మీ వ్యూస్

వెన్నెల కురిపించారు - మీ వ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవరాత్రిలో వెన్నెల. నవరాత్రి చిత్రంలో అష్టతారల కూటమి ఓ పిచ్చాసుపత్రిలో అద్భుతంగా చిత్రీకరించిన ప్రహసనం వెన్నెలలాంటిదే. రకరకాల వైరుధ్యాలతో పిచ్చాసుపత్రిలో వున్న సూర్యకాంతం, ఛాయాదేవి, గిరిజ, కాంచన, జమున, గీతాంజలి, జయలలిత లాంటి వారి మధ్య సావిత్రి వెళితే ఇంక ఏముంది? అంతమంది జాబిలమ్మల ముందు వెన్నెల విరగకాయదు! ఆరోజుల్లో ఈ పాటను మళ్లీమళ్లీ చూసిన అనేక మంది ఉన్నారు. పారితోషికం ఆశించకుండా వచ్చి నటించి, ఆ పాటను రక్తికట్టించి చిరస్మరణీయులయ్యారు. ఈ శరదృతువులో ధవళ వస్త్రాలను ధరించిన నటీమణుల ఫొటోలను ప్రచురించి, వెనె్నల కురిపించారు.
- ఎన్ రామలక్ష్మి, సికిందరాబాద్

పరమచెత్త
తెలుగు సినిమాకు ఏ గ్రహణం పట్టిందోగానీ వరుస ప్లాపులు వచ్చి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మాది సూపర్ వెరైటీ, కామెడీ క్లాసికల్ అంటూ మీడియాలో అదరగొట్టడం, అది నిజమని వెళ్లిన ప్రేక్షకుడికి తలబొప్పికట్టి గుడ్లు తేలవేయడం ఇప్పటి ప్రేక్షకుడి చిత్రం. ఈ కాలానికి వచ్చిన మరొక పరమ చెత్త సినిమా శంకరాభరణం. కోన వెంకట్ ఇచ్చిన బిల్డప్‌కు, టైటిల్ వింటుంటే కలిగే ఆసక్తితో సినిమాకు వెళ్తే తల ఫట్‌మనడం ఖాయం. సూపర్ సెటైరికల్ కామెడీ అయినా ఫస్‌గయారే ఒబామాను ఇంతకుముందు రెండుసార్లు రీమేక్ చేసి, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. ఇది ముచ్చటగా మూడో సినిమా. శంకరాభరణం లాంటి టైటిల్‌ను ఎంచుకున్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని సినిమా తీయాలి.
-సి సాయిమనస్విత, విజయవాడ

రాదుమరీ?
దీపికాపదుకోనేకు కోపం వచ్చింది. రాదుమరీ? పనీపాటా లేని సాపాటు రాయుళ్లు ఆమె నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బాజీరావు మస్తాని’ బాహుబలి దరిదాపుల్లో వుంటుందా? లేక మించిపోతుందా? అంటూ ప్రశ్నలతో వేధిస్తున్నారట. ఈ రెండు సినిమాలకు సంబంధమే లేదు. వాటిని పోల్చవద్దు అని ఆమె మొత్తుకున్నా అవే ప్రశ్నలు అడుగుతున్నారట. బాహుబలి స్థాయిలో బాజీరావు వుండడు. అందుకే దీపికా చిర్రుబుర్రులాడుతోంది అని వాళ్లు తీర్మానించారు. నిజానికి బాజీరావు ఓ మరాఠా యోధుడు. బాహుబలి పూర్తిగా కల్పితం. దాని వెనుక అనేక ఊహలు, గ్రాఫిక్స్ ఉన్నాయి. బాజీరావు విషయంలో అలా కాదు. అందుకే దీపికకు కోపం వచ్చింది.
- పి.శుభలక్ష్మి, కాకినాడ

రిస్క్ చేస్తే..
సినిమాకోసం కొంతమంది నటీనటులు తమ ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నారు. సినిమాలో పాత్రకోసం బరువు పెరగడం, తగ్గడం వంటివి చేసి ఆరోగ్యం పాడుచేసుకోడం మంచిది కాదు. గతంలో చక్రి వంటి సంగీత దర్శకుడు భారీ శరీరంతో హఠాన్మరణం చెందాడు. హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ లైపోసెక్షన్ చేయించుకోవడంకోసం విదేశాలకు వెళ్లి తనువు చాలించింది. ఇలా ఒక్కొక్కరు తమ సొంత సమస్యలతో చనిపోవడంవల్ల పరిశ్రమ మంచి నటులను కోల్పోతోంది. అనుష్క కూడా సినిమా పాత్రకోసం బరువు పెరిగిందట. ఇప్పుడు బానే వుంటుంది. భవిష్యత్‌లో సమస్యలు ఎదురవుతాయి. ప్రేక్షకులకు కావలసింది మంచి కథాకథనాలు ఉండే చిత్రాలే కానీ నటీనటులు తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం కాదు. ఇలా రిస్క్ చేయకపోవడం చాలా మంచిది.
- బానాల కృష్ణమాచారి, హైదరాబాద్

ప్రకాశించింది
ఈనెల వెనె్నలలో శరత్‌కాలమ్ వికసించింది. సీతారామకళ్యాణం స్థిర చలనచిత్ర విశేషమే వెనె్నల్లో ఆకర్షణ అయింది. ముందడుగు చిత్రం వ్యాసం అలరించింది. చరిత్రలో వసూళ్ల నిరాదరణ వాస్తవమైనా వచ్చినవి పేరుప్రతిష్ఠలకు కొదవలేదు. అన్నీ గుర్తుంచుకొనదగినవే. సారంగధర, పల్నాటియుద్ధం, బొబ్బిలియుద్ధం, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మహామంత్రి తిమ్మరుసు, మల్లీశ్వరి, భక్తపోతన, త్యాగయ్య, వేములవాడ భీమకవి లాంటి చిత్రాలన్నీ అలరించినవే. నాకు నచ్చిన సినిమా, పాట శీర్షికలు పాత సంగతులతో సినీ అభిమానుల్ని పలకరిస్తున్నాయి.
- పి.వి.ఎస్.ప్రసాదరావు, అద్దంకి

సినిమా నిర్మాణంలో కూడా ప్రవేశించిన ప్యాకేజీల భాగోతం బాగా వివరించారు. ఇంటిలో వ్రతం చేసుకుంటే ఏకావలసిన సామగ్రి జాగ్రత్తగా ఎంచుకొని పెట్టుకుంటాం. పంతులుగారు మన ఎదుట కూచుని మంత్రాలు చదువుతూ ఎప్పుడు ఏది ఎలా చేయాలో చెప్తూ చేయిస్తారు. మనసుకు తృప్తిగా ఉంటుంది. కాని దేవస్థానంలో టిక్కెట్టు తీసుకొని పెద్ద హాలులో ఇతరులతోపాటు కూచుంటే మనముందు సామగ్రి ఉంచుతారు. ఎప్పుడూ తోమని జిడ్డు కలశం ఉంటుంది. మాసిపోయిన గుడ్డ ముక్క ఉంటుంది. పత్రి, పూలు కూడా ముందు బ్యాచిలో వాడినవే మన ముందు పడేస్తారు. మైకులో పురోహితుడు మంత్రాలు చదువుతూ చెప్పేది చేస్తే వ్రతం పూర్తవుతుంది. అసంతృప్తి మిగులుతుంది. పాత సినిమా నిర్మాణ పద్ధతికి ఈనాటి పద్ధతికీ ఇదే తేడా!
-బి.చంద్రిక, రాజేంద్రనగర్

ఏంటిది.. పూరి!
పూరి జగన్నాధ్ వెదజల్లిన ‘ఆణిముత్యాలు’ ఇవి.. ఏరుకోండి! మత గ్రంథాలు ‘నిన్ను నీవు ప్రేమించుకో. నీకు నీవే సేవ చేసుకో’ అని బోధించాలట. స్వార్థం చాలా మంచిదట. రాంగోపాల్‌వర్మలాగా నిర్లక్ష్యంగా ఉంటూ హాయిగా బతికేయాలట. ఆయన నచ్చిందే చేస్తాడు. ఇష్టమొచ్చినప్పుడు పనిచేస్తాడు. లేకుంటే పడుకుంటాడు- ఇలాంటి ఆణిముత్యాలెన్నో దొర్లాయి ఆయన ఇంటర్వ్యూలో. సెట్‌మీదకొచ్చి నాకు పని చేయాలని లేదు, పడుకుంటా అని నటీనటులు చెప్తే ఒప్పుకుంటాడు పూరి? ‘లోఫర్’ ఆడియో ఫంక్షన్‌లో పవన్ అభిమానులు అల్లరి చేస్తే పూరి ఇరిటేట్ అయ్యాట్ట.
వాళ్లకిష్టం అయింది, అల్లరి చేశారు. ఇరిటేషన్ ఎందుకు పూరీ? నువ్వు చెప్పిన సూత్రమే కదా ఇష్టమైనది చెయ్యమని!
-్ధర్మతేజ, గొడారిగుంట