మీ వ్యూస్

ఓస్.. డబ్ల్యుఎఫ్‌ఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనె్నల్లో ఈవారం ప్రచురించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నిజంగానే సరిహద్దులను దాటలేదు. విమాన ప్రేమ కథను ‘వరల్డ్ లవర్’ అనిపించడానికే పెట్టినట్టుంది. ఏమాత్రం మార్పులేని విజయ్ రొటీన్ నటనతో -ప్రేక్షకుడిని తీవ్ర అసహనానికి గురిచేశాడు. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు చిత్రంలో -ప్రేమ లోతును అద్భుతంగా చూపించిన దర్శకుడు క్రాంతిమాధవ్ -ఎక్కువ ప్రేమ కథలు ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకుని పూర్తిగా కన్ఫ్యూజ్ చేశాడు. కన్ఫ్యూజయ్యాడు కూడా. ఒక్క ఇల్లెందు శీనయ్య కథనే సినిమా తీసినా అద్భుతంగా ఉండేదేమో. విజయ్ ఆ పాత్రతో రక్తికట్టిస్తే.. ఐశ్వర్య రాజేష్ మరింత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది. ఆ కథలోని ఒకింత ఆర్థ్రత ఆడియన్‌కి దొరికింది. వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ పెద్ద పెద్ద ఆశలు చూపించి -దర్శకుడు క్రాంతిమాధవ్, విజయ్ దేవరకొండ పూర్తిగా నిరాశపర్చారు.
-ఎంఆర్ ప్రసాద్, పార్వతీపురం
పెరిగే బడ్జెట్
అందం అంటే మనోళ్లకి మాచెడ్డ మోజు. హీరోలు అందంగా ఉండాలి. హీరోయిన్లు మరింత అందంగా ఉండాలి. సహాయ పాత్రలు చూడచక్కగా ఉండాలి. అయితే వికారంగా ఉండే హీరోలతో కొన్ని కన్నడ, తమిళ చిత్రాల హిట్ అవడంతో.. ముళ్లపొదలాంటి జుట్టు, గుబురు గడ్డం, వల్గర్ భాషతో కనిపించే మోటు హీరోల చిత్రాలూ ఇప్పుడొస్తున్నాయి. కొన్ని హిట్టయ్యాయి కూడా. అయినా హీరోయిన్లు అందంగానే ఉండాలి. ఇప్పుడు తల్లీ, వదినలాంటి పాత్రలకు ఒకలాంటి గ్లామర్ తారలను వెదికి వెదికి పట్టుకొస్తున్నారు. నదియా, రమ్యకృష్ణ, విజయశాంతి, టబూ, చివరకు భాగ్యశ్రీ కూడా తల్లి పాత్రలు చేసేస్తున్నారు. ఊరికే ప్రచారానికే తప్ప, వీరివల్ల సినిమా లెవల్ పెరగదు సరికదా బడ్జెట్ మాత్రం భారీ అవుతుంది.
-ఆర్ భవదీశ్వరి, జగన్నాధపురం
అనుసరించండి
ఇప్పుడున్న సినీ నటులు కన్నడ హీరో అంబరీష్‌ను అనుసరించాలి. తను పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నప్పుడు తనకు ఎలాంటి ప్రభుత్వ భద్రత (సెక్యూరిటీ) వద్దని చెప్పిన నిస్వార్థ ప్రజాసేవకుడు అంబరీష్. అలాగే నదీ జలాల సమస్యలపై వివాదం వచ్చినప్పుడు దేశభక్తి, రాష్ట్ర భక్తిపరునిగా ఆయన అప్పట్లో తన ప్రయోజనంకన్నా ప్రజల ప్రయోజనమే ముఖ్యమని అధికార సభ్యుడిగా రాజీనామా చేశారు. ఇప్పుడు చాలామంది సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ల స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారు.
-ఆచార్య నాగ్, కాకుటూరు
వందేళ్ల ప్రస్థానం
ఇది మన ప్రస్థానమంటూ వందేళ్ల సినిమా చరిత్ర తెలిపినందుకు వెనె్నలకు ధన్యవాదాలు. అలనాటి సినిమాల ముందు 1980లదాకా సినిమా పెద్దల విశేషాలు బాగా ఉన్నాయి. 1925లో నిర్మించిన ఒక సినిమా థియేటర్ కాకినాడలో ఇప్పటికీ ఉన్నదని చెప్పారు వ్యాసకర్త. ఆ థియేటర్ పేరేదో తెలిపివుంటే బాగుండేది. ఒకప్పటి క్రౌన్, కల్పన, మెజిస్టిక్ థియేటర్ల స్థానంలో పెట్రోల్ బంక్, షాపులు వెలిసాయి. గాయని బాలసరస్వతి విశేషాలు వ్యాసం బాగుంది. ఈ రెండు వ్యాసాలలో గ్రూప్ ఫొటోలు బాగున్నాయి.
