మీ వ్యూస్

ఇప్పుడూ అంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలు వస్తున్న కొత్తలో వినోదంయొక్క ప్రాధాన్యం గుర్తించారు మనవాళ్లు. ఆ రోజుల్లో కామెడీ అంటే బూతులే. ఒకే కథతో లక్ష్మమ్మ, శ్రీలక్ష్మమ్మ కథ చిత్రాలు పోటాపోటీగా వచ్చి రెండో చిత్రంలో అంజలి, నాగేశ్వర్రావులున్నా శివరావు చేసిన వెగటు బూతు కామెడీతో చిత్రం ఫ్లాప్ అయింది. నీట్‌గా ఉన్న లక్ష్మమ్మ హిట్ అయింది. అయినా నిర్మాతలు ఏమీ నేర్చుకోలేదు. చాలాకాలం బూతులే కామెడీగా చెలామణి అయ్యాయి. ఇప్పుడూ అంతే. ఆరోజుల్లో కామెడీకి ప్రత్యేక నటులుంటే ఇప్పుడు హీరో, హీరోయినే్ల డబుల్ మీనింగ్ డైలాగులు, చేష్టలతో వినోదం పండించే ప్రయత్నం చేస్తున్నారు. మన్మథుడు-2 లాంటి వినోదాల్ని ప్రజలు తిరస్కరించినా మనవాళ్లు మానరు. మారరు.
- భవదీశ్వరి,
జగన్నాధపురం
యాప్ట్ ప్రశ్న
‘‘మనం మారేదెప్పటికి?’’అన్నది ప్రస్తుత చిత్ర రంగ పరిస్థితిలో యాప్ట్ ప్రశ్న. చాలామంది ఒప్పుకోకపోయినా ఆ ఆర్టికల్‌లో చెప్పినవన్నీ నగ్నసత్యాలే. ప్రతి సినిమాలో డాన్స్ అంటూ ఒక గుంపు. ఆ గుంపులో చేరి అర్థనగ్నంగా గంతులేస్తుంది హీరోయిన్. హీరో ఫుల్ డ్రెస్‌లో డ్రిల్ చేస్తాడు. అలా గంతులేసే అమ్మాయిని సామాన్యుల సంగతి అటుంచి హీరోలైనా నిజజీవితంలో పెళ్లిచేసుకుంటారా? అసలు హీరోలు తమ భార్యల్నే ఏ సినీ ఫంక్షన్‌కి తీసుకురారు. గుంపులో ఇలా గంతులేయనిస్తారా? ఫైటింగ్‌లు ఒక తలనొప్పి వ్యవహారం. హీరో ఎత్తికుదేస్తే విలన్ గాలిలో గింగిరాలు తిరుగుతూ కిందపడి స్ప్రింగ్‌లాగ వెంటనే పైకి లేచి మళ్లీ పడటం ఎంత హాస్యాస్పదం! అన్ని సినిమాల్లో అంతే!
- శాండీ, శ్రీనగర్
ప్రజలు నమ్మరు
రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటులను మించిపోయి నటించేస్తూ ఉండటంవల్ల కాబోలు నటులు కూడా ముఖ్యంగా కాలంచెల్లి, ఛాన్సుల, తగ్గిపోయినవారు రాజకీయాల్లోకి దిగుతున్నారు. కమల్‌హాసన్, రజనీకాంత్, ప్రకాశ్‌రాజ్ ప్రజాసేవ చేస్తామని బయలుదేరినా ప్రజలు నమ్మలేదు. కమల్ పార్టీ, ప్రకాష్‌రాజ్ దారుణంగా ఓడిపోయారు. మేం ఏం తక్కువని సీనియర్ నటీమణులు రాజకీయాల్లో చేరినా -వారూ ప్రజల్ని పెద్దగా మెప్పించలేకపోయారు. తాజాగా శృతిహాసన్ ఉబలాటపడుతోంది. యాంకర్‌గా పేరు తెచ్చుకున్న సమీరా షరాఫ్ తనకు సిఎం అవ్వాలన్న కోరిక వుందని ప్రకటించింది. అయ్యో, రాజకీయాలు!
-జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్
తెలుగు వెలుగు
సంకల్పం వుంటే కొండను పిండిచేయొచ్చు. బంకమట్టి ముద్దలా ఒకేచోట వుండటం కాదు, బంతిలా ప్రయాణించే ఆదర్శవంతం! ఇటీవల కొరియాలో జరిగిన బుసాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ‘తిలాదానం’ కెఎన్‌టి పర్యవేక్షణ కావించిన చిత్రం భారతదేశానికి ఘనమైన యశస్సు తెచ్చింది. 57 దేశాలనుంచి వచ్చిన చిత్రాలతో పోటీ పడి ఘనవిజయం సాధించడం ఎంతో గర్వకారణం.
-కేవీపీ, కందుకూరు
మనమెక్కడ?
దక్షిణ కొరియా చిత్రాల్ని మనవాళ్లు ఫ్రీమేకులు, రీమేకులూ చేయటం ఎక్కువైంది. అతి చిన్నదేశం తన చిత్రాలతో ప్రపంచానే్న ఊపేస్తోంది. తాజాగా ఆ దేశం నిర్మించిన ‘పారసైట్’ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డుతో సహా నాలుగు ఆస్కార్‌లు సాధించింది. ఆస్కార్‌లు ఆంగ్ల చిత్రాలకే పరిమితం. కాని ఆస్కార్ చరిత్రలో తొలిసారిగా ఆంగ్లేతర చిత్రానికి అవార్డులిచ్చింది. మన దేశం 70 ఏళ్లుగా చిత్రాలు నిర్మిస్తున్నా ఒక్క చిత్రానికీ ఇంతవరకు ఆస్కార్ లభించలేదు. అయితే ఆంగ్ల చిత్రాలకు పని చేసిన ముగ్గురికి ఆస్కార్ లభించింది.
-బి ప్రభాస్, గాంధీనగర్
అదో సెంటిమెంట్
నిజ జీవితంలో మనం పాటించినా, పాటించకపోయినా ‘ఒకరు ఒకరినే ప్రేమంచాలి’ అన్న సెంటిమెంట్ మనలో వుంది. ఆ సెంటిమెంట్‌కి భిన్నంగా తీసిన సినిమాలు మనసుకి ఎక్కవు. అలనాడు రాజ్‌కపూర్ ‘మేరా నామ్ జోకర్’లో ఒకరి తర్వాత ఒకరుగా నలుగురిని ప్రేమించి విఫలమయ్యాడు. సినిమా మ్యూజిక్, సాంకేతికంగా గొప్పగా వున్నా ఫ్లాపైంది. రెండోభాగం తీస్తానని ప్రకటించి విరమించాడు. తెలుగులో పూజాఫలం గతి కూడా అంతే అయింది. ఇపుడు వరల్డ్ ఫేమస్ లవర్ గురించి ప్రచారం హోరెత్తించినా ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోలేదు.
-హితీష్, రమణయ్యపేట
భలే చెప్తారు..
ప్రేమించడానికి తీరికే లేదని తారలు చెప్పడం ఫ్యాషనైంది. కాని ఎంత బిజీగా వున్నా నయన్ లాంటివారు ప్రేమిస్తున్నాం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. మిగిలినవారికి ఆ ధైర్యం లేక హీరోలతో చెట్టాపట్టలేసుకొని తిరగడానికి తీరిక చేసుకొని కూడా మాది ప్రేమ కాదు, జస్ట్ ఫ్రెండ్‌షిప్ అంటూ తప్పించుకుంటారు. అందుకే ప్రేమించడానికి టైమ్ లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అని ఎవరైనా చెబితే నమ్మబుద్ధి కాదు. వీరికన్నా శృతిహాసన్ బెటర్. సినిమాలు మానేసి ప్రేమికునితో వెళ్లిపోయింది. ప్రేమ ఎండిపోగానే మళ్లీ వచ్చేసింది అనుకోండి, అది వేరే విషయం.
-సాహిత్య దీప్తి, రమణయ్యపేట
వాడటం తప్పుకదా
దైవ సంబంధమైన పేర్లు సినిమా పేర్లకు అనుకరించడం సమంజసమా? అశ్వత్థామ, నమో వెంకటేశాయ, హరేరామ హరేరామ, భీష్మ, ఓం ఆధ్యాత్మికపరమైన పదాలు. ఇంకా ఎన్నో ఇలాంటి పేర్లు పిచ్చి కథలకు వాడటం అరాచకం. అలాగే దొంగశివ దొంగశివ అనే సినీ పాటలు కోకొల్లలు. ఇప్పటికైనా కళ్లు తెరిచి దైవ సంబంధమైన పేర్లను అపవిత్రం చేయడం శ్రేయస్కరం కాదని గ్రహించాలి.
-కేవీ ప్రసాదరావు, కందుకూరు