌పోస్టర్ కూడా పడలేదు.
-పల్లి వరలక్ష్మి, ఆదోని