మీ వ్యూస్

అక్కడే.. పడింది దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని సినిమాలు ఒక్కలా ఉండవ్ -అంటూ గతంలో ఓ సినిమాకు టాగ్‌లైన్ పెట్టారు. అది పేలింది. సినిమా ఒకేలావున్నా, అప్పటికది వెరైటీ కనుక రిసీవ్ చేసుకున్నారు. అయతే, ఈ క్యాప్షన్ బేతాళుడికి సరిపోతుంది. విజయ్ ఆంటోనీ సినిమాలన్నీ ఒక్కలా హిట్ కావు అన్న విషయం అర్థమైంది.
బిచ్చగాడు బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో -అదే రేంజ్‌లో బేతాళుడు చిత్రాన్ని కూడా చూసేస్తారని ఆశించారు. కానీ, సినిమాకు అంత సీన్ లేదు. కంపేరిజన్ లేకుండా చూసివుంటే బేతాళుడు కూడా బావుందని అనిపించేదేమో. బిచ్చగాడు హిట్టును అడ్డుపెట్టుకుని వసూళ్లు సాధిద్దామనుకున్న ప్రయత్నాలే బేతాళుడికి బెడిసికొట్టింది. ఏదేమైనా -విజయ్ మాత్రం తెలుగులో మార్కెట్ పెంచుకునే ప్రయత్నాల్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది.
-కల్పన, సికింద్రాబాద్

చూడచక్కగా..
ఇటీవలి కాలంలో అల్లరి నరేష్, సునీల్‌ల హాస్య ప్రధానాంశంతో వచ్చిన సినిమాలన్నీ అపహాస్యం పాలయ్యాయి. కమెడియన్‌గా కెరీర్‌ను నడిపిస్తూ హీరో ప్రయత్నాలు చేస్తున్న శ్రీనివాసరెడ్డి చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా ఆడియన్స్‌కి నచ్చింది. ఎన్టీఆర్ చిత్రం శభాష్‌రాముడులోని పాటలోని పల్లవి పదాలే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టైటిల్ చేశారు. కమెడియన్లు హీరోలుగా చేసే చిత్రాల్లో ఒకింత జాగ్రత్త తీసుకుంటే వర్కవుటవ్వొచ్చు. ఒరవడి మార్చకుండా ఓవరాక్షన్ చేస్తే మాత్రం నిరాశ మిగలక తప్పదు. ప్రేక్షకుల దృష్టిననుసరించి సినిమా తీస్తే ఎవరు నటించినా ఆదరణకు కరువేమీ ఉండదనే చెప్పాలి.
-బృంద, ఆగిరిపల్లి

లీకుల గోలేంటో..
బాహుబలి-2లో 9 నిమిషాల భాగం లీక్ అయిందన్నారు. వెంటనే నాగార్జున హీరోగా చేస్తున్న నమో వెంకటేశాయ భాగం లీక్ అన్నారు. గతంలో అత్తారింటికి దారేదిలో సగం వరకు లీక్ అయ్యిందని ప్రచారం జరిగినా, అదే కలిసొచ్చి చిత్రం హిట్ అయింది. ఈ లీకుల్లో అనుమానితులుగా కొందర్ని అరెస్ట్ చేస్తున్నా కోర్టుకి వెళ్లడం లేదు, శిక్షలూ లేవు. ఈ ప్రహసనం అంతా ప్రచారం కోసమే చేస్తున్నారేమో. బాహుబలి-2 లీకును చాలామంది చూశారు. అందులో సౌండ్ లేదు, చీకటి. కాసేపు ముఖాలు కనిపించినా ఏమీ అర్థంకానట్టుంది. దీనివల్ల చిత్రానికి నష్టమేమీ లేదు. ఆ మాత్రానికి లీకు అంటూ ఆర్భాటం ఎందుకు? ఇలాంటి ప్రచారాలు ఎంతకాలం చేస్తారు.
-కమలాకర్, పెనుగొండ