-ఎవి సోమయాజులు, కాకినాడ
చాన్నాళ్లకు..
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ చినాళ్లకు వచ్చినా ఏమాత్రం విసుగు లేకుండా చూడదగిన చిత్రంలా అనిపించింది. హీరో తనదైన స్టయిల్‌లో యాక్షన్‌తో సినిమా మొత్తం ఒంటి చేత్తో నడిపించాడు. హీరోయిన్‌గా పూజాహెగ్డే ఓకే. మురళీశర్మ, టబు, జైరామ్ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. థమన్ కూడా తన ఊకదంపుడు సంగీతానికి భిన్నంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో సహా మార్చి అసలు సంగీత దర్శకుడు థమనేనా అనిపించేలా చేశాడు. వినోద్ కెమెరా ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా చూపింది. త్రివిక్రమ్ మార్కు పంచ్‌లు పెద్దగా లేనప్పటికీ నడిపించిన తీరు అతని స్టామినాను బైటపెట్టింది. మొత్తానికి చానాళ్ల తర్వాత కుటుంబ సమేతంగా చూసే సినిమా వచ్చింది. సంతోషం!
-కె.ఎస్.రెడ్డి, కొంకుదురు
ఇది గ్రహించాలి
వెనె్నలలో -పల్లి వరలక్ష్మి, ఆదోనినుంచి రాసిన ఉత్తరం, దానికి జవాబుగా ఎస్ శ్రీనివాసరావు రాసిన ప్రత్యుత్తరం చూశాక- భారతదేశ గొప్ప దర్శకులు శాంతారామ్‌ని ఓసారి మీడియా ‘మీరు చిత్ర రంగ దర్శకులు విఠలాచార్య తీసిన చిత్రాల్లాంటివి నిర్మించకూడదా?’ అని అడిగితే.. ‘నేనా’ అని నవ్వుతూ.. ‘అలాంటి చిత్రాలు చూసే స్థాయికి మా ప్రేక్షకులు దిగజారరు. ఆ చిత్రాలన్నీ పదేళ్ల అమాయక పిల్లలు చూసేందుకే’ అన్నారట. శ్రీనివాసరావు చెప్పిన చిత్రాలు ప్రజాదరణకు నోచుకోనివే. తెలుగు చిత్రసీమలో అత్యధిక ఫ్లాపుల నటునిగా కృష్ణ, ఎన్టీఆర్‌లకే పేరుంది. భువనసుందరి కథ, బబ్రువాహన, భాగ్యచక్రం, ఉమాచండీ గౌరీ శంకరుల కథ, దక్షయజ్ఞం, అడుగుజాడలు, డా.ఆనంద్, కాడెద్దులు ఎకరం నేల -వంటి చిత్రాలు నిర్మించిన నిర్మాత, దర్శకులు దివాలా తీసిన విషయం శ్రీనివాసరావు తెలుసుకోవాలి.
-ఎస్‌ఎం అంకిత, ఆదోని
హిందీ కాపీలే!
ఫిబ్రవరి 9 వెనె్నల్లో సీవీఆర్ మాణిక్యేశ్వరి ‘శాంతినివాసం’ చిత్రం గురించి రాశారు. ఈ చిత్రంలోని పాటలు కొన్ని హిందీ చిత్రాల పాటలకు కాపీలు. 1.ఉజాలా చిత్రంలో ‘యాలాయాలా దిన్‌లేగయా’ పాటకు సంగీతం శంకర్ జైకిషన్ అని రాస్తూ మిగతా మూడు పాటల సంగీత దర్శకుల పేర్లను రాయలేదు. అవి 2.‘తిమ్ తిమ్ తిమ్ తారోంకే దీప్‌జలే’- సంగీతం వసంత్ దేశాయ్. 3.దిల్‌లేకే దిల్ దేఖోజీ- సంగీతం ఉషాఖన్నా (తొలి పరిచయం). 4.ఆశలు నెరవేర్చే ఓ జననీ పాట ఖైదీ నెం.911 చిత్రంలో ‘మీఠీ మీఠీ బాతోంసే బచ్నాజరా’ సంగీతం దత్తారామ్ సమకూర్చారు. ఇక ఏరీ ఆ హీరోలు వ్యాసంలో.. కాల్షీట్లు సర్దుబాటుకాక ఎన్టీఆర్‌ని చిలకలా మార్చేసిన విఠలాచార్య సీన్ రాశారు. ఆ సినిమా పేరేంటో తెలియజేస్తే బావుంటుంది.
-ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు