మీ వ్యూస్

సంతోషం.. విచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలు.. సంబంధం లేని పేర్లు మీద వెనె్నల వ్యాసం వివరణాత్మకంగా ఉంది. పాత సినిమా పాటల పల్లవి పంక్తులనే టైటిల్స్‌గా పెట్టడం గొప్ప విషయమే అయినా, తెలుగు భాషమీద ఇప్పుడున్నవాళ్లకు అంత పట్టులేదన్న విషయం అర్థమవుతుంది. సినిమా కథకు తగినట్టు అచ్చతెనుగు టైటిల్ పెట్టుకోలేక -గత రచయితలు సృజించిన పాపులర్ పల్లవులనే పల్లవించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ, సినిమా టైటిల్స్ చూసినపుడు అప్పటి పాటలు, వాటి బాణీలు మదిలో పదేపదే గుర్తుకొచ్చి ఒకింత ఆనందం కూడా వేస్తోంది. అలా ఆనందం.. ఇలా ఆవేదన. అంతే!!
జివి రఘురాము, వాడపల్లి

అదీ అసలు పేరు
పదహారణాల తెలుగువాడైన విజయా రెడ్డి ముచ్చటగా మూడు మంచి తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించినా -మాతృభాషా చిత్రాల్లో మాత్రం ఎక్కువ కాలం రాణించలేకపోయారు. విఠలాచార్య పుణ్యమా అని కన్నడ చిత్రరంగంలో నిలదొక్కుకున్నట్టు మాణిక్యేశ్వరి కాలమ్‌లో చదివినపుడు మనసుకు తృప్తినిచ్చింది. నిజానికి ‘శ్రీమతి’ చిత్రం నిర్మాతను సిరిమంతునిగానే చేసింది. చిత్ర దర్శకుని పేరును విజయానంద్‌గా ప్రకటించుకున్న విజయారెడ్డి అసలు పేరు సుబ్బిరెడ్డి. ఈయనది పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామం. 1950-60 మధ్యలో అక్కడే చదువుకున్నారు.
ఎన్ రామలక్ష్మి, సికింద్రాబాద్

గ్రేట్ దంగల్
తెలుగు సినిమాలు ప్రేక్షకులను వీరబాదుడు బాదేస్తున్న తరుణంలో వచ్చిన అమీర్‌ఖాన్ హిందీ చిత్రం ‘దంగల్’. కుస్తీయోధుడి జీవిత చరిత్రను తీసుకుని ఆయన తన కుమార్తెలను తీర్చిదిద్దిన వైనం, దేశానికి గర్వకారణంగా నిలిపిన ఘనతను సినిమాగా చూపించన తీరు అభినందనీయం. అప్పుడప్పుడూ ఇలాంటి సినిమాలు రావడంవల్లే ఇంకా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలనిపిస్తుందేమో. పాత్రధారుల ఎంపిక, వాళ్లనుంచి నటన రాబట్టుకోవడం వరకూ దర్శకుడు తన నైపుణ్యాన్ని చూపించాడన్న విషయం సినిమా చూస్తే అర్థమవుతుంది. అమీర్‌ఖాన్ మరోసారి తన సత్తా చూపిన చిత్రం ‘దంగల్’.
సిహెచ్ సాయిమన్విత, హైదరాబాద్

సప్తగిరి డకవుట్!
సినిమాలో చిన్న పాత్రయినా చక్కని నటన, మంచి టైమింగ్‌తో కామెడీ పండించే ప్రతిభాశాలి సప్తగిరి. అటువంటి నటుడిని హీరోగాపెట్టి పూర్తి నిడివి వినోదాత్మక చిత్రం తీయాలంటే కథాబలం, ఆకట్టుకునే కథనం తప్పనిసరి. సరిగ్గా ఈ విషయంలో బోల్తాపడిన కారణంగానే ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ అభాసుపాలైంది. గతంలో కామెడీ నటులను హీరోలుగా పెట్టి తీసిన సినిమాలు ఎందుకు విఫలమయ్యాయో విశే్లషించుకుంటే -సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను ప్రేక్షకులను హింసపెట్టేలా తీసిఉండేవారు కాదేమో. కామెడీ సన్నివేశాల్లోనే చూడ్డానికి అలవాటుపడిన సప్తగిరిని -స్టార్ హీరో మాదిరి యాక్షన్ ఎపిసోడ్స్‌లో చూడాల్సి రావడం.. ప్రేక్షకులపై పగ తీర్చుకున్నారన్న భావనే కలిగింది. కామెడీ హీరోలంటేనే వెగటు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు, నిర్మాతలు. పాపం.. హీరోగా సప్తగిరి డకవుట్ అయిపోయాడు.
సి ప్రతాప్, శ్రీకాకుళం