చెంచులక్ష్మి
1943, 1958లలో ఒకే పేరుతో విడుదలైన ‘చెంచులక్ష్మి’ సినిమాలు ఘన విజయం సాధించగా, అదే కథాంశంతో 1932లో నిర్మించిన తొలి తెలుగు టాకీ భక్తప్రహ్లాద, మరల అదే పేరుతో 1967లో వచ్చిన చిత్రం అన్నీ ఘన విజయం సాధించడం విచిత్రం. ఇలాంటి సంఘటనలు బహు అరుదుగా జరుగుతుంటాయి. దర్శకుల, నటీనటుల ప్రతిభతో రసరమ్యమైన పాటలు, వీటికి తగ్గ సంగీత బాణీలు సమపాళ్ళలో ఇమిడిపోయాయి. కనుకనే తిరిగి తీసినా చూసారానాడు. 1958, 1967 చిత్రాలకు సాలూరి రాజేశ్వరరావు స్వరకర్త కావడం మరో విశేషం. ఎఎన్నార్ చెంచులక్ష్మిలో ఉగ్ర నరసింహునిగా నటించిన పహిల్వాన్ రాజు విస్సాకోడేరని రాశారు. ఈ గ్రామం భీమవరంలో ఉంది. పాలకొల్లుకు పదిహేను కిలోమీటర్ల దూరం. ఫ్లాష్‌బ్యాక్‌లు బావుంటున్నాయి.
-ఎన్‌ఆర్ లక్ష్మి, సికింద్రాబాద్

ప్చ్.. మనవాళ్లంతే!
కమల్‌హాసన్ గొప్ప నటుడు. అనీల్‌కపూర్ కూడా మంచి నటుడే. స్వాతిముత్యం తెలుగులో కమల్, హిందీలో అనీల్ నటించారు. బుద్ధిమాంద్యం కలిగిన పాత్రకు ప్రాణ ప్రతిష్టచేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసేడు కమల్. మరి అనిల్ కేవలం ఆ పాత్రను నటించాడు. కొడతా అన్నట్టు చెయ్యి ఎత్తే మేనరిజాన్ని కమల్ అతి సహజంగా చేస్తే, అనిల్ అలా చేయలేకపోయాడు. పాత్రల ఫీలింగ్స్‌ని ప్రేక్షకుల హృదయాల్లోకి బదిలీచేయడమే ఉత్తమ నటన. ఆ పని పరభాషా నటీనటులు చేయగలుగుతున్నారు. మనవాళ్లు చేయలేకపోతున్నారు. అందుకే మలయాళీ భామలు టాలీవుడ్‌ని ఆక్రమించేశారు. మనవాళ్లు ప్చ్!
-స్నేహమాధురి, పెద్దాపురం

పవర్ తగ్గినట్టా?
చిరంజీవి 150 చిత్రంకోసం ఎంత హంగామా! మొదట కథ, దర్శకుడు, హీరోయిన్ ఎంపిక కోసం ఎంత కసరత్తు! ఎన్ని మార్పులు! చివరకు అన్నీ సెటిలై చిత్రం పూర్తయిందనేసరికి ఐటంసాంగ్ చేయాల్సిన కేథరిన్ దుస్తులు సౌకర్యంగా లేవు అనడంతో ఆమెను తొలగించి రాయ్‌లక్ష్మిని తీసుకున్నారు. సౌకర్యంగా లేవంటే వల్గర్‌గా ఉన్నాయనే అర్థం. చిత్రీకరించాక రాయ్‌లక్ష్మి గ్లామర్ సరిపోదు అనుకున్నారేమో అర్థనగ్నంగా... కాదు, ముప్పాతిక నగ్నంగా కాజల్‌తో మరో సాంగ్ చేసి కలపాలనుకుంటున్నారు! డబల్ డోస్ గ్లామర్ కిక్ ఉంటేగాని హీరోగారి హీరోయిజం క్లిక్ అవదా? తనపై తానే విశ్వాసం కోల్పోతున్నారా చిరంజీవి? ఎంత దుర్గతి!
-మరుదకాశి, కరప

లోపం మనదే!
ఆమె నటన, హావభావాలు, అందం అన్నీ ఆంధ్రులకు నచ్చేశాయి. ఒక్కసారిగా స్టార్‌డం పెరిగిపోయింది. పరభాషా హీరోయిన్లు పూర్తిగా టాలీవుడ్‌ని ఆక్రమించేశారు. తెలుగువాళ్లకి ఛాన్సులెందుకు వస్తాయి- లాంటి కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ప్లస్ పాయింట్స్ ఉంటే చాలదు. వాటిని చక్కగా బ్లెండ్ చేసి ప్రేక్షకుల గుండెల్లోకి బదిలీచేసే నేర్పు ఉండాలి.
అలాంటి నేర్పు లేకపోవడంవల్లనే తెలుగు నటులు నిలబడలేకపోతున్నారు. మనవారి టాలెంట్ ప్రేక్షకుల గుండెల్ని తాకీతాకనట్లు స్పర్శరేఖలా పోతున్నది. గుండెల్లోకి దిగడం లేదు. అలా దిగాలంటే బాడీ లాంగ్వేజి మెరుగుపరుచుకొని పాత్రల మాదిరిగా ప్రవర్తించడం అలవరచుకోవాలి. తెరమీద నటీనటులుకాక పాత్రలు కనిపించాలి.
-సుధీర్, శ్రీనగర్