మీ వ్యూస్

అర్ధంకాని బా(మ)ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ కొత్త వాళ్లతో మహిళా దర్శకురాలు దర్శకత్వంలో రూపొందిన మధ చిత్రాన్ని చూశాం. వాల్‌పోస్టర్లు చూస్తే ఏదో వైవిధ్యం ఉన్నట్టుగా అనిపించింది. దానికి తగినట్టుగా ఎక్కడ వాల్‌పోస్టర్లపై తెలుగు పేరు కనబడలేదు. అన్ని పోస్టర్స్‌లో ఇంగ్లీష్‌లోనే మధ అనే టైటిల్‌ను చూపారు. ఏదో వైవిధ్యముంది అనుకొని వెళితే ఆ బాధేంటో అర్ధమే కాలేదు. ఆ మధ ఏంటో తెలియలేదు. హీరోయిన్‌ను నానా బాధలుపెట్టి, ఆమె ఏడ్పులే చూడండన్నట్టుగా సాగిందీ చిత్రం. చిత్రానికి కావల్సిన ఎటువంటి ప్రత్యేకతలు ఇందులో లేవు. అవార్డులు ఇలాంటి సినిమాలకు కూడా ఇస్తారా? అనిపించింది. మొత్తానికి ఎన్ని అవార్డులు వచ్చినా ప్రేక్షకుడికి అర్థం కాకపోతే ఆ సినిమా నిరర్ధకమే!
-ఎం సుమలత, తుని
నిజంగా స్పెషలే!
బాలీవుడ్‌లో అనుష్కశర్మది విశిష్ట వ్యక్తిత్వం. మిగిలిన తారల్లాగ ఫ్యాషన్ వెంట పరుగులు తీయదు. ప్రేమించడానికి తీరికలేదు అనకుండా విశ్వవిఖ్యాత క్రికెటర్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నటిగా, భార్యగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా బాధ్యతలు నెరవేరుస్తూ ఫార్ములా కథల జోలికిపోకుండా సహజమైన కథలే ఎంచుకుంది. అందుకే 13ఏళ్లలో 15 సినిమాలే చేసింది. చేసినవన్నీ ప్రజామోదం పొందాయి. మీడియాకి దూరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లు నేను చెప్పింది రాయరు. వ్యక్తిగత విషయాన్ని హైలెట్ చేస్తారు అని చెప్పుకొచ్చింది. సాధారణ దుస్తులు, సామాన్యమైన రంగులే ప్రిఫర్ చేస్తుంది. నిజంగా ఆమె ఓ స్పెషల్ కదా!
-కె.గునే్నష్, కొవ్వాడ
బాగున్నాయి
మనం మారేదెప్పుడు అనే వ్యాసం ద్వారా రచయిత ఫ్లాపుల సినిమాలను విజయవంతమైన సినిమాలని ఎలా డబ్బా కొట్టుకుంటున్నారో, పెద్ద నటుల నిర్వాకాల గురించి వారి గొప్ప మాటల గురించి బాగా విశే్లషించారు. లయన్‌కింగ్ యదార్థమైన కలక్షన్లను గురించి బాగా రాశారు. పర్ఫెక్షన్‌కు ప్రాక్టీసే మార్గం అన్న నటుడు వెంకటేశ్వరరావు పాత్రలు, ఆయన షూటింగ్ అనుభవాలు ఎన్టీఆర్ డబల్ పారితోషికం ఇవ్వమని చెప్పడం, ఆనాటి ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ వంటివారు మంచి మనసు గలవారని చెప్పడం బావుంది. అలాగే నాగభూషణం, రాజనాల నాటకంలోని నటనకి స్క్రీన్ నటనకి లిప్ మూమెంట్ విషయంలో చక్కని మాటలు చెప్పారు. ఈ వ్యాసంలో గ్రూప్ ఫొటో బాగుంది. అందులో ఉన్న పేర్లు వరుస క్రమంలో తెలిపితే బావుండేది. మధురం మధురం, ఆడ పెత్తనం చిత్రాల విషయాలు పాఠకులకు నచ్చుతాయి.
-ఏవీఎస్, కాకినాడ
ఆస్కారం లేదు
ఆస్కార్ అవార్డులు ఆంగ్ల చిత్రాలకే పరిమితం అనే సాంప్రదాయానికి తిలోదకాలిచ్చి ఒక చిన్న దేశం ఏకంగా నాలుగు ఆస్కార్ అవార్డులు కొట్టేసింది. దక్షిణ కొరియా వారు దాదాపు 70 ఏళ్లకు పైగా సినిమాలు నిర్మిస్తున్నారు. మన దేశంలో కూడా అప్పట్నుంచే సినిమాలు రూపొందిస్తున్నారు. కానీ మనకు ఒక్క ఆస్కార్ రాలేదు. కారణం ఏమిటి? విదేశ చిత్రాలు అతి సహజంగా ఉంటాయి. నిజ జీవితాల్ని ప్రతిబింబిస్తాయి. మన చిత్రాలు అలాకాదు. 50 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు టెక్నికల్‌గా మెరుగుపడినా దర్శకత్వ పరంగా, కథాపరంగా అక్కడక్కడ అప్పుడప్పుడు మెరుపు కనిపించినా అన్ని కాలక్షేపం బఠాణీ చిత్రాలే తప్ప నిజంగా హృదయాల్ని కదిలించలేవు. అసహజ డైలాగులు, అసహజ సన్నివేశాలు, పేలవమైన దర్శకత్వాలు వెరసి భారతీయ చిత్రాలను ఖూనీ చేస్తున్నాయి. ఇక అవార్డులు రమ్మంటే ఎలా వస్తాయి?
- సహృదయ.కె, రామేశ్వరం
బాహుబలులే!
భారతదేశంలో అత్యంత ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోల్లో ముఖ్యంగా అలనాటి మలయాళ సూపర్‌స్టార్ ప్రేమ్‌నజీర్ పేరు చెప్పాలి. ఆయన గతించిన నాటికి సుమారు 600 చిత్రాలకు పైగా నటించారు. అలాగే తెలుగు చిత్రాల్లో చెప్పుకుంటే సూపర్‌స్టార్ కృష్ణ సుమారు 375 చిత్రాల్లో నటించారు. అప్పటి హీరోలను ఇప్పటి హీరోలు ఎప్పటికీ అధిగమించలేరు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, శోభన్‌బాబులను కూడా ఎక్కువ చిత్రాల్లో నటించిన బాహుబలి హీరోలే అనచ్చు. ఇప్పటి యంగ్ హీరోలు పరిశ్రమకు వచ్చిన ఏడాదికి ఒక్క సినిమాలో నటిస్తే గొప్ప. చిరంజీవి 152 చిత్రాల్లో నటించగా, బాలకృష్ణ 106 చిత్రాల్లోనే చేశారు. నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు సైతం 100కు దాటలేకపోయారు. తమిళ నటుడు రజనీకాంత్ 166 చిత్రాలు చేశారు. భవిష్యత్తులో ఇంకెంతకాలం నటిస్తారో చూడాలి. ఏదేమైనా ఆయన కూడా ఆ రికార్డును దాటలేరు. హాస్య నటులు బ్రహ్మానందం, మనోరమ, రమాప్రభ ఇత్యాది తారలు దాదాపు వెయ్యి చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు.
-ఎఆర్ రావు, ఖమ్మం
అదే రాజకీయం
రజనీకాంత్ రాజకీయాల్లో ప్రవేశించగానే ‘అతడు తమిళుడు కాదు, తమిళ రాజకీయాల్లో అతనికేం పని’ అంటూ రాధిక ధ్వజమెత్తింది. ఇపుడు భారతీరాజా రజనీని విమర్శిస్తున్నాడు. దర్బార్ చిత్రం 400 కోట్లు సాధించింది అంటున్నారు. దాని నిర్మాణానికి 50 కోట్లు కంటే ఎక్కువ కదా. మిగిలిన 35 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లినట్లు? నష్టపోయాం అంటూ బయ్యర్లు రజనీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. బయ్యర్లు నష్టపోతే ఎంతో కొంత సాయం చేయడం రజనీకి అలవాటే. బయ్యర్లు నిజంగా నష్టపోతే వాళ్లు రజనీని విమర్శించాలిగాని భారతిరాజాకి ఎందుకు? తన చిత్రాల బయ్యర్లు నష్టపోతే భారతీరాజా వారికి చెల్లించాడా? తమిళ రాజకీయాలు ఇలాగే ఉంటాయి.
-ప్రసన్న, పేర్రాజుపేట
తేల్చేసింది
అక్షరంతో ఆలోచన రేకెత్తించిన సాహితీవేత్తలపై వ్యాసం బావుంది. రాజమకుటం చిత్ర విశేషాలు బాగున్నా అక్కడక్కడా తప్పులు దొర్లాయి. ఈ చిత్రానికి కొంత ఆధారమైన తమిళ చిత్రం కుదుమై పిత్తన్‌ను కుదుమై పితమే అని రాశారు. రాజమకుటం విజయవంతం కాలేదు. పైగా చిత్రం చూసిన ప్రేక్షకులు మల్లీశ్వరి తీసిన వాడికి ఏమైందిరా? ఇలాంటిది తీశాడని విమర్శించారట.
-శంభుడు, వక్కలంక