ఫ్లాష్‌బ్యాక్ సూపర్
ఫ్లాష్‌బ్యాక్‌లో ఎన్నో ఉత్తమ చిత్రాల వివరాలు అందిస్తున్న రచయిత మాణిక్యేశ్వరికి అభినందనలు. ఈమధ్య టాలీవుడ్ చానెల్‌లో ‘నిండుకుటుంబం’ సినిమా చూస్తుంటే -అప్పుడెప్పుడో చూసిన డిబిఎన్ ప్రొడక్షన్స్ కృష్ణ, రామ్మోహన్, విజయనిర్మలతో నిర్మించిన ‘అన్నదమ్ములు’ చిత్రం గుర్తుకొచ్చింది. తెలుగు సినిమాల్లో గుర్తుంచుకోదగినది. ఆ సినిమా వివరాలతో ‘్ఫ్లష్‌బ్యాక్’ అందివ్వగలరు.
కెజికె మూర్తి, విజయవాడ

ఇప్పట్లోనూ బావుంది..
యువ హీరోల్లో -నారా రోహిత్ ప్రత్యేకం అనిపిస్తుంది అతని సినిమాలు చూస్తుంటే. కథల ఎంపిక విషయంలో అతని శ్రద్ధ కావొచ్చు, కలిసొచ్చే అదృష్టం కావొచ్చు.. సినిమాలన్నీ వేటికవే అన్నట్టు ఉంటాయ. గతవారం విడుదలైన ఒకడుండేవాడు చిత్రం కూడా కచ్చితంగా వైవిధ్యమైనదే. ‘‘అప్పట్లో’’ తనకు జరిగిన అన్యాయాన్ని, తన హోదాతో అంతం చేయాలనుకున్న యువకుడిగా రోహిత్ మంచి నటనే ప్రదర్శించాడు. క్రికెట్ ఆటంటే అమితంగా ఇష్టపడే కుర్రాడిగా, బతుకులో ఎదురైన అన్యాయాన్ని తిరిగి అన్యాయంతోనే ఎదుర్కోవాలనుకున్న యువకుడిగా శ్రీవిష్ణు నటన చెప్పుకోదగ్గదే. ఇద్దరు మంచి నటులతో, సరైన కథా కథనంతో మంచి చిత్రాన్ని అందించిన దర్శకుడినీ అభినందించాలి. అప్పట్లో ఒకడుండేవాడు చూడదగ్గ చిత్రం. అందులో ఏమాత్రం సందేహం లేదు.
కె వల్లభ, విజయవాడ

అలనాటి సంగతి
పట్టువీడలేదు..
చిత్ర నిర్మాత శంకర రెడ్డి 1958లో ‘లవకుశ’ చిత్ర నిర్మాణం మొదలెట్టారు. మంచి ముహూర్తాన చిత్రం ప్రారంభించినా దురదృష్టవశాత్తూ -ఎన్నో అవాంతరాలు, ఆటంకాలు ఎదురయ్యాయి. కానీ, నిర్మాత ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆగిపోయిన చిత్ర నిర్మాణాన్ని తిరిగి 1963 మార్చి 29న మొదలెట్టారు. ఆ మధ్యకాలంలో మాత్రం చిత్ర నిర్మాత శంకర రెడ్డి ఆర్థికంగా ఎన్నో ఆటుపోట్లుకు గురయ్యారు. అయితే, మంచివారికి దైవం తోడన్నట్టు -శ్రీరామచంద్రుడే చిత్ర నిర్మాణానికి సహకరించాడనిపిస్తుంది. ఆటుపోట్లు తట్టుకుని, కాలాహరణాన్ని భరించి మొత్తానికి చిత్రాన్ని పూర్తి చేశారు శంకర రెడ్డి. ఎన్ని తట్టలు విరిగాయన్నది కాదు, వడ్లు ఎన్ని రాలాయన్నదే లెక్క. లవకుశ చిత్రం అదే రుజువు చేసింది. అవాంతరాలు దాటుకుని థియేటర్లకు వచ్చిందన్న లెక్కలు, విడుదల తరువాత గాలికి కొట్టుకుపోయాయి. 72 కేంద్రాల్లో శతదినోత్సవం, 16 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుని ఆర్థికంగా, హార్థికంగా బలమైన చిత్రంగా నిలబడింది లవకుశ. ఆ సినిమా నేటికీ మణిమకుటమే.
కోవూరు వేంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